NRI-NRT

లండ‌న్ ఎగ్జిబిష‌న్‌లో ప్ర‌ద‌ర్శించ‌నున్న‌ ప్రిన్సెస్‌ డ‌యానా పెండ్లి కిరీటం

Auto Draft

యువ‌రాణి డ‌యానా పెండ్లి సంద‌ర్భంగా ధరించిన కిరీటాన్ని లండ‌న్‌లో సోత్‌బే నిర్వ‌హిస్తున్న ప్ర‌త్య‌క క్రౌన్ ఎగ్జిబిష‌న్‌లో ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. 1981లో ప్రిన్సెస్ డ‌యానా ప్రిన్స్ చార్లెస్‌తో జ‌రిగిన పెండ్లి వేడుక‌లో ధ‌రించిన క్రౌన్‌ను ఈ ఎక్స్‌పోలో ప్ర‌ద‌ర్శిస్తారు. క్వీన్ ఎలిజ‌బెత్ ప్లాటినం జుబ్లీ వేడుక‌ల సంద‌ర్భంగా ఈ ప్ర‌త్యేక భారీ క్రౌన్ ఎగ్జిబిష‌న్‌ను నిర్వ‌హిస్తున్నారు. మే 28 నుంచి జూన్ 15 వ‌ర‌కూ ఈ ప్ర‌ద‌ర్శ‌న జ‌రుగుతుంది.ఈ ఎగ్జిబిష‌న్‌లో అద్భుతంగా రూపొందిన 50 ర‌కాల క్రౌన్‌ల‌ను ప్ర‌ద‌ర్శిస్తారు. వీటిలో కొన్ని పీస్‌ల‌ను తొలిసారిగా ప్ర‌జ‌ల ముందుంచుతున్నారు. ప్రిన్సెస్ డ‌యానా ఈ ప్రత్యేక క్రౌన్‌ను 1982 నుంచి 1992 మ‌ధ్య ఏడు సార్లు ధ‌రించారు. రాయ‌ల్ టూర్స్‌, ఇత‌ర హైప్రొఫైల్ ఈవెంట్స్‌లో ఆమె ఈ న‌గను ధ‌రించారు. ప్రసిద్ధ గార్లాండ్ స్టైల్ డిజైన్‌లో వజ్రాలతో కూడిన సెంట్రల్ హార్ట్ షేప్‌లో త‌యారుచేయ‌బ‌డిన ఈ క్రౌన్ ఆక‌ట్టుకుంటుంది.వెండి , బంగారంతో అమర్చబడిన నక్షత్రంతో ట్రంపెట్ ఆకారపు పువ్వులతో ఈ క్రౌన్ ప్ర‌త్యేకంగా డిజైన్ చేయ‌బ‌డింది. ఈ ఆభ‌ర‌ణం లేడీ డ‌యానా ఆమె అమ్మ‌మ్మ సింథియ హామిల్ట‌న్‌కు సెంటిమెంట‌ల్ క్రౌన్‌గా మారిందని చెబుతారు. లేడీ హామిల్ట‌న్‌కు 1919లో వివాహం సంద‌ర్భంగా ఈ క్రౌన్ బ‌హుమ‌తిగా అందింద‌ని సౌత్‌బే ఇన్‌స్టాగ్రాం పోస్ట్‌లో పేర్కొంది