NRI-NRT

లైఫ్‌ సెన్సెస్‌ క్యాపిటల్‌గా హైదరాబాద్‌.. దావోస్‌ సదస్సులో కేటీఆర్‌

లైఫ్‌ సెన్సెస్‌ క్యాపిటల్‌గా హైదరాబాద్‌.. దావోస్‌ సదస్సులో కేటీఆర్‌

లైఫ్‌ సెన్సెస్‌ క్యాపిటల్‌గా హైదరాబాద్‌ నిలిచిందని తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. స్విట్జర్లాండ్‌ దావోస్‌ వరల్డ్‌ ఎననామిక్స్‌ ఫోరం సదస్సులో కేటీఆర్‌ పాల్గొన్నారు. తెలంగాణలో జరిగిన లైఫ్‌ సెన్సెస్‌ అభివృద్ధిపై సదస్సులో చర్చ జరిగింది. కేటీఆర్‌తో పాటు డాక్టర్‌ రెడ్డీస్‌ ప్రతినిధి జీవీ ప్రసాద్‌రెడ్డి, పీడబ్ల్యూసీకి చెందిన మహ్మద్‌ అథర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ కరోనా వల్ల లైఫ్‌ సైన్సెస్‌, మెడికల్‌కు ప్రాధాన్యం పెరిగిందన్నారు. మెడికల్‌ రంగానికి ఊతమిచ్చేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రపంచపోటీ తట్టుకోవాలంటే విప్లవాత్మకమైన సంస్కరణలు అవసరమని అభిప్రాయపడ్డారు. లైఫ్‌ సైన్సెస్‌లో ఇతర నగరాల కంటే హైదరాబాద్‌ ముందుందని కేటీఆర్‌ పేర్కొన్నారు. లైఫ్‌ సైన్స్‌లో హైదరాబాద్‌ తన బలాన్ని పెంచుకుంటోందని, ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ప్రపంచస్థాయిలో హైదరాబాద్‌ ఫార్మా సిటీని ఏర్పాటు చేస్తున్నామని, అంతర్జాతీయ ప్రాధాన్యత ఉన్న ప్రాజెక్టుకు కేంద్రం మద్దతు లేదన్నారు. లైఫ్‌ సైన్సెస్‌.. డిజిటల్‌ డ్రగ్‌ డిస్కవరీ వైపు వెళ్తోందని, ఐటీ, ఫార్మారంగం కలిసి పని చేయాల్సి ఉంటుందన్నారు.