DailyDose

దొంగనోట్లు మారుస్తూ పట్టుబడిన భార్యాభర్తలు – TNI నేర వార్తలు

దొంగనోట్లు మారుస్తూ పట్టుబడిన భార్యాభర్తలు – TNI  నేర వార్తలు

* దొంగనోట్లు మారుస్తూ పట్టుబడిన భార్యాభర్తలను అరెస్ట్‌ చేసి కేసు నమోదు చేశామని పార్వతీపురం పట్టణ ఎస్సై ప్రయోగమూర్తి సోమవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా అనపర్తికి చెందిన సత్తి నాగేశ్వరరెడ్డి భార్య వనజలు కొమరాడ మండలం కోటిపాం, జంఝావతిలతోపాటు పట్టణంలోని పాతబస్టాండ్‌ కూడలి వద్ద దుకాణాల్లో రూ.500, రూ.200, రూ.100 నకిలీ నోట్లు ఇచ్చి శీతల పానీయాలతో పాటు ఆహార పదార్థాలు కొనుగోలు చేస్తున్న సమయంలో కొంతమంది వ్యాపారులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు నాగేశ్వరరెడ్డి దంపతులను అదుపులోకి విచారణ చేయగా నకిలీ నోట్లు మారుస్తున్నట్లు అంగీకరించారని తెలిపారు.

*కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హుకుం సింగ్ క‌ర‌ద కుమారుడు రోహిత‌బ్ సింగ్ తాగిన మైకంలో ఓ వ్యాపారి కారును త‌న వాహ‌నంతో ఢీకొట్టిన ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని సెహోర్‌లో వెలుగుచూసింది. రోహిత‌బ్ సింగ్ వ్యాపారి దినేష్ అహుజా కారును ఢీకొన‌డంతో పాటు ఆయ‌న‌తో వాగ్వాదానికి దిగాడు. ఈ ఘ‌ట‌న‌ను వ్యాపారి వీడియో తీయ‌గా సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారింది.కారుకు న‌ష్టం వాటిల్ల‌డంతో ప‌రిహారం కింద వ్యాపారి డ‌బ్బు అడ‌గ‌డంతో రోహిత‌బ్ సింగ్ దురుసుగా ప్ర‌వ‌ర్తించాడు. మీతో తాను పోరాడ‌తాన‌ని, పోలీస్ స్టేష‌న్‌కు రావాల‌ని నిందితుడు అన‌డం వినిపించింది. ఆపై నిందితుడు మ‌రో కారును ఢీ కొట్టాడు. నిందితుడు క‌త్తితో త‌న వెంట ప‌రుగెడుతూ త‌న కారు విండోను బ‌ద్ద‌లుకొట్టాడ‌ని వ్యాపారి ఆరోపించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు.

* కృష్ణాజిల్లా గుడివాడలోని ఓల్డ్ ఎలక్ట్రికల్ గోడౌన్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పట్టణంలోని ముబారక్ సెంటర్ వలివర్తిపాడు రోడ్డులోని కాజా ఓల్డ్ ఎలక్ట్రికల్ గోడౌన్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ప్రమాదంలో రూ.లక్షల విలువైన ఎలక్ట్రికల్ పరికరాలు దగ్ధమయ్యాయి. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద తీవ్రతకు పరిసర ప్రాంతాల్లోని రెండు గడ్డివాములు, రెండు ఇళ్లు ఆహుతయ్యాయి. మధ్యాహ్నం సమయంలో ఉవ్వెత్తున మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గోడౌన్లో చెలరేగిన మంటలు… పరిసర ప్రాంతాలకు వ్యాపిస్తుండటంతో స్థానిక ప్రజల కలవరపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. సంఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

*వినుకొండ మండలం నాగులవరంలో దొంగలు బీభత్సం సృష్టించారు. గుజ్జల యోగిరెడ్డి ఇంట్లో చొరబడి బీరువాను దుండగులు ఎత్తుకెళ్లారు. బీరువాలో ఉన్న రూ.35 లక్షల విలువైన బంగారం, రెండు లక్షల నగదును తీసుకుని బీరువాను పొలాల్లో పడేసి పరారయ్యారు. బీరువా శబ్ధాలు వినపడటంతో గ్రామస్తులు పొలాల్లోకి వచ్చే లోపు దుండగులు బైక్‎లు వదిలి బంగారం, నగదుతో పరారయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని బైక్‎లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

*హైదరాబాద్: నగరంలోని తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. కుష్బుసింగ్ (31) అనే మహిళను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

*హైద‌రాబాద్‌లోని తిరుమ‌ల‌గిరి పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో ఘోర రోడ్డుప్ర‌మాదం జ‌రిగింది. సైకిల్‌పై వెళ్తున్న మ‌హిళ‌ను ఆర్టీసీ బ‌స్సు ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో మ‌హిళ అక్క‌డిక‌క్క‌డే మృతి చెందింది.స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్నారు. మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో ఆమె భ‌ర్త కూడా ప‌క్క‌నే ఉన్నాడు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మృతురాలి నివాసంలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.

*భార్య కాపురానికి రాలేదని మనస్థాపానికి గురైన భర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన వనపర్తి జిల్లా అమరచింత మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. అమరచింతకు చెందిన కల్యాణ్‌, సమ్రిన్‌ ప్రేమించుకున్నారు. తొమ్మిది నెలల కిందట మతాంతర వివాహం చేసుకున్నారు. హైదరాబాద్‌లో పీజీ చదువుతూ, అక్కడే ఉంటున్నారు. 20 రోజుల కిందట తన తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగోలేదని సమ్రిన్‌ భర్తకు చెప్పి అమరచింతకు వచ్చింది. తర్వాత తల్లిదండ్రుల సహకారంతో భర్త తనను వేధిస్తున్నాడని అమరచింత పోలీస్‌ స్టేషన్‌లో కేసు పెట్టింది. ఎస్‌ఐ జయన్న కల్యాణ్‌ను పిలిపించి, కేసు నమోదు చేశామని చెప్పారు. సమాచారం తెలుసుకుందామని కల్యాణ్‌ అత్తగారింట్లో ఉన్న భార్య వద్దకు సోమవారం వెళ్లగా, వారి కుటుంబ సభ్యులు గొడవ పడ్డారు. తమ అమ్మాయిని పంపించబోమని చెప్పడంతో కల్యాణ్‌ మనస్తాపానికి గురయ్యాడు. పట్టణంలోని ఒక పొలం వద్ద పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆత్మకూర్‌లోని ప్రభుత్వ ఆస్పతికి తరలించారు. ప్రమాదం ఏమీ లేదని వైద్యులు చెప్పారని కుటుంబీకులు తెలిపారు.

*పదవ తరగతి ప్రశ్నా పత్రాల మాల్ ప్రాక్టీస్ కేసు వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణను చిత్తూరు 9వ అదనపు జిల్లా కోర్టు వాయిదా వేసింది. నారాయణ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 12న జిల్లా కోర్టులో చిత్తూరు పోలీసులు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. విచారణలో భాగంగా పోలీస్ శాఖ తరపున హైకోర్టు ఏజీపీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టుకు హాజరయ్యారు. దీంతో నారాయణ బెయిల్ రద్దు పిటిషన్ దాఖలుపై విచారణను కోర్టు ఈనెల 24కు వాయిదా వేసింది. తిరిగి ఈ రోజు మళ్ళీ న్యాయస్థానం కేసు విచారణను 30కి వాయిదా వేసింది.

*శ్రీశైలం సాక్షిగణపతి ఆలయం సమీపంలో అదుపు తప్పి విద్యుత్ స్దంభాన్ని కారు ఢీకొట్టింది. అయితే పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం కారులోని వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. హైద్రాబాద్ నుంచి శ్రీశైలం వస్తున్న సమయంలో ఘటన చోటుచేసుకుంది. కరెంట్ పోల్‌ను ఢీకొట్టి రోడ్డుపక్కన ఉన్న సైడ్ వాల్ పైకి ఎక్కి కారు నిలబడి ఆగడంతో ప్రమాదం తప్పింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నమని ఎస్ ఐ వెంకటరెడ్డి తెలిపారు.

*గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కుర్నూతలలో అర్థరాత్రి మట్టి తరలిస్తున్న వాహనాలను అడ్డుకున్న పోలీసులపై వైకాపా నాయకలు దౌర్జన్యానికి దిగారు. చెరువులో మట్టి తవ్వుకునేందుకు నీటిపారుదలశాఖ అధికారులు అనుమతి ఇచ్చారు. ఇదే అదనుగా వైకాపా నాయకులు రాత్రి, పగలు తేడా లేకుండా పెద్దఎత్తున మట్టి తరలించారు. దీంతో అధికారులు మట్టి తవ్వకాలను నిలిపివేసినా.. వైకాపా నాయకులు ఆగలేదు. దీంతో స్థానిక ఎస్సై వెంకటేశ్వరరావు మట్టి తవ్వకాలు జరిగే ప్రాంతానికి వెళ్లి అడ్డుకోవడంతో మూకుమ్మడిగా ఆయనపై వైకాపా నాయకులు వాగ్వాదానికి దిగారు. ఇక్కడే ఉంటే వీరు చంపేస్తారేమోనంటూ ఎస్సై అక్కడి నుంచి వెళ్లిపోదామని కానిస్టేబుళ్లతో అన్నాడంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే మట్టి తవ్వకాలను అడ్డుకున్న ఎస్సైను ఉన్నతాధికారులు వీఆర్‌కు పంపడం గమనార్హం. ఇక్కడ మట్టి తవ్వకాలన్నీ స్థానిక ఎమ్మెల్యే కనుసన్నల్లోనే జరుగుతుందని స్థానికులు, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

*నరసరావుపేటలో హాస్టల్ వార్డెన్ గిరిరాజు శ్రీనివాసరావుపై ట్రైబల్ వెల్ఫేర్ సూపరిండెండెంట్ పి చంద్రరావు దాడి చేశారు. శాఖపర సమావేశంలో వార్డెన్‌పై సూపరింటెండెంట్ భౌతిక దాడికి పాల్పడ్డారు. అందరిలో కులం పేరుతో దూషించి, అవమానించాడని బాధితుడు శ్రీనివాసరావు టూ టౌన్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు

*కృష్ణా: జిల్లాలోని గుడివాడలో భారీ అగ్నిప్రమాదంచోటుచేసుకుంది. ముబారక్ సెంటర్‌లో పాత ఎలక్ట్రానిక్స్ గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో సమీప ప్రాంతాలకు కూడా మంటలు వ్యాపించాయి. గోదాములో లక్షలాది రూపాయల విలువైన ఎలక్ట్రికల్ పరికరాలు దగ్ధమయ్యాయి. గోదాము సమీపంలోని రెండు గడ్డివాములు, ఇళ్లకు సైతం మంటలు వ్యాపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలార్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నది.

*ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటపై యువతి తండ్రి, తమ్ముడు దాడికి పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మూడు నెలల క్రితం సాంబశివరావు, పావని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. గత రాత్రి రెస్టారెంట్‌లో పావని తండ్రి, తమ్ముడు సాంబశివరావు చెవి కొరికి కర్రలతో దాడి చేశారు. దాడిలో సాంబశివరావు తీవ్రంగా గాయపడ్డాడు. ద్వారకా తిరుమల పోలీసులకు ఫిర్యాదు చేశారు.

*మిర్యాలగూడలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏడుకోట్ల తండా వద్ద బైక్‌ను కారు ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలు కావడంతో బైక్‌పై ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా.. ఆసుపత్రికి తరలించారు. అయితే, మృతులకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

*కామారెడ్డి : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఉరి వేసుకొని దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాదకర సంఘటన జిల్లా కేంద్రంలోని మాయాబజార్‌లో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. మాయాబజార్‌కు చెందిన గజవాడ కుబేరం (60) గజవాడ లక్ష్మి (55)ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

*దంపతుల పై దాడి చేసి వారి వద్ద ఉన్న బంగారు నాన్‌తాండుమొబైల్‌ ఫోన్‌ను దుండగులు అపహరించిన ఘటన సోమవారం మండంలోని శాంతినగర్‌ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణా రాష్ట్రం సూర్యాపేట జిల్లా మేళ్ళచెరువు గ్రామానికి బొల్లా రామకృష్ణఅతని భార్య భారతి కర్నూలు జిల్లాలోని ఒక వివాహానికి హాజరై సోమవారం తెల్లవారు జాముకు నరసరావుపేట రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. నరసరావుపేట రైల్వేస్టేషన్‌లో ఉంచిన బైక్‌పౌ మేళ్ళ చెరువుకు తిరుగు ప్రయాణం అయ్యారు. వీరిని రెండు బైక్‌ల పై ముగ్గురు చొప్పున యువకులు వెంటాడారు. శాంతినగర్‌ సమీపానికి రాగానే బైక్‌లను అడ్డు పెట్టి ఆ దంపతులను బెదిరించి భారతి వద్ద ఉన్న నాన్‌తాడునురామకృష్ణ వద్ద ఉన్న మొబైల్‌ను దాడి చేసి తీసుకొని పరారయ్యారు. రామకృష్ణ అక్కడ సువర్ణ సిమెంట్‌ ప్యాక్టరీలో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు నకరికల్లు ఎస్‌ఐ పి.సురేష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

*నందికొట్కూరు మండలంలోని బ్రహ్మణకొట్కూరులో భారీగా గుట్కా ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణ నుంచి అక్రమంగా అర్ధరాత్రి తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుట్కా ప్యాకెట్ల విలువ సుమారుగా రూ.లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‎కు తరలించారు.

*సమస్యలపై ప్రశ్నించిన ఓ మహిళపై ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి వింత వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆదోని బైచి గేరిలో గడప గడప కార్యక్రమంలో ఎమ్యెల్యే పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సమస్యలపై ఎమ్మెల్యేను మహిళలు నిలదీశారు. ఓ మహిళ సమస్యపై ప్రశ్నిస్తే నీ మొగుడు నీతో ఎట్లా ఏగుతున్నాడోఅంటూ వింత వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి వ్యాఖ్యలపై మహిళలు అవాక్కయ్యారు.

*వినుకొండ మండలం నాగులవరంలో దొంగలు బీభత్సం సృష్టించారు. గుజ్జల యోగిరెడ్డి ఇంట్లో చొరబడి బీరువాను దుండగులు ఎత్తుకెళ్లారు. బీరువాలో ఉన్న రూ లక్షల విలువైన బంగారంరెండు లక్షల నగదును తీసుకుని బీరువాను పొలాల్లో పడేసి పరారయ్యారు. బీరువా శబ్ధాలు వినపడటంతో గ్రామస్తులు పొలాల్లోకి వచ్చే లోపు దుండగులు బైక్‎లు వదిలి బంగారంనగదుతో పరారయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని బైక్‎లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

*దూల్ పేట్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొకైన్‌ను అధికారులు సీజ్ చేశారు. ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఒక ఇన్నోవా కారును స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన ముగ్గురిలో ఒకరు ఆఫ్రికన్ కావడం గమనార్హం. నిందితుల వద్ద లభించిన కొకైన్‌ను అధికారులు సీజ్ చేశారు

*సంచలనం సృష్టించిన బేగం బజార్ నీరజ్ హత్య కేసులో మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితులు అభినందన్మహేష్‌లను నాందేడ్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఒక మైనర్‌తో పాటు ఆరుగురు నిందితులు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. గతంలో అరెస్ట్‌ అయిన నలుగురిని పోలీసులు ఏడు రోజుల పాటు కస్టడీకి కోరారు. పోలీసుల కస్టడీ పిటిషన్‌పై నేడు కోర్టులో విచారణ జరుగనుంది. ప్రేపెళ్లిపరువు వ్యవహారమే నీరజ్ హత్యకు కారణంగా పోలీసులు తెలిపారు. పరువు కోసమే హత్య చేశామని ఇప్పటికే నిందితులు ఒప్పుకున్న విషయం తెలిసిందే.

*దంపతుల పై దాడి చేసి వారి వద్ద ఉన్న బంగారు నాన్‌తాండు, మొబైల్‌ ఫోన్‌ను దుండగులు అపహరించిన ఘటన సోమవారం మండంలోని శాంతినగర్‌ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణా రాష్ట్రం సూర్యాపేట జిల్లా మేళ్ళచెరువు గ్రామానికి బొల్లా రామకృష్ణ, అతని భార్య భారతి కర్నూలు జిల్లాలోని ఒక వివాహానికి హాజరై సోమవారం తెల్లవారు జాముకు నరసరావుపేట రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. నరసరావుపేట రైల్వేస్టేషన్‌లో ఉంచిన బైక్‌పౌ మేళ్ళ చెరువుకు తిరుగు ప్రయాణం అయ్యారు. వీరిని రెండు బైక్‌ల పై ముగ్గురు చొప్పున యువకులు వెంటాడారు. శాంతినగర్‌ సమీపానికి రాగానే బైక్‌లను అడ్డు పెట్టి ఆ దంపతులను బెదిరించి భారతి వద్ద ఉన్న నాన్‌తాడును, రామకృష్ణ వద్ద ఉన్న మొబైల్‌ను దాడి చేసి తీసుకొని పరారయ్యారు. రామకృష్ణ అక్కడ సువర్ణ సిమెంట్‌ ప్యాక్టరీలో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు నకరికల్లు ఎస్‌ఐ పి.సురేష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

*దంపతుల పై దాడి చేసి వారి వద్ద ఉన్న బంగారు నాన్‌తాండుమొబైల్‌ ఫోన్‌ను దుండగులు అపహరించిన ఘటన సోమవారం మండంలోని శాంతినగర్‌ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణా రాష్ట్రం సూర్యాపేట జిల్లా మేళ్ళచెరువు గ్రామానికి బొల్లా రామకృష్ణఅతని భార్య భారతి కర్నూలు జిల్లాలోని ఒక వివాహానికి హాజరై సోమవారం తెల్లవారు జాముకు నరసరావుపేట రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. నరసరావుపేట రైల్వేస్టేషన్‌లో ఉంచిన బైక్‌పౌ మేళ్ళ చెరువుకు తిరుగు ప్రయాణం అయ్యారు. వీరిని రెండు బైక్‌ల పై ముగ్గురు చొప్పున యువకులు వెంటాడారు. శాంతినగర్‌ సమీపానికి రాగానే బైక్‌లను అడ్డు పెట్టి ఆ దంపతులను బెదిరించి భారతి వద్ద ఉన్న నాన్‌తాడును, రామకృష్ణ వద్ద ఉన్న మొబైల్‌ను దాడి చేసి తీసుకొని పరారయ్యారు. రామకృష్ణ అక్కడ సువర్ణ సిమెంట్‌ ప్యాక్టరీలో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు నకరికల్లు ఎస్‌ఐ పి.సురేష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

*దర్శకుడు రాంగోపాల్‌ వర్మపై మియాపూర్‌ పోలీస్టేషన్‌లో చీటింగ్‌ కేసు నమోదైంది. దిశ ఎన్‌కౌంటర్‌పై సినిమా తీస్తానని ప్రకటించి రాంగోపాల్‌ వర్మ.. తన వద్ద రూ. లక్షలు అప్పుగా తీసుకున్నాడంటూ మియాపూర్‌ మాతృశ్రీనగర్‌కు చెందిన శేఖర్‌ ఆర్ట్స్‌ క్రియేషన్‌ నిర్వాహకుడు శేఖర్‌ రాజు ఫిర్యాదు చేశారు. ఆ మొత్తాన్ని విడతల వారీగా ఆర్టీజీఎస్‌ ద్వారా వర్మ ఖాతాకు బదిలీ చేసినట్లు చెప్పారు. ఆ డబ్బును తిరిగి ఇవ్వాలని కోరితే.. బెదిరింపులకు పాల్పడుతున్నాడని వాపోయారు. ఈ మేరకు శేఖర్‌ రాజు కోర్టులో పిటిషన్‌ వేశారు. కోర్టు ఆదేశాలతో మియాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

* చెవిటి, మూగ కుమార్తెతో ఆ తల్లి రైల్వేస్టేషన్‌కు వచ్చిన ఆ తల్లి.. రైలు ఎక్కే క్రమంలో జారిపడి ట్రైన్‌ కింద పడ్డారు. ఈ ప్రమాదంలో కుమార్తె మృతిచెందగా తల్లి ప్రాణాలతో బయటపడింది. ప్రత్యక్ష సాక్షులు, రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. ఏలూరు వంగాయిగూడెంకు ప్రాంతానికి చెందిన నువ్వుల లక్ష్మి (50) తన చెవిటి, మూగ కుమార్తె సాయిదుర్గ (25)ను తీసుకుని విశాఖపట్టణం వెళ్లేందుకు సోమవారం ఉదయం ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్‌కు వచ్చారు. రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ వచ్చి ఆగగా.. గార్డుకు ముందున్న జనరల్‌ బోగీలో ఎక్కేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో రైలు కదలడంతో వారిద్దరూ రైలు బోగీ-ప్లాట్‌ ఫామ్‌ మధ్యలో చిక్కుబడి మెలితిరుగుతూ 20 మీటర్లుపైనే వెళ్ళిపోయారు. అంతలో ప్రయాణీకులు చైన్‌ లాగడంతో రైలు ఆగిపోయింది. అక్కడే ఉన్న ఆర్‌పీఎఫ్‌ సీఐ బి.శంకరరావు, ఏఎ్‌సఐ రామారావు, సిబ్బంది కె.శ్రీనివాసరావు, సీహెచ్‌ ప్రసాద్‌ వెంటనే రంగంలోకి దిగారు. ఏఎ్‌సఐ, మరో కానిస్టేబుల్‌ రైలు కిందకు వెళ్ళి వారిని అతి కష్టం మీద తీసి లక్ష్మిని ఫ్లాట్‌ఫామ్‌ పైకి ఎక్కించారు. వారిని వెంటనే 108 అంబులెన్సులో ఎక్కించి ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా సాయిదుర్గ చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ ఘటనపై ఏలూరు రైల్వే హెడ్‌ కానిస్టేబుల్‌ సిహెచ్‌ విజయలక్ష్మి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

*తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని పాత బస్టాండ్‌ సమీపంలో ఉన్న టీడీపీ కార్యాలయాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేసి నిప్పంటించారు. టీడీపీ నాయకుడు గంగబాబు కథనం ప్రకారం.. ఆదివారం రాత్రి కార్యాలయాన్ని మూసివేసి బయట వరండాలో ఆయన కూర్చుని ఉండగా మోటారు సైకిల్‌పై ముగ్గురు యువకులు వచ్చి దుర్భాషలాడారు. కొంత సమయం తర్వాత ఆయన బస్టాండ్‌ ప్రాంతంలోకి వెళ్లగా టీడీపీ కార్యాలయానికి నిప్పంటించి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారని గంగబాబుకు ఓ వ్యక్తి ఫోన్‌ చేశాడు. దీంతో తాను పోలీసులకు సమాచారం అందించి స్థానికుల సహాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేసినట్టు వివరించారు. ఆ యువకులు అక్కడి నుంచి పరారైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
*హుబ్లీ నుంచి విజయవాడ వస్తున్న అమరావతి ఎక్స్‌ప్రె్‌సలో కొకైన్‌ తరలిస్తున్న వ్యక్తిని ఎస్‌ఐబీ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. నిందితుడి నుంచి భారీగా మాదక ద్రవ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సోమవారం సాయంత్రం అమరావతి ఎక్స్‌ప్రెస్‌ అనంతపురం జిల్లా గుంతకల్లుకు రాగానే ఎస్‌ఐబీ పోలీసులు తనిఖీ చేశారు. పట్టుబడిన వ్యక్తి వద్ద రూ.లక్షల విలువైన కొకైన్‌ను ఉన్నట్టు కనుగొన్నారు. వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు విజయవాడకు చెందినవాడిగా భావిస్తున్నారు. కొకైన్‌ ఎక్కడి నుంచి తెచ్చిఎక్కడికి తీసుకువెళుతున్నాడుసూత్రధారులెవరనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. విజయవాడలోని పలు కళాశాలల్లో విద్యార్థులకు అమ్మేందుకు కొకైన్‌ను తరలిస్తున్నట్టు అనుమానిస్తున్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్‌ఐబీ పోలీసులు తెలిపారు.

*కృష్ణా జిల్లా మంగినపూడి బీచ్‌లో మునిగి ఇరువురు బీ-ఫార్మసీ విద్యార్థినులు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి మచిలీపట్నం రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మచిలీపట్నం పరాసుపేటకు చెందిన కళ్లేపల్లి పూజిత (22), భీమవరం సమీపంలోని పిప్పర గ్రామానికి చెందిన ప్రమీల (22), గరగపర్రుకు చెందిన దత్తాల ఆశ.. భీమవరంలోని ఓ కళాశాలలో బీ-ఫార్మసీ చదువుతున్నారు. క్యాంపస్‌ సెలక్షన్లలో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. పూజితతో కలిసి ప్రమీల, ఆశ… మూడు రోజులక్రితం మచిలీపట్నం వచ్చారు. సోమవారం ఉదయం 9 గంటల సమయంలో వీరు మంగినపూడి బీచ్‌కు వెళ్లారు. సముద్రంలో స్నానం చేస్తుండగా పెద్ద కెరటం వీరిని లాక్కుపోవడం గమనించిన మెరైన్‌ పోలీసులు రక్షించే ప్రయత్నం చేశారు. పూజిత, ప్రమీలను ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తుండగానే వారు ప్రాణాలు విడిచారు.

*హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురం ఓయో రూంలో యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు బంధువులకు సాయికృష్ణ ఫోన్‌ చేసి ఈ ఘటనకు పాల్పడ్డాడు. వెంటనే వనస్థలిపురం యువకుడి బంధువులు పోలీసులకు సమాచారమిచ్చారు. హుటాహుటిన పోలీసులు ఆ యువకుడిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యప్తు జరుపుతున్నారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలపై సాయికృష్ణ నోరువిప్పడం లేదు.

*నల్గొండ: జిల్లాలోని చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో 65వ జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఐరన్ పైపుల లోడుతో వెళ్తున్న అశోక్ లేలాండ్ వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

*ఇరాన్‌లోని అబాడాన్‌ నగరంలో పదంస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన 80 మంది వరకు చిక్కుకుపోగా వారిని రక్షించేందుకు రెస్క్యూ సిబ్బంది ప్రయత్నిస్తున్నారని ఇరాన్‌ స్టేట్‌ టీవి తెలిపింది.

*నిడమనూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని కారు ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులు సమాచారం అందించారు. హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి..కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

* చిలమత్తూరు మండలంలోని కోడూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని ప్రైవేట్‌ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం చెందగా..మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

*రంగారెడ్డి: జిల్లాలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి అత్తాపూర్‌లో గల సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్‌లో గత అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిప్రమాద సిబ్బంది అక్కడకు చేరుకుని ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. షాట్ సర్క్యుట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

*భార్య కాపురానికి రాలేదని మనస్థాపానికి గురైన భర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన వనపర్తి జిల్లా అమరచింత మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. అమరచింతకు చెందిన కల్యాణ్‌సమ్రిన్‌ ప్రేమించుకున్నారు. తొమ్మిది నెలల కిందట మతాంతర వివాహం చేసుకున్నారు. హైదరాబాద్‌లో పీజీ చదువుతూఅక్కడే ఉంటున్నారు.రోజుల కిందట తన తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగోలేదని సమ్రిన్‌ భర్తకు చెప్పి అమరచింతకు వచ్చింది. తర్వాత తల్లిదండ్రుల సహకారంతో భర్త తనను వేధిస్తున్నాడని అమరచింత పోలీస్‌ స్టేషన్‌లో కేసు పెట్టింది. ఎస్‌ఐ జయన్న కల్యాణ్‌ను పిలిపించి, కేసు నమోదు చేశామని చెప్పారు. సమాచారం తెలుసుకుందామని కల్యాణ్‌ అత్తగారింట్లో ఉన్న భార్య వద్దకు సోమవారం వెళ్లగా, వారి కుటుంబ సభ్యులు గొడవ పడ్డారు. తమ అమ్మాయిని పంపించబోమని చెప్పడంతో కల్యాణ్‌ మనస్తాపానికి గురయ్యాడు. పట్టణంలోని ఒక పొలం వద్ద పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆత్మకూర్‌లోని ప్రభుత్వ ఆస్పతికి తరలించారు. ప్రమాదం ఏమీ లేదని వైద్యులు చెప్పారని కుటుంబీకులు తెలిపారు.

*గుంటూరు: జిల్లాలోని చేబ్రోలు మండలం శేకూరు చెరువు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. చెరువులో వైసీపీ అక్రమంగా మట్టి తవ్వకాలు చేపట్టింది. తవ్వకాల విషయం తెలిసిన మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర చెరువు వద్దకు వచ్చారు. దీంతో ధూళిపాళ్లను వైసీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. టీడీపీ ప్రభుత్వంలో అడ్డగోలుగా మట్టి తవ్వకాలు చేశారంటూ గగ్గోలు పెట్టారు. దీంతో వైసీపీ – టీడీపీ వర్గాల మధ్య వాగ్వివాదం, తోపులాటకు దారి తీసింది. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.

*ములుగు డీఆర్‌వో ప్రేమలత రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. విధులకు హాజరయ్యేందుకు మంగళవారం హనుమకొండ నుంచి ములుగుకు వస్తుండగా ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయింది.లుగు జిల్లా కేంద్రం పరిధిలో ప్రేమ్‌నగర్ వద్ద వడ్లలోడు ట్రాక్టర్ ఒక్కసారిగా యూ టర్న్ తీసుకోవడంతో వెనుక వస్తున్న కారు ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈసంఘటలో డీపీఆర్‌వో ఎడమ చేయి విరిగింది. ములుగు ఏరియా వైద్యశాలలో ప్రథమ చికిత్స అనంతరం ఆమెను వరంగల్ కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.