DailyDose

తమిళనాడు సీఎంకు చంద్రబాబు లేఖ – TNI తాజా వార్తలు

తమిళనాడు సీఎంకు చంద్రబాబు లేఖ  –  TNI  తాజా వార్తలు

*ఆంధ్రప్రదేశ్‌ నుంచి అక్రమ రవాణా అవుతున్న బియ్యాన్ని అడ్డుకోవాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు లేఖ రాశారు. పేదలకు పంచవలసిన రేషన్‌ బియ్యాన్ని కొందరు ఏపీ -తమిళనాడు సరిహద్దు ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్నారని వివరించారు. తమిళనాడు-చిత్తూరు సరిహద్దులోని 7 మార్గాల ద్వారా రైస్‌ మాఫియా బియ్యం తరలిస్తున్నారని పేర్కొన్నారు.

*ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం రాఘవాపురంలో కొండ గట్లను దోచేస్తున్నారని నిరసన తెలుపుతున్న మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను…. పోలీసులు అరెస్టు చేశారు. గ్రావెల్ అక్రమ రవాణా జరుగుతుందని నిరసిస్తూ అర్ధరాత్రి వరకు కార్యకర్తలతో ఆమె ధర్నా నిర్వహించారు.మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అరెస్ట్శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమను అక్రమంగా అరెస్టు చేయడంపై మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఇష్టానుసారంగా గుట్ట గ్రామంలో అక్రమ రవాణా చేస్తున్నప్పటికీ పట్టించుకోని పోలీసులు.. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమను ఎందుకు అరెస్టు చేశారని ఆమె ప్రశ్నించారు. గత నాలుగు రోజులుగా అధికారులకు మేము ఫిర్యాదు చేస్తున్న ఏ మాత్రము చర్యలు లేవు.. కానీ ఈరోజు మేము దీక్ష చేస్తుంటే ఏదో తప్పు చేసినట్లుగా అరెస్టులు చేయడం ఏంటని నిలదీశారు.

* కేదార్‌నాథ్‌లో చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పులతో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. కొండ ప్రాంతాల్లో పలు చోట్ల వర్షం, హిమపాతం కురుస్తుండడంతో చలితీవత్ర పెరుగుతున్నది. పగటి, రాత్రి ఉష్ణోగ్రతల్లో భారీగా తేడాలుంటున్నాయి. రాంబాడ నుంచి రుద్రపాయింట్‌ వరకు నాలుగు కిలోమీటర్ల కాలినడక మార్గంలోనూ ఇబ్బందులు తప్పడం లేదు. ఈ మార్గం ఓపెన్‌ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 28 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 27 మందికి గుండెపోటు వచ్చింది. సముద్రమట్టానికి 11750 అడుగులో ఉన్న కేదార్‌నాథ్‌ మూడు వైపులా భారీ మంచుకొండలున్నాయి.గౌరీకుండ్‌ వైపు లోయ ఉంటుంది. ప్రస్తుతం కేదార్‌నాథ్‌లో వాతావరణ పరిస్థితులు భక్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. మే 6న యాత్ర మొదలైన నాటి నుంచి వాతావరణ పరిస్థితులు దిగజారుతూ వస్తున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 20-24 గంటల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒక్కసారిగా 2నుంచి3 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులుతీరగా.. వర్షంలో తడిసిముద్దవుతున్నారు. పొగమంచు కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతిలో నొప్పి, కళ్లు తిరగడం సమస్యలతో బాధపడుతున్నట్లు పలువురు భక్తులు పేర్కొన్నారు. ఇవే సమస్యలు పలువురు ప్రాణాలు కోల్పోయారు.గౌరీకుండ్‌ – కేదార్‌నాథ్‌ మార్గంలో రాంబాడ నుంచి రుద్రపాయింట్‌ మధ్య నాలుగు కిలోమీటర్ల ప్రయాణం ఇబ్బందులకు గురి చేస్తున్నది. మందాకిని నదికి ఇరువైపులా ఎత్తైన పర్వతాలు ఉండడంతో ఈ ప్రాంతం పూర్తిగా ‘వీ’ ఆకారంలో లోయ ఉంటుంది. దీంతో ఆక్సిజన్‌ స్థాయి తక్కువగా ఉంటుంది. దీంతో ఊపిరి తీసుకోవడం కష్టతరంగా మారుతుంది. పలు సమయాల్లో ప్రాణాంతకంగా మారుతోంది. ఈ క్రమంలో సోన్‌ ప్రయాగ్‌లో 50 ఏళ్లు పైబడిన వ్యక్తులందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షల్లో ఫిట్‌ కానీ పక్షంలో సదరు వ్యక్తి సొంత పూచీకత్తుపై మాత్రమే అనుమతిస్తున్నారు.

* ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఓపీఎస్‌ విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగులు నిరసన తెలిపారు. సీపీఎస్‌ రద్దు చేయాలని, జీపీఎస్‌ను అంగీకరించొద్దని కోరుతూ ఉద్యోగ సంఘాల నాయకులు, అధికారులకు గులాబీ పూలు అందజేసి నిరసన తెలిపారు. ఇవాళ ఏపీ సచివాలయంలోని బ్లా్క్ -2లో మంత్రివర్గ ఉపసంఘం జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు. మంత్రి బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేశ్‌, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు హాజరయ్యారు.ఈ సందర్భంగా సచివాలయానికి పెద్ద ఎత్తున ఉద్యోగులు అక్కడికి చేరుకుని ముందస్తుగా ఉద్యోగ సంఘాల నాయకులకు ఓపీఎస్‌పైనే చర్చించాలని సూచించారు. సీపీఎస్‌, జీపీఎస్‌ విధానాన్ని అంగీకరించొద్దని నేతలకు విజ్ఞప్తి చేశారు. సీపీఎస్‌, జీపీఎస్‌ వద్దు, ఓల్ట్‌ పెన్షన్‌ స్కీం ముద్దంటూ ప్లకార్డులు, గులాబీపూలతో నినాదాలు చేశారు. ఉద్యోగులు మాట్లాడుతూ గతంలో పీఆర్సీ సాధన సమితి సమావేశంలో జరిగిన చర్చల్లో ఓపీఎస్‌ను తీసుకువస్తామని ఉద్యోగ సంఘం నాయకులు చెప్పారని పేర్కొన్నారు.సమావేశంలో ఓపీఎస్‌ కాకుండా జీపీఎస్‌ గురించి మాట్లాడితే సమావేశాన్ని బైకాట్ చేయాలని ఉద్యోగ సంఘాల నాయకులను కోరేందుకు సచివాలయానికి వచ్చామని పేర్కొన్నారు. కాగా ఉద్యోగ సంఘం నాయకుడు బొప్పరాజు మాట్లాడుతూ సీపీఎస్‌ను రద్దు చేయాలని మొదటి నుంచి ఉద్యోగ సంఘాలన్నీ డిమాండ్‌ చేస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం మాత్రం జీపీఎస్‌ను తీసుకువచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు.

*కాకినాడ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టు విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించిందని ఏపీ హోం మంత్రి తానేటి వనిత అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్యకేసుపై ఆమె స్పందించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అనంతబాబును అరెస్టు చేసి పేదలు, బడుగు, బలహీన వర్గాల పక్షాన ప్రభుత్వం నిలిచిందని తెలిపారు. ప్పుచేసిన వారెవరైనా సరే ఉపేక్షించేది లేదన్న ఉద్దేశ్యంతో ఎమ్మెల్సీని అరెస్టు చేశామన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు తమ రాజకీయ లబ్ది కోసం వాడుకోవాలని చూస్తున్నాయని ఆమె అన్నారు.

*ఒడిస్సాలోని భువ‌నేశ్వర్‌లో టీటీడీ నిర్మించిన శ్రీ వేంక‌టేశ్వర‌స్వామివారి ఆల‌య మ‌హాసంప్రోక్షణ మంగ‌ళ‌వారం నిర్వహించారు. విష్వక్సేన పూజ, పుణ్యాహ‌వ‌చ‌నం, అగ్నిప్రణ‌య‌నం, క‌ల‌శారాధ‌న‌, ఉక్తహోమాలు, చ‌తుర్దశ క‌ల‌శ స్నప‌నం జరిపించారు. అనంతరం శ్రీ‌వారి విగ్రహ‌నికి జ‌లాధివాసం , కుంభారాధ‌న‌, ఉక్త హోమాలు చేపట్టారు.సాయంత్రం 6.30 నుంచి రాత్రి 9.30 గంటల వ‌ర‌కు క‌ల‌శారాధ‌న‌, విశేష హోమాలు, వైదిక కార్యక్రమాలు నిర్వహించ‌నున్నారు.ఈ కార్యక్రమాల్లో స్థానిక సలహా కమిటీ అధ్యక్షుడు దుష్మంత్ కుమార్, డిప్యూటీ ఈవో గుణభూషణ్‌రెడ్డి, టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి విజయసారధి, వైఖాన‌స ఆగ‌మ స‌ల‌హాదారు విష్ణుబ‌ట్టాచార్యులు, ఏఈవో దొరస్వామి నాయక్, సూపరింటెండెంట్ మల్లికార్జున, అర్చకులు పాల్గొన్నారు.

*రాష్ట్రవ్యాప్తంగా యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 1869 బోధనా పోస్టులను వెంటనే భర్తీ చేయాలని వైఎ్‌సఆర్టీపీ అధినేత్రి షర్మిల డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఈ పోస్టులను భర్తీ చేసే వరకూ తమ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. యూనివర్సిటీల్లోకి సీఎం కేసీఆర్‌ను అడుగు పెట్టనివ్వలేదని చెప్పి వాటిని ఆయన భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. చదువుకుంటే ఉద్యోగాలు అడుగుతారన్న ఉద్దేశంలో వర్సిటీను ఆగం పట్టించే కార్యక్రమం చేపట్టారని సోమవారం ఓ ప్రకటనలో ఆమె ఆరోపించారు.

*క్రిమినల్‌ కేసుల్లో నిందితులకు పాస్‌పోర్ట్‌లు జారీచేసే అంశంపై సంబంధిత కోర్టులే నిర్ణయం తీసుకుంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. ఎంఎస్‌ పూర్తిచేసిన తన కుమార్తె స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి అమెరికా వెళ్లాల్సి ఉండటంతో హైదరాబాద్‌లోని నాచారానికి చెందిన ఓ మహిళ పాస్‌పోర్ట్‌ కోసం దరఖాస్తు చేశారు. అధికారులు పాస్‌పోర్ట్‌ జారీ చేయకపోవడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ కె. సురేందర్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. రీజినల్‌ పాస్‌పోర్ట్‌ ఆఫీసర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పిటిషనర్‌ తనపై ఉన్న క్రిమినల్‌ కేసును దాచిపెట్టారని అందుకే పాస్‌పోర్ట్‌ జారీచేయలేదని తెలిపారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. కేంద్ర ప్రభుత్వం 1993లో జారీచేసిన నోటిఫికేషన్‌ ప్రకారం క్రిమినల్‌ కేసుల్లో నిందితులకు పాస్‌పోర్ట్‌ జారీ చేసే అంశంపై కేసు విచారణలో ఉన్న కోర్టులే నిర్ణయం తీసుకుంటాయని తెలిపింది. ప్రస్తుత కేసులో పిటిషనర్‌కు రెండేళ్ల కాలపరిమితిగల పాస్ట్‌పోర్ట్‌ జారీచేయాలని ఆదేశాలు జారీచేసింది. ఆ పాస్‌పోర్ట్‌ను ట్రయల్‌ కోర్టులో సమర్పించి, విదేశీ పర్యటనకు అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని పిటిషనర్‌కు తెలిపింది. ఈ దరఖాస్తుపై ఆ కోర్టే తగిన నిర్ణయం తీసుకుంటుందని పేర్కొంది. కాగా, న్యాయశాఖ కార్యదర్శిగా నియమితులైన జిల్లా-సెషన్స్‌ జడ్జి నర్సింగ్‌ రావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు.

*వానాకాలం సాగు సీజన్‌ మరో వారం రోజుల్లో ప్రారంభం అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ ఎరువుల సరఫరాకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కలిపి ఇప్పటికే 4.20 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులను పంపించింది. 10 లక్షల టన్నుల యూరియాతో కలిపి ఈ సీజన్‌లో మొత్తం 25 లక్షల టన్నుల ఎరువులు అవసరమని అధికారలు అంచనా వేశారు. దానికి అనుగుణంగానే అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. మరోపక్క మార్క్‌ఫెడ్‌ వద్ద 2.13 లక్షల టన్నుల యూరియా, 11,857 టన్నుల డీఏపీ, 41,540 టన్నుల కాంఫ్లెక్స్‌ ఎరువులు నిల్వలు ఇప్పటికే ఉన్నాయి. ఈ మేరకు ఎరువుల సరఫరా, పంపిణీకి సంబంధించి వ్యవసాయ శాఖ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది.

*స్నాతకోత్సవం అంటే పట్టభద్రుల్లో ఎనలేని సంతోషం ఉంటుంది… అదీగాక ద్విదశాబ్ది వేడుకల్లో భాగంగా నిర్వహిస్తుంటే, ముఖ్య అతిథిగా దేశ ప్రధాని వస్తుంటే విద్యార్థుల సంతోషానికి అవధులే ఉండవు. కానీ.. దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక బిజినెస్‌ స్కూల్‌గా పేరొందిన ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌(ఐఎ్‌సబీ) విద్యార్థుల పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. ఐఎ్‌సబీని ప్రారంభించి 20ఏళ్లు అవుతున్న సందర్భంగా ఈ నెల 26న ద్విదశాబ్ది వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ రానున్నారు. ప్రధాని పర్యటనలో భాగంగా పోలీసులను మోహరించడం, అడుగడుగునా తనిఖీలు చేపట్టడం, అనుమానితులను అదుపులోకి తీసుకోవడం వంటివి సాధారణమే అయినప్పటికీ… ఈసారి పర్యటనలో మాత్రం నిఘా వర్గాలు కొత్త విధానాన్ని అమలుచేస్తున్నాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొనాలంటే.. సోషల్‌ మీడియాలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా వారు ఎలాంటి పోస్టులు పెట్టి ఉండకూడదు. ఈ మేరకు స్నాతకోత్సవంలో పాల్గొననున్న విద్యార్థుల బ్యాక్‌గ్రౌండ్‌ను చెక్‌ చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. విద్యార్థుల సోషల్‌ మీడియా అకౌంట్లను నిశితంగా పరిశీలిస్తున్నారు.

*ఏపీ సచివాలయం రెండో బ్లాక్ ఎదుట సీపీఎస్ ఉద్యోగులు మంగళవారం నిరసనకు దిగారు. ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ సమావేశం జరిగే బ్లాక్ వద్ద ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్‌తో ఎర్ర గులాబీలు, ప్లేకార్డులతో నిరసన తెలిపారు. మంత్రుల కమిటీ సమావేశానికి వెళ్తున్న సూర్యనారాయణ, బొప్పరాజు, బండి శ్రీనివాస్‌లను అడ్డుకున్న ఉద్యోగులు వారికి ఎర్రగులాబీలు ఇచ్చి నిరసన తెలియజేశారు. ఉద్యోగ సంఘాలు తమ సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని డిమాండ్ చేశారు. పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, సీఎం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. సీపీఎస్ ఉద్యోగ సంఘాలను కూడా మంత్రుల కమిటీ చర్చలకు పిలవాలని ఉద్యోగులు కోరారు.

*వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్డ్రై వర్ సుబ్రహ్మణ్యం హత్య ఘటనపై టీడీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యులు మంగళవారం భేటీ అయ్యారు. అనంతబాబు అరెస్ట్ అనంతర పరిణామాలపై చర్చించనున్నారు. అనంత ఉదయ్ భాస్కర్‌ను ఎమ్మెల్సీ పదవి నుండి బర్తరఫ్ చేయాలని టీడీపీ నిజానిర్ధారణ కమిటీ డిమాండ్ చేస్తోంది. గవర్నర్‌ను కలిసి ఒక నివేదిక అందచేయాలని కమిటీ సభ్యులు భావిస్తున్నారు. ఇప్పటికే గవర్నర్‌ను కలిసేందుకు టీడీపీ బృందం సమయం కోరింది.

*శ్రీ సత్యసాయి: జిల్లాలోని గోరంట్ల మండలం గోపి దేవరపల్లిలో ఎమ్మెల్యే శంకర నారాయణకు చుక్కెదురైంది. గడప గడప కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పర్యటించిన శంకరనారాయణను సమస్యలపై మహిళలు నిలదీశారు. అయితే సమాధానం చెప్పలేకపోయిన ఎమ్మెల్యే… మహిళల తలపై చేయి వేసి వెళ్లిపోయారు.

*ఇంద్రకీలాద్రి, కనకదుర్గా నగర్‌లో దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పర్యటించారు. పార్కింగ్, అన్న ప్రసాదం, ప్రసాదం భవనాల పనులను పరిశీలించారు. ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తయారవుతుందన్నారు. ప్లాన్‌ను అంగీకరించిన వెంటనే పనులు వేగవంతం చేస్తామన్నారు. అభివృద్ధి పనులకు నిధుల కొరత లేదన్నారు. ఘాట్ రోడ్డులో రాకపోకలు తగ్గిస్తున్నామని, భక్తులు, వీవీఐపీలు మహామండపంలోని రాజగోపురం ద్వారా దర్శించుకొనేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అర్జునుడు తపస్సు చేసిన ఇంద్రకీలాద్రి కొండపై భాగానికి మెట్లు వేసి వ్యూ పాయింట్‌గా మారుస్తామన్నారు. త్వరలోనే ఘాట్లలో పుణ్య స్నానాలకు భక్తులకు అనుమతిస్తామన్నారు. వేసవి దృష్ట్యా భక్తులకు ఇబ్బంది లేకుండా చలువ పందిళ్ల వేయాలని ఆదేశించామన్నారు. మంత్రి వెంట ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ సింఘాల్, కమిషనర్ హరి జవహర్ లాల్, దుర్గగుడి ఈవో భ్రమరాంబ ఉన్నారు.

*పదవ తరగతి ప్రశ్నా పత్రాల మాల్ ప్రాక్టీస్ కేసు వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణను చిత్తూరు 9వ అదనపు జిల్లా కోర్టు వాయిదా వేసింది. నారాయణ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 12న జిల్లా కోర్టులో చిత్తూరు పోలీసులు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. విచారణలో భాగంగా పోలీస్ శాఖ తరపున హైకోర్టు ఏజీపీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టుకు హాజరయ్యారు. దీంతో నారాయణ బెయిల్ రద్దు పిటిషన్ దాఖలుపై విచారణను కోర్టు ఈనెల 24కు వాయిదా వేసింది. తిరిగి ఈ రోజు మళ్ళీ న్యాయస్థానం కేసు విచారణను 30కి వాయిదా వేసింది.

*తిరుమలలో కొలువైన కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ మంగళవారం ఆన్‌లైన్‌లో విడుదలచేసింది. ఆగ‌స్టు మాసానికి సంబంధించిన తిరుమ‌ల శ్రీ‌వారి కల్యాణోత్సవం, ఊంజ‌ల్‌సేవ‌, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార ఆగస్టు నెల టికెట్ల కోటాను విడుదల చేసింది. సుప్రభాతం, తోమాల, అర్చన, సంబంధించి అష్టదళ పాదపద్మారాధన సేవా టికెట్లను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నది.ఈ నెల 26వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు భక్తులు పేర్లు నమోదు చేసుకునే వీలు కల్పిస్తుండగా.. అదే రోజు సాయంత్రం 6 గంటలకు ఆన్‌లైన్‌ డిప్‌ ద్వారా సేవా టికెట్లు పొందిన భక్తులకు టీటీడీ సమాచారం అందివ్వనున్నది. భ‌క్తులు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి సేవా టికెట్లు పొందాల్సి ఉంటుందని అ ధికారులు తెలిపారు. అయితే జూలై, ఆగస్ట్‌ నెలలకు సంబంధించిన వ‌ర్చువ‌ల్ కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజ‌ల్‌సేవ‌, స‌హ‌స్రదీపాలంకరణ సేవ టికెట్ల కోటా బుధవారం విడుదల కానున్నది.

*హర్యానా కాంగ్రెస్‌కు పెద్ద బూస్ట్ లభించింది. ఏకంగా ఒకేసారి ఎనిమిది మంది మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రికాంగ్రెస్ కీలక నేత భూపిందర్ సింగ్ హూడా ఆధ్వర్యంలో వారంతా కాంగ్రెస్ కండువా కప్పుకుని సభ్యత్వం తీసుకున్నారు. హర్యానా కాంగ్రెస్ చీఫ్ ఉదయి భన్ వారందరినీ పార్టీలోకి ఆహ్వానించారు. చేరినవారు వరుసగా శర్ద రాథోడ్రాం నివాస్ ఘోరెలానరేష్ సెల్వాల్పర్మిందర్ సింగ్ ధుల్జి లే రాం శర్మరాకేష్ కంబోజ్రాజ్‌కుమార్ వాల్మీకిసుభాష్ చౌదరి అని కాంగ్రెస్ ఒక ప్రకటనలో తెలిపింది.

* నాలుగు పదుల వయసు దాటగానే కొందరికి చత్వారం(ప్రెస్బయోపియా) వస్తుంది. పుస్తకాలు చదవడానికి కళ్లజోడు అవసరం అవుతుంది. కానీ చత్వారం బాధితులకు కళ్లజోడు అవసరం లేకుండా చేసే ‘వ్యూటీ’ చుక్కల మందుకు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏ తాజాగా అనుమతిచ్చింది. ప్రెస్బయోపియా ఉన్నవారు ఈ చుక్కల మందు వేసుకుంటే చాలు 15 నిమిషాల్లో వారు కంప్యూటర్‌ తెరను, ఫోన్‌ తెరను స్పష్టంగా చూడొచ్చని.. పుస్తకాలు, పేపర్‌ నిక్షేపంగా చదవొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. కన్ను పనిచేసే తీరును లక్ష్యంగా చేసుకుని ఈ వ్యూటీ చుక్కల మందు పనిచేస్తుందని.. ఈ చుక్కలు వేయగానే అవి కనుపాపలు కుచించుకుపోయేలా చేస్తాయని వైద్యనిపుణులు వివరించారు. ఎఫ్‌డీఏ అనుమతి రావడంతో.. చత్వారం చూపును సరిచేసే తొలి చుక్కల మందుగా (అనుమతి పొందిన) వ్యూటీ చరిత్ర సృష్టించింది.

*వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం సోమవారం భక్తజన సంద్రంగా మారింది. మండుటెండలను సైతం లెక్కచేయకుండా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు సర్వదర్శనం శీఘ్రదర్శనం క్యూలైన్ల మీదుగా ఆలయంలోకి చేరుకుని రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో ఆలయ అధికారులు గర్భాలయ ప్రవేశం నిలిపివేసి లఘుదర్శనం అమలు చేశారు. దీంతో భక్తులు నందీశ్వరుడి వద్ద నుంచి శ్రీస్వామివారిని దర్శించుకున్నారు. ఆర్జిత సేవలలో భాగంగా పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు. కళాభవన్‌లో స్వామివారి నిత్యకల్యాణం సత్యనారాయణవ్రతం తదితర ఆర్జిత సేవలలో పాల్గొన్నారు. ఆలయ కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు. లడ్డూ ప్రసాదాల కౌంటర్లు పూజల టిక్కెట్ల కౌంటర్లు భక్తులతో నిండిపోయాయి. అనుబంధ ఆలయమైన బద్దిపోచమ్మ దేవాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. భారీ సంఖ్యలో భక్తులు బద్దిపోచమ్మ అమ్మవారిని దర్శించుకుని బోనం మొక్కు చెల్లించుకున్నారు.

*రాష్ట్రంలో రైతుల గోస పట్టించుకునే వారు కరువయ్యారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నానంటూ సీఎం కేసీఆర్‌ తరచూ ఢిల్లీలో తిరుగుతున్నారని రాష్ట్రంలో ఉన్నప్పుడు ప్రగతిభవన్‌ ఫామ్‌హౌజ్‌కు పరిమితమవుతున్నారని విమర్శించారు. మేడ్చల్‌ జిల్లా మూడుచింతలపల్లి మండలం లక్ష్మాపూర్‌లో సోమవారం రాత్రి నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

*దేశంలోనే తొలిసారిగా.. కొవిడ్‌ కొత్త వేరియంట్‌ బీఏ కేసు హైదరాబాద్‌లో నమోదైంది. ఓ వృద్ధుడిలో దీనిని గుర్తించారు. న్యాయ సలహాదారుగా పనిచేస్తున్న ఈయన కొవిడ్‌ లక్షణాలు కనిపించడంతో ఈ నెల ఆర్టీపీసీఆర్‌ టెస్టు చేయించుకున్నారు. అందులో పాజిటివ్‌ వచ్చింది. అయితే వైద్య శాఖ.. ర్యాండమ్‌గా కొన్ని నమూనాలను జన్యు విశ్లేషణలకు గాంధీ ఆస్పత్రి ల్యాబ్‌కు పంపింది. అందులో వృద్ధుడి శాంపిల్‌ కూడా ఉంది. జన్యు ఫలితాల్లో బీఏ వేరియంట్‌ ఉన్నట్లు తేలింది. ఈయనకు ఎటువంటి ప్రయాణ చరిత్ర లేదని ఆరోగ్యం నిలకడగా ఉందని డీహెచ్‌ డాక్టర్‌ గడల శ్రీనివాసరావు తెలిపారు. వృద్ధుడు హోం ఐసొలేషన్‌లో ఉన్నట్లు చెప్పారు. ఇద్దరు కాంటాక్టులను గుర్తించామని వెల్లడించారు. వారిని సైతం ఐసొలేట్‌ చేశామని.. నమూనాలను ఆర్టీపీసీఆర్‌ పరీక్ష కోసం పంపినట్లు పేర్కొన్నారు. ఫలితాల కోసం చూస్తున్నామన్నారు. తెలంగాణలో కొవిడ్‌ నాలుగో వేవ్‌ వచ్చే అవకాశం లేదని డాక్టర్‌ గడల వెల్లడించారు.

*టమాటా ధరలు కొండెక్కాయి. కిలో వంద రూపాయలు దాటి వినియోగదారులను బెంబేలెత్తిస్తున్నాయి. కర్నూలు నంద్యాల జిల్లాల్లో ప్రధాన కూరగాయల మార్కెట్లో టమాటా నాణ్యతను బట్టి కిలో పైగానే విక్రయిస్తున్నారు. బోరుబావుల కింద సాగు చేసిన టమాటా బీర బెండ తోటలు చివరి దశకు చేరడంతో ధరలు చుక్కలనంటుతున్నాయి. స్థానికంగా దిగుబడులు లేకపోవడంతో చిత్తూరు జిల్లా మదనపల్లె గుర్రంకొండ మార్కెట్ల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లె గుర్రంకొండ కలకడ అన్నమయ్య జిల్లా చిన్నమండెం సంబేపల్లి లక్కిరెడ్డిపల్లె మండలాల్లో హైబ్రీడ్‌ తీగ జాతి రకం టమాటా సాగు చేస్తున్నారు. భూమిపై ప్లాస్టిక్‌కవర్‌ (మల్చి ంగ్‌) కర్ర పందిరి వేసి సాగు చేస్తుండడం వల్ల ఎకరాకు లక్షలు పెట్టుబడి అవుతోందని చిన్నమండెంకు చెందిన రైతు హరిబాబు పేర్కొన్నారు. టమాటా సాగుకు అక్కడి వాతావరణం అనుకూలించడంతో మదనపల్లె నుంచి రాయలసీమ జిల్లాలకే కాకుండా బెంగళూరు హైదరాబాద్‌ చెన్నై వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. తాజాగా నాణ్యతను బట్టి కిలో విక్రయిస్తున్నారు. వీధి వ్యాపారులైతే కిలో కు వరకు అమ్ముతున్నారు.

*హైకోర్టుల మాజీ ప్రధాన న్యాయమూర్తులు, మాజీ న్యాయమూర్తులు 51 మందికి వారు విధులు నిర్వర్తించిన హైకోర్టుల్లోనే సీనియర్‌ అడ్వొకేట్లుగా సుప్రీంకోర్టు తాజాగా గుర్తింపునిచ్చింది. వీరిలో ఏపీకి చెందిన జస్టిస్‌ దామా శేషాద్రి నాయుడు, జస్టిస్‌ మటం వెంకటరమణ, మద్రా్‌సకు చెందిన జస్టిస్‌ కె.రవిచంద్రబాబు, జస్టిస్‌ బి.రాజేంద్రన్‌, జస్టిస్‌ ఎం.సత్యనారాయణన్‌, కర్ణాటకకు చెందిన జస్టిస్‌ కె.భక్తవత్సల, కేరళకు చెందిన జస్టిస్‌ ఎ.హరిప్రసాద్‌, జస్టిస్‌ టీఆర్‌.రామచంద్రన్‌ నాయర్‌ కూడా ఉన్నారు.

*కరోనా తర్వాత తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని ఆదివారం రికార్డుస్థాయిలో భక్తులు దర్శించుకున్నారు. వేకువజాము నుంచి అర్ధరాత్రి వరకు 89,794 మందికి దర్శనం కల్పించారు. శుక్రవారం నుంచి భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమలలో సోమవారం మధ్యాహ్నం నుంచి రద్దీ తగ్గుముఖం పట్టింది.

*రాష్ట్రాన్ని అడ్డంపెట్టుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వైసీపీ నేతలు కోట్లాది రూపాయలను దోచేస్తున్నారని వీరికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పేరోజులు దగ్గర పడ్డాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు అన్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో సోమవారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. 40 సంవత్సరాల ఉత్తరాంధ్ర ప్రజల కల విశాఖ రైల్వేజోన్‌ తెచ్చింది నరేంద్రమోదీయేనని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిందీ కేంద్ర ప్రభుత్వమేనని, దమ్ముంటే మంత్రి బొత్స దీనిపై చర్చకు వస్తారా ? అని సవాల్‌ విసిరారు.

* తుంగ-భద్ర పరీవాహక ప్రాంతంలో కురిసిన వర్షాలతో తుంగభద్ర జలాశయానికి సోమవారం 80 వేల క్యూసెక్కుల భారీ వరద వచ్చింది. 100.86 టీఎంసీల సామర్థ్యం కలిగిన తుంగభద్ర జలాశయం లో ప్రస్తుతం 31.18 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కర్ణాటకలోని రాజోలిబండ డైవర్షన్‌ స్కీమ్‌(ఆర్డీఎస్‌) ఆనకట్టకు 5,455 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. కృష్ణా నదిపై ఉన్న నారాయణపూర్‌ జలాశయానికి 4,956 క్యూసెక్కులు, ఆల్మట్టి ప్రాజెక్టుకు 1,897 క్యూసెక్కుల వరద వచ్చింది. గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు 724 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. శ్రీశైలం రిజర్వాయర్‌లోకి 10,200 క్యూసెక్కుల వరద చేరుతోంది. ప్రాజెక్టులో 37 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గోదావరి బేసిన్‌లో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 539 క్యూసెక్కుల వరద వచ్చింది.

* విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు గాను ఈ ఏడాది 133 మంది బ్రాహ్మణ విద్యార్థులకు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ఆర్థిక సహాయాన్ని అందించనుంది. వివేకానంద విదేశీ విద్యా పథకం ద్వారా ఒక్కో విద్యార్థికి గరిష్టంగా రూ. 20 లక్షల వరకు ఆర్థిక సహాయానికి సంబంధించిన మంజూరు పత్రాలను ఈ నెల 26న జరిగే కార్యక్రమంలో అందజేయనుంది. శాసన మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు చైర్మన్‌ కేవీ రమణాచారి ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

*వానాకాలం సాగు సీజన్‌ మరో వారం రోజుల్లో ప్రారంభం అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ ఎరువుల సరఫరాకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కలిపి ఇప్పటికే 4.20 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులను పంపించింది. 10 లక్షల టన్నుల యూరియాతో కలిపి ఈ సీజన్‌లో మొత్తం 25 లక్షల టన్నుల ఎరువులు అవసరమని అధికారలు అంచనా వేశారు. దానికి అనుగుణంగానే అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. మరోపక్క మార్క్‌ఫెడ్‌ వద్ద 2.13 లక్షల టన్నుల యూరియా, 11,857 టన్నుల డీఏపీ, 41,540 టన్నుల కాంఫ్లెక్స్‌ ఎరువులు నిల్వలు ఇప్పటికే ఉన్నాయి. ఈ మేరకు ఎరువుల సరఫరా, పంపిణీకి సంబంధించి వ్యవసాయ శాఖ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది.

* క్రిమినల్‌ కేసుల్లో నిందితులకు పాస్‌పోర్ట్‌లు జారీచేసే అంశంపై సంబంధిత కోర్టులే నిర్ణయం తీసుకుంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. ఎంఎస్‌ పూర్తిచేసిన తన కుమార్తె స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి అమెరికా వెళ్లాల్సి ఉండటంతో హైదరాబాద్‌లోని నాచారానికి చెందిన ఓ మహిళ పాస్‌పోర్ట్‌ కోసం దరఖాస్తు చేశారు. అధికారులు పాస్‌పోర్ట్‌ జారీ చేయకపోవడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ కె. సురేందర్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. రీజినల్‌ పాస్‌పోర్ట్‌ ఆఫీసర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పిటిషనర్‌ తనపై ఉన్న క్రిమినల్‌ కేసును దాచిపెట్టారని అందుకే పాస్‌పోర్ట్‌ జారీచేయలేదని తెలిపారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. కేంద్ర ప్రభుత్వం 1993లో జారీచేసిన నోటిఫికేషన్‌ ప్రకారం క్రిమినల్‌ కేసుల్లో నిందితులకు పాస్‌పోర్ట్‌ జారీ చేసే అంశంపై కేసు విచారణలో ఉన్న కోర్టులే నిర్ణయం తీసుకుంటాయని తెలిపింది. ప్రస్తుత కేసులో పిటిషనర్‌కు రెండేళ్ల కాలపరిమితిగల పాస్ట్‌పోర్ట్‌ జారీచేయాలని ఆదేశాలు జారీచేసింది. ఆ పాస్‌పోర్ట్‌ను ట్రయల్‌ కోర్టులో సమర్పించి, విదేశీ పర్యటనకు అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని పిటిషనర్‌కు తెలిపింది. ఈ దరఖాస్తుపై ఆ కోర్టే తగిన నిర్ణయం తీసుకుంటుందని పేర్కొంది. కాగా, న్యాయశాఖ కార్యదర్శిగా నియమితులైన జిల్లా-సెషన్స్‌ జడ్జి నర్సింగ్‌ రావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు.

*కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం(సీపీఎ్‌స)ను రద్దు చేయాలంటూ దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాస్తానని రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ భరోసా ఇచ్చారని నేషనల్‌ మూవ్‌మెంట్‌ ఫర్‌ ఓల్డ్‌ పెన్షన్‌ స్కీం(ఎన్‌ఎంఓపీఎస్‌) తెలిపింది. ఈ మేరకు ఎన్‌ఎంఓపీఎస్‌ సెక్రటరీ జనరల్‌ స్థితప్రజ్ఞ ఓ ప్రకటన చేశారు. రాజస్థాన్‌లో సీపీఎ్‌సను రద్దు చేసినందుకు తమ సంఘం ప్రతినిధులమంతా జైపూర్‌కు వెళ్లి అశోక్‌ గెహ్లాట్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపినట్లు పేర్కొన్నారు.

* వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం సోమవారం భక్తజన సంద్రంగా మారింది. మండుటెండలను సైతం లెక్కచేయకుండా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు సర్వదర్శనం, శీఘ్రదర్శనం క్యూలైన్ల మీదుగా ఆలయంలోకి చేరుకుని రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో ఆలయ అధికారులు గర్భాలయ ప్రవేశం నిలిపివేసి లఘుదర్శనం అమలు చేశారు. దీంతో భక్తులు నందీశ్వరుడి వద్ద నుంచి శ్రీస్వామివారిని దర్శించుకున్నారు. ఆర్జిత సేవలలో భాగంగా పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు. కళాభవన్‌లో స్వామివారి నిత్యకల్యాణం, సత్యనారాయణ వ్రతం తదితర ఆర్జిత సేవలలో పాల్గొన్నారు. ఆలయ కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు. లడ్డూ ప్రసాదాల కౌంటర్లు, పూజల టిక్కెట్ల కౌంటర్లు భక్తులతో నిండిపోయాయి. అనుబంధ ఆలయమైన బద్దిపోచమ్మ దేవాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. భారీ సంఖ్యలో భక్తులు బద్దిపోచమ్మ అమ్మవారిని దర్శించుకుని బోనం మొక్కు చెల్లించుకున్నారు.

*ఎంపీ రఘురామ అనర్హత పిటిషన్పై లోక్సభ ప్రివిలేజ్ కమిటీ విచారణ నిర్వహించింది. కమిటీ ముందు వైసీపీ చీఫ్ విప్ మార్గాని భరత్ హాజరయ్యారు. ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ సునీల్కుమార్ సింగ్ దీనిపై విచారణ చేపట్టారు. రఘురామ పార్టీ వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడుతున్నారని.. గతంలో స్పీకర్‌కు మార్గాని భరత్ ఫిర్యాదు చేశారు. భరత్ పిటిషన్‌పై విచారణ జరిపి ప్రివిలేజ్ కమిటీకి స్పీకర్ ఓంబిర్లా నివేదిక పంపారు. మౌఖిక సాక్ష్యం ఇచ్చేందుకు ప్రివిలేజ్ కమిటీ ఎదుట మార్గాని భరత్ హాజరయ్యారు.

*‘‘వైసీపీ ప్రభుత్వ మోసపూరిత, ద్రోహపూరిత విధానాలను ప్రజలు వ్యతిరేకించాలి. ఆదివాసీల ఓట్లతో ప్రజా ప్రతినిధులై పాలకపక్షం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు మద్దతిస్తున్న అరకు ఎంపీ జి.మాధవి, ఎమ్మెల్యేలు చెట్టి ఫాల్గుణ, భాగ్యలక్ష్మిలను గ్రామాల్లోకి రానీయకండి. తన్ని తరమండి’’ అని మావోయిస్టు పార్టీ ఆంధ్ర, ఒడిశా సరిహద్దు స్పెషల్‌ జోనల్‌ కమిటీ కార్యదర్శి గణేశ్‌ పిలుపునిచ్చారు. వైసీపీ సర్కారు తీరును ఎండగడుతూ సోమవారం మీడియాకు లేఖ విడుదల చేశారు. ‘‘వైసీపీ పాలన రాష్ట్రాన్ని తీవ్రమైన రుణ, ఆర్థిక సంక్షోభంలోకి నెట్టింది. సామాజిక, రాజకీయ వివాదాలు పెరిగాయి. దోపిడీని కళగా అలవరచుకుంది. అందులో భాగంగానే అల్లూరి సీతారామరాజు పేరిట జిల్లా ఏర్పా టు చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా అధికార యంత్రాంగం అల్లూరి వర్ధంతిని ఘనంగా నిర్వహించింది. ఇదంతా దేవతకు బలిచ్చే ముందు జంతువులకు చేసే పూజలాంటిది’’ అని మావోయిస్టు నేత మండిపడ్డారు. ‘‘తప్పనిసరి పరిస్థితుల్లో జీవో-97ను రద్దు చేసినప్పటికీ, అన్‌రాక్‌ కంపెనీతో జరిగిన ఒప్పందాన్ని మాత్రం ర ద్దు చేయలేదు. తిరిగి బాక్సైట్‌ తవ్వకాలు చేపట్టాలనే ఆలోచనతోనే జీవో-89ను తెరపైకి తెచ్చారు. మైనింగ్‌కు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదంటూనే లేటరైట్‌ తవ్వకాలకు అనుమతిచ్చారు. అన్‌రాక్‌ కంపెనీ ఉత్పత్తి ప్రారంభించేందుకు అనుమతులు ఇచ్చారు. గిరిజన రైతులకు పంపిణీ చేసిన ఏపీఎ్‌ఫడీసీ కాఫీ తోటలను తిరిగి ప్రభు త్వ స్వాధీనం చేసుకుంది. మావోయిస్టు పార్టీని అంతమొందించాలనే లక్ష్యంతోనే గ్రేహౌండ్స్‌ సాయుధ బలగాలతో వేట కొనసాగిస్తోంది. అవివేకుడైన సతీశ్‌కుమార్‌ను అల్లూరి జిల్లాకు ఎస్‌పీగా నియమించారు’’ అని మావోయిస్టు నేత గణేశ్‌ ఆరోపించారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లను ఆయన పేర్కొన్నారు.

*రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యుడిగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్రంలో ఒక రాజ్యసభ స్థానం ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారం ముగిసింది. రవిచంద్ర నామినేషన్‌ మాత్రమే మిగిలి ఉండటంతో ఆయన అభ్యర్థిత్వం ఏకగ్రీవమైంది. ఈ మేరకు రాజ్యసభ సభ్యునిగా ఆయన ఎన్నికైనట్లు రిటర్నింగ్‌ అధికారి, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వద్దిరాజు రవిచంద్రను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇంద్రకరణ్‌ రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీ మాలోత్‌ కవిత, ఎమ్మెల్సీ తాతామధు, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌ తదితరులు అభినందించారు. వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ తనకు ప్రాధాన్యమిచ్చి రాజ్యసభ సభ్యునిగా అవకాశం కల్పించారని, తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు.

*విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు గాను ఈ ఏడాది 133 మంది బ్రాహ్మణ విద్యార్థులకు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ఆర్థిక సహాయాన్ని అందించనుంది. వివేకానంద విదేశీ విద్యా పథకం ద్వారా ఒక్కో విద్యార్థికి గరిష్టంగా రూ. 20 లక్షల వరకు ఆర్థిక సహాయానికి సంబంధించిన మంజూరు పత్రాలను ఈ నెల 26న జరిగే కార్యక్రమంలో అందజేయనుంది. శాసన మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు చైర్మన్‌ కేవీ రమణాచారి ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

*కృష్ణా నుంచి ఇతర బేసిన్లకు భారీగా నీటిని తరలించడానికి వీలుగా ఆంధ్రప్రదేశ్‌ అక్రమంగా చేపడుతున్న ప్రాజెక్టుల పనులను అడ్డుకోవాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)ని తెలంగాణ కోరింది. ఈ మేరకు ఆయా ప్రాజెక్టుల పనుల కోసం పిలిచిన టెండర్ల కాపీలను జత చేసి, కేఆర్‌ఎంబీ ఛైర్మన్‌ మహేంద్ర ప్రతా్‌పసింగ్‌కు తెలంగాణ ఈఎన్‌సీ సి.మురళీధర్‌రావు లేఖ రాశారు. ఎస్కేప్‌ చానెల్‌, నిప్పులవాగు, కుందు కెనాల్‌, గాలేరు నదుల్లో పనుల కోసం ఆంధ్రప్రదేశ్‌ టెండర్లు పిలిచిందని పేర్కొన్నారు. దాంతో పాటు పోతిరెడ్డిపాడు, బనకచర్ల హెడ్‌రెగ్యులేటరీ కాంప్లెక్స్‌ల నుంచి రోజుకు 80 వేల క్యూసెక్కుల నీటిని తరలించడం తోపాటు రాయలసీమ పంపింగ్‌ వ్యవస్థ ద్వారా రోజుకు 3 టీఎంసీల నీటిని తరలించడానికి వీలుగా సంగమేశ్వరం నుంచి ఎస్‌ఆర్‌ఎంసీ దాకా పనులకు, పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటరీ నుంచి నీటిని తరలించే శ్రీశైలం రైట్‌ బ్యాంక్‌ కెనాల్‌(ఎ్‌సఆర్‌బీసీ), గాలేరు నగరి సుజల స్రవంతి(జీఎన్‌ఎ్‌సఎ్‌స) కాలువల సామర్థ్యాన్ని పెంచి 30 వేల క్యూసెక్కుల నీటిని తరలించేలా కెనాల్‌ లైనింగ్‌ పనులకు టెండర్లు పిలిచారని పేర్కొంటూ ఆ జీవోలను కూడా లేఖతో జతచేశారు. ఆయా ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయితే తెలంగాణలోని నాగార్జునసాగర్‌, శ్రీశైలం పరిధిలోని కృష్ణా బేసిన్‌ ప్రాంతాలకు నీటికి ఇబ్బందులు ఏర్పడతాయని గుర్తు చేశారు.

*అమలాపురంలో భారీగా పోలీసులు మోహరించారు. పేరు మార్పుపై కోనసీమ జేఏసీ నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఛలో అమలాపురం ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ర్యాలీలు, ఊరేగింపులు చేయొద్దని జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి హెచ్చరించారు. అమలాపురంలో 144 సెక్షన్ విధించారు. కోనసీమ జిల్లాకు పేరు మార్చవద్దంటూ మధ్యాహ్నం భారీ ర్యాలీగా అమలాపురం తరలి వచ్చే అవకాశం ఉంది. దీంతో అమలాపురంలలో ఎక్కడికక్కడ భారీగా పోలీసు బలగాలు మోకోమటపల్లిలో అధికారుల అత్యుత్సాహం వెలుగు చూసింది. వైసీపీ కార్యకర్తల కుటుంబాలకు ఉపాధిహామీ పనులు కేటాయిస్తున్నారు. టీడీపీ కార్యకర్తల కుటుంబాల పేర్లు జాబితా నుంచి తొలగించారు. ఉపాధి పనులు కల్పించాలంటూ టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అధికారుల తీరును నిరసిస్తూ జాతీయ రహదారిపై టీడీపీ ఆందోళనకు దిగింది.హరించారు.

*అనంతబాబును పదవి నుంచి తొలగించాలి: జడ శ్రవణ్ కుమార్
ఎమ్మెల్సీ అనంతబాబుకు కఠిన శిక్ష పడేవరకు విశ్రమించబోమని సీనియర్ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ చెప్పారు. కాకినాడ జిల్లా పోలీసు అధికారులు కట్టుకథలు చెప్పారన్నారు. మొత్తం ఏడుగురు సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఉన్నారని తమ అనుమానమన్న శ్రవణ్ కుమార్‌… కేసును బలహీనపరచడానికే సహ నిందితులను పక్కన పెట్టేశారని ఆరోపించారు. హత్య కేసులో నిందితుడైన అనంతబాబును వెంటనే ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్న శ్రవణ్ కుమార్.మృతదేహం తీసుకొచ్చి నేరుగా ఇంటి వద్ద పడేశారని… మృతదేహం ఎలా అప్పగించారో పోలీసులకు బాధిత కుటుంబం తెలిపిందని సీనియర్ న్యాయవాది శ్రవణ్‌ కుమార్ స్పష్టం చేశారు. రిపోర్టులోని అంశాలు పరిగణించకుండా ఎమ్మెల్సీ పేరు తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమానాస్పద మృతిగా ఎలా కేసు నమోదు చేస్తారని ప్రశ్నించారు. ఎస్పీ స్టేట్‌మెంట్‌ను రాష్ట్ర ప్రజలంతా విన్నారన్న ఆయన.. చనిపోయిన తర్వాత మృతుణ్ని కొట్టారని ఎలా చెబుతారని నిలదీశారు. ఏడు నుంచి 8 మంది హత్యకు పాల్పడ్డారని ఆరోపించారు.