NRI-NRT

అలరించిన అన్నమయ్య శతగళార్చన

అలరించిన అన్నమయ్య శతగళార్చన

తెలుగు భాగవత ప్రచార సమితి ఆధ్వర్యంలో అన్నమయ్య శతగళార్చన కార్యక్రమం సింగపూర్‌లోని సివిల్‌ సర్వీసెస్‌ క్లబ్‌ ఆడిటోరియంలో ఆన్‌లైన్‌లో ఘనంగా నిర్వహించారు. మూడుగంటల పాటు నిర్వహించిన ప్రత్యక్ష ప్రసారానికి యూట్యూబ్‌ ద్వారా నిర్వహించ విశేష స్పందన లభించింది. అన్నమయ్య జయంతి రోజున మొదలైన సాంస్కృతిక కార్యక్రమం, సప్తగిరి సంకీర్తనలు, పిల్లల అన్నమయ్య సంకీర్తనలు వీక్షకులను అలరించాయి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి పిల్లలు, పెద్దలు పంపిన కీర్తలను నిత్యం యూట్యూబ్‌ ద్వారా ప్రసారం చేస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. చిన్నారుల్లో సాంస్కృతిక విలువలపై ఆసక్తిని పెంచేందుకు నిర్వహించిన కార్యక్రమానికి విద్యాధరి, చిరంజీవి వ్యాఖ్యానం అందించారు.
a2
కార్యక్రమంలో కవుటూరు రత్నకుమార్, అనంత్ బొమ్మకంటి, సురేష్ కుమార్ ఆకునూరి పాల్గొని చిన్నారులను ప్రోత్సహించారు. అన్నమయ్య శతగళార్చన కార్యక్రమానికి కియా మీడియా వీడియోగ్రఫీ, ఆడియో సహకారం అందించిన శివకుమార్‌ (వయోలిన్‌), శివకుమార్‌ గోపాలన్‌ (మృదంగం)లకు భాగవత ప్రచార సమితి తరఫున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రామాన్ని విజయవంతంగా నిర్వహించిన తెలుగు భాగవత ప్రచార సమితి సభ్యులకు, భాగవత బంధువులు, స్వచ్ఛంద కార్యకర్తలకు నిర్వహణ కమిటీ సురేష్ చివుకుల, విద్యాధరి కాపవరపు, రమ్య బొమ్మకంటి, రవితేజ భాగవతుల, మౌర్య ఊలపల్లి ధన్యవాదాలు తెలిపారు.
a3
a5