NRI-NRT

స్నితిక్ అభిమానానికి కేటీఆర్ ఫిదా

స్నితిక్ అభిమానానికి కేటీఆర్ ఫిదా

స్విట్జ‌ర్లాండ్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్‌కు ఓ బాలుడి నుంచి ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. జ్యూరిచ్ న‌గ‌రానికి చేరుకున్న కేటీఆర్‌కు స్నితిక్ అనే బాలుడు స్వాగ‌తం ప‌లికాడు. త‌న‌పై స్నితిక్‌కు ఉన్న అభిమానం ప‌ట్ల కేటీఆర్ ఫిదా అయిపోయాడు. దీంతో ఆ అబ్బాయితో కేటీఆర్ సెల్ఫీ దిగి కానుక‌గా అందించారు. వరల్డ్‌ ఎక‌నా‌మిక్‌ ఫోరం (డ‌బ్ల్యూ‌ఈ‌ఎఫ్‌) సదస్సు కోసం మున్సి‌పల్‌, ఐటీ శాఖల మంత్రి కేటీ‌ఆర్‌ ఆది‌వారం సాయంత్రం స్విట్జ‌ర్లాం‌డ్‌‌లోని జ్యూరిచ్‌ నగ‌రా‌నికి చేరు‌కు‌న్నారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్‌కు స్విట్జ‌ర్లాండ్ టీఆర్ఎస్ టీం గందె శ్రీధ‌ర్, అనిల్ జాల‌, కృష్ణారెడ్డి, అల్లు, తిరుప‌తి ప‌త్తిపాక‌, ప‌ద్మ‌జా రెడ్డితో పాటు త‌దిత‌రులు ఉన్నారు.