NRI-NRT

యూకేలో తెలుగు మహిళ అరుదైన ఘనత

యూకేలో తెలుగు మహిళ అరుదైన ఘనత

యూకేలోని కెంట్‌ ప్రాంతంలో నివసించే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హిమవల్లి చలికొండ అరుదైన అవార్డును అందుకున్నారు. ఐఐడబ్ల్యూయషీ ఇన్‌స్పెయిర్‌ అవార్డ్స్‌ 2022లో ప్రతిష్టాత్మకమైన ఇన్‌స్పెయిరింగ్‌ ఇండియన్‌ ఉమెన్‌ గ్లోబల్‌ అవార్డును కమ్యూనిటీ స్పిరిట్‌ విభాగంలో ఈ నెల 23న యూకేలోని హౌస్‌ ఆఫ్‌ పార్లమెంట్‌లో హిమవల్లి అందుకున్నారు.ఈ అవార్డు కోసం ప్రపంచవ్యాప్తంగా 25 దేశాల నుంచి వివిధ రంగాల నుంచి 150 నామినేషన్లు రాగా ప్రతిభ ఆధారితంగా హిమవల్లికి దక్కింది. పలు సంవత్సరాల నుంచి అభ్యర్థ్ధులు చేస్తున్న నిర్విరామ కృషి ఆధారంగా ఈ అవార్డును అందిస్తారు.చివరి రౌండ్‌లో ఆమె మూడో స్థానంలో నిలిచి ఈ అవార్డును కైవసం చేసుకున్నారు. హిమవల్లి మాట్లాడుతూ 2006 నుంచి తెలుగువారి కోసం సోషల్‌ మీడియా ద్వారా ఓ కమ్యూనిటీని స్థాపించి భారత్‌ నుంచి యూకే వచ్చే వారికోసం అన్ని విధాలుగా తోడ్పాటునందిస్తున్నట్లు తెలిపారు.ఇప్పటి వరకు ఈ కమ్యూనిటీలో 9 వేల మంది సభ్యులున్నట్లు చెప్పారు. పేద విద్యార్థులకు ఆర్థికంగా చేయూత, ఇండియాలో వరదలు సంభవించినపుడు పేదల ఆర్థిక అండకు, ఒంటరి మహిళల సహాయార్థం గ్రూపును ఏర్పాటు చేíసినట్లు తెలిపారు.