DailyDose

‘స్వర్ణ పానం’.. ఈ టీ పొడి బంగారమే..

‘స్వర్ణ పానం’.. ఈ టీ పొడి బంగారమే..

*కిలో రూ.2.5 లక్షలు…

ఆ టీ పొడి ధర అక్షరాలా కిలో రూ.2.5 లక్షలు. అవును మీరు చదివింది నిజమే. దాని పేరు ‘స్వర్ణ పానం’. అసోమ్‌కు చెందిన రంజిత్‌ బారువా అనే ఒక టీ పొడి దుకాణం యజమాని ఈ సరికొత్త టీ పొడిని తయారు చేశాడు. అసోం టీ తోటల్లో లభించే లేలేత తేయాకులకు పరిమిత మోతాదులో మేలిమి (24 క్యారట్స్‌) బంగారం, తేనె, బెల్లం, కోకో జోడించి ఆయన ఈ ‘స్వర్ణ పానం’ టీ పొడిని మార్కెట్‌ చేస్తున్నాడు. శనివారం గువహతిలో జరిగిన ఇంటర్నేషనల్‌ టీ ఫెస్టివల్‌లోనూ ఆయన ఈ టీ పొడితో చేసిన టీని కొద్ది మందికి సర్వ్‌ చేశాడు. మంచి సువాసన, రుచితో కూడిన ఈ టీకి చాలా మంది ఫిదా అయిపోయారు. వంద గ్రాముల ప్యాక్‌ లో లభించే ఈ టీ పొడి ప్యాక్‌ కావాలంటే కొనుగోలుదారులు రూ.25,000 ఖర్చు చేయాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన అసోమ్‌ టీకి మరింత విలువ జోడించాలనే ఆలోచనతోనే తాను ఈ ప్రయోగం చేసినట్టు బారువా చెప్పారు. గతంలోనూ ఆయన అనేక ప్రత్యేక టీ పొడులను అభివృద్ధి చేశాడు. యూరోపియన్‌ దేశాల్లో ఈ లగ్జరీ టీలకు మంచి మార్కెట్‌ ఉంది. ఇప్పుడు స్వర్ణ పానం టీతో బారువా ఖ్యాతి మరింత ఇనుమడించింది.