DailyDose

నిందితుడు బయటే తిరుగుతున్నా.. పోలీసులకు కనిపించడం లేదా ? – TNI తాజా వార్తలు

నిందితుడు బయటే తిరుగుతున్నా.. పోలీసులకు కనిపించడం లేదా ? –  TNI  తాజా వార్తలు

* కారు డ్రైవర్‌ హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్‌ చేయకపోవటంపై తెదేపా అధినేత చంద్రబాబు విస్మయం వ్యక్తం చేశారు. కళ్లముందే నిందితుడు తిరుగుతున్నా.. అరెస్ట్ చేయకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. మృతిడి భార్యను ఫోన్లో పరామర్శించిన చంద్రబాబు.. అండగా ఉంటామని హామీ ఇచ్చారు.కాకినాడలో హత్యకు గురైన ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం భార్యను తెదేపా అధినేత చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు. సుబ్రహ్మణ్యం కుటుంబానికి అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. గర్భవతిగా ఉన్న సుబ్రహ్మణ్యం భార్య అపర్ణకు పెద్ద కష్టం వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెదేపా తరఫున రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. తన భర్త హత్యపై సీబీఐతో విచారణ జరిపించాలని అపర్ణ కోరుతున్నారన్న చంద్రబాబు.. తెదేపాతో పాటు దళిత సంఘాలు చేసిన పోరాటం వల్లే పోలీసులు సుబ్రహ్మణ్యం మృతిని హత్య కేసుగా నమోదు చేశారన్నారు. హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్టు చేయకపోవటంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. కళ్లముందే నిందితుడు తిరుగుతున్నా.. అరెస్ట్ చెయ్యకపోవడాన్నితప్పుపట్టారు. నిందితుడిని అరెస్టు చేయకుండా పోలీసుల వ్యవహరిస్తున్న తీరు.. బాధితుల అనుమానాలను బలపరిచేలా ఉన్నాయని విమర్శించారు.

*నెల్లూరు నగరంలోని సంతపేట పోలీస్ స్టేషన్ సమీపంలో టీడీపీ నాయకురాలు రేవతిపై అధికార వైఎస్సార్సీపీ గూండాలు ఆదివారం జరిపిన దాడిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఖండించారు.మాజీ మంత్రి పి. అనిల్‌ కుమార్‌ యాదవ్‌పై కొన్ని కౌంటర్‌ కామెంట్‌లు చేసినందుకే రేవతి, ఆమె భర్తను బలిపశువులను చేశారని లోకేశ్ అన్నారు.ప్రభుత్వ విధానాలను ప్రశ్నించినందుకే వైసీపీ నేతలు అభద్రతాభావం పెంచుతున్నారని, దాడులకు దిగుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ ఇక్కడ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రేవతి భర్త వేధింపులకు గురవుతున్నాడని పోలీసు స్టేషన్‌కు పిలిపించారు. ఇదేమిటని ఆమె అడగ్గా.. అధికార పార్టీ గూండాలు ఆమెపై పోలీస్ స్టేషన్ సమీపంలో దాడి చేశారు.రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం ఇంకా ఉందా అనే సందేహాలు తలెత్తుతున్నాయని లోకేష్ అన్నారు. రేవతిపై దాడి చేసిన వైసీపీ దుండగులపై, ఆమె భర్తను వేధించిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలి.ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు అత్యంత ప్రమాదకర స్థాయికి దిగజారడం దురదృష్టకరమని నారా లోకేష్ అన్నారు. రాజకీయ ప్రత్యర్థులు, బలహీనవర్గాలు, వెనుకబడిన తరగతులు, మహిళలు, యువత, ఉద్యోగులపై గూండాలు, నేరగాళ్లు హింసాత్మకంగా దాడులు చేస్తుంటే పోలీసులు మౌన ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోయారు.
తనపై దాడి చేసి గాయపరిచిన తీరును రేవతి వివరిస్తున్న వీడియోలను లోకేష్ విడుదల చేశారు. కత్తి పట్టుకున్న గూండాలు కూడా ఆమెను బెదిరించారు. డీజీపీ నెల్లూరు పర్యటనలో ఉన్న సమయంలో కూడా తనలాంటి కార్యకర్తపై పోలీస్ స్టేషన్ సమీపంలో గూండాలు దాడి చేసినప్పుడు సామాన్య మహిళలకు భద్రత ఏంటని ఆమె ప్రశ్నించారు.

*ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామి వారిని దర్శించుకోడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి 2 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు తెలిపారు. ఆలయ అభివృద్ధి పనుల దృష్ట్యా పోలీసులు కొండపైకి భక్తుల వాహనాలను అనుమతించడంలేదు.

*పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి పెద్ద షాక్ తగిలింది. బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ తృణముల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఖరగ్ పూర్ నుంచి అర్జున్ సింగ్ ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన ఈరోజు టీఎంసీలో చేరడంతో బీజేపీకి పెద్ద షాక్ ఇచ్చినట్లయ్యింది.

*గోదావరి బేసిన్‌లో అనుమతుల కోసం తెలంగాణ సమర్పించిన మూడు డీపీఆర్‌ లు గోదావరి నదీ యాజమాన్య బోర్డు(జీఆర్‌ఎంబీ)ను దాటేసి ఢిల్లీకి చే రుకున్నాయి. చనాకా కొరటా, చౌటపల్లి హనుమంతరెడ్డి, చిన్న కాళేశ్వరం(ముక్తేశ్వర్‌) డీపీఆర్‌లను గత ఏడాది సెప్టెంబరులో తెలంగాణ ప్రభుత్వం అనుమతుల కోసం సమర్పించిన విషయం విదితమే. ప్రతిబంధకాలన్నీ దాటేసి ఈ డీపీఆర్‌లు గోదావరి బోర్డు సమావేశానికి వచ్చాయి. ఇటీవలే జరిగిన బోర్డు సమావేశంలో వీటిపై చర్చించి, తెలుగు రాష్ట్రాల అభిప్రాయాలను పొందుపర్చి… తాజాగా వాటిని తదుపరి అనుమతి కోసం కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) పరిధిలోని టెక్నికల్‌ అడ్వైజరీ కమిటీ(టీఏసీ)కి పంపించారు.

*ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌తో కేసీఆర్‌ భేటీ..
జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన సీఎం కేసీఆర్ దేశవ్యాప్త పర్యటనలో భాగంగా ఢిల్లీకి చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన జాతీయ స్థాయి నేతల సమావేశాలతో సీఎం కేసీఆర్ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుత పర్యటనలో ఆయన జాతీయ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ కూటమిపై చర్చలు జరపనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌తో ఆదివారం భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా ఇరువురు నేతలు జాతీయ రాజకీయాలు, సమాఖ్య స్ఫూర్తి, కేంద్ర ప్రభుత్వ విధానాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం భోజనం తర్వాత ఇద్దరు సీఎంలు చండీగఢ్‌ వెళ్లనున్నారు.

*సర్పంచ్‌ ఎన్నికల్లో తనను మహిళల ఓట్లే గెలిపించాయని.. దీనికి కృతజ్ఞతగా గ్రామంలో ఏ ఆడబిడ్డ వివాహం జరిగినా తన తోబుట్టువుగా భావిస్తూ పెళ్లి కానుక అందజేస్తూ గ్రామస్థుల ప్రశంసలు అందుకుంటున్నారు పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం ఎస్సీ బోస్‌ కాలనీ సర్పంచ్‌ మంతెన శ్రీనివాసరాజు. 2021లో జరిగిన సర్పంచ్‌ ఎన్నికల్లో తెలుగుదేశం అనుకూల అభ్యర్థిగా ఆయన బరిలో నిలిచి విజయం సాధించారు. గ్రామంలో మహిళలు ఓట్లు వేయడం వల్లే తాను గెలిచానని భావించిన ఆయన గ్రామంలో ఏ ఆడపిల్ల వివాహం జరిగినా కులమతాలకు అతీతంగా రెండు గ్రాముల బంగారు మంగళ సూత్రాలు, పెళ్లి పట్టుచీర, గాజులు, పువ్వులు, పసుపు-కుంకుమతో పాటు రూ.2వేల నగదు అందజేస్తున్నారు. సర్పంచ్‌గా గెలిచిన నాటి నుంచి ఇప్పటి వరకు 14 మంది నవ వధువులకు పెళ్లి కానుక అందించారు. ఈ క్రమంలోనే శనివారం గ్రామానికి చెందిన మోకా హరిబాబు, వెంకటలక్ష్మి దంపతుల కుమార్తె లక్ష్మి వివాహం సందర్భంగా పెళ్లి కానుక అందించారు

*తెలంగాణవ్యవసాయ విధానాలు భేష్ గా వున్నాయని, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వడ్డే శోభనాదీశ్వరరావు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు అనుకూల పథకాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయన్నారు.ఆదివారం మంత్రుల నివాస సముదాయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ వ్యవసాయ శాఖా మంత్రి, మాజీ ఎంపీ వడ్డే శోభనాద్రీశ్వర రావు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని కలిశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పంటల వైవిధ్యీకరణ తప్పనిసరి అని వరి సాగు నుండి పప్పు, నూనె గింజల సాగు వైపు మళ్లాలని అన్నారు.ఆయిల్ పామ్ సాగుకు తెలంగాణ ప్రభుత్వం రైతాంగాన్ని ప్రోత్సహించడం ఆహ్వానించదగ్గ పరిణామమన్నారు.1985-1989 మధ్యకాలంలో నూనెగింజలు – అపరాల సాంకేతిక మిషన్ పథకం తరహాలో ప్రస్తుతం అపరాలు, నూనె, పప్పుగింజల సాగుకు ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందన్నారు.

*ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ ముగిసింది. ఇద్దరు సీఎంల మధ్య గంటన్నర పాటు సమావేశం కొనసాగింది. సమావేశానంతరం చండీగఢ్‌కు కేసీఆర్, కేజ్రీవాల్‌ బయలుదేరారు. సాగుచట్టాల ఉద్యమంలో చనిపోయిన రైతుల కుటుంబాలను పరామర్శించనున్నారు. రైతు ఉద్యమంలో చనిపోయిన ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చెక్కును కేసీఆర్‌ అందజేయనున్నారు. ఆరు వందల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించనున్నారు.

*గోదావరి బేసిన్‌లో అనుమతుల కోసం తెలంగాణ సమర్పించిన మూడు డీపీఆర్‌ లు గోదావరి నదీ యాజమాన్య బోర్డు(జీఆర్‌ఎంబీ)ను దాటేసి ఢిల్లీకి చే రుకున్నాయి. చనాకా కొరటా, చౌటపల్లి హనుమంతరెడ్డి, చిన్న కాళేశ్వరం(ముక్తేశ్వర్‌) డీపీఆర్‌లను గత ఏడాది సెప్టెంబరులో తెలంగాణ ప్రభుత్వం అనుమతుల కోసం సమర్పించిన విషయం విదితమే. ప్రతిబంధకాలన్నీ దాటేసి ఈ డీపీఆర్‌లు గోదావరి బోర్డు సమావేశానికి వచ్చాయి. ఇటీవలే జరిగిన బోర్డు సమావేశంలో వీటిపై చర్చించి, తెలుగు రాష్ట్రాల అభిప్రాయాలను పొందుపర్చి… తాజాగా వాటిని తదుపరి అనుమతి కోసం కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) పరిధిలోని టెక్నికల్‌ అడ్వైజరీ కమిటీ(టీఏసీ)కి పంపించారు.

*సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సెటైర్లు వేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌ చేతిలో మోసపోనివారు ఎవరైనా ఉన్నారా? అని ప్రశ్నించారు. కొడంగల్‌ అభివృద్ధిపై కేటీఆర్‌ చర్చకు రావాలని సవాల్ విసిరారు. రైతులు చనిపోతుంటే కేసీఆర్‌ ఒక్క కుటుంబాన్ని పరామర్శించలేదన్నారు. వెంటనే ఐకేపీ కేంద్రాలు తెరిచి వడ్లు కొనాలని డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్‌ పాలనలో పేదలకు ఎలాంటి సాయం అందలేదని రేవంత్‌రెడ్డి విమర్శించారు.

*అనేక ఉద్రిక్తతల మధ్య వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతదేహానికి పోస్టుమార్టం పూర్తైంది. పెదపూడి మండలం జి.మామిడాడలో ఆదివారం అంత్యక్రియలు నిర్వహిస్తారు. శరీరంపై గాయాలుండడంతో పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో కొట్టి చంపినట్టు తేలిందని సమాచారం. మృతుడి భార్యకు ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు ఈ కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును ప్రధాన నిందితుడిగా చేర్చారు. నేడు ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మృతుడి కుటుంబీకుల స్టేట్‌మెంట్ ఆధారంగా అరెస్ట్ చేస్తామని పోలీసులు వెల్లడించారు. అనంతబాబు కోసం ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

*తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి 33 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పట్టనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. శనివారం శ్రీవారిని 83,739 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 46,187 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.20 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

*ఫైళ్లు పెట్టే విషయంలో దేవదాయశాఖ ఉద్యోగులకు టార్గెట్‌ విధించింది. ఇకపై సెక్షన్ల వారీగా ప్రతి ఉద్యోగి ఎన్ని ఫైళ్లు పెట్టాలి, అధికారులు ఎన్ని రోజుల్లో వాటిని పరిష్కరించాల అనే దానిపై సమయాన్ని నిర్దేశించింది. ఈ మేరకు దేవదాయ కమిషనర్‌ హరిజవహర్‌లాల్‌ ఆదేశాలు జారీచేశారు. అర్చకులకు సంబంధించిన ఫైళ్లు చూసే డబ్ల్యూ సెక్షన్‌లో ఒక్కొక్కరు నెలకు 60 ఫైళ్లు పెట్టాలని స్పష్టంచేశారు. ఆలయ ఉద్యోగుల సర్వీసు అంశాలు, ఆలయాల పరిపాలనా వ్యవహారాలు, ధార్మిక పరిషత్‌ అంశాలు చూసే ఏ, బీ, సీ, డీ, డీపీ సెక్షన్లలో వారానికి 40 ఫైళ్లు పెట్టాలని తెలిపారు. ఉద్యోగుల సర్వీసు అంశాలు, విజిలెన్స్‌, భూముల వ్యవహారాలు చూసే ఈ, వీ, ఎల్‌, ఎమ్‌ సెక్షన్లలో వారానికి 30 ఫైళ్లు పెట్టాలన్నారు. ఈ ఫైళ్లను సెక్షన్ల సూపరింటెండెంట్లు, రూటింగ్‌ అధికారులు మూడు రోజుల్లో… అదనపు కమిషనర్లు ఐదు రోజుల్లో పరిష్కరించాలని స్పష్టంచేశారు.

*జాతీయ నూతన విద్యా విధానంతో ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు. శనివారం కర్నూలు రాయలసీమ యూనివర్సిటీ 3వ స్నాతకోత్సవంలో ఆయన వర్చువల్‌ విధానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ప్రధాని మోదీ.. మేక్‌ ఇన్‌ ఇండియా 2020లో భాగంగా కొత్త విద్యావిధానాన్ని తెరపైకి తెచ్చారని గుర్తు చేశారు. చదువు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరూ వెంటనే ఉపాధి అవకాశాలు అందుకునే విధంగా నూతన విద్యకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ఈ ప్రక్రియలో ప్రధానంగా యూనివర్సిటీల్లో పెను మార్పులు, చేర్పులు చేశారని ఆయన చెప్పారు. అందుకు తగ్గట్టుగా ఇన్‌ఫ్రాస్టక్చర్‌ అభివృద్ధ్దికి చర్యలు తీసుకుంటున్నామని తె లిపారు. అంతకుముందు ఉపకులపతి ఎ,ఆనందరావు అధ్యక్షతన ముగ్గురికి గౌరవ డాక్టరేట్లు, మరో 66 మందికి బంగారు పతకాలు అందజేశారు. 241 మందికి పీహెచ్‌డీలు,1267 మందికి పీజీ, 15,339 మందికి యూజీ పట్టాలను ప్రదానం చేశారు.

*రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి జీఎంఆర్‌ తన అధికారిక వెబ్‌సైట్లో రాజీవ్‌గాంధీ పేరును తొలగించినట్టు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ ఆరోపించారు. ఈ విమానాశ్రయంలో 13 శాతం వాటా కలిగి ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండా ఆ సంస్థ ఇంతటి సాహసం చేయబోదన్నారు. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అని పెద్ద అక్షరాలతో విమానాశ్రయం వద్ద బోర్డును ఏర్పాటు చేయడమేకాకుండా విమానాశ్రయంలో రాజీవ్‌ విగ్రహాన్ని, ఫొటో చిహ్నాలను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు శనివారం ఆయన లేఖ రాశారు.

*బీజేపీ రాష్ట్ర నేతలపై సొంత పార్టీ వారే దాడి చేశారు. అదే పార్టీకి చెందిన కార్పొరేటర్‌ అనుచరులు ఆయన సమక్షంలోనే భౌతిక దాడులకు పాల్పడ్డారు. ఇదేమిటని ప్రశ్నించిన వారిపై పిడిగుద్దులు కురిపించారు. ఈ దాడిలో బీజేపీ రాష్ట్ర నాయకుడు మొవ్వా సత్యనారాయణ గాయపడ్డారు. ఈ దాడిపై ఫిర్యాదు చేసేందుకు బాధితుడు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి అక్కడే సొమ్మసిల్లి పడిపోయారు. అనంతరం ఆయనను ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. ‘మీ సమస్య పై మా పోరాటం’ కార్యక్రమంలో భాగంగా శనివారం నియోజకవర్గ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్‌ యోగానంద్‌, బీజేపీ నాయకులు జ్ఞానేంద్రప్రసాద్‌, మొవ్వా సత్యనారాయణ, ప్రభాకర్‌ యాదవ్‌, గోవర్ధన్‌గౌడ్‌తో పాటు మొవ్వా సత్యనారాయణ వ్యక్తిగత కార్యదర్శి, ఫొటోగ్రాఫర్‌ మధువన్‌ గోపన్‌పల్లిలోని దేవునికుంట చెరువును సందర్శించారు.

*గోదావరి బేసిన్‌లో అనుమతుల కోసం తెలంగాణ సమర్పించిన మూడు డీపీఆర్‌ లు గోదావరి నదీ యాజమాన్య బోర్డు(జీఆర్‌ఎంబీ)ను దాటేసి ఢిల్లీకి చే రుకున్నాయి. చనాకా కొరటా, చౌటపల్లి హనుమంతరెడ్డి, చిన్న కాళేశ్వరం(ముక్తేశ్వర్‌) డీపీఆర్‌లను గత ఏడాది సెప్టెంబరులో తెలంగాణ ప్రభుత్వం అనుమతుల కోసం సమర్పించిన విషయం విదితమే. ప్రతిబంధకాలన్నీ దాటేసి ఈ డీపీఆర్‌లు గోదావరి బోర్డు సమావేశానికి వచ్చాయి. ఇటీవలే జరిగిన బోర్డు సమావేశంలో వీటిపై చర్చించి, తెలుగు రాష్ట్రాల అభిప్రాయాలను పొందుపర్చి… తాజాగా వాటిని తదుపరి అనుమతి కోసం కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) పరిధిలోని టెక్నికల్‌ అడ్వైజరీ కమిటీ(టీఏసీ)కి పంపించారు.

*కేంద్ర జలశక్తి సంఘం అధికారులు శనివారం పోలవరం ప్రాజెక్టు వద్ద పర్యటించారు. ప్రాజెక్టు స్పిల్వేలో 21, 22 రేడియల్‌ గేట్ల వద్ద ఏర్పాటుచేసిన పవర్‌ ప్యాక్‌లను క్షుణ్ణంగా పరిశీలించారు. రేడియల్‌ గేట్లను పైకి కిందకి కదిలించేందుకు ఏర్పాటు చేసిన సిలిండర్లను ఆపరేట్‌ చేయించి పనితీరు గమనించారు. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాం, డయాఫ్రంవాల్‌, పవర్‌ హౌస్‌, అప్రోచ్‌ చానల్‌ తదితర పనులను కూడా పరిశీలించారు. సలహాదారు వెదిరే శ్రీరామ్‌, ప్రాజెక్టు అథారిటీ చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ల నేతృత్వంలో డ్యాం డిజైన్‌ రివ్యూ పానెల్‌, మట్టి, రాతి నాణ్యతా పరిశీలన అధికారుల బృందాలు అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నాయి. ఈ బృందం ఆదివారం మరికొన్ని ప్రాంతాలను పరిశీలించి ప్రాజెక్టు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించనుంది.

*దుర్గగుడి సిబ్బందికి ఈఓ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇంద్రకీలాద్రిపై పని చేసే ఉద్యోగులు, సిబ్బంది ఇక నుంచి తెలుపు రంగు చొక్కా, పంచె కట్టకపోతే 200 రూపాయలు జరిమానా విధించారు. ఐడీ కార్డు లేకపోతే 100 రూపాయలు జరిమానా విధించారు. విధులకు హాజరయ్యే సిబ్బంది పంచె, ఐడీ కార్డు ధరించి రావాలని ఈఓ బ్రమరాంబ ఆదేశాలు జారీ చేశారు. మూడుసార్లు జరిమానాలు చెల్లించిన వారికి ఇంక్రిమెంట్ కట్ చేస్తామని హెచ్చరించారు. దేవస్థానం అధికారులు, సిబ్బంది, ఉద్యోగులు డ్రెస్ కోడ్ పాటించడం, ఐడీ కార్డు ధరించడం, బయోమెట్రిక్ హాజరుపై అధికారికంగా ఈఓ సర్క్యులర్ జారీ చేశారు.

*ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 31వ తేదీన హిమాచల్‌ ప్రదేశ్‌ రాజధాని సిమ్లా నుంచి ప్రధాని నరేంద్రమోదీ.. దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న వివిధ కేంద్ర పథకాల లబ్ధిదారులతో నేరుగా మాట్లాడనున్నారు. ఇందుకు సంబంధించి జిల్లాల్లో చేయాల్సిన ఏర్పాట్లపై శుక్రవారం ఢిల్లీ నుంచి కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబ వివిధ రాష్ట్రాల ప్రభుత్వ కార్యదర్శులతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించి, తగిన ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా హర్‌ ఘర్‌ జెండా విధానం కింద జాతీయ జెండా ప్రాముఖ్యతను తెలియజేసే విధంగా అన్ని ప్రభుత్వ భవనాలు, సంస్థలు, విద్యాసంస్థలన్నింటిపైనా ఆరోజు జాతీయ జెండాను ఎగురవేయాలన్నారు. రాష్ట్రంలో విజయనగరం, కృష్ణా, చిత్తూరు జిల్లాల నుంచి పీఎంతో ఇంటరాక్ట్‌ అయ్యేందుకు ముగ్గురు లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు సీఎస్‌ సమీర్‌శర్మ తెలిపారు.

*యిన్‌ ట్యూమర్‌తో బాధపడుతున్న ప్రకాశం జిల్లా కొండపికి చెందిన చిన్నారి జోషికకు పెద్దమనసుతో సాయం చేసేందుకు పలువురు దాతలు ముందుకొచ్చారు. చిన్నారి వ్యధను వివరిస్తూ శనివారందీనికి స్పందించి రాష్ట్రంలోని అనేక జిల్లాల నుంచి పలువురు ఫోన్‌ చేసి తనతో మాట్లాడి బాధను పంచుకున్నారని చెన్నైలో ఉన్న జోషిక తండ్రి చంద్రశేఖర్‌ తెలిపారు. శనివారం .సాయంత్రానికి రూ.2లక్షలకు పైగా దాతలు సాయం అందించారని, తమ బాధను ప్రపంచం దృష్టికి తీసుకువచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా చాలామంది అకౌంట్‌కు డబ్బులు వేస్తూనే ఉన్నారని, ఫోన్‌లో పరామర్శించి సాయం అందిస్తామని హామీ ఇస్తున్నారని చెప్పారు.

*తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం సాయంత్రం నుంచే భక్తుల రాక పెరిగింది. శనివారం శ్రీవారి ఆలయం ప్రాంతంతో పాటు మాడవీధులు, అఖిలాండం, లడ్డూ కౌంటర్‌, అన్నప్రసాద భవనం, బస్టాండ్‌, యాత్రికుల వసతి సముదాయాలు రద్దీగా కన్పించాయి. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు నిండిపోయి లేపాక్షి సర్కిల్‌ మీదుగా పీఏసీ-4 లగేజీ కౌంటర్‌ వరకు సర్వదర్శనం క్యూలైన్‌ దాదాపు రెండు కిలోమీటర్ల మేర వ్యాపించింది. దాదాపు 24 గంటల తర్వాత శ్రీవారి దర్శనం లభిస్తుండడంతో చిన్నపిల్లలు, వృద్ధులతో వచ్చిన భక్తులు క్యూలైన్లలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గదుల కోసం గంటల తరబడి క్యూలైన్‌లో వేచి ఉండాల్సి వస్తోంది.

*సర్పంచ్‌ ఎన్నికల్లో తనను మహిళల ఓట్లే గెలిపించాయని.. దీనికి కృతజ్ఞతగా గ్రామంలో ఏ ఆడబిడ్డ వివాహం జరిగినా తన తోబుట్టువుగా భావిస్తూ పెళ్లి కానుక అందజేస్తూ గ్రామస్థుల ప్రశంసలు అందుకుంటున్నారు పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం ఎస్సీ బోస్‌ కాలనీ సర్పంచ్‌ మంతెన శ్రీనివాసరాజు. 2021లో జరిగిన సర్పంచ్‌ ఎన్నికల్లో తెలుగుదేశం అనుకూల అభ్యర్థిగా ఆయన బరిలో నిలిచి విజయం సాధించారు. గ్రామంలో మహిళలు ఓట్లు వేయడం వల్లే తాను గెలిచానని భావించిన ఆయన గ్రామంలో ఏ ఆడపిల్ల వివాహం జరిగినా కులమతాలకు అతీతంగా రెండు గ్రాముల బంగారు మంగళ సూత్రాలు, పెళ్లి పట్టుచీర, గాజులు, పువ్వులు, పసుపు-కుంకుమతో పాటు రూ.2వేల నగదు అందజేస్తున్నారు. సర్పంచ్‌గా గెలిచిన నాటి నుంచి ఇప్పటి వరకు 14 మంది నవ వధువులకు పెళ్లి కానుక అందించారు. ఈ క్రమంలోనే శనివారం గ్రామానికి చెందిన మోకా హరిబాబు, వెంకటలక్ష్మి దంపతుల కుమార్తె లక్ష్మి వివాహం సందర్భంగా పెళ్లి కానుక అందించారు.

*ఉద్యోగ, ఉపాధ్యాయులతోపాటు ప్రజల ప్రాథమిక హక్కులను ప్రభుత్వాలు హరిస్తున్నాయని స్కూల్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌టీఎఫ్‌ఐ) జాతీయ ప్రధాన కార్యదర్శి సీఎస్‌ భారతి అన్నారు. జాతీయ విద్యావిధానం రద్దు, సీపీఎస్‌ రద్దుపై జాతీయ స్థాయి ఉద్యమాన్ని నిర్మించనున్నట్టు వెల్లడించారు. విజయవాడలో జరగుతున్న ఎస్‌టీఎఫ్‌ఐ మూడు రోజుల జాతీయ మహాసభల్లో భాగంగా శనివారం మహాసభలు ఆమోదించిన పలు తీర్మానాలను నేతలు వివరించారు. అట్టడుగు వర్గాల వారికి న్యాయం అందని ద్రాక్షగా మారిందన్నారు. ఎమ్మెల్సీ ఎస్‌కే సాబ్జీ, యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్‌.వెంకటేశ్వర్లు, కేఎస్‌ఎస్‌ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

*తెలుగు రాష్ట్రాల్లో ప్రజలను ఆదుకునేందుకు ఎన్టీఆర్‌ ట్రస్టు సేవలను విస్తరింపజేసినట్లు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. మహబూబాబాద్‌ జిల్లా గూడూరులోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో రూ.50 లక్షలతో ట్రస్ట్‌ ఏర్పాటు చేసిన ఆక్సిజన్‌ ప్లాంట్‌ను జిల్లా అదనపు కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ శనివారం ప్రారంభించారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు మాట్లాడారు. ట్రస్టు ఆధ్వర్యంలో గూడూరుతోపాటు ఏపీలోని కుప్పం, టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ప్లాంట్‌లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జూమ్‌యాప్‌ ద్వారా వీడియోలింక్‌ను షేర్‌ చేసి లక్షలాది మంది కొవిడ్‌ బాధితులకు ట్రస్టు ద్వారా టెలీమెడిసిన్‌ సేవలు అందించినట్లు తెలిపారు. దేశ, విదేశీ వైద్య నిపుణులతో ఏర్పాటు చేసిన వైద్యబృందాలు వీడియోకాల్‌ ద్వారా వైద్యం అందించినట్లు పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ ట్రస్టు, తెలుగుదేశం పార్టీ సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. విద్య, ఆరోగ్యం, స్వయం ఉపాధిరంగాల్లో ట్రస్టు సేవలందిస్తున్నట్లు వివరించారు. గూడూరు ఏజెన్సీ ప్రాంతంలో ఎన్టీఆర్‌ ట్రస్టు ఆధ్వర్యంలో ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయడం అభినందనీయమని అదనపు కలెక్టర్‌ అభిలాష అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కరోనాబారీన పడినవారికి ఉచితంగా ఆక్సిజన్‌ ఆందించేందుకు ఈ ప్లాంట్‌ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. ట్రస్టు ప్రతినిధి రాజీవ్‌రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కిని నర్సింహులు, పార్టీ నేతలు బండి పుల్లయ్య, రాజునాయక్‌, సునీత, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ భూక్య వెంకట్రాములు, స్థానిక ఆస్పత్రి ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ భరత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

*వైసీపీ ప్రభుత్వంలో దళితులపై హత్యాకాండకు అంతం లేదా? అని విశాఖపట్నం దళిత సంఘాల (విదసం) ఐక్యవేదిక ప్రతినిధులు ప్రశ్నించారు. కాకినాడలో దళిత యువకుడు సుబ్రహ్మణ్యంను హత్య చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును తక్షణం అరెస్టు చేయాలని, ఆయన్ను పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఐక్యవేదిక కన్వీనర్‌ బూసి వెంకటరావు ఆధ్వర్యంలో దళితులు అంబేడ్కర్‌ విగ్రహం వద్ద శనివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వెంకటరావు మాట్లాడుతూ పేరుకు దళిత మహిళను హోంమంత్రిని చేసి, అడ్డూఅదుపూ లేకుండా దళితులపై హత్యాకాండను అధికార పార్టీ నాయకులు కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆందోళనలో వేదిక ప్రతినిధులు ఈతలపాక సుజాత, సోడదాసు సుధాకర్‌, సుజాత, నిర్మల, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

*డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును అదుపులోకి తీసుకుంటామని ఎస్పీ రవీంద్రనాథ్ ప్రకటించారు. మృతుడి కుటుంబీకుల స్టేట్‌మెంట్ ఆధారంగా అరెస్ట్ చేస్తామని ఆయన వెల్లడించారు. ఎమ్మెల్సీ కోసం పోలీస్ బృందాలు గాలిస్తున్నాయన్నారు. ఐపీసీ 302 సెక్షన్ కింద ఎమ్మెల్సీపై కేసు నమోదు చేస్తున్నామని ఎస్పీ రవీంద్రనాథ్ తెలిపారు.

*మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులు అరెస్ట్ సరికాదని టీడీపీ నేత పరిటాల శ్రీరామ్‌ తప్పుబట్టారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తప్పొప్పులు ఆలోచించకుండా లాఠీచార్జ్‌ చేయడం బాధాకరమన్నారు. టీడీపీ నుంచి శాంతిభద్రతల సమస్య తలెత్తదని తెలిపారు. లా అండ్ ఆర్డర్‌ సమస్య అయితే సవాల్ విసిరిన ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అధికారం ఉందికదాని పోలీసులను వాడుకుంటే.. రేపు ఎలా ఉంటుందో ఆలోచించాలని హెచ్చరించారు. తిరుపతికే దిక్కులేదని, రాయదుర్గంలో దేవుళ్లకు దిక్కెక్కడిదని శ్రీరామ్‌ ప్రశ్నించారు.

*మాజీ క్రికెటర్‌, పంజాబ్‌ కాంగ్రెస్‌ మాజీ చీఫ్‌ నవజోత్‌సింగ్‌ సిద్ధూని పటియాలా సెంట్రల్‌ జైలుకు తరలించారు. మూడు దశాబ్దాల నాటి కేసులో సుప్రీంకోర్టు ఆయనకు ఏడాది జైలు శిక్ష విధించడంతో శుక్రవారం పటియాలా జిల్లా కోర్టులో లొంగిపోయిన సంగతి తెలిసిందే. సిద్ధూను జైలులో పదో నంబరు బ్యారక్‌లో ఉంచారు. ఆ గదిలో మరో నలుగురు ఖైదీలు కూడా ఉన్నారు. ఖైదీగా ఆయనకు 241383 నంబరు కేటాయించారు. గదికి చేరడానికి ముందే సిద్ధూ ఆహారం తీసుకోవడంతో తొలి రోజు రాత్రి జైలులో భోజనం చేయలేదని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. మిగతా ఖైదీల్లాగానే సిమెంట్‌ బెడ్‌పై విశ్రమించారని పేర్కొన్నాయి.

*రానున్న ఐదు రోజులు పలు రాష్ర్టాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరిక జారీ చేసింది. వర్షాల తీవ్రత సోమవారం గరిష్ఠ స్థాయికి చేరుకునే అవకాశం ఉందని తెలిపింది. ఏపీ, తమిళనాడు, తెలంగాణ, బిహార్‌, జార్ఖండ్‌, పశ్చిమబెంగాల్‌, ఒడిసాల్లో వచ్చే ఐదు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కాగా, శనివారం సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్‌, నారాయణపేట, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వివరించింది. తెలంగాణ మీదుగా దక్షిణ కర్ణాటక వరకు ఉన్న ఉపరితల ఆవర్తనం శనివారం బలహీనపడిందని తెలిపింది.

*మాజీ క్రికెటర్‌, పంజాబ్‌ కాంగ్రెస్‌ మాజీ చీఫ్‌ నవజోత్‌సింగ్‌ సిద్ధూని పటియాలా సెంట్రల్‌ జైలుకు తరలించారు. మూడు దశాబ్దాల నాటి కేసులో సుప్రీంకోర్టు ఆయనకు ఏడాది జైలు శిక్ష విధించడంతో శుక్రవారం పటియాలా జిల్లా కోర్టులో లొంగిపోయిన సంగతి తెలిసిందే. సిద్ధూను జైలులో పదో నంబరు బ్యారక్‌లో ఉంచారు. ఆ గదిలో మరో నలుగురు ఖైదీలు కూడా ఉన్నారు. ఖైదీగా ఆయనకు 241383 నంబరు కేటాయించారు. గదికి చేరడానికి ముందే సిద్ధూ ఆహారం తీసుకోవడంతో తొలి రోజు రాత్రి జైలులో భోజనం చేయలేదని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. మిగతా ఖైదీల్లాగానే సిమెంట్‌ బెడ్‌పై విశ్రమించారని పేర్కొన్నాయి

*ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌- యమునోత్రి జాతీయ రహదారి మరోసారి మూతబడింది. ఈ జాతీయ రహదారిపై ఓ ప్రాంతంలో రోడ్డు ధ్వంసం కావడంతో శుక్రవారం ఉదయం నుంచి వాహన రాకపోకలను నిలిపివేశారు. దీంతో 10 వేల మందికి పైగా ప్రజలు రహదారి పొడవునా ఎక్కడికక్కడ నిలిచిపోయారు. జంకీచట్టి ప్రాంతంలో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. రోడ్డును మరమ్మతు లు చేసేందుకు 3 రోజులు పడుతుందని అధి కారులు అంటున్నారు. బుధవారం భారీ వర్షానికి సయనాచట్టి, రణచట్టి ప్రాంతాల మధ్యలో రహదారి కోతకు గురికావడంతో రాకపోకలు స్తంభించాయి. 24 గంటలు కూడా గడవకముందే మరోసారి అంతరాయం ఏర్పడింది.

*సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో జ్ఞానవాపి కేసు విచారణ బాధ్యతలను వారాణసీ జిల్లా జడ్జి స్వీకరించారు. కేసుకు సంబంధించిన పత్రాలు, నివేదికను జిల్లా జడ్జికి శనివారం వారాణసీ సివిల్‌ కోర్టు అందజేసింది. మరోవైపు జ్ఞానవాపి వివాదంపై అభ్యంతరకర పోస్టు పెట్టిన ఢిల్లీ యూనివర్సిటీ చరిత్ర ప్రొఫెసర్‌ రతన్‌ లాల్‌ను పోలీసులు అరెస్టు చేయగా, కోర్టులో ఆయనకు బెయిల్‌ మంజూరైంది. జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌లో శివలింగం గుర్తించినట్టు సోషల్‌ మీడియాలో వచ్చిన ఫొటోలను ఆయన ఫేస్‌బుక్‌లో ఉంచి, అభ్యంతరకర వ్యాఖ్యలు జోడించారంటూ ఢిల్లీకి చెందిన లాయర్‌ వినీత్‌ జిందాల్‌ ఫిర్యాదు చేయడంతో గత మంగళవారం రతన్‌లాల్‌పై కేసు నమోదైంది. శనివారం మధ్యాహ్నం ఆయనను ఢిల్లీలోని ఓ కోర్టులో ప్రవేశపెట్టారు. ఆయన్ని 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీకి అప్పగించాలని ఢిల్లీ పోలీసులు చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది.సోషల్‌ మీడియాలో ఏ విధమైన పోస్టులూ పెట్టొద్దని, ఇంటర్వ్యూలు ఇవ్వొద్దని ఈ సందర్భంగా రతన్‌లాల్‌ను కోర్టు ఆదేశించింది.

*మేడికొండూరు సిఐ, ఇద్దరు యస్సైల పై ఉన్నతాదికారుఆదేశాలతో ఏయస్పీ అనిల్ విచారణ.మేడికొండూరు పోలీస్ స్టేషన్ లో జోరుగా సివిల్ పంచాయితీలు…విల్ పంచాయతీల పై ఐజీ, యస్పీలకు పిర్యాదులు…కేసులను అడ్డుపెట్టుకుని స్టేషన్ లో సివిల్ పంచాయితీలు చేస్తున్నారనే ఫిర్యాదు ల పై విచారణ…ఒక కేసులోనగదు డిమాండ్ చేస్తూ ఆస్తి పంపకాలకు బెదిరింపులు చేశారంటూ సిఐ అస్లామ్ హుస్సేన్, యస్సైలు నరహరి, దాసరి శ్రీనివాస్ ల పై ఫిర్యాదులు..కేసు నమోదు చేసి 41 notice ఇవ్వకుండా వేదింపులు…FIR లో పేర్లు ఉన్నఒక్కొక్కరు నుంచి 50 వేలు డిమాండ్…కోరిన డబ్బు ఇచ్చి సివిల్ పంచాయితీకి ఒప్పుకోకపోతే చిత్రహింసలకు గురిచేస్తామంటూ హెచ్చరిక..