NRI-NRT

అమెరికా యూనివర్శిటీలో ఆనంద్ మహీంద్రాకు అరుదైన గౌరవం!

అమెరికా యూనివర్శిటీలో ఆనంద్ మహీంద్రాకు అరుదైన గౌరవం!

ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రాకు అమెరికాలో తాజాగా ఓ అరుదైన గౌరవం దక్కింది. టఫ్ట్స్ యూనివర్శిటీలోని ఫ్లెచర్‌ స్కూల్ ఆఫ్ లా అండ్ డిప్లొమసీలో జరిగిన ‘క్లాస్ డే’ వేడుకలో ప్రసంగించిన తొలి భారతీయుడిగా ఆయన రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా కళాశాల డీన్ మహీంద్రాను ‘డీన్ మెడల్‌’తో సత్కరించారు. మరో విశేషం ఏంటంటే.. 75 ఏళ్ల క్రితం ఆనంద్ మహీంద్రా తండ్రి హరీశ్.. ఫ్లెచర్ స్కూల్ నుంచే డిగ్రీ పట్టా పొందారు. ఆ విభాగంలో చదువుకున్న తొలి భారతీయ విద్యార్థిగా ఆయన రికార్డు సృష్టించారు. ఈ కార్యక్రమం తాలూకు విశేషాలను ఆనంద్ మహీంద్రా ట్విటర్ వేదికగా నెటిజన్లతో పంచుకున్నారు. తండ్రి చదువుకున్న కళాశాలలోనే తనకు ఇలాంటి అరుదైన అవకాశం దక్కడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ‘‘తండ్రి తరఫున తాను ఈ మెడల్ స్వీకరించినట్టుగా ఉంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇక టఫ్ట్స్ యూనివర్శిటీకి చెందిన ఫ్లెచర్ స్కూల్‌ ఆఫ్ లా అండ్ డిప్లొమెసీలో అంతర్జాతీయ వ్యవహారాలను బోధిస్తుంటారు. అమెరికాలోని ప్రతిష్టాత్మక కళాశాలల్లో ఇదీ ఒకటి. ఫ్లెచర్ స్కూల్‌లో అందించే గ్రాడ్యూయేట్, డాక్టోరల్ కోర్సులకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉంది.
https://twitter.com/anandmahindra/status/1529065720138670081/photo/1