DailyDose

ఎలాంటి సవాలుకైనా భారత్ పరిష్కారం – TNI తాజా వార్తలు

ఎలాంటి సవాలుకైనా భారత్ పరిష్కారం   –  TNI  తాజా వార్తలు

*అనేక సంవత్సరాల నుంచి జపాన్‌ లో స్థిరపడినప్పటికీ భారతీయులకు భారతీయ సంస్కృతి పట్ల అంకితభావం నిరంతరం వృద్ధి చెందుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జపాన్‌లో పర్యటించిన ప్రతిసారీ తనకు గొప్ప ఆత్మీయత లభిస్తోందన్నారు. సోమవారం ఆయన జపాన్‌లోని భారత సంతతి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. మోదీ జపాన్‌లో రెండు రోజులపాటు పర్యటిస్తారు. క్వాడ్ సదస్సులో పాల్గొనడంతోపాటు జపాన్ నేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఈ నేపథ్యంలో భారత సంతతి ప్రజలతో ఆయన సోమవారం మాట్లాడారు.
*ఉత్త‌రాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో ఇవాళ ఉద‌యం నుంచి భారీ వ‌ర్షం కురుస్తోంది. దీంతో అధికారులు అక్క‌డ ఆరెంట్ అల‌ర్ట్ జారీ చేశారు. కాలిన‌డ‌క‌న వెళ్లే భ‌క్తుల‌ను నిలిపివేశారు. భ‌క్తులంతా హోట‌ళ్ల‌కు వెళ్లాలంటూ అభ్య‌ర్థిస్తున్నామ‌ని రుద్ర‌ప్ర‌యాగ్ సీవో ప్ర‌మోద్ కుమార్ తెలిపారు. ప్ర‌స్తుతం వాతావ‌ర‌ణం స‌రిగా లేద‌ని, భ‌క్తులెవ్వ‌రూ కేదార్‌నాథ్‌కు కాలిన‌డ‌క‌న వెళ్ల‌రాదు అని, సుర‌క్షితంగా ఉండాల‌ని ఆయ‌న కోరారు. మంగ‌ళ‌వారం కోసం కూడా ఆరెంజ్ అల‌ర్ట్ జారీ చేసిన‌ట్లు ప్ర‌మోద్ వెల్ల‌డించారు. గుప్త‌కాశీ నుంచి వ‌స్తున్న అయిదు వేల మందిని ప్ర‌స్తుతం నిలిపివేసిన‌ట్లు చెప్పారు. హెలికాప్ట‌ర్ స‌ర్వీసుల‌ను కూడా నిలిపివేసిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.
*ఆర్‌ కృష్ణయ్య ఎంపికపై మంత్రి బొత్స వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఉన్నా ఆంధ్రా ప్రజల తరుపునే గొంతు వినిపిస్తారని ఆయన తెలిపారు. కృష్ణయ్య జాతీయ నాయకుడు కాబట్టే ఎంపిక చేశామన్నారు. సామాజిక న్యాయం తెలియజేయటానికే మంత్రుల బస్సు యాత్ర చేపట్టారని తెలిపారు. సీఎం జగన్‌ దావోస్ పర్యటనతో ఏపీకి కంపెనీలు క్యూ కట్టనున్నాయన్నారు.
* మంత్రి బొత్స సత్యనారాయణకు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సవాల్ విసిరారు. నేడు సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ.. ఏపీని అభివృద్ధి చేసింది కేంద్రమేనని పేర్కొన్నారు. ఏపీ అభివృద్ధిపై దమ్ముంటే చర్చకు వస్తారా? అని సవాల్ విసిరారు. ఏపీలో వైసీపీ సర్కార్ చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. వైసీపీ ప్రభుత్వం.. దోపిడీ ప్రభుత్వమని సోము వీర్రాజు పేర్కొన్నారు. రేషన్ బియ్యంలో ఏపీ రూ.2 పెడితే.. కేంద్రం వాటా రూ.30 అని తెలిపారు. రేషన్ పంపిణీ వాహనాలపై జగన్ ఫొటో ఎలా పెట్టుకుంటారని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర ప్రజల 40 ఏళ్ల కల విశాఖ రైల్వే జోన్ అని పేర్కొన్నారు. విశాఖ రైల్వే జోన్ కల నెరవేర్చిందని ప్రధాని మోదీ అని సోము వీర్రాజు తెలిపారు.
* మహానాడు నిర్వహణపై టీడీపీ అధినేత చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. 40 ఏళ్ల ప్రస్థానం చాటేలా, భవిష్యత్ ప్రయాణాన్ని నిర్ధేశించేలా మహానాడు ఉండాలని సూచించారు. మొదటి రోజు ప్రతినిధుల సభకు 12 వేల మందికి ఆహ్వానం ఇవ్వనున్నట్లు తెలిపారు. రెండో రోజు అదే ప్రాగణంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. పార్టీ భవిష్యత్ ప్రయాణంపై దిశా నిర్ధేశం చేసేలా మహానాడు కార్యక్రమం ఉండాలన్నారు. వివిధ వర్గాల నుంచి వస్తున్న స్పందన చూస్తే ప్రభంజనంలా మహానాడు ఉండబోతోందన్నారు. ప్రభుత్వం అడ్డంకులు సృష్టించినంత మాత్రాన మహానాడు ఆగదన్నారు.*హైదరాబాద్ నగరంలోని బేగంబజార్ పరువు హత్య కేసులో మరొకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న A5 మహేష్ గోటియ యాదవ్(21)ను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పుణెలో మహేష్ అహియార్ గోటియ యాదవ్‌ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురు నిందితులు విజయ్ యాదవ్, సంజయ్ యాదవ్, రోహిత్ యాదవ్, ఓ మైనర్ బాలుడు రిమాండ్ అయిన విషయం తెలిసిందే. ఈరోజు A5 మహేష్ అహీయార్ యాదవ్(21)ను షాహీనాథ్ గంజ్ పోలీసులు రిమాండ్‌కు తరలించనున్నారు. అలాగే బేగంబజార్ కోల్సివాడకు చెందిన అభినవ్ యాదవ్ (26)ఇంకా పరారీలో ఉన్నాడు. అతని కోసం వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్, షాహినాద్ గంజి పోలీసులు గాలిస్తున్నారు.
*హైదరాబాద్ నగరంలోని కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోల్నాకలో దారుణం జరిగింది. ఏడేళ్ల బాలుడిని సవతి తల్లి హత్య చేసింది. ఉజ్వల్ అనే ఏడేళ్ల బాలుడు 15 రోజుల క్రితం బిల్డింగ్‌పై నుంచి కింద పడ్డాడు. వెంటనే తండ్రి బాలుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించాడు. ఆ తరువాత ఇంటికి తీసుకురాగా… నిన్న(ఆదివారం) బాలుడు ఇంట్లో చనిపోయాడు. బాలుడి మృతిపై అనుమానం వ్యక్తం చేసిన తండ్రి భాస్కర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది. సవతి తల్లి సరిత కొడుకును హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. బిల్డింగ్‌పై నుండి ఉజ్వల్‌ను సవతి తల్లి నెట్టివేసింది. అప్పటికి చనిపోకపోవడంతో ఇంటికి వచ్చిన తరువాత గొంతు నులిమి హత్య చేసింది. సరితను అరెస్టు చేసిన కాచిగూడ పోలీసులు స్టేషన్‌కు తరలించారు.
*పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం తొగర్రాయి పాండవుల గుట్టలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. పాండవుల విగ్రహాలను తొలగించి గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. ఆ తవ్విన చోట గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలను సైతం నిర్వహించారు. కోరిన కోర్కెలు తీర్చే దేవతలుగా పాండవులను గ్రామస్తులు నమ్ముతారు. తవ్వకాలు జరిపిన వ్యక్తులను పట్టుకొని చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
*తెలంగాణలో టెన్త్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. రెండేళ్ల తర్వాత రాష్ట్రంలో టెన్త్ పరీక్షలు జరుగుతున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. తెలంగాణలో మొత్తం 5 లక్షల 9,275 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,861 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎగ్జామ్ హాల్‎లోకి 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతిస్తామని అధికారులు తెలిపారు.
*ముఖ్యమంత్రి జగన్ పర్యటనపై వర్ల రామయ్య మాట్లాడారు. దావోస్ పర్యటనలో జగన్ తత్తరపాటుకు గురయ్యారని పేర్కొన్నారు. మీ బిడ్దలను కలవాలనుకుంటే.. ఆ విషయ కోర్టుకు తెలిపి.. దర్జాగా లండన్‌లో దిగి, మీ వ్యక్తిగత పనులు చూసుకోవచ్చు కదా? అని జగన్‌ను ప్రశ్నించారు. దైవ దర్శనానికి కూడ జగన్ భార్యతో కలిసిరారని, భార్యాభర్తలు కలిసి బయలు దేరినపుడు ఆ ట్రిప్ వ్యక్తిగతమని తెలిసిపోయిందన్నారు
*రుషికొండ తవ్వకాలపై ఏపీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విశాఖలో రుషికొండ తవ్వకాలపై ఎన్జీటీ ధర్మాసనం స్టే విధించింది. ఎన్జీటీ ఆదేశాలను ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. పర్యావరణ అనుమతులన్నీ పొందిన తర్వాతే.. రుషికొండ తవ్వకాలను చేపట్టినట్లు ఏపీ సర్కార్ పేర్కొంది. పర్యావరణానికి ఎటువంటి హానీ కలగకుండా.. తవ్వకాలు, నిర్మాణాలు చేపడతామని పిటిషన్‌లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది. ఎంపీ రఘురామ గతేడాది దాఖలు చేసిన పిటిషన్‌పై ఈనెల 6న ఎన్జీటీ విచారణ జరిపింది. తవ్వకాలపై అధ్యయనం చేసేందుకు సంయుక్త కమిటీని నియమించింది. నెల రోజుల్లో నివేదిక అందించాలని కమిటీకి ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వుల వరకు ఎలాంటి తవ్వకాలూ జరపరాదని ఎన్జీటీ ఆదేశించింది. త్వరలో రుషికొండ తవ్వకాలపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.
*సామూహిక వివాహాలను వైభవంగా నిర్వహించారు. బళ్లారి నగరం రిజ్జమ్‌ ల్యాండ్‌ పాఠశాల ఆవరణంలో ఆది ఎడ్యుకేషనల్‌ ట్రస్టు, సోషల్‌ వెల్ఫేర్‌ ట్రస్టు ఆధ్వర్యంలో అధ్యక్షుడు వీరేష్‌ కుమార్‌ నేతృత్వంలో రెండవ సంవత్సరం ఉచిత సామూహిక వివాహాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 28 జంటలు ఒక్కటయ్యారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 131వ జయంతి, 889వ బసవ జయంతి సందర్భంగా రెండవ సంవత్సరం ఉచిత సామూహిక వివాహా లు నిర్వహించినట్లు ట్రస్టు సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి శ్రీరాములు, రూరల్‌ ఎమ్మెల్యే నాగేంద్ర, కల్యాణస్వామి, బళ్లారిలోని పలు వార్డు కార్పొరేటర్లు, ఉచిత సామూహిక వివాహాల్లో పాల్గొని 28 మంది నూతన వధూవరులను ఆశీర్వదించారు. పలు గ్రామాల నుంచి, పట్టణాల నుంచి పెద్దఎత్తున ప్రజలు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. పలువురు వక్తలు దాతల ఔదార్యాన్ని ప్రశంసించారు. పేదలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ ఎమ్మెల్యే నాగేంద్ర, బెంగళూరు సిటీ సి విల్‌ జడ్జీ రాఘవేంద్ర, కాంగ్రెస్‌ నాయకుడు సునీల్‌రావు, బీజేపీ నాయకుడు అబ్దుల్‌ అజీ జ్‌, సిద్దార్థ, అర్జున్‌, రైతు సంగనకల్లు కృష్ణప్ప, వీరేశ్‌కుమార్‌, ట్రస్టు సభ్యులు గంగాధర్‌, గురుసిద్దప్ప, శేకప్ప పాల్గొన్నారు.
*కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రైతుల జీవనాడిగా నిలిచిన తుంగభద్ర జలాశయానికి అధిక ప్రమాణంలో నీరు వచ్చి చేరుతుండడంతో తుంగభద్ర ఆయకట్టు రైతుల్లో ఆనందోత్సవాలు కనిపిస్తున్నాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది ముందుగానే వర్షాలు పడుతుండడంతో తుంగభద్ర జలాశయానికి అధికంగా నీరు వచ్చి చేరుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జలాశయం నీటి మట్టం 1605.56 నమోదు కాగా, ప్రస్తుతం జలాశయంలో 27.48టిఎంసి నీరు నిలువ ఉన్నట్లు వివరించారు. తుంగభద్ర జలాశయం పైభాగంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో తుంగ, భద్ర నదులు పొంగి ప్రవహిస్తున్న కారణంగా శివమొగ్గ జిల్లా పరిధిలో గాజగనూరు వద్ద తుంగ నదిపై నిర్మించిన గాజగనూరు, భద్ర జలాశయం నుంచి వేలాది క్యూసెక్కుల వరద నీరు దిగువకు వదులుతున్నందున.. ఆ నీరు నేరుగా తుంగభద్ర జలాశయానికి వచ్చి చేరుతోంది. దీంతో తుంగభద్ర జలాశయం వరద నీటితో కళకళలాడుతోంది.
* ఉదయం నుంచి ఢిల్లీలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడగా.. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రతికూల వాతావరణంతో విమానాల సర్వీసులపై ప్రభావం పడింది. 19 విమానాలను ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ అధికారులు జైపూర్, లఖ్‌నవూ, ఇండోర్, అమృత్‌సర్, ముంబై వైపు మళ్లించారు.
*రాష్ట్రంలో భారంగా మారిన పెట్రో ధరలు తగ్గించాలి అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ట్వీట్టర్ వేదికగా స్పందిస్తూ… నాడు అభివృద్ధిలో దేశంలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం… ఇప్పుడు పన్నుల భారంలో మొదటి స్థానంలో ఉందన్నారు. పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరల నుంచి దేశ ప్రజలకు ఉపశమనం కలిగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు. అదే సమయంలో ఆయా రాష్ట్రాలను కూడా పన్నులు తగ్గించుకుని ప్రజలకు మేలు చేయమంటూ కేంద్రం పిలుపును ఇవ్వడం ప్రశంసనీయమన్నారు. తెలుగుదేశం హయాంలో అభివృద్ధిలో దేశంలో మొదటి స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం… ఇప్పుడు పెట్రో బాదుడులో దేశంలోనే మొదటి స్థానంలో ఉందని వ్యాఖ్యానించారు. పెట్రో ధరల బాదుడుతో సామాన్యుడి జీవితంపై తీవ్ర ప్రభావం పడుతోందన్నారు. నిత్యావసర వస్తువుల ధరల భారానికి ఇది కారణం అవుతోందని తెలిపారు. ఎన్ని విజ్ఞప్తులు చేసినా, ప్రజలు భారం మోయలేక పోతున్నా ప్రభుత్వం మాత్రం పెట్రో బాదుడు నుంచి ఉపశమనం కలిగించలేదని టీడీపీ అధినేత మండిపడ్డారు.
*మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్‌ కోర్టుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ హాజరయ్యారు. కేసు విచారణలో భాగంగా కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యారు. అచ్చెన్నాయుడు అరెస్ట్ సమయంలో.. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ లోకేష్‌, కొల్లు రవీంద్రపై పోలీసులు కేసు నమోదు చేశారు. లోకేష్‌తో పాటు కొల్లు రవీంద్ర కోర్టుకు హాజరయ్యారు. కోర్టు దగ్గర నేతలు అనుసరిస్తున్న విధానాన్ని పోలీసులు తప్పుబట్టారు. కోర్టు దగ్గర టాస్క్‌ఫోర్స్ పోలీసులకు ఏం పనంటూ టీడీపీ నేతలు మండిపడ్డారు. కోర్టు దగ్గరకు టీడీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. పోలీసులు అడ్డుకున్నారు.
*వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రం హత్యలకు, లైంగికదాడులకు నిలయంగా మారిందన్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులే నేరాలకు పాల్పడుతున్నా వైసీపీ అధిష్ఠానం పట్టించుకోదని మండిపడ్డారు. సీఎం బాబాయి వివేకా హత్య కేసులో ఎంపీ నిఖిత్ రెడ్డి పాత్ర ఉందని, సీబీఐ తేల్చినా ఇప్పటికీ ఎటువంటి చర్యలు లేవని అన్నారు. కాకినాడలో సొంత డ్రైవర్‌ను హత్య చేసిన ఎమ్మెల్సీ అనంతబాబు) పై ఎన్నో నేరారోపణలు ఉన్నాయని తెలిపారు. టీడీపీ, దళిత సంఘాల ఆందోళనతోనే ఎమ్మెల్సీ అనంతబాబుపై కేసు నమోదు చేశారని అంగర రామ్మోహన్ అన్నారు.
* వైసీపీ నేత, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడి కి ప్రభుత్వం గన్‌మెన్లను తొలగించింది. కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న సమయంలో సుబ్బారాయుడికి 1+1 పద్ధతిలో గన్‌మెన్లను కేటాయించడం జరిగింది. ఇటీవల జిల్లా కేంద్రం విషయంలో ప్రభుత్వానికి, సొంత పార్టీకి సుబ్బారాయుడు ఎదురుతిరిగిన విషయం తెలిసిందే. రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే గన్‌మెన్లను తొలగించారని వైసీపీ వర్గాల్లో ప్రచారం జోరుగా వినిపిస్తోంది.
*రాష్ట్ర స్త్రీ, శిశుసంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీచరణ్‌.. ఏకంగా చెరువుకే ఎసరు పెట్టారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ సమీపంలోని చెరువును మంత్రి అనుచరులు పూడ్చివేస్తుండడంతో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఉమామహేశ్వరనాయుడు.. స్థానిక నాయకులతో కలిసి ఆదివారం ఆందోళన చేపట్టారు. ఎక్స్‌కవేటర్లు, టిప్పర్లతో జరుగుతున్న మట్టి తవ్వకాలను అడ్డుకున్నారు. చెరువులోనే బైఠాయించి 3 గంటలపాటు ధర్నా చేపట్టారు. చెరువు పూడిక పనులను నిలిపివేయాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి, ఆర్డీవో నిశాంత్‌రెడ్డి, తహసీల్దార్‌ బ్రహ్మయ్యలను ఫోన్‌లో కోరారు. గంటల తరబడి చెరువులో ఆందోళన చేస్తున్నా.. అధికారులు స్పందించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉమా మాట్లాడుతూ.. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని దొడగట్ట సమీపంలో 329 సర్వేనెంబరులో సుమారు 130 ఎకరాల చెరువు ఉందని తెలిపారు. దాని కింద వందలాది మంది రైతులు వ్యవసాయ బోరుబావులతో పంటలు సాగుచేసుకుంటున్నారన్నారు. చెరువును పూడ్చి వేస్తుండడంతో రైతుల బోరుబావులు ఎండిపోవడంతో పాటు పంటల సాగు కూడా ప్రశ్నార్థకంగా మారనుందన్నారు. అలాంటి చెరువును పూడ్చివేస్తే వర్షాలు కురిసినపుడు పట్టణంలోని లోతట్టుప్రాంతాల్లో నీరు చేరుతుందని తెలిపారు. మంత్రి ఉషశ్రీచరణ్‌ అధికారాన్ని అడ్డుపెట్టుకుని దర్జాగా మట్టిని తోలిస్తూ చెరువును ఆక్రమించడం ఎంతవరకు సమంజసమని ఉమా నిలదీశారు. చెరువు అన్యాక్రాంతం కాకుండా తక్షణమే ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.
* కళ్యాణదుర్గం చెరువు వద్దకు రైతులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. చెరువును కబ్జాదారుల నుంచి కాపాడాలంటూ టీడీపీ ఆందోళనకు దిగింది. రైతులతో కలిసి టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఉమామహేశ్వర నాయుడు ఆందోళనలో పాల్గొన్నారు. ఫ్లకార్డులు పట్టుకుని రైతులు నిరసనలో కూర్చున్నారు. రూ.200 కోట్లు విలువ చేసే 93 ఎకరాలు కబ్జాకు గురవుతున్నాయని రైతులు వెల్లడించారు.
*వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం ఆదివారం భక్తులతో రద్దీగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకొని తరించారు. ఆదివారం సందర్భంగా గర్భాలయంలోకి ప్రవేశం నిలిపివేసి లఘుదర్శనం అమలు చేయడంతో నందీశ్వరుడి వద్ద నుంచి స్వామివారిని దర్శించుకున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు. కళాభవన్‌లో స్వామివారి నిత్యకల్యాణం, సత్యనారాయణవ్రతం ఆర్జిత సేవలలో పాల్గొన్నారు. అనుబంధ ఆలయమైన బద్దిపోచమ్మ ఆలయంలోనూ భక్తుల రద్దీ కొనసాగింది. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకొని బోనం మొక్కు చెల్లించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.
*తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యవసాయ విధానాలు బాగున్నాయని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయశాఖ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిని ఆదివారం ఆయన హైదరాబాద్‌లో కలిశారు. కేసీఆర్‌ చేపడుతున్న రైతు అనుకూల పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు. పంటల వైవిధ్యీకరణ తప్పనిసరి అని, వరి సాగు నుంచి పప్పు ధాన్యాలు, నూనె గింజల సాగు వైపు రైతులు మళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇథనాల్‌ ఉత్పత్తిని కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని సూచించారు. ఎగుమతులు ప్రోత్సహించేందుకు అనేక వసతులు కల్పించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మద్దతు ధరల విధానం లోపభూయిష్టంగా ఉన్నదని చెప్పారు. ఎమ్మెస్‌ స్వామినాథన్‌ కమిటీ సిఫారసుల అమలు అవసరాన్ని గుర్తుచేశారు.
*కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో రాష్ట్రం మరో మైలురాయిని అధిగమించింది. రాష్ట్ర ప్రజలకు వేసిన డోసుల సంఖ్య ఆదివారం సాయంత్రానికి 6 కోట్లు దాటింది. ఈ సందర్భంగా వైద్య సిబ్బందికి మంత్రి హరీశ్‌ రావు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో మొత్తంగా ఇప్పటివరకు 3.11 కోట్ల మందికి తొలి డోసు, 2.83 కోట్ల మందికి రెండో డోసు, 5.18లక్షల మందికి ప్రికాషనరీ డోసు పంపిణీ చేశారు. 12-14 వయసు వారికి వ్యాక్సినేషన్‌ కొనసాగుతోంది. 11.36లక్షల మందికి టీకాలు వేయాలని లక్ష్యంగా నిర్దేశించగా.. ఇప్పటివరకు 19% పూర్తయింది. కరోనా వైరస్‌ నుంచి రక్షణ పొందేందుకు అర్హులైన ప్రతి ఒక్కరూ టీకాలు వేసుకోవాలని మంత్రి హరీశ్‌ రావు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
*తుంగభద్ర జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతాలైనా మలేనాడు, హగుంబే, హరిహర, శివమొగ్గ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో రెండు రోజుల్లో 20 టీఎంసీల వరద నీరు జలాశయంలోకి వచ్చి చేరింది. దీంతో కర్నూలు జిల్లాలోని 1.5 లక్షల ఎకరాల్లో పత్తి, మిరప, వరి సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. తుంగభద్ర జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 1633 అడుగులు ఉండగా, ప్రస్తుతం 1605.56 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 100 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 28 టీఎంసీలకు చేరింది. ఇన్‌ఫ్లో 89,664 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 255 క్యూసెక్కులు ఉంది. అలాగే, ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి శ్రీశైల జలాశయానికి ఆదివారం స్వల్పంగా ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. సుంకేసుల జలాశయం నుంచి 8,622 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ఇక్కడి పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు. గరిష్ఠ నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా, ప్రాజెక్టులో ఆదివారం రాత్రి 9 గంటల సమయానికి 813.20 అడుగుల వద్ద 36.1914 టీఎంసీలుగా నమోదైంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల్లో విద్యుదుత్పత్తి జరగడం లేదు.
* తుంగతుర్తిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్‌ పై మాజీ ఎమ్మెల్యే దామోదర్‌రెడ్డి వర్గీయులు దాడి చేశారు. కొంతకాలంగా దామోదర్‌రెడ్డి, దయాకర్‌ వర్గాల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. ఇటీవల కాలంలో దామోదర్‌రెడ్డితో పాటు మరికొందరిపై ఏఐసీసీకి అద్దంకి దయాకర్ ఫిర్యాదు చేశారు.
*TDP పోలిట్‌బ్యూరో సమావేశం ఈ నెల 26న జరగనుంది. 27వ తేదీ నుంచి ప్రారంభమయ్యే మహానాడులో ఆమోదించాల్సిన తీర్మానాలపై ఇందులో చర్చించనున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక, ఇతర అంశాల‌పై చర్చిస్తారు. అలాగే రానున్న ఎన్నికల్లో యువత, మహిళలకు పెద్ద పీట, ఇతర అంశాల‌పై కూడా చర్చిస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి.
* గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే‌ అన్నా రాంబాబుకి అసమ్మతి సెగ తగిలింది. అన్నా రాంబాబుకు వ్యతిరేకంగా సంజీవరాయునిపేటలో వైసీపీ నాయకులు భేటీ అయ్యారు. గిద్దలూరు జడ్పీటీసీ మధుసూదన్ ఆధ్వర్యంలో సమావేశమై చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో గిద్దలూరు, కొమరోలు, అర్థవీడు మండలాల వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
*ప్రకాశం జిల్లా దర్శి వైసీపీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌కు చెందిన కాలేజీ విద్యార్థులు కళాశాలలో జరిగిన ఓ ఫంక్షన్‌లో సీఎం జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదేసమయంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు అనుకూలంగా నినాదాలు చేయడంతో పాటు జనసేన జెండాలను ప్రదర్శించారు. కళాశాల వార్షికోత్సవ ముగింపు సభలో శనివారం రాత్రి హఠాత్తుగా చోటు చేసుకున్న ఈ ఘటనతో కాలేజీ యాజమాన్యం విస్తుబోయింది. ఆదివారం సాయంత్రానికి దీనిపై దర్శి పోలీసు స్టేషన్‌లో ముగ్గురు వ్యక్తులపై కేసులు నమోదయ్యాయి. మద్దిశెట్టి వేణుగోపాల్‌కు ఒంగోలు సమీపంలో పేస్‌ ఇంజనీరింగ్‌ కళాశాల ఉంది. కాలేజీ కరస్పాండెంట్‌గా ఎమ్మెల్యే సోదరుడు మద్దిశెట్టి శ్రీధర్‌ ఉన్నారు. కేసు నమోదైన వారిలో మల్లికార్జున యాదవ్‌ వైసీపీకే చెందిన మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డికి అనుచరుడిగా ఉన్నారు. దీంతో ఆయనకు మద్దతుగా శివప్రసాద్‌రెడ్డి అనుచరులు పోలీసు స్టేషన్‌ వద్దకు చేరారు. షేక్‌ అయూబ్‌, ముత్యాల కల్యాణ్‌ అనే వారిపైనా కేసు నమోదు చేశారు. వీరిలో కల్యాణ్‌ జనసేన ముఖ్య కార్యకర్త అని తెలుస్తోంది.
*డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం కుటుంబానికి చంద్రబాబు రూ.5లక్షల ఆర్థిక సాయం ప్రకటించినట్టు రాష్ట్ర ఎస్సీసెల్‌ అధ్యక్షుడు ఎంఎ్‌స.రాజు తెలిపారు. మృతుడి స్వగ్రామంలో బాధిత కుటుంబ సభ్యులను ఆదివారం ఎంఎ్‌స.రాజు, పెదపూడి సర్పంచ్‌ కలవల కృష్ణమూర్తి, రాష్ట్ర ఎస్సీసెల్‌ అధికార ప్రతినిధి చిర్రా వరప్రసాదరావు, జిల్లా ఎస్సీసెల్‌ నాయకులు సత్యనారాయణ పరామర్శించారు.
*రద్దు చేసిన దళిత సంక్షేమ పథకాలను పునరుద్ధరించిన తర్వాతే ఎమ్మెల్యే గారు గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టాలి’ అంటూ ఇంటింటా పోస్టర్లు అతికించారు. అనకాపల్లి జిల్లా దళిత సంఘాల ఐక్య వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ప్రభుత్వానికి ఇలా వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ కరపత్రాలను జీవీఎంసీ 85వ వార్డులోని పినమడక ఎస్సీ కాలనీలో ఇంటింటికీ తిరిగి గోడలపై అతికించారు. రిటైర్డ్‌ అదనపు ఎస్పీ పి.ప్రకాశరావు ముఖ్యఅతిథిగా పాల్గొని కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం ఆయనే నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితుల సంక్షేమం కోసం గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. దళితులు కోరి ఎన్నుకున్న వైసీపీ సర్కారు, ఎస్సీలకు ద్రోహం తలపెట్టిందని విమర్శించారు. ఎస్సీ కార్పొరేషన్‌ రుణాలు, చట్టబద్ధంగా రావలసిన సబ్‌ ప్లాన్‌ నిధులు, భూమి కొనుగోలు పథకం, కులాంతర వివాహ ప్రోత్సాహకం, పారిశ్రామిక ప్రోత్సాహకాలు తదితరాలను రద్దు చేసిందన్నారు. తమ గడపకు పాలకులు వచ్చే ముందు రద్దు చేసిన పథకాలను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఐక్య వేదిక కన్వీనర్‌ బూసి వెంకటరావు, దళిత సంఘాల నేతలు చంద్రశేఖర్‌, బాబాసాహెబ్‌, సరోజనీదేవి తదితరులు పాల్గొన్నారు.
*రాష్ట్రవ్యాప్తంగా కామన్‌ గుడ్‌ ఫండ్‌ (సీజీఎఫ్‌) పథకం ద్వారా మూడేళ్లలో 547 పురాతన, శిధిలావస్థకు చేరిన ఆలయాల పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం సోమవారం మరికొన్నింటికి అనుమతి ఇవ్వనుంది. ఈమేరకు ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అధ్యక్షతన సచివాలయంలో ప్రత్యేక సమావేశం జరగనుంది.దేవదాయ శాఖ మంత్రి చైర్మన్‌గా, ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌లతో పాటు టీటీడీ ఈవో సభ్యులుగా కొనసాగే కామన్‌ గుడ్‌ ఫండ్‌ కమిటీ ఆలయాల పునఃనిర్మాణానికి నిధులు మంజూరు చేస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్‌ 4వతేదీన నాడు దేవదాయ శాఖ మంత్రిగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రూ.31.40 కోట్లతో 60 ఆలయాల పునఃనిర్మాణానికి అనుమతి తెలిపారు. ప్రస్తుతం దేవదాయ శాఖ వద్ద సుమారు 160 ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.
*ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్‌ మృతి కేసులో దర్యాప్తు జరుగుతోందని, పోస్టుమార్టం నివేదిక అందగానే తదుపరి చర్యలు తీసుకుంటామని డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి చెప్పారు. గతంతో పోల్చితే రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఆదివారం తిరుపతి నుంచి విజయవాడ వెళ్తూ మార్గమధ్యంలో ఆయన నెల్లూరు పోలీసు అతిథి గృహంలో మీడియాతో మాట్లాడారు. శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నామని, ఫలితంగా నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని చెప్పుకొచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా 25 మోడల్‌ స్టేషన్లను నిర్మిస్తున్నట్లు చెప్పారు. నేరం జరిగిన వెంటనే విచారణను రోజుల వ్యవధిలోనే పూర్తిచేసి కోర్టులో చార్జిషీటు దాఖలు చేయడంతోపాటు న్యాయ వ్యవ స్థ సహకారంతో నేరస్థులకు త్వరితగతిన శిక్షలు పడేలా చేస్తున్నామన్నారు. కొత్త జిల్లాల్లో పోలీసు కార్యాలయాలను దశలవారీగా నిర్మిస్తున్నట్లు చెప్పారు. గంజాయిసాగు, అక్రమరవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామని.. నిరంతర తనిఖీలతో అక్రమ రవాణా తగ్గిందన్నారు. డీజీపీ వెంట నెల్లూరు ఎస్పీ విజయారావు ఉన్నారు.
*భారత్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో విశేషమైన సేవలందిస్తున్న గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్త(ఆశా)ల నెట్‌వర్క్‌కు ప్రపంచ గుర్తింపు లభించింది. మూడేళ్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) అందజేస్తున్న ‘డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్స్‌ గ్లోబల్‌ హెల్త్‌ లీడర్‌ అవార్డు’ భారత్‌లోని ఆశా నెట్‌వర్క్‌ కు దక్కింది. ఆదివారం వర్చువల్‌గా జరిగిన సమావేశంలో డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ డాక్టర్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ ఘెబ్రేయెసస్‌ ప్రకటించారు. ‘‘భారత్‌లో సుమారు 10 లక్షల మంది మహిళలతో ఆశా నెట్‌వర్క్‌ కొనసాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను అందిస్తోంది. కొవిడ్‌-19 కల్లోలం తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు ఇంటింటికీ వెళ్లి.. బాధితులను గుర్తించింది. వైరస్‌ ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా చర్యలు తీసుకుంది’’ అని డాక్టర్‌ టెడ్రోస్‌ వ్యాఖ్యానించారు. ‘‘హిందీ భాషలో ఆశా అంటే నమ్మకం అని అర్థం’’ అని వివరించారు. కాగా.. ఈ ఏడాది ఫిబ్రవరి 24న తాలిబాన్ల కాల్పుల్లో మృతిచెందిన 8 మంది పోలియో బృందం సభ్యులకూ ఈ అవార్డును ప్రకటించా రు. వ్యక్తిగత కేటగిరీలో.. హార్వర్డ్‌ కు చెందిన డాక్టర్‌ పాల్‌ ఫార్మర్‌(మరణానంతరం), బ్రిటన్‌కు చెందిన లెబనాన్‌ సంతతి సైకియాట్రిస్టు డాక్టర్‌ అహ్మద్‌ హన్కీర్‌, కాబోవెర్దేకు చెందిన లుద్మిలా సోఫియా ఒలివెరియా, డబ్ల్యూహెచ్‌వో కుష్ఠు నివారణ విభాగానికి జపాన్‌ తరఫున రాయబారిగా ఉన్న యోహెయి ససవాకను అవార్డులకు ఎంపిక చేసినట్లు టెడ్రోస్‌ చెప్పారు.
*వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం ఆదివారం భక్తులతో రద్దీగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకొని తరించారు. ఆదివారం సందర్భంగా గర్భాలయంలోకి ప్రవేశం నిలిపివేసి లఘుదర్శనం అమలు చేయడంతో నందీశ్వరుడి వద్ద నుంచి స్వామివారిని దర్శించుకున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులుస్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు. కళాభవన్‌లోస్వామివారి నిత్యకల్యాణంసత్యనారాయణవ్రతం ఆర్జిత సేవలలో పాల్గొన్నారు. అనుబంధ ఆలయమైన బద్దిపోచమ్మ ఆలయంలోనూ భక్తుల రద్దీ కొనసాగింది. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకొని బోనం మొక్కు చెల్లించుకున్నారు.భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.
*రాష్ట్ర స్త్రీ, శిశుసంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీచరణ్‌.. ఏకంగా చెరువుకే ఎసరు పెట్టారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ సమీపంలోని చెరువును మంత్రి అనుచరులు పూడ్చివేస్తుండడంతో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఉమామహేశ్వరనాయుడు.. స్థానిక నాయకులతో కలిసి ఆదివారం ఆందోళన చేపట్టారు. ఎక్స్‌కవేటర్లు, టిప్పర్లతో జరుగుతున్న మట్టి తవ్వకాలను అడ్డుకున్నారు. చెరువులోనే బైఠాయించి 3 గంటలపాటు ధర్నా చేపట్టారు. చెరువు పూడిక పనులను నిలిపివేయాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి, ఆర్డీవో నిశాంత్‌రెడ్డి, తహసీల్దార్‌ బ్రహ్మయ్యలను ఫోన్‌లో కోరారు. గంటల తరబడి చెరువులో ఆందోళన చేస్తున్నా.. అధికారులు స్పందించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉమా మాట్లాడుతూ.. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని దొడగట్ట సమీపంలో 329 సర్వేనెంబరులో సుమారు 130 ఎకరాల చెరువు ఉందని తెలిపారు. దాని కింద వందలాది మంది రైతులు వ్యవసాయ బోరుబావులతో పంటలు సాగుచేసుకుంటున్నారన్నారు. చెరువును పూడ్చి వేస్తుండడంతో రైతుల బోరుబావులు ఎండిపోవడంతో పాటు పంటల సాగు కూడా ప్రశ్నార్థకంగా మారనుందన్నారు. అలాంటి చెరువును పూడ్చివేస్తే వర్షాలు కురిసినపుడు పట్టణంలోని లోతట్టుప్రాంతాల్లో నీరు చేరుతుందని తెలిపారు. మంత్రి ఉషశ్రీచరణ్‌ అధికారాన్ని అడ్డుపెట్టుకుని దర్జాగా మట్టిని తోలిస్తూ చెరువును ఆక్రమించడం ఎంతవరకు సమంజసమని ఉమా నిలదీశారు. చెరువు అన్యాక్రాంతం కాకుండా తక్షణమే ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.
*ప్రభుత్వం ఉర్దూకు రెండో అధికార భాష హోదా కల్పిస్తే దానికి ముగింపు కార్డు పడే విధంగా విద్యాశాఖ అధికారులు ప్రవర్తిస్తున్నారని రాష్ట్ర ఉర్దూ టీచర్స్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు సయ్యద్‌ హిదయతుల్లా, అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్‌ అబ్ధుల్‌ వారిస్‌, సయ్యద్‌ ఇక్బాల్‌ పేర్కొన్నారు. నూతన విద్యా విధానంలో పాఠశాలల మ్యాపింగ్‌ సాకు చూపి ఇతర మీడియం పాఠశాలల్లో ఉర్దూ పాఠశాలల్ని మ్యాపింగ్‌ చేసేందుకు అధికారులు యత్నిస్తున్నారని వారు ఆదివారం ఒక ప్రకటనలో ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో సమగ్ర శిక్ష కార్యాలయాల్లో ఉర్దూ అకడమిక్‌ మానిటరింగ్‌ అధికారి, డిప్యూటీ ఇనస్పెక్టర్‌ ఆఫ్‌ స్కూల్స్‌ ఉర్దూ రేంజ్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఉర్దూ పాఠశాలల పర్యవేక్షణ గాలికొదిలి మ్యాపింగ్‌కు ఆదేశాలు ఇవ్వడం ద్వారా ఉర్దూ పాఠశాలల మనుగడను ప్రశ్నార్థకంగా మార్చే చర్యలకు విద్యాశాఖ ఉపక్రమించడం మంచిది కాదన్నారు. 220 ఉర్దూ ప్రాథమికోన్నత పాఠశాలలకు కనీసం 660 మంది విద్యా వలంటీర్లను ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర విద్యాశాఖ ఉండటం సిగ్గుచేటన్నారు.
* టీటీడీ ఆర్జిత సేవా టికెట్ల కుంభకోణానికి సంబంధించి 12 సంవత్సరాల తర్వాత బాధ్యులైన ఉద్యోగులపై అధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్టు సామాజిక కార ్యకర్త జంపాన శ్రీనివాసగౌడ్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2010లో అప్పటి లోకాయుక్తకు శ్రీనివాసగౌడ్‌ ఫిర్యాదు చేయగా విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ విచారణ చేసి 2011లో నివేదికను ప్రభుత్వానికి, టీటీడీ ఈవోకు అందజేసింది. లోకాయుక్త సుదీర్ఘ విచారణ అనంతరం 11మంది టీటీడీ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్టు శ్రీనివాసగౌడ్‌ తెలిపారు.
*నయార ఎనర్జీ డీలర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యవర్గం(ప్రైవేటు పెట్రోలు బంకుల యజమానులు) ఎన్నిక ఆదివారం గుంటూరులో నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షునిగా కె.వి.నారాయణ(ప్రకాశం), ఉపాధ్యక్షులుగా ఆర్‌.దేవుడుబాబు (శ్రీకాకుళం), నరసింహారావు (పశ్చిమగోదావరి), పూర్ణచంద్రరావు (గుంటూరు), వెంకటరమణ (చిత్తూరు), నరసింహారెడ్డి (కడప), ప్రధాన కార్యదర్శిగా కరుణాకరరావు (ప్రకాశం), సంయుక్త కార్యదర్శిగా బి.రాజశేఖరరెడ్డి(చిత్తూరు), కోశాధికారిగా ఎం.బ్రహ్మారెడ్డి (గుంటూరు) ఎన్నికయ్యారు.
*కన్యాం కనక సంపన్నాం.. కనకాభరణైర్యుతాం.. అంటూ వెండితెర ముందు వధువు తలిదండ్రులు కన్యాదానం చేసి.. ధర్మేచ అర్థేచ కామేచ.. నాతిచరితవ్య.. అంటూ వరుడిని మాటిమ్మని కోరగా.. నాతి చరామీ అంటూ మూడు మార్లు పలికి అమెరికా నుంచి వరుడు హామీ ఇచ్చాడు. ఖండాంతరాల ఆవల కన్న కూతురి కల్యాణం జరుగుతుంటే అక్కడికి చేరుకోలేని ఆ తల్లిదండ్రులు సూళ్లూరుపేటలో వెండితెరపై వివాహ తంతులో పాల్గొని సంతృప్తిపడిన ఉదంతం ఇది. నెల్లూరుకు చెందిన పలగాటి శ్రీనివాసులురెడ్డి, సునీల దంపతుల తనయ రిషిత అమెరికాలో ఎంబీఏ చదువుతోంది. ఆమెకు అమెరికా నివాసులైన పర్వతరెడ్డి శ్రీనివాసులురెడ్డి, జ్యోతి దంపతుల తనయుడు రోహిత్‌రెడ్డితో అమెరికాలో మే 21వ తేదీ (భారత కాలమానం మేరకు మే 22వ తేదీ)న వివాహం జరిపించాలని నిర్ణయించారు. అమ్మాయి తల్లిదండ్రులు అమెరికాకు వెళ్లేందుకు వీసాకు దరఖాస్తు చేసినా మంజూరు కాలేదు. దాంతో కుమార్తె పెళ్లి వేడుక చూడాలని సూళ్లూరుపేటలోని బాహుబలి (వీఎపిక్‌) థియేటర్‌ను బుక్‌ చేసుకున్నారు. బంధుమిత్రులతో కలిసి ఆ థియేటర్‌లో వెండితెరపై అమెరికాలో జరుగుతున్న కుమార్తె వివాహాన్ని వీక్షించారు.
*విద్య, ఆరోగ్యం బాధ్యత నుంచి ప్రభుత్వాలు పక్కకు తప్పుకొని కార్పొరేట్‌లకు అవకాశం ఇస్తున్నాయని స్కూల్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్టీఎ్‌ఫఐ) నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కేసీ హరికృష్ణన్‌, సీఎన్‌ భారతి ఆరోపించారు. విజయవాడలో ఈ నెల 20న ప్రారంభమైన ఎస్టీఎ్‌ఫఐ 8వ జాతీయ మహాసభలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగుల సామాజిక భద్రతను తీసివేసే సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. పెరిగిన ధరలకు వ్యతిరేకంగా మే 25 నుంచి 31 వరకు మండల, జిల్లా స్థాయిల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని, ఎన్‌ఈపీ-2020 ఉపసంహరించాలని, సీపీఎస్‌ రద్దు చేయాలని కోరుతూ జూన్‌ 1 నుంచి 20వ తేదీ వరకు జిల్లాస్థాయిలో ధర్నా, ర్యాలీలు నిర్వహించాలని సమావేశాలు నిర్ణయించినట్టు వెల్లడించారు. జూలై 7న రాష్ట్రస్థాయి ధర్నా, జూలై 17న ఢిల్లీలో జాతీయస్థాయి సెమినార్‌ నిర్వహిస్తామన్నారు. 2022-25 సంవత్సరానికి ఎస్‌టీఎ్‌ఫఐ జాతీయ అధ్యక్షుడిగా కె.సి.హరికృష్ణన్‌, జాతీయ ప్రధాన కార్యదర్శిగా సి.ఎన్‌.భారతిలు తిరిగి ఎన్నికయ్యారు.
*భారత అంతరిక్ష పరశోధనా సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమైంది. టాటా స్కై డీటీహెచ్‌ ప్రసారాల కోసం వినియోగించుకునే నిమిత్తం నాలుగు టన్నుల జీశాట్‌-24 ఉపగ్రహాన్ని రోదసీలోకి ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే భారత్‌ నుంచి కాకుండా దక్షిణ అమెరికా ఈశాన్య తీరంలోని ఫ్రెంచ్‌గాయానాలోని యూరోపియన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం చేయనుంది. భారత అంతరిక్ష శాఖ వాణిజ్య విభాగమైన న్యూస్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌ఎ్‌సఐఎల్‌) పూర్తి నిధులతో ఈ కమ్యూనికేషన్‌ ఉపగ్రహాన్ని ఇస్రో రూపొందించింది. దీన్ని టాటా స్కైకి లీజుకు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్న న్యూస్పేస్‌ ఇండియా దీన్ని ఫ్రెంచ్‌ గయానా నుంచి కక్ష్యలోకి చేరవేయిస్తోంది. దీనికోసం యూరోపియన్‌ స్పేస్‌తో ఒప్పందం చేసుకున్న ఎన్‌ఎ్‌సఐఎల్‌ ఉపగ్రహాన్ని భారత వైమానిక దళ ప్రత్యేక విమానంలో ఫ్రెంచ్‌గయానాకు చేర్చింది. జూన్‌ 22న తమ ఏరియన్‌-5 (వీఏ257) రాకెట్‌ ద్వారా జీశాట్‌-24ను కక్ష్యలోకి చేరవేయనున్నట్లు యూరోపియన్‌ స్పేస్‌ ఏజన్సీ ట్విట్టర్‌లో ప్రకటించింది.
*తిరుమల శ్రీవారికి కూరగాయల రైతులు లారీని విరాళంగా అందజేశారు. కర్ణాటకలోని ముళబాగల్ మాజీ ఎమ్మెల్యే జి. మంజునాథ్‌తో పాటు మరో 12 మంది కూరగాయల దాతలు రూ. 30 లక్షల విలువైన లారీని తిరుమల,తిరుమపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. ఈ మేరకు లారీ తాళంచెవులను ఆయనకు అందజేశారు.టీటీడీ అన్నప్రసాద కార్యకలాపాలకు కూరగాయలను తీసుకెళ్లేందుకు ఈ వాహనాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. కార్యక్రమంలో టీటీడీ అన్నప్రసాదం, దాతల విభాగం డిప్యూటీ ఈఓ పద్మావతి, డ్రైవింగ్ ఇన్‌స్పెక్టర్ జానకిరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
*వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారిని సోమవారం ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు ఆశీర్వచనం చేయగా ఆలయ ఈవో రమాదేవి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. వారి వెంట రాజన్న సిరిసిల్ల జిల్లా టీఆర్‌ఎస్ అధ్యక్షుడు తోట ఆగయ్య, వేములవాడ టీఆర్ఎస్ నాయకులు రామతీర్థపు రాజు, శ్రీకాంత్, కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు.