DailyDose

గురువు శవపేటిక మోసిన ఉత్తర కొరియా అధ్యక్షుడు

గురువు శవపేటిక మోసిన ఉత్తర కొరియా అధ్యక్షుడు

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్‌ ఉన్ గురువు కొరియన్‌ పీపుల్స్‌ ఆర్మీ మార్షల్‌ హ్యోన్‌ చొల్‌ హయే అనారోగ్య కారణాలతో మృతి చెందారు. దాంతో ఆయన అంత్యక్రియాల్లో అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గురువు శవపేటికను ఆయన మోశారు. అందుకు సంబంధించిన ఫోటోలు తాజాగా విడుదలయ్యాయి. కిమ్ జాంగ్‌-2 మరణం అనంతరం కిమ్ జాంగ్ ఉన్‌ను అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టడంలో కొరియన్‌ పీపుల్స్‌ ఆర్మీ మార్షల్‌ హ్యోన్‌ చొల్‌ హయే కీలక పాత్ర పోషించారు.