NRI-NRT

తెలంగాణ ఉద్య‌మంలో ఎన్నారైల కృషి అభినంద‌నీయం

తెలంగాణ ఉద్య‌మంలో ఎన్నారైల కృషి అభినంద‌నీయం

తెలంగాణ ఉద్య‌మంలో ఎన్నారైల కృషి అభినంద‌నీయ‌మ‌ని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణకు పెట్టుబడులు ఆహ్వానించేందుకు లండన్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆయ‌న‌ శ‌నివారం ఇక్కడ ప్రవాస తెలంగాణ సంఘాలు ఏర్పాటు చేసిన మీట్ ఎండ్ గ్రీట్ లో పాల్గొని ప్రసంగించారు.
KTR
ముందుగా జాతిపిత‌ మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బాబాసాహెబ్ అంబేద్కర్, తెలంగాణ సిద్ధాంత‌క‌ర్త‌ ప్రొఫెసర్ జయశంకర్ సార్‌ చిత్రపటాలకు న‌మ‌స్క‌రించారు. తెలంగాణ అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి, అంజలి ఘటించారు. ఉద్యమకాలంలో ఎనలేని కృషి చేసిన తెలంగాణ ఎన్నారైలను మంత్రి ఈ సందర్భంగా ప్రశంసించారు.