Politics

వైసీపీ పాలనను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు – TNI రాజకీయ వార్తలు

వైసీపీ పాలనను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు   – TNI రాజకీయ వార్తలు

* వైసీపీ పాలనను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ… ప్రజలు టీడీపీ అధినేత చంద్రబాబు వైపు చూస్తున్నారని.. అది తట్టుకోలేకే అరెస్ట్లు చేస్తున్నారని మండిపడ్డారు. నియంతృత్వ పాలకులు చరిత్రలో రాణించలేదన్నారు. జగన్ అంత పిరికి ముఖ్యమంత్రిని చరిత్రలో చూడలేదని విమర్శించారు. టీడీపీ మహానాడును ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహానాడుకు ఆర్టీసీ బస్సులను ఇవ్వటం లేదని, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను కూడా అడ్డుకుంటున్నారన్నారు. మహానాడుకు నడిచి వచ్చేందుకు కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మహానాడుకు వచ్చే వారిని అడ్డుకుంటే టీడీపీ ఆందోళనలకు దిగుతుందని బుద్ధా వెంకన్న హెచ్చరించారు.

*అంబేద్కర్ దేశ రక్షకుడు.. దేశానికి ఎనలేని సేవ చేశారు: సోము వీర్రాజు
కోనసీమలో చిచ్చుని రాష్ట్ర ప్రభుత్వమే తెరలేపిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల ఇల్లు దహనం చేయడాన్ని ఖండించారు. యువత ఆగ్రహావేశాలకు లోను కావద్దన్నారు. ఇటువంటి ఉద్యమాల్లో బీజేపీ ఎటువంటి పాత్ర పోషించడం లేదన్నారు. దేశంలో అంబేద్కర్ పంచ తీర్ధాన్ని మోదీ ఏర్పాటు చేశారన్నారు. ఆయన దేశానికి ఎనలేని సేవలు చేశారని సోము వీర్రాజు పేర్కొన్నారు. అంబేద్కర్ దేశ రక్షకుడన్నారు. 125 అడుగుల విగ్రహాన్ని పెడతామని గత ప్రభుత్వం చెప్పిందని.. ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదన్నారు. ప్రభుత్వ డబ్బులతో చర్చ్‌లు కడుతున్నారన్నారు. టిప్పు సుల్తాన్ విగ్రహాలను పెడితే.. ప్రజల్లోకి ఎటువంటి సందేశాలు వెళ్తాయని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలను అవలభిస్తోందని సోము వీర్రాజు పేర్కొన్నారు.

*మోదీ వస్తున్నారనే కేసీఆర్ రాష్ట్రం విడిచిపోతున్నారు: లక్ష్మణ్ప్ర
ధాని మోదీ వస్తున్నారనే సీఎం కేసీఆర్ రాష్ట్ర విడిచిపోతున్నారని బీజేపీ నేత లక్ష్మణ్ పేర్కొన్నారు. బేగంపేట ఎయిర్పోర్టులో ఏర్పాట్లను లక్ష్మణ్ బృందం పరిశీలించింది. కేసీఆర్ నిబంధనలు పాటించకుండా నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. కేసీఆర్ చర్యలను తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. ఎయిర్ పోర్టులో పార్టీ తరఫున ప్రధానికి సన్మాన కార్యక్రమం నిర్వహిస్తామని లక్ష్మణ్ పేర్కొన్నారు. ఎయిర్ పోర్టులో ప్రధాని మోదీ ప్రసంగించే అవకాశం లేదన్నారు. ప్రధానికి సీఎం స్వాగతం పలికే ఆనవాయితీని కేసీఆర్ కాలరాశారన్నారు. రాష్ట్ర రైతులను వదిలి.. ఇతర రాష్ట్ర రైతులకు డబ్బులు ఇస్తున్నారని లక్ష్మణ్ విమర్శించారు.

*అమలాపురం అల్లర్లు ప్రభుత్వ స్పాన్సర్డ్‌ విధ్వంసం: Achennaidu
అమలాపురం అల్లర్లు ప్రభుత్వ స్పాన్సర్డ్‌ విధ్వంసమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ… సెక్షన్‌ 144 అమలులో ఉంటే అంత మంది ఎలా వచ్చారని ప్రశ్నించారు. మంత్రి, ఎమ్మెల్యే ఇంటి మీది దాడి జరిగిందంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని నిలదీశారు. మంత్రి విశ్వరూప్‌ ఇంటికి ఎందుకు భద్రత కల్పించలేకపోయారని అడిగారు. అమలాపురం ఘటన వెనుక ప్రభుత్వమే ఉందని టీడీపీ నేత ఆరోపించారు. హత్య ఘటన నుంచి దృష్టి మళ్లించేందుకే విధ్వంసమని అన్నారు. ప్రజల దృష్టి మళ్లించడం డైవర్షన్‌ సీఎంకు బాగా అలవాటని యెద్దేవా చేశారు. కోనసీమను విధ్వంసం చేయాలని జగన్‌ కంకణం కట్టుకున్నారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

*సీఎం జగన్ దావోస్ పర్యటన సూపర్ సక్సెస్: మంత్రి Satyanarana
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దావోస్ పర్యటన సూపర్ సక్సస్ అయిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ… టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు , జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ లు గత రెండు నెలల నుండి శ్రీలంక శ్రీలంక అని ప్రచారం చేస్తున్నారని తెలిపారు. శ్రీలంకలో ప్రజలు ప్రభుత్వంపై వ్యతిరేఖతతో ఉన్నారని… ఏపీలో ప్రజలు ప్రభుత్వానికి విశ్వాసంతో ఉన్నారని వెల్లడించారు. శ్రీలంకలో లాగా మారణహోమం సృష్టించాలని చంద్రబాబు, పవన్ చూస్తున్నారని మంత్రి కొట్టు సత్యనారాయణ ఆరోపించారు.

*ఏపీలో ఉన్నామా?.. పాకిస్తాన్‌లో ఉన్నామా?: GVL
కోనసీమ జిల్లాలో జరిగిన విధ్వంసంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ… మనం ఏపీలో ఉన్నామా?… పాకిస్తాన్‌లో ఉన్నామా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి అంబేద్కర్‌ మీద చిత్తశుద్ధి ఉంటే నవరత్నాలకు అంబేద్కర్‌ పేరు పెట్టొచ్చుగా అని నిలదీశారు. నిన్నటి అల్లర్లకు బాధ్యులెవరైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విధ్వంసకర చర్యలు సమర్థనీయం కాదన్నారు. అల్లర్లలో బీజేపీ కార్యకర్తలెవరూ పాల్గొనలేదని స్పష్టం చేశారు. అంబేద్కర్‌ పేరుపై వైసీపీ ప్రభుత్వం వివాదం సృష్టించిందని మండిపడ్డారు. దేశప్రజలకు సీఎం జగన్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలని ఎంపీ జీవీఎల్ డిమాండ్ చేశారు.

*అప్పుడే అంబేద్కర్‌ కోనసీమ అంటే ఇబ్బంది వచ్చేది కాదు: Pawan
కోనసీమ జిల్లాలో జరిగిన విధ్వంసంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్స్పం దించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ… గత కొన్ని రోజుల కిందట జిల్లాల విభజనను రాష్ట్ర ప్రబుత్వం చేసిందన్నారు. అన్ని జిల్లాలకు ఒక విధానం పెట్టారని… కొనసీమకు ప్రత్యేక విధానం అవలంబించారని అన్నారు. అన్ని జిల్లాలకు నామకరణం చేసిన రోజే అంబేద్కర్ కోనసీమ అని ఉంటే ఇబ్బంది వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు. జాతీయ స్థాయి నాయకుల పేర్లు పెట్టడం జనసేన వ్యతిరేకించదని స్పష్టం చేశారు. వైస్సార్ పేరుతో కడప జిల్లా.. అంతకు ముందు పొట్టి శ్రీరాములు పేరు నెల్లూరుకు పెట్టారని గుర్తుచేశారు. ఈ రోజు వైస్సార్ కడప కేవలం వైస్సార్ జిల్లాగా మార్చారన్నారు. ఏ ప్రభుత్వం అయిన పాలసీ నిర్ణయం తీసుకున్నప్పుడు అన్ని ఆలోచించాలని జనసేనాని సూచించారు.కృష్ణ జిల్లా కూడా ఎన్టీఆర్ జిల్లా అని పెట్టారని, కృష్ణా తీరం ఎక్కువగా వున్న చోట ఎన్టీఆర్ జిల్లా అన్నారని తెలిపారు. అక్కడే వంగవీటి డిమాండ్ వచ్చిందని అన్నారు. ఇలాంటి పేర్లు పెట్టేప్పుడు సున్నితంగా వ్యవహరించాలని హితవుపలికారు. కోనసీమ జిల్లాకు ఆ రోజు పేరు పెట్టకుండా ఇప్పుడు పెట్టడం ఏంటి అని ప్రశ్నించారు. అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లో చెప్పాలని కోనసీమలో అడిగారన్నారు. నిజానికి కోనసీమపై బ్రిటీష్ ప్రభావం కంటే అక్కడి వారి సంస్కృతి ప్రభావం ఎక్కువ అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

*ప్రతిపక్షాలు చెప్పినట్లు కేంద్రంపై పోరాటం చేయటం సరికాదు: విజయసాయిరెడ్డి
ప్రతిపక్షాలు చెప్పినట్లు కేంద్రంపై పోరాటం చేయటం కరెక్ట్ కాదని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే తమ పోరాటం కొనసాగిస్తామని వెల్లడించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి 4 శాతం ఓట్లు తక్కువగా ఉన్నాయన్నారు. బీజేపీ అడిగితే సీఎం జగన్‌రెడ్డి తగిన నిర్ణయం తీసుకుంటారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

*విధ్వంసం వెనుక వైసీపీ కౌన్సిలర్‌ హస్తం ఉంది : మంత్రి విశ్వరూప్
అమలాపురంలో ఆందోళనలు అత్యంత దురదృష్టకరమని మంత్రి విశ్వరూప్ పేర్కొన్నారు. విధ్వంసం వెనుక వైసీపీ కౌన్సిలర్‌ హస్తం ఉందన్నారు. అన్ని ఆధారాలూ తన దగ్గర ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజల్లోకి రౌడీషీటర్లు వచ్చారని.. విధ్వంసం సృష్టించారన్నారు. చట్టానికి అందరూ సమానమేనన్నారు. దాడులకు పాల్పడిన వారిని వదిలేది లేదన్నారు. ప్రజలు సంయమనం పాటించాలన్నారు. కావాలనే కొందరు ఆందోళనలను డైవర్ట్‌ చేశారని మంత్రి విశ్వరూప్‌ పేర్కొన్నారు.

*Jagan సర్కార్పై సోము వీర్రాజు తీవ్ర విమర్శలు
జగన్ సర్కార్పై బీజేపీ నేత సోము వీర్రాజు తీవ్ర విమర్శలు గుప్పించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వానికి మారణహోమం కావాలన్నారు. ప్రభుత్వ వైఫల్యమే కోనసీమ అల్లర్లకు కారణమని విమర్శించారు. డ్రైవర్ సుబ్రమణ్యం హత్యలో ఎమ్మెల్సీ అనంతబాబు వ్యాఖ్యలు సరికాదన్నారు. ఆనంతబాబును పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.

*Kadapa districtకు అంబేద్కర్ పేరు పెట్టాలని ఎందుకు అనిపించలేదు?: పవన్
ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కొంత వ్యతిరేకత ఉంటుందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ వ్యాఖ్యానించారు. అంత మాత్రాన ఆ వ్యక్తులు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదన్నారు. బుధవారం పవన్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు విషయంలోనూ అదే జరిగిందని గుర్తుచేశారు. ఏ విషయంపైనైనా ఏకాభిప్రాయం అవసరమని అభిప్రాయపడ్డారు. కోనసీమ జిల్లా పేరు మార్పుపై అభ్యంతరాలకు 30 రోజులు గడువు ఇచ్చారని, గడువు ఇచ్చారు కాబట్టే అక్కడ గొడవలు చెలరేగాయని తెలిపారు. గొడవలు అవుతాయని ప్రభుత్వానికి తెలుసు కాబట్టే గడువు పెట్టారని చెప్పారు. ‘‘వైసీపీ ఎమ్మెల్సీ ఘటన సమయంలోనే కోనసీమ అల్లర్లు ఎందుకు చెలరేగాయి?.. కోనసీమకే అంబేద్కర్ పేరు పెట్టాలని ఎందుకు అనిపించింది?.. కడప జిల్లా కు అంబేద్కర్ పేరు పెట్టాలని ఎందుకు అనిపించలేదు?.. కడప జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు ఎందుకు పెట్టలేదు?’’ అని పవన్ ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం ఏనాడు తప్పులను ఒప్పుకోలేదన్నారు. ఆడబిడ్డ అఘాయిత్యానికి గురై న్యాయం కావాలంటే… సాక్షాత్తు హోంమంత్రి చులకనగా మాట్లాడారని విమర్శించారు. తల్లి పెంపకంలో లోపమే అందుకు కారణమనడం ఎంతవరకు సబబు అని పవన్‌కల్యాణ్ విమర్శించారు

*అంబేద్కర్ దేశ రక్షకుడు.. దేశానికి ఎనలేని సేవ చేశారు: సోము వీర్రాజు
కోనసీమలో చిచ్చుని రాష్ట్ర ప్రభుత్వమే తెరలేపిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల ఇల్లు దహనం చేయడాన్ని ఖండించారు. యువత ఆగ్రహావేశాలకు లోను కావద్దన్నారు. ఇటువంటి ఉద్యమాల్లో బీజేపీ ఎటువంటి పాత్ర పోషించడం లేదన్నారు. దేశంలో అంబేద్కర్ పంచ తీర్ధాన్ని మోదీ ఏర్పాటు చేశారన్నారు. ఆయన దేశానికి ఎనలేని సేవలు చేశారని సోము వీర్రాజు పేర్కొన్నారు. అంబేద్కర్ దేశ రక్షకుడన్నారు. 125 అడుగుల విగ్రహాన్ని పెడతామని గత ప్రభుత్వం చెప్పిందని.. ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదన్నారు. ప్రభుత్వ డబ్బులతో చర్చ్‌లు కడుతున్నారన్నారు. టిప్పు సుల్తాన్ విగ్రహాలను పెడితే.. ప్రజల్లోకి ఎటువంటి సందేశాలు వెళ్తాయని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలను అవలభిస్తోందని సోము వీర్రాజు పేర్కొన్నారు.

*వైసీపీ పాలనను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు: Budda venkanna
వైసీపీ పాలనను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ… ప్రజలు టీడీపీ అధినేత చంద్రబాబు వైపు చూస్తున్నారని.. అది తట్టుకోలేకే అరెస్ట్లు చేస్తున్నారని మండిపడ్డారు. నియంతృత్వ పాలకులు చరిత్రలో రాణించలేదన్నారు. జగన్ అంత పిరికి ముఖ్యమంత్రిని చరిత్రలో చూడలేదని విమర్శించారు. టీడీపీ మహానాడును ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహానాడుకు ఆర్టీసీ బస్సులను ఇవ్వటం లేదని, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను కూడా అడ్డుకుంటున్నారన్నారు. మహానాడుకు నడిచి వచ్చేందుకు కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మహానాడుకు వచ్చే వారిని అడ్డుకుంటే టీడీపీ ఆందోళనలకు దిగుతుందని బుద్ధా వెంకన్న హెచ్చరించారు.

*అప్పుడే అంబేద్కర్‌ కోనసీమ అంటే ఇబ్బంది వచ్చేది కాదు: Pawan
కోనసీమ జిల్లాలో జరిగిన విధ్వంసంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ… గత కొన్ని రోజుల కిందట జిల్లాల విభజనను రాష్ట్ర ప్రబుత్వం చేసిందన్నారు. అన్ని జిల్లాలకు ఒక విధానం పెట్టారని… కొనసీమకు ప్రత్యేక విధానం అవలంబించారని అన్నారు. అన్ని జిల్లాలకు నామకరణం చేసిన రోజే అంబేద్కర్ కోనసీమ అని ఉంటే ఇబ్బంది వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు. జాతీయ స్థాయి నాయకుల పేర్లు పెట్టడం జనసేన వ్యతిరేకించదని స్పష్టం చేశారు. వైస్సార్ పేరుతో కడప జిల్లా.. అంతకు ముందు పొట్టి శ్రీరాములు పేరు నెల్లూరుకు పెట్టారని గుర్తుచేశారు. ఈ రోజు వైస్సార్ కడప కేవలం వైస్సార్ జిల్లాగా మార్చారన్నారు. ఏ ప్రభుత్వం అయిన పాలసీ నిర్ణయం తీసుకున్నప్పుడు అన్ని ఆలోచించాలని జనసేనాని సూచించారు.కృష్ణ జిల్లా కూడా ఎన్టీఆర్ జిల్లా అని పెట్టారని, కృష్ణా తీరం ఎక్కువగా వున్న చోట ఎన్టీఆర్ జిల్లా అన్నారని తెలిపారు. అక్కడే వంగవీటి డిమాండ్ వచ్చిందని అన్నారు. ఇలాంటి పేర్లు పెట్టేప్పుడు సున్నితంగా వ్యవహరించాలని హితవుపలికారు. కోనసీమ జిల్లాకు ఆ రోజు పేరు పెట్టకుండా ఇప్పుడు పెట్టడం ఏంటి అని ప్రశ్నించారు. అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లో చెప్పాలని కోనసీమలో అడిగారన్నారు. నిజానికి కోనసీమపై బ్రిటీష్ ప్రభావం కంటే అక్కడి వారి సంస్కృతి ప్రభావం ఎక్కువ అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

*సీఎం చెప్పినా ప్రజలు విశ్వసించరు: పవన్‌
‘‘రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగం వెలిగిపోతోంది… కరోనా సమయంలో 44 సార్లు ఇంటింటి సర్వేలు చేసి సేవలు చేశాం… అంటూ దావోస్‌ వేదికగా సీఎం చెప్పిన విషయాలను ప్రజలు విశ్వసించే పరిస్థితిలో లేరు. విదేశీయులకు ఏం చెప్పినా నిజాలు తెలియవు అనే ధీమాతో సీఎం జగన్‌ మాట్లాడారు’’ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. ఆయన మంగళవారం ఈమేరకు ఓప్రకటన విడుదలచేశారు

*రివర్స్‌ టెండరింగ్‌తో పోలవరం నిర్వీర్యం: ‘ఆళ్ల’
‘‘రివర్స్‌ టెండరింగ్‌తో పోలవరం సాగు నీటి ప్రాజెక్టు నిర్వీర్యమైపోయింది. ఈ నెల 10న సీఎం జగన్మోహన్‌రెడ్డి నిర్వహించిన సమీక్షలో పోలవరం ప్రాజెక్టు పనుల అంచనా వ్యయాన్ని రూ.1,548 కోట్ల నుంచి రూ.1,917 కోట్లకు పెంచినట్లుగా అధికారులు తెలిపారు. ప్రాజెక్టు అంచనాలను పెంచిన విషయాన్ని ప్రభుత్వం ఎందుకు బహిర్గతం చేయడం లేదు?’’ అని సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షుడు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు ప్రశ్నించారు. మంగళవారం ఈమేరకు ఒక ప్రకటన చేశారు.

*దోచుకున్నది దాచుకునేందుకే జగన్‌ దావో్‌సకు
‘‘రాష్ట్రంలో దోపిడీలు, దాడులతో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. సీఎం కాకముందే జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని దోచేశారు. గడిచిన మూడేళ్లలో మరింత దోచుకుని, దాచుకునేందుకు దావో్‌సకు వెళ్లారు’’ అని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఈనెల 27, 28 తేదీలలో ఒంగోలు సమీపంలోని మండవవారిపాలెంలో జరగనున్న టీడీపీ మహానాడు ఏర్పాట్లను మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతోపాటు, ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో కలిసి పరిశీలించారు. వేదిక, రక్తదాన శిబిరం, వీఐపీ గ్యాలరీ, ఫొటో ఎగ్జిబిషన్‌, భోజనశాల, పార్కింగ్‌ తదితర ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా యనమల మాట్లాడారు. ‘‘గతం కంటే భిన్నంగా ఈ ఏడాది మహానాడు నిర్వహించబోతున్నాం. పదిహేడు అంశాలపై చర్చించి తీర్మానాలు ప్రవేశపెట్టబోతున్నాం’’ అని యనమల తెలిపారు. ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలను రాబోయే 40 ఏళ్లపాటు చెప్పుకునేలా నిర్వహిస్తున్నామని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.

*ఏ ముఖం పెట్టుకుని వైసీపీ బస్సు యాత్రదళితులను చంపుతుంటే ఒక్క మంత్రీ ఖండించలేదు: టీడీపీ
‘అధికార పార్టీ ఎమ్మెల్సీ జగనన్న శవాల పంపిణీ పథకం అమలు చేస్తున్నాడు. దళితులను చంపి వారి శవాలను ఇళ్ల వద్ద పడేసి పోతుంటే రాష్ట్రంలో ఒక్క దళిత మంత్రి కూడా నోరు తెరిచి ఇదేమి ఘోరమని ప్రశ్నించలేకపోయారు. ఇక ఏ ముఖం పెట్టుకొని బస్సు యాత్ర చేస్తారు’ అని టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ ప్రశ్నించింది. దళితులపై జరుగుతున్న అమానుష ఘటనలపై గళం విప్పి ప్రశ్నించాల్సింది పోయి దళిత మంత్రులు, ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి భజనలో తరిస్తున్న తీరుతో దళితుల హృదయం రగిలిపోతోందని, వైసీపీ నేతల బస్సుయాత్రకు వారు చెప్పులతో స్వాగతం పలకడం ఖాయమని కమిటీ సభ్యులు వ్యాఖ్యానించారు. కాకినాడలో కారు డ్రైవర్‌ వీధి సుబ్రహ్మణ్యం హత్యపై పార్టీపరంగా ఏర్పాటైన నిజ నిర్ధారణ కమిటీ సభ్యులుగా ఉన్న మాజీ మంత్రి పీతల సుజాత, పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్‌ రాజు, పార్టీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు మంగళవారం ఇక్కడ తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు

*బీజేపీ శ్రేణులు పాల్గొనవు: వీర్రాజు
కోనసీమ జిల్లా పేరు మార్చాలన్న ఉద్యమంలో బీజేపీ శ్రేణులు పాల్గొనవని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. అమలాపురంలో ప్రశాంత వాతావరణం నెలకొనడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అంబేడ్కర్‌ పేరును వివాదంలోకి లాగింది వైసీపీ ప్రభుత్వమేనని, కోనసీమలో లేని వివాదాన్ని సృష్టించి ఉద్రిక్త పరిస్థితులకు కారణమైందని బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా.. అమలాపురంలో ఆందోళనకారులు మంత్రి విశ్వరూప్‌ ఇంటిపై దాడి చేయడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పేరును వివాదాస్పదం చేస్తూ హింసకు దిగడాన్ని ఖండిస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తెలిపారు.

*మాపై నేరం నెట్టే ప్రయత్నం చేస్తున్నారు: పవన్కల్యాణ్
జిల్లాల పేర్లు పెట్టేటప్పుడే అంబేడ్కర్ పేరు పెట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మంత్రి విశ్వరూప్‌ ఇంటిపై దాడి జరుగుతుంటే పోలీసులు చూస్తూ ఉంటారా? అని ప్రశ్నించారు. కులసమీకరణతో రాజకీయాలు చేస్తారా? అని ధ్వజమెత్తారు. భావోద్వేగాలు ఉంటాయని తెలిసే రెచ్చగొట్టారని ఆరోపించారు. ఈ ఘటనకు వైకాపా ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. కోనసీమ ప్రాంతానికి అంబేడ్కర్‌ పేరు పెట్టారని.. అదేదో జిల్లాలకు కొత్త పేర్లు పెట్టినప్పుడే పెడితే అంబేడ్కర్‌ పేరు పెట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని పవన్‌ అన్నారు. మిగతా జిల్లాలతో పాటు అంబేడ్కర్‌ పెడితే సహజంగా ఉండేదని అభిప్రాయపడ్డారు. అంబేడ్కర్‌ పేరు పెట్టడంలో జాప్యమెందుకో అర్థం కావట్లేదని… రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన పొట్టి శ్రీరాములును ఒక జిల్లాకే కుదించారని చెప్పారు. కృష్ణా నది తక్కువగా ఉన్నచోట కృష్ణా జిల్లా పెట్టారని.. ఎక్కువగా ఉన్నచోట ఎన్టీఆర్‌ అని పేరు పెట్టారని అన్నారు. జిల్లా పేర్లకు వ్యతిరేకమైనా.. వ్యక్తులకు వ్యతిరేకం కాదని వ్యాఖ్యానించారు. పేర్లు పెట్టేటప్పుడు ప్రభుత్వం సున్నితంగా వ్యవహరించాలని సూచించారు. అభ్యంతరాలుంటే 30 రోజులు సమయమిచ్చి కలెక్టరేట్‌కు రమ్మని చెప్పిన ప్రభుత్వం… మిగతా జిల్లాలకు సమయం ఇవ్వకుండా కోనసీమకే ఎందుకు సమయమిచ్చిందని ప్రశ్నించారు. సామూహికంగా కాదు.. వ్యక్తులుగా రావాలని చెప్పారని.. అది వ్యక్తులను టార్గెట్‌ చేయడమేనని జనసేన భావిస్తోందన్నారు. గొడవలు జరగాలనే అభ్యంతరాలకు సమయం ఇచ్చారా? అని పవన్ ప్రశ్నించారు.

*మలాపురం ఘటనలో ఎవరున్నా ఉపేక్షించం: మంత్రి విశ్వరూప్
నిన్నటి ర్యాలీలోకి సంఘ విద్రోహశక్తులు చొరబడ్డాయని మంత్రి విశ్వరూప్ అన్నారు. ఈ ఘటనలో తెదేపా, జనసేన ద్వితీయ శ్రేణి నాయకులు ఉన్నారని ఆరోపించారు. నిన్న ఆందోళనకారులు నిప్పంటించిన తన ఇంటిని మంత్రి విశ్వరూప్ పరిశీలించారు. నిన్నటి ఘటనలో దహనమైన తన ఇంటిని మంత్రి విశ్వరూప్ పరిశీలించారు. ర్యాలీకి పిలుపునిచ్చిన కోనసీమ సాధన సమితి బాధ్యత తీసుకోవాలని విశ్వరూప్‌ అన్నారు. కొంతమంది సంఘ విద్రోహశక్తులు ర్యాలీలోకి చొరబడ్డారని ఆరోపించారు. అమలాపురం ప్రజలకు ఎలాంటి తప్పుడు ఆలోచనలు లేవన్నారు. ఉద్యమం ముసుగులో కొంతమంది రౌడీషీటర్లు చొరబడ్డారని ఆరోపించారు. ముందుగా అనుకున్న ప్రకారమే తన ఇంటిపై దాడి చేశారని తెలిపారు. ఈ ఘటనలో తెదేపా, జనసేన ద్వితీయ శ్రేణి నాయకులు ఉన్నారన్నారు. అయితే ఈ ఘటనలో ఎవరున్నా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

*ద్రిక్తత కారకులెవరో ప్రజలకు తెలుసు: పవన్‌
కోనసీమ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులకు బీజం వేసింది ఎవరో ఆ జిల్లా వాసులకే కాదు.. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ప్రజలంతా సంయమనం పాటించాలని, శాంతియుత పరిస్థితులు నెలకొనేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపిచ్చారు. అంబేడ్కర్‌ పేరును వివాదాల్లోకి తెచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న హోం మంత్రి జనసేన పేరు ప్రస్తావించడాన్ని ఖండించారు. ప్రభుత్వ వైఫల్యాలను జనసేనపై రుద్దవద్దన్నారు.

*ఆ ఘటనల వెనుక ఏవో శక్తులు: సజ్జల
అమలాపురం ఘటనల వెనుక ఏవో శక్తులున్నాయని ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. మంగళవారం వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాల విభజన సందర్భంగా కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెట్టాలని వినతులు వచ్చాయని, విస్తృతంగా డిమాండ్‌ ఉన్నందునే ఆలోచించి నిర్ణయం తీసుకున్నామని, గతంలో అన్ని పార్టీలూ ఒప్పుకొన్నాయని తెలిపారు. మహానేత పేరు పెడితే పునరాలోచన చేయాల్సింది ఏముందని ప్రశ్నించారు.

*అమలాపురం ఘటన కుల దురంహకారానికి నిదర్శనం
అమలాపురం ఘటన కుల దురంహకారానికి నిదర్శనమని కాంగ్రెస్ నేత sailajanath అన్నారు. కొత్త జిల్లా ల పేర్ల గజెట్‌లో చేర్చకుండా ఇప్పుడు మార్చడం వెనుక జగన్ రెడ్డి రాజకీయకుట్ర చేస్తున్నారని ఆరోపించారు. చాలా కాలం నుండి కొనసీమకు డా.బి.అంబేద్కర్, కర్నూల్‌కి దామోదరం సంజీవయ్య పెరుపెట్టాలని డిమాండ్ చేశారు. శాంతి భద్రతలను పరిరక్షించడంలో జగన్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందన్నారు. భారత రాజ్యాంగ నిర్మాతకు ఘోర అవమానం జరిగిందన్నారు. జేఏసీల ముసుగులో దాడులకు పాల్పడ్డ వారిపై తక్షణమే అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వివాదాలకు కేంద్ర బిందువుగా కొనసీమని మార్చడం దురదృష్టకరమన్నారు.

*అమలాపురం ఆందోళనలో బీజేపీ శ్రేణులు పాల్గొనరు: సోము వీర్రాజు
అమలాపురం ఘటనను ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఖండించారు. కొనసీమ జిల్లాకు అంబేద్కర్‌ పేరు పెట్టడంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైందన్నారు. అమలాపురం ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. అమలాపురం ఘటన నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని ఎద్దేవా చేశారు.

*ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే
ప్రశాంతంగా ఉండే కోనసీమ ప్రాంతంలో ఘర్షణలు దురదృష్టకరమని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. హోం శాఖ మంత్రి తానేటి వనిత టీడీపీపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, ప్రభుత్వ వైఫల్యాన్ని టీడీపీపై నెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. ఇది ముమ్మాటికీ పోలీసులు, ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. కోనసీమలో ప్రశాంతత నెలకొనేందుకు ప్రజలంతా సహకరించాలని కోరారు.

*ఉద్దేశపూర్వకంగానే అల్లర్లు: Home minister తానేటి వనిత
భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ పేరును ఒక జిల్లాకు నామకరణం చేయడాన్ని వ్యతిరేకించడం బాధాకరమని హోం శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కోనసీమ జిల్లాను అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చాలని స్థానిక ప్రజలు, అన్ని వర్గాలు, పార్టీలు డిమాండ్ చేయడంతోనే మార్చామని చెప్పారు. కొందరు ఉద్దేశపూర్వకంగానే గొడవలు, అల్లర్లు సృష్టించారని, వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసులపై జరిగిన దాడిని ఖండిస్తున్నామన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై చర్యలు తప్పమని హెచ్చరించారు.

*ప్రజలంతా సంయమనం పాటించాలి: Pavan Kalyan
అమలాపురంలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని ప్రజాస్వామ్యవాదులంతా ముక్త కంఠంతో ఖండించాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కోరారు. ప్రజలంతా సంయమనం పాటించాలని, శాంతియుత పరిస్థితులు నెలకొనేందుకు అందరూ సహకరించాలని కోరారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ పేరును వివాదాలకు కేంద్ర బిందువుగా మార్చడం దురదృష్టకరమన్నారు. అమలాపురంలో శాంతిభద్రతలను పరిరక్షించడంలో పాలక వర్గం విఫలమైందని ఆరోపించారు. పాలనపరమైన లోపాలను కప్పి పుచ్చుకోవడానికి లేని సమస్యలు సృష్టిస్తున్నారని విమర్శించారు. ఉద్రిక్త పరిస్థితులకు బీజం వేసింది ఎవరనేది జిల్లావాసులకే కాదు.. రాష్ట్రానికంతా తెలుసునని అన్నారు. బాధ్యత గల పదవిలో ఉన్న హోమ్ శాఖ మంత్రి జనసేన పేరు ప్రస్తావించడాన్ని ఖండిస్తున్నానని చెప్పారు.

*తెలంగాణ ప్రజల ఆశలు అడియాశలయ్యాయి: etela rajender
రాష్ట్రం వస్తే నీళ్లు, నిధులు నియామకాలు వస్తాయనుకున్నామని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ ప్రజలు ఆశలు అడియాశలయ్యాయన్నారు. కుల్వకుంట్ల కుటుంబం అభివృద్ధే తప్ప ప్రజలు బాగుపలేదన్నారు. అభివృద్ధి జరగలేదనడానికి తుర్కపల్లి మండలమే నిదర్శనమని ఆయన చెప్పారు. రైతులు వరి వేయద్దని హుకుం జారీ చేసిన ఏకైక సీఎం కేసీఆరే అన్నారు. తరుగు పేరుతో రైతులను ఆగం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. దేశంలో ఎక్కువ మద్యం అమ్మకాలు జరిగేది రాష్ట్రంలోనేనని చెప్పారు. ఇక్కడి రైతులను గాలికొదిలేసి పంజాబ్‌ రైతులకు సాయం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రైతుల చావులు కేసీఆర్‌కు కనిపిస్తేలేవా? అని ప్రశ్నించారు. తెలంగాణలో కాషాయ జెండా ఎగరడం ఖాయమన్నారు.