Politics

లండన్ వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఉందా?

లండన్ వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఉందా?

అనుమతి ఇవ్వకపోయినా సీఎం జగన్‌ లండన్ వెళ్లడం కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు.లండన్ వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఉందా? లేక దావోస్‌కు వెళ్లేందుకు మాత్రమే అనుమతించిందా అని ప్రశ్నించారు. లండన్‌కు అనుమతిస్తే అధికార పర్యటనలో ఎందుకు చేర్చలేదని నిలదీశారు. షెడ్యూల్‌లో లేని లండన్‌లో ఎందుకు దిగాల్సి వచ్చిందని ప్రశ్నించారు.దండుకున్న సంపద దాచుకోడానికే లండన్ వెళ్లారనే అనుమానం ప్రజల్లో బలంగా ఉందని ఆరోపించారు. మూడేళ్ల తర్వాత దావోస్ వెళ్లడం రాష్ట్రం కోసమా? అక్రమార్జన తరలింపు కోసమా? అని యనమల మండిపడ్డారు.సొంత, రహస్య పనులకు ప్రజాధనం దుర్వినియోగం చేయడమేంటని ప్రశ్నించిన యనమల.. ఇలా కోర్టు అనుమతితో విదేశీ పర్యటనలకు వెళ్లే పరిస్థితి దేశంలో ఏ సీఎంకు లేదన్నారు. దావోస్‌కు అధికార యంత్రాగంతో కలసి వెళ్లకుండా ప్రత్యేక విమానానికి ఒక ఖర్చు, కమర్షియల్ ఫ్లైట్‌కు మరో ఖర్చు పెట్టడం వెనుక మర్మమేంటని ప్రశ్నించారు. అసలే ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రానికి ఇది అదనపు భారమవుతుందని పేర్కొన్నారు.