NRI-NRT

విదేశీ గడ్డపై సింగరేణి బిడ్డలు!

విదేశీ గడ్డపై సింగరేణి బిడ్డలు!

యూఎస్‌, ఈయూలో కొలువులు
ఇల్లెందు నుంచే 200 మందికి పైగా
బొగ్గుట్ట కార్మికులకు విమానయోగం
స్వరాష్ట్రంలో మారిన బతుకు చిత్రం
కేసీఆర్‌ పాలనలో తీరిన ఆర్థిక కష్టాలు
బ్యాడ్‌ ఇమేజ్‌ను చెరిపేస్తున్న యువత

ఉమ్మడి రాష్ట్రంలో సింగరేణి కార్మికుల పిల్లలంటే చాలామందిలో చెడు అభిప్రాయం ఉండేది. ఆనాటి ప్రభుత్వాలు అనుసరించిన విధానాలు కార్మికులను, వారి పిల్లలను శాపగ్రస్తులుగా మార్చేశాయి. అప్పట్లో వారసత్వ ఉద్యోగాలను రద్దు చేశారు. అండర్‌గ్రౌండ్‌ మైన్స్‌ను మూసివేసి, ఓపెన్‌కాస్టులకే ప్రాధాన్యం ఇచ్చారు. వారసత్వం రద్దు అవడంతో తండ్రి ఉద్యోగం వస్తుందని ఆశ పడ్డ పిల్లలకు నిరాశే మిగిలిం ది. చాలీ చాలని వేతనాలు, ఆడపిల్లల పెండ్లి తదితర కారణాలతో కార్మికులను ఆర్థిక కష్టాలు చుట్టుముట్టేవి. పిల్లలకు చదువులు అబ్బక, వ్యసనాలకు బానిసలై జీవనోపాధిని కోల్పోయా రు. డబ్బు కోసం ఎటువంటి పని చేసేందుకు వెనుకాడేవారు కాదు. ఇలా కోల్‌బెల్ట్‌కు చెడ్డ పేరు వచ్చింది. పెద్దగా చదువుకోలేక పోయిన పిల్లలు స్థానికంగా చిరువ్యాపారాలు చేస్తూ, ఆటో నడుపుతూ బతుకు బండిని లాగించేవారు. మరికొందరు కూలీలుగా మారారు. ఇల్లెందు ఏరియా 21 పరిధిలో కార్మికుల పిల్లలు కూలీలుగా మారిన తీరు ప్రతి ఒక్కరినీ బాధిస్తుంది.

*స్వరాష్ట్రంలో సగర్వంగా..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో సీన్‌ మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మార్గదర్శనంలో సింగరేణి సాధిస్తున్న అద్భుత విజయాలు, సాధిస్తున్న లాభాలు ఉత్సాహపూరిత వాతావరణం సృష్టించాయి. కారుణ్య నియామకాలు అమలయ్యాయి. 2014 నుంచి ఇప్పటివరకు వేజ్‌బోర్డు వేతనాలను 7 శాతం పెంచింది. దీంతో కార్మికులకు రెట్టింపు వేతనాలు లభిస్తున్నాయి. కార్మికులకు ఆర్థిక దన్ను లభించడంతో తమ పిల్లలను ఉన్నతంగా చదివించుకోవాలన్న ఆకాంక్ష పెరిగింది. ఆర్థిక కష్టాలు తీరడంతో తమ పిల్లలకు మంచి భవిష్యత్తును అందించాలన్న తపన మొదలైంది. దీనికి తగ్గట్టుగానే పిల్లల్లోనూ పోటీ వాతావరణం ఏర్పడింది.కుటుంబంలో మంచి వాతావరణం ఏర్పడటంతో చదువుల మీద ధ్యాస పెట్టారు. పెద్దపెద్ద చదువులు చదివి అమెరికాలో ఉద్యోగం సంపాదించాలన్న ఆకాంక్ష బలీయమైంది. సింగరేణిలో జనరల్‌ మజూర్ద్‌, క్లర్క్‌ కార్మికుల పిల్లలు విదేశీ ఉద్యోగాలు సాధిస్తున్నారు. ఇల్లెందు ఏరియాకు చెందిన సుమారు 200 మందికి పైగా యువత అమెరికా, యూరప్‌ దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. సైకిళ్లతో ప్రారంభమైన సింగరేణి కార్మిక కుటుంబాల జీవితం ఆకాశంలో విహరించే స్థాయికి వెళ్లింది. ఏడాదికి ఒకట్రెండు సార్లు విమానాల్లో విదేశాలకు వెళ్లి పిల్లలతో గడిపివస్తున్నారు. ఆ మధుర జ్ఞాపకాలు, తమ పిల్లలు సాధిస్తున్న విజయాలను తోటివారికి చెప్పుకొంటూ మురిసిపోతున్నారు.
s2
*నా కూతురు పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తున్నది
మా కూతురు అమెరికాలో పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తున్నది. ఊహించని విధంగా వేతనం లభిస్తున్నది. మా అల్లుడు కూడా అక్కడే జాబ్‌ చేస్తున్నాడు. ఆరు నెలలకు ఒకసారి యూఎస్‌కు వెళ్లి వస్తుంటాం. మా అమ్మాయి ఇటీవల డెలీవరికి దగ్గరైంది. సుమారు ఆరునెలలు అక్కడే ఉండి వచ్చాం.
– కోటిరెడ్డి, సింగరేణి కార్మికుడు, ఇల్లెందు ఏరియా