DailyDose

డ్రైవర్ను హత్య చేసినట్లు ఒప్పుకున్న ఎమ్మెల్సీ అనంత్ ఉదయ్ భాస్కర్ – TNI నేర వార్తలు

డ్రైవర్ను హత్య చేసినట్లు ఒప్పుకున్న ఎమ్మెల్సీ అనంత్ ఉదయ్ భాస్కర్ – TNI  నేర వార్తలు

*కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన నేరాన్ని ఒప్పుకున్నాడు. తన వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నందుకే తాను ఒక్కడినే అతడిని చంపానని పోలీసులకు ఆయన వివరించాడు. నాలుగు రోజులుగా ఏపీలోని కాకినాడలో డ్రైవర్‌ హత్య కేసు ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తున్న విషయం తెలిసిందే.అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ని పోలీసులు అరెస్టు చేయకపోవడాన్ని నిరిసిస్తూ ప్రజా , ఎస్సీ సంఘాలు, ప్రతిపక్ష, వామపక్ష సంఘాల నాయకులు ఆందోళన నిర్వహిస్తున్నారు. దీంతో పోలీసులు తప్పని పరిస్థితుల్లో నిన్న రాత్రి ఎమ్మెల్సీని అదుపులోకి తీసుకుని ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో డీఐజీ పాలరాజు సమక్షంలో విచారించారు. ఈ విచారణలో భాగంగా జరిగిన ఘటన వివరాలను ఎమ్మెల్సీ వివరించాడు. అరెస్ట్ వివరాలను డీఐజీ సాయంత్రం అధికారికంగా వెల్లడిస్తారని పోలీసు అధికారులు తెలిపారు.
*నార్క‌ట్‌ప‌ల్లి మండ‌లం ఔరావాణిలో విషాదం చోటు చేసుకుంది. రెండేండ్ల కుమారుడి గొంతు నుమిలి చంపిన త‌ల్లి.. అనంత‌రం ఉరేసుకుంది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతుల‌ను సాత్విక్(2), దొడ్డి లాస్య‌(23)గా పోలీసులు గుర్తించారు.
*నకిలీ నోట్లను చలామణి చేస్తున్న దంపతులను పార్వతీపురం జిల్లా కొమరాడ పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సై ప్రయోగమూర్తి తెలిపిన వివరాల ప్రకారం… తూర్పు గోదావరి జిల్లా వనపర్తికి చెందిన సత్య నాగమల్లేశ్వర రెడ్డి, వనజ భార్యభర్తలు. వీరు గత రెండేళ్లుగా పార్వతీపురంలో నివాసం ఉంటున్నారు. సత్య నాగమల్లేశ్వర రెడ్డి స్థానిక పెట్రోల్ బంక్లో పని చేస్తున్నారు. ఈనెల 11న వీరు తమ బంధువల పెళ్లికి స్వగ్రామానికి వెళ్లారు. అక్కడ బంధువు అనిల్ రెడ్డి నకిలీ నోట్ల విషయాన్ని సత్యనాగమల్లేశ్వర రెడ్డికి తెలియజేశాడు.
*నకిలీ తుపాకులు, కత్తిని చూపించి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరు రౌడీషీటర్లను.. విశాఖ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆనందపురం సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. ఒకటో పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలోకి చెందిన దోని సతీష్ అలియాస్ గసగసాలు (24), పెదజాలారిపేటకు చెందిన పి.గౌరీసాయి (24)లు రౌడీషీటర్లు. కొంతకాలంగా పరారీలో ఉన్న వీరు.. గంజాయి వ్యాపారం చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.
*పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో అర్ధరాత్రి దారి దోపిడీ జరిగింది. తిరుపతి నుంచి వచ్చిన భక్తులపై కొందరు గుర్తుతెలియని దుండగులు దాడి చేసి సొమ్మును ఎత్తుకెెళ్లారు రాజుపాలేనికి చెందిన శ్రీనివాసరావు, గోవిందరావు కుటుంబసభ్యులు.. తిరుపతి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో సోమవారం తెల్లవారుజామున నారాయణాద్రి ఎక్స్ప్రెస్ రైలులో వచ్చి సత్తెనపల్లిలో దిగారు. స్టేషన్ నుంచి కాలినడకన తాలుకా సెంటర్కు నడిచి వెళ్తుండగా.. కొందరు గుర్తుతెలియని దుండగులు బైకులపై వెంబడించి కర్రలతో దాడి చేశారు. అనంతరం వాళ్ల వద్ద ఉన్న రూ. 5 వేల నగదు, వాచీ, సేల్ఫోన్ ఎత్తుకెళ్లారు.బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో సత్తెనపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దుండగుల దాడిలో గాయపడ్డ బాధితులు ప్రస్తుతం స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
* పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ల రైల్వే క్వార్టర్‌‌లో రైల్వే విశ్రాంత ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. సత్య వర్ధన్ రైల్వే హెడ్ కానిస్టేబుల్గా పని చేస్తూ 45 రోజుల క్రితం వీఆర్ఎస్ తీసుకున్నాడు. అప్పటి నుంచి ఇంటి వద్దే ఉంటున్న అతను ఉరి వేసుకని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే అప్పుల బాధ వల్లనే ఆయన ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
*తెలంగాణ రాజధాని హైదరాబాద్లోని బేగం బజార్లో నిన్న జరిగిన పరువు హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందుతుల్లో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు కర్నాటకలో ఉన్నారని గుర్తించిన పోలీసులు.. అక్కడికెళ్లి పట్టుకున్నారు.
* నార్క‌ట్‌ప‌ల్లి మండ‌లం ఔరావాణిలో విషాదం చోటు చేసుకుంది. రెండేండ్ల కుమారుడి గొంతు నుమిలి చంపిన త‌ల్లి.. అనంత‌రం ఉరేసుకుంది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్‌ లికి చేరుకుని మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతుల‌ను సాత్విక్(2), దొడ్డి లాస్య‌(23)గా పోలీసులు గుర్తించారు.
*ఆత్మహత్య చేసుకునేవిధంగా భార్యను ప్రేరేపించిన కేసులో భర్త దోషి అని కేరళలోని ఓ కోర్టు సోమవారం తీర్పు చెప్పింది. వరకట్నం కోసం డిమాండ్ చేయడంతోపాటు ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు నమోదైన ఆరోపణలు రుజువైనట్లు తెలిపింది. దోషికి శిక్షను మంగళవారం ఖరారు చేసే అవకాశం ఉంది. 2021 జూన్‌లో ఈ దారుణం జరిగింది.
*డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో భాగంగా అతని స్నేహితులను ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉదయం నుంచి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. ఎస్పీ కార్యాలయం నుంచి వెళ్లిపోవాలని తల్లిదండ్రులను పోలీసులు బెదిరిస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు.
*నల్గొండ: జిల్లాలోని చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో 65వ జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఐరన్ పైపుల లోడుతో వెళ్తున్న అశోక్ లేలాండ్ వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
*బెంగళూరు నుంచి మూడు రోజుల క్రితం కనిపించకుండాపోయిన ప్రేమికులు ఉడుపి జిల్లాలో సజీవ దహనమయ్యారు. ఉడుపిలోని మందార్తి సమీపంలోని హెగ్గుంజె గ్రామ పంచాయతీ వర్తూరు వద్ద కారులోనే ఇద్దరూ కాలిపోయారు. ఆదివారం తెల్లవారుజామున  గంటలకు ఈ ఘటన జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. బెంగళూరులోని ఆర్‌టీ నగర్‌కు చెందిన యశ్వంత్‌ యాదవ్‌ (జ్యోతి ( సజీవ దహనమైనట్టు గుర్తించారు. కారులో మంటలు చెలరేగగానే స్థానికులు ఆపే ప్రయత్నం చేశారు. అప్పటికే ఇద్దరూ కాలిపోయారు. ఈనెల జ్యోతి అదృశ్యమైనట్టు ఆర్‌టీ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు కాగాయశ్వంత్‌ యాదవ్‌ అదృశ్యమైనట్టు హెబ్బాళ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. వీరి వివాహానికి ఇరు కుటుంబాల నుంచి వ్యతిరేకత ఉన్నట్టు తెలుస్తోంది. బెంగళూరు నుంచి బైక్‌పై శనివారం మంగళూరుకు చేరుకున్న వారు అల్‌మిజ్బా కార్‌ రెంటల్‌ సర్వీసెస్ లో కారును అద్దెకు తీసుకున్నారు. ఆదివారం ఉదయం సజీవ దహనమయ్యారు. వారు ఇద్దరూ పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్రహ్మావర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
*పల్నాడు: జిల్లాలోని సత్తెనపల్లి మండలం కంటేపూడి నలంద కాలేజీ వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. బైక్‌ను బొలేరో వాహనం ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు మున్నా(23), అజయ్(24)గా గుర్తించారు. ఎలక్ట్రిక్ వస్తువులు కొసం పేరేచర్ల వెళ్లుతుండగా ప్రమాదం జరిగింది. మృతులు పేరేచర్ల, క్రోసూరు మండలం అనంతవరం గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
*కృష్ణా జిల్లా మచిలీపట్నం మంగినపూడి బీచ్‌లో విషాదం చోటు చేసుకుంది. సముద్ర స్నానానికి వెళ్లిన ఇద్దరు విద్యార్థినిలు గల్లంతయ్యారు. భీమవరం విష్ణు కాలేజ్‌లో బి.ఫార్మసీ చదువుతున్న కాకర ప్రమీల (22), కళ్ళేపల్లి పూజిత (22) బీచ్‌లో గల్లంతయ్యారు. సమాచారం అందిన వెంటనే మెరైన్ పోలీసులు… విద్యార్థినిలను కాపాడి ఒడ్డుకు చేర్చారు. కాగా… ఒడ్డుకు చేరిన 20 నిమిషాల్లోనే విద్యార్థినిలు మృతి చెందారు. విషయం తెలిసిన బందరు తాలుకా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు విద్యార్థినిలు మృతి చెందడటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
*ఇంటర్ విద్యార్థిపై డిప్యూటీ వార్డెన్ దాడికి పాల్పడ్డాడు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని మైనారిటీ గురుకుల కళాశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. చెప్పినట్టు వినడం లేదని ఆగ్రహంతో ఇంటర్ విద్యార్థి రాజును డిప్యూటీ వార్డెన్ నయీం కొట్టాడు. విద్యార్థిని కింద పడవేసి కాళ్లతో తన్ని పిడిగుద్దులు గుద్దాడు. విద్యార్థి ప్రాధేయ పడిన కనికరించకుండా డిప్యూటీ వార్డెన్ తీవ్రంగా హింసించాడు. విద్యార్థిని కొడుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
*పూజ గదిలో బంగారం వెలికి తీస్తామని మోసం చేసిన నకిలీ బాబాలను అరెస్టు చేసిన ఘటన మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ ఎన్‌.చంద్రబాబు తెలిపిన వివరాలు.. కరీంనగర్‌ జిల్లా గన్నేరువరానికి చెందిన మతం చందు, రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లికి చెందిన ఎర్నాళ్ల సంజీవ్‌ అలియాస్‌ సంజయ్‌ బాబాలుగా అవతారమెత్తారు. ఏప్రిల్‌ 11న ఘట్‌కేసర్‌ మండలం ఎదులాబాద్‌లో మాచర్ల రాజు వద్దకు వచ్చి బాబాలుగా పరిచయం చేసుకున్నారు. మీ ఇంటికి తీసుకెళ్లి భోజనం పెడితే అంతా శుభం కలుగుతుందని చెప్పారు. అంగీకరించిన ఆయన భోజనం పెట్టారు. ఇంట్లో పూజ గది మూసి ఉండడంతో ఆరా తీశారు. సోదరుడి కుమారుడు చనిపోవడంతో పూజలు చేయడం లేదని రాజు పేర్కొన్నారు. ఇంట్లో దెయ్యం ఉందని, అమావాస్య రోజు పూజ చేయాలని, లేకపోతే మరో మరణం సంభవిస్తుందని భయపెట్టి.. రూ.3వేలు తీసుకొని వెళ్లిపోయారు. వారం తర్వాత బాబాలను కలిసి పూజ చేయాలని కోరగా అందుకు వారు రూ.35 వేలు తీసుకుని పూజలు చేసి వెళ్లి పోయారు. పది రోజుల తర్వాత బాబాలు మళ్లీ వచ్చి మీ ఇంట్లో పూజ గదిలో రూ.4 కోట్ల విలువైన బంగారం ఉందని నమ్మించారు. నమ్మిన ఆయన బంగారం వెలికి తీయాలని కోరారు. అందుకు సిద్దిపేటలో రూ.1.80 లక్షలు విలువ చేసే పూజా సామగ్రి కొనుగోలు చేయాలని చెప్పి రూ.30 వేల సామగ్రి రాజుకు ఇచ్చి పంపించారు. కమీషన్‌గా దుకాణదారుడు బాబాలకు రూ.1.50 లక్షలు చెల్లించాడు. అనంతరం వివిధ పూజల పేరిట రూ.7.5 లక్షలను వారు వసూలు చేశారు. పూజలు చేశామని.. కొన్ని రోజుల తర్వాత పూజ గది తెరిచి చూడాలని చెప్పి వెళ్లిపోయారు. రోజులు గడిచినా.. బంగారం కనిపించక పోవడంతో మోసపోయామని గ్రహించారు. ఈ నెల 20న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌వోటీ బృందం సాయంతో ఆదివారం నకిలీ బాబాలను ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి రూ.15 వేల నగదు, కారు, పూజా సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.
*పాముకాటుతో ఎనిమిదేళ్ల బాలుడు మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండల పరిధిలోని కొండాపూర్‌ హనుమాన్‌ తండాలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. తండావాసులు ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం.. హనుమాన్‌ తండాకు చెందిన నారాయణచిట్టిబాయి దంపతుల కుమారుడు పవన్‌(తండాలోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో మూడవ తరగతి చదువుతున్నాడు. శనివారం రాత్రి భోజనం చేసికుటుంబ సభ్యులతో కలిసి నిద్రించాడు. ఆదివారం తెల్లవారు జామున బాలుడు అకస్మాత్తుగా నిద్రలోంచి లేచి ఏడుస్తున్నాడు. కుటుంబీకులు ఇంట్లో గమనించగా పాము కనిపించడంతో చంపేశారు. అనంతరం బాలుడ్ని చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలించడానికి ప్రయత్నిస్తున్న క్రమంలోనే మృతి చెందాడు. కాగా తండాలో పారిశుధ్యం లోపించడంతో పాములు సంచరిస్తున్నాయని తండా వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి పారిశుధ్య పనులు చేపట్టాలని కోరారు.
*రాష్ట్రంలో రహదారులు ఆదివారం రక్తమోడాయి. మూడు జిల్లాల్లో జరిగిన ప్రమాదాల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. వైఎస్సార్‌ కడప జిల్లా, అన్నమయ్య జిల్లాల్లో శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వైఎస్సార్‌ కడప జిల్లా మైలవరం మండల పరిధిలోని కరమలవారిపల్లి గ్రామ సమీపంలోని జమ్మలమడుగు-తాడిపత్రి ప్రధాన రహదారిలో శనివారం అర్ధరాత్రి ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. వారిలో దొమ్మరనంద్యాల గ్రామానికి చెందిన దండె వెంకట సుబ్బయ్య (43), కుండా వెంకట సుబ్బమ్మ (73), మోరగుడికి చెందిన చౌడం లక్ష్మీ మునెమ్మ (52) మృతి చెందగా.. కారు డ్రైవర్‌ కుమార్‌, చిన్నారి గీతాంజలి గాయపడ్డారని మైలవరం ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు. మోరగుడి గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు చౌడం తిరుమల కొండయ్య, చౌడం లక్ష్మీ మునెమ్మల కుమార్తెకు పది రోజుల క్రితం నంద్యాల జిల్లా అవుకు మండలం సంగపట్నానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. శనివారం ఉదయం మోరగుడి నుంచి రెండు వాహనాల్లో కూతురికి చీరె సారె తీసుకుని సంగపట్నం వెళ్లారు. అక్కడ నుంచి తిరిగి వస్తుండగా రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని కారు ఢీకొంది. అన్నమయ్య జిల్లా సంబేపల్లె గుట్టపల్లె ఆంజనేయస్వామి జాతరకు వెళ్లిన విద్యార్థులు శనివారం రాత్రి తిరిగి వస్తుండగా ఎదురెదురుగా రెండు బైక్‌లు ఢీకొనడంతో ఇద్దరు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. కలకడ మండలం ఝరిగడ్డ పాలెంకు చెందిన జ్యోతీశ్వర్‌నాయుడు (20), బాటవారిపల్లెకు చెందిన సోమశేఖర్‌ (18) జాతర చూసి శనివారం అర్ధరాత్రి బైక్‌ ఇంటికి వెళుతుండగా బాలయ్యగారిపల్లె క్రాస్‌ రోడ్డు వద్ద ఎదురుగా వచ్చిన ద్విచక్రవాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో జోతీశ్వర్‌నాయుడు, సోమశేఖర్‌ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వాహనంపై ఉన్న బ్రహ్మంఆచారి, చింతం కృష్ణారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. అనంతపురం జిల్లా పామిడి మండలం రామరాజుపల్లికి చెందిన ఒక వ్యక్తి తాడిపత్రి మండలం ఇగుడూరు గంగమ్మ ఆలయం వద్ద దేవర నిర్వహిస్తుండగా.. అదే ఊరికి చెందిన లక్ష్మిరెడ్డి(32), రంగనాథ్‌రెడ్డి (25), ఫీల్డ్‌ అసిస్టెంట్‌ మల్లికార్జునరెడ్డి వెళ్లారు. మధ్యాహ్నం భోజనం అనంతరం వీరు ముగ్గురు కలిసి ద్విచక్రవాహనంపై రామరాజుపల్లికి బయల్దేరారు. వేములపాడు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ఆటోను ద్విచక్రవాహనం వేగంగా ఢీకొనడంతో రెండు వాహనాలూ బోల్తాపడ్డాయి. ఈ ప్రమాదంలో లక్ష్మిరెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన రంగనాథరెడ్డిని స్థానికులు తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. మల్లికార్జునరెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. మల్లికార్జునరెడ్డిని చికిత్స నిమిత్తం అనంతపురం తరలించారు.
*అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం కమలపాడు గ్రామానికి చెందిన రైతు ఉప్పర గోపాల్‌ (51) అప్పుల బాధ భరించలేక ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. రైతు భార్య నాగలక్ష్మి, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గోపాల్‌ తన ఆరున్నర ఎకరాల పొలం సాగు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. పంటల సాగుకు రూ.8 లక్షల వరకూ అప్పుచేశాడు. వరుసగా నాలుగేళ్ల పాటు పంటలు చేతికి రాక అప్పులు పెరిగిపోయాయి ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున ఉరి వేసుకుని మరణించాడు. కూడేరు మండలం పి.నారాయణపురం గ్రామానికి చెందిన నారాయణరెడ్డి (76) తన 12 ఎకరాల భూమిలో 2 ఎకరాల్లో ఉల్లి, 4 ఎకరాల్లో బ్యాడిగ మిరప సాగు చేశాడు. పంటలు చేతికి రాక నష్టపోయాడు. మూడు బోర్లు వేసినా చుక్కనీరు పడలేదు. దీంతో రూ.7.75 లక్షల అప్పుతీర్చే మార్గంలేక తీవ్ర ఆవేదనకు గురై శనివారం రాత్రి విషం తీసుకుని, ఆపస్మారక స్థితిలో ఉండగా స్థానికులు గుర్తించి, అనంతపురం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
*బాపట్ల జిల్లాలో ఇండియన్‌ బ్యాంకులో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న ఓ యువతి ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్‌ఐ వెంకటకొండారెడ్డి కథనం ప్రకారం తెలంగాణా రాష్ట్రం సిరిసిల్లకు చెందిన బొల్లి దివ్యవాణి(31) నగరం మండలం చినమట్లపూడి గ్రామంలోని ఇండియన్‌ బ్యాంక్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తోంది. చెరుకుపల్లి మండలం గుళ్ళపల్లిలో నివసిస్తున్న ఆమె ఆదివారం ఉదయం బయటకు రాకపోవడంతో పక్క గదిలో వారు వచ్చి చూసేసరికి ఉరివేసుకుని కనిపించింది. తమ కుమార్తె రూ.40లక్షలు రుణం తీసుకుని భవనం నిర్మించుకుందని, పని ఒత్తిడి, ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటోందని తల్లిదండ్రులు తెలిపారు.
*శ్రీకాకుళం జిల్లా రణస్థలం ఫ్యాక్టరీ నుంచి బీరు లోడుతో వెళ్తున్న లారీ ప్రకాశం జిల్లా సింగరాయకొండ జాతీయ రహదారిపై బోల్తా పడింది. ఈ సంఘటన ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో చోటుచేసుకోగా, స్థానికులు, అటువైపు వెళ్తున్న లారీ డ్రైవర్లు బీరు బాటిళ్ల కోసం ఎగబడ్డారు. పోలీసుల కథనం మేరకు.. రణస్థలం నుంచి బీరు లోడుతో చిత్తూరు జిల్లా మదనపల్లికి వెళ్తున్న లారీ మూలగుంటపాడు వచ్చేసరికి డ్రైవర్‌ నిద్రమత్తులోకి జారుకోవడంతో అదుపుతప్పి రహదారి మధ్యలో ఉన్న డివైడర్‌ను బలంగా ఢీకొని.. ఆ వేగానికి అవతలివైపు రహదారిపైకి దూసుకెళ్లి బోల్తాపడింది. అదే సమయంలో తిరువూరు నుంచి గుంటూరు వెళ్తున్న ట్యాంకరు బోల్తాపడిన లారీని బలంగా ఢీకొట్టింది. దీంతో బాటిళ్లన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. కొద్దిసేపటికి స్థానికులతోపాటు, అటుగా వెళ్తున్న ఇతర లారీల డ్రైవర్లు పగలని బీరు బాటిళ్ల కోసం ఎగబడి చేతికందనన్ని పట్టుకుపోయారు. ఈ సంఘటనలో బీరులోడు లారీని నడుపుతున్న డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు వచ్చి ఎక్సైజ్‌ అధికారులకు సమాచారం ఇచ్చారు. రూ.30లక్షల నష్టం వాటిల్లినట్లు వారు అంచనా వేశారు.
*కొన్ని గంటల్లో పెళ్లి అనగా.. ఛాతతీనొప్పితో విలవిల్లాడిన వరుడు తుదిశ్వాస విడిచాడు. దీంతో మరో యువకుడితో పెళ్లి జరిపించిన మతపెద్దలు ఆ వధువు జీవితాన్ని నిలబెట్టారు. కర్నూలు జిల్లా హొళగుంద మండల పరిధిలోని గజ్జెహళ్లిలో ఆదివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల మేరకు.. పెద్దకడుబూరు మండలం చిన్నతుంబళం గ్రామానికి చెందిన చాంద్‌బాషా రెండో కుమారుడు అబ్దుల్‌ హనీఫ్‌ (21)కు గజ్జెహళ్లి యువతితో ఈ నెల 22న నిఖా నిశ్చయించారు. శనివారం సాయంత్రమే గజ్జెహళ్లి చేరుకున్న వరుడు, బంధువులు ఆ రాత్రి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో బస చేశారు. ఆదివారం తెల్లవారుజామున వరుడికి తీవ్రమైన ఛాతినొప్పి రావడంతో హుటాహుటిన కర్ణాటకలోని శిరుగుప్ప ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. హనీఫ్‌ మృతదేహాన్ని బంధువులు చిన్నతుంబళం తీసుకెళ్లిపోయారు. పెళ్లికొడుకు మరణవార్త గజ్జెహళ్లి చుట్టు పక్కల గ్రామాలకు తెలిసిపోయింది. వధువు కుటుంబానికి దగ్గరి బంధువు, వందవాగిలి గ్రామానికి చెందిన మహ్మద్‌ కుమారుడు నబీరసూల్‌ వధువును పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చాడు. దీంతో మత పెద్దల ఆధ్వర్యంలో ఇరు కుటుంబాల సమక్షంలో పెళ్లి జరిపించారు. అమ్మాయి జీవితం అభాసుపాలుకాకుండా పెద్ద మనసు చాటుకున్న నబీరసూల్‌ను గ్రామస్థులు, బంధువులు అభినందించారు.
*పాతకక్షలతో టీడీపీ కార్యకర్తపై వైసీపీ ఎంపీటీసీ దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఎంపీటీసీకి వలంటీర్‌ కూడా సహకరించారు. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం దురిమెర్లలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. శనివారం రాత్రి తురిమెర్లలో జరిగిన ఓ పెళ్లికి టీడీపీ కార్యకర్త తక్కెడ చిన్న అభయ హాజరయ్యారు. ఈ క్రమంలో పాతకక్షలు మనసులో పెట్టుకుని ఎంపీటీసీ సభ్యుడు ప్రసాదు అతడిపై దాడి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకొన్నాడు. వలంటీర్‌ మనోహర్‌, కాకులూరి మధు అనే వ్యక్తితో కలిసి చీకట్లో ఒక్కడే ఉన్న సమయం చూసి రాడ్డుతో దాడికి పాల్పడ్డారు. దీంతో చిన్న అభయ తల, ఛాతి, మెడ భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్థులకు విషయం తెలియడంతో హుటాహుటిన అక్కడకు చేరుకుని అభయను నెల్లూరులోని జీజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం అభయ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఎస్‌ఐ సుమన్‌ బాధితుడి ఫిర్యాదు మేరకు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
* నెల్లూరు నగరంలో సాక్షాత్తు డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి నగర పర్యటనలో ఉండగానే, సంతపేట పోలీ్‌సస్టేషన్‌ ఎదుట స్కూటీపై వెళుతున్న తెలుగు మహిళ నెల్లూరు నగర అధ్యక్షురాలు కప్పిర రేవతిపై ముగ్గురు మహిళలు హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆదివారం మిట్టమధ్యాహ్నం జరిగిన ఈ ఘటన సంచలనం రేపింది. బాధితురాలు రేవతి కథనం మేరకు.. ఆదివారం ఉదయం సంతపేట పోలీ్‌సస్టేషన్‌కు వెళ్లిన తన భర్త శ్రీనివాసులు మధ్యాహ్నం 12 గంటలు దాటుతున్నా తిరిగి రాకపోవడంతో ఏం జరిగిందోననే గాబరాతో రేవతి స్కూటీపై బయలుదేరారు. సరిగ్గా స్టేషను గోడ వద్దకు వచ్చేసరికి పూటుగా మద్యం తాగిన ముగ్గురు మహిళలు ఆమెను అటకాయించారు. స్కూటీని కింద పడేసి కత్తి చూపి బెదిరిస్తూ పిడిగుద్దులు గుద్దారు. ఆ బాధను తట్టుకోలేక రేవతి గట్టిగా కేకలు వేయడంతో పోలీ్‌సస్టేషన్‌ సిబ్బంది, స్థానికులు వచ్చారు. ఆ ముగ్గురు మహిళలు పరారయ్యారు. రేవతిని స్టేషన్‌లోకి తీసుకువెళ్లారు. వెంటనే టీడీపీ నగర ఇన్‌చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అక్కడకు చేరుకుని బాధితురాలితో మాట్లాడారు. స్టేషనులో స్పృహతప్పి పడిపోయిన రేవతిని జీజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.
*శ్రీకాకుళం జిల్లా రణస్థలం ఫ్యాక్టరీ నుంచి బీరు లోడుతో వెళ్తున్న లారీ ప్రకాశం జిల్లా సింగరాయకొండ జాతీయ రహదారిపై బోల్తా పడింది. ఈ సంఘటన ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో చోటుచేసుకోగా, స్థానికులు, అటువైపు వెళ్తున్న లారీ డ్రైవర్లు బీరు బాటిళ్ల కోసం ఎగబడ్డారు. పోలీసుల కథనం మేరకు.. రణస్థలం నుంచి బీరు లోడుతో చిత్తూరు జిల్లా మదనపల్లికి వెళ్తున్న లారీ మూలగుంటపాడు వచ్చేసరికి డ్రైవర్‌ నిద్రమత్తులోకి జారుకోవడంతో అదుపుతప్పి రహదారి మధ్యలో ఉన్న డివైడర్‌ను బలంగా ఢీకొని.. ఆ వేగానికి అవతలివైపు రహదారిపైకి దూసుకెళ్లి బోల్తాపడింది. అదే సమయంలో తిరువూరు నుంచి గుంటూరు వెళ్తున్న ట్యాంకరు బోల్తాపడిన లారీని బలంగా ఢీకొట్టింది. దీంతో బాటిళ్లన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. కొద్దిసేపటికి స్థానికులతోపాటు, అటుగా వెళ్తున్న ఇతర లారీల డ్రైవర్లు పగలని బీరు బాటిళ్ల కోసం ఎగబడి చేతికందనన్ని పట్టుకుపోయారు.
*హవేలి ఘనపూర్ మండలం తిమ్మాయిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో ఈతకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతులు మెదక్ మండలం రాజుపల్లి గ్రామానికి చెందిన గంగ రాములు, సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు గ్రామానికి చెందిన గోనపల్లి లక్ష్మణ్‎గా గుర్తించారు. వీరి మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
*ఉద్యోగపరమైన ఒత్తిడితో పాటు తల్లిదండ్రులను విడిచి వెళ్లాల్సి వస్తుందనే బాధతో ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణ ఎస్‌ఐ ఎల్‌.రామకృష్ణ కథనం మేరకు.. అనకాపల్లి మండలం కొత్తూరు గ్రామానికి చెందిన నగిరెడ్డి నవీన్‌వెంకట్‌(23)కు నాలుగు నెలల క్రితం హైదరాబాద్‌లోని ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఇప్పటి వరకూ ఇంటి నుంచే పనిచేస్తున్నాడు. హైదరాబాద్‌ రావాలని ఇటీవల కంపెనీ యాజమాన్యం సూచించింది. కొత్త ఉద్యోగంలో ఒత్తిడితోపాటు తల్లిదండ్రులను విడిచి వెళ్లడానికి ఇష్టపడని నవీన్‌వెంకట్‌ శనివారం తెల్లవారుజామున తల్లిదండ్రులు పై పోర్షన్‌లో నిద్రపోతుండగా కింద ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నవీన్‌వెంకట్‌ సున్నిత మనస్కుడని స్నేహితులు చెబుతున్నారు.
* కొన్ని గంటల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడు అనారోగ్యంతో కుప్పకూలాడు. దీంతో వధువుకు మరో అబ్బాయితో వివాహం జరిపించిన ఘటన కర్నూలు జిల్లా హొళగుంద మండలం గజ్జహల్లి గ్రామంలో జరిగింది. బంధువులు తెలిపిన వివరాలు మేరకు.. గ్రామానికి చెందిన యువతికి పెద్దకడబూరు మండలం చిన్న తుంబళం గ్రామానికి చెందిన హనీఫ్‌(23)తో వివాహం నిశ్చయమైంది. ఆదివారం వివాహం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. సరిగ్గా పెళ్లి క్రతువు జరిగే సమయంలో వరుడు హనీఫ్‌కు ఛాతిలో నొప్పిరావటంతో హుటాహుటిన కర్ణాటక రాష్ట్రం శిరగుప్పలోని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతిచెందినట్లు నిర్ధారించారు. అనంతరం వధువు తల్లిదండ్రులు తమ సమీప బంధువైన హొళగుంద మండలం వందవాగిలి గ్రామానికి చెందిన నబిరసూల్‌తో వివాహం చేశారు.
*తమ ప్రేమను ఇరు కుటుంబాలూ వ్యతిరేకించడంతో తాము ప్రయాణించిన కారుపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుని యువతీ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. ఉడుపి జిల్లా బ్రహ్వార తాలూకా హెగ్గుంజె గ్రామ సమీపంలో కారు దహనమవుతుండటాన్ని చూసిన స్థానికులు అక్కడకు చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చారు. అప్పటికే యువతీయువకుడు అగ్నికి ఆహుతయ్యారు. బెంగళూరుకు చెందిన యశ్వంత్‌- జ్యోతి కొంతకాలంగా ప్రేమించుకున్నారు. వీరి ప్రేమకు ఇరు కుటుంబాల నుంచీ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో జ్యోతి, యశ్వంత్‌ శనివారం రాత్రి మంగళూరు చేరుకున్నారు. అక్కడే ఓ కారును అద్దెకు తీసుకుని ఉడుపి వైపునకు పయనమయ్యారు. అంతకు కొద్ది సేపు ముందే ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయాన్ని కుటుంబ పెద్దలకు తెలిపినట్లు సమాచారం. వారు అప్రమత్తమయ్యేలోపే ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో కారుపై పెట్రోలు పోసుకుని లోపల కూర్చుని నిప్పంటించుకున్నారు. బ్రహ్మావర పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.