NRI-NRT

టెక్సాస్‌ ఎలిమెంటరీ స్కూల్‌లో కాల్పులు

టెక్సాస్‌ ఎలిమెంటరీ స్కూల్‌లో కాల్పులు

అగ్రరాజ్యంలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. టెక్సాస్‌లో ఓ ఎలిమెంటరీ స్కూల్‌లో దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 18 మంది విద్యార్థులు, ముగ్గురు టీచర్లు మృతిచెందారు. మెక్సికన్‌ సరిహద్దులోని ఉవాల్డేలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ పాఠశాలలో మొత్తం 500 మంది విద్యార్థులు చదువుతున్నారు. మృతిచెందిన విద్యార్థుల వయస్సు 4 నుంచి 11 ఏళ్ల మధ్య ఉంటుందని టెక్సాస్‌ గవర్నర్‌ గ్రేగ్‌ అబాట్‌ తెలిపారు. అనుమానితుడు ఉవాల్డే హైస్కూల్‌లో 18 ఏళ్ల విద్యార్థి అని అబాట్ చెప్పారు. సిబ్బంది అతన్ని మట్టుబెట్టినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే చాలాకాలం తర్వాత అమెరికా గన్‌ కల్చర్‌లో ఇంత ఘోరమైన ఘటన చోటు చేసుకుంది. నిందితుడిని సాల్వడోర్‌ రామోస్‌గా గుర్తించినట్లు తెలుస్తోంది. కాల్పుల ఘటనకు ముందు.. తన బామ్మను చంపిన తర్వాతే వాహనంలో స్కూల్‌కు చేరుకుని ఘాతుకానికి పాల్పడినట్లు ఓ నిర్ధారణకు వచ్చారు.