DailyDose

కోడికొండలో వైకాపా, తెదేపా వర్గీయుల ఘర్షణ – TNI నేర వార్తలు

కోడికొండలో వైకాపా, తెదేపా వర్గీయుల ఘర్షణ  – TNI  నేర వార్తలు

*చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కొత్తఇండ్లు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున సుబ్రమణ్యం (71) అనే రైతు పొలానికి వెళ్లగా.. అదే సమయంలో అటు వైపుగా వస్తున్న ఏనుగుల గుంపు అతన్ని తొక్కి చంపేశాయి. గత వారం రోజులుగా ఇదే ప్రాంతంలో ఏనుగులు సంచరిస్తున్నా అటవీశాఖ అధికారులు చొరవ చూపడం లేదని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పరిణామాలు ఇంతకు ముందు అనేక సార్లు జరిగాయని.. అయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తిన విధంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. కలెక్టర్ వచ్చేంతవరకు తమ ధర్నా కొనసాగుతుందని రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.

*బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం మేదరమెట్ల జాతీయ రహదారిపై ప్రమాదం చోటుచేసుకుంది. ఒంగోలు నుంచి విజయవాడ వైపు నిమ్మకాయల లోడుతో వెళ్తున్న లారీని కోళ్లలోడుతో వెళ్తున్న మరో లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. మృతులు రాజా(30), శివ(26)లను ఎన్టీఆర్ జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

*శ్రీ సత్య సాయి జిల్లా చిలమత్తూరు మండలం కోడికొండలో వైకాపా, తెదేపా వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తింది. పాత కక్షల నేపథ్యంలో తెలుగుదేశం మాజీ సర్పంచ్ బాలాజీ ఇంటిపైకి వైకాపా వర్గీయులు రాళ్లు రువ్వారు. అడ్డొచ్చిన తెదేపా శ్రేణులను.. కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. క్షతగాత్రులను చిలమత్తూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

*కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో విషాదం చోటు చేసుకుంది. సిలిండర్‌ పేలి తల్లీ కుమారుడు మృతి చెందగా..మరో ఐదుగురికి గాయాలయ్యాయి. మృతులు నాగశేషు, మద్దక్కగా గుర్తించారు.

*కర్నూలు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన తనిఖ్లీలో పట్టుబడ్డ నాటుసారా, కర్ణాటక అక్రమ మద్యం సీసాలను పోలీసులు రోడ్డు రోలర్తో తొక్కించి ధ్వంసం చేయించారు. అదోని డీఎస్పీ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో పట్టణ శివారులోని సిరుగుప్ప చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. వివిధ ప్రాంతాల్లో చేపట్టిన మొత్తం 410 కేసులో పట్టుబడిన 11 వేల 300 లీటర్ల నాటు సారా, మద్యంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి అన్నింటిని రోడ్ రోలర్తో ధ్వంసం చేయించారు. ధ్వంసం చేసిన మద్యం విలువ రూ. కోటి 20 లక్షల వరకు ఉంటుందని డీఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు.

*పల్నాడు జిల్లా వినుకొండ మండలం నాగులవరం గ్రామంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. తెల్లవారుజామున ద్విచక్ర వాహనాలపై వచ్చిన దుండగులు గజ్జల యోగి రెడ్డి అనే వ్యక్తికి చెందిన ఇంటి తలుపులు పగలగొట్టారు. బీరువాను పొలాల్లోకి తీసుకెళ్లి.. పగలగొట్టి రూ.35 లక్షలు విలువైన బంగారు నగలు, రూ.2 లక్షలు దోచుకెళ్లారు. శబ్దాలు విని గ్రామస్తులు వెంట పడటంతో బైకులు వదిలేసి నగలతో పరారు ఆయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దుండగులు వదిలేసి వెళ్లిన బైకులను స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

* శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం కోడూరుతోపు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై ఆగి ఉన్న లారీని ఓ ప్రైవేటు బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. బస్సులోని మరో 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం… హిందూపురం, కర్ణాటక బాగేపల్లిలోని ఆస్పత్రులకు తరలించారు. ప్రైవేటు బస్సు అతివేగమే ప్రమాదానికి కారణమని… పోలీసులు భావిస్తున్నారు. బస్సు హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

*ఒడిశాలో ర రోడ్డు ప్రమాదం టుచేసుకుంది. గంజామ్-కంధమల్ సరిహద్దుల్లో టూరిస్టు బస్సు అదుపు తప్పి బోల్తా పడటంతో పశ్చిమబెంగాల్‌ కు చెందిన ఆరుగురు టూరిస్టులు దుర్మరణం చెందగా, 40 మంది వరకూ గాయపడ్డారు. మృతులలో నలుగురు మహిళలు ఉన్నారు. మంగళవారంరాత్రి ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు బుధవారం ఉదయం తెలిపారు. 77 మంది బస్సులో ప్రయాణిస్తున్నారని, వీరిలో 65 మంది పశ్చిమ బెంగాల్‌లోని హౌరా, హుగ్లీ జిల్లాలకు చెందిన వారేననని చెబుతున్నారు. కంధమల్ జిల్లాలోని దరింగిబండి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని గంజాం ఎస్‌పీ బ్రిజేష్ రాయ్ తెలిపారు. టూరిస్టు బస్సు ప్రమాదంలో మృతులను సుప్రియ డెన్రె (33), సంజీత్ పాత్ర (33), రిమా డెన్రె (22), మౌసుమి డెన్రె, బర్నాలి మన్నా (34), స్వపన్ గుషయిత్ (44)గా గుర్తించారు.

*ఎచ్చెర్లలో జాతీయరహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయరహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. నలుగురు గాయపడ్డారు. మృతులను పశ్చిమబెంగాల్ వాసులుగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

*కృష్ణా జిల్లా మచిలీపట్నం రూరల్ పెదపట్నం పరిధిలో విషాదం చోటు చేసుకుంది. భార్యాభర్తలకు విద్యుత్ షాక్ తగలడంతో భర్త అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చెరువుల యజమాని కరెంటు తీగలను రోడ్డుకు అడ్డంగా వేయడం వలన ఉదయం కురిసిన వర్షానికి తడిసి షాక్ కొట్టినట్లుగా తెలుస్తోంది. కాగా… విషయం బయటకు పొక్కకుండా కొందరు పావులు కదుపుతున్నట్లు సమాచారం.

*బ్రెజిల్ రాజధాని రియో డీజనీరోలో పై పోలీసులు ఉక్కుపాదం మోపారు. రాజధాని శివార్లలోని విలా కృజెరియోలో డ్రగ్స్ మాఫియా ముఠా సమావేశమవుతుందనే సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులను చూడగానే ముఠా సభ్యులు కాల్పులకు దిగారు. పోలీసుల ఎదురుకాల్పుల్లో 21 మంది హతమయ్యారు. గాయపడ్డ ఏడుగురిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఓ పోలీస్ కూడా ఉన్నారు. ఘటనాస్థలం నుంచి రైఫిళ్లు, పిస్టళ్లు, కార్లు, బైకులు స్వాధీనం చేసుకున్నారు.

*తమిళనాడు రామేశ్వరంలో దారుణం జరిగింది. ఓ 45 ఏళ్ల మహిళపై ఒడిశాకు చెందిన ఆరుగురు వలస కార్మికులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఆపై ఆమెను చంపి, మృతదేహాన్ని తగలబెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

*ఉత్తర ప్రదేశ్‌లోని భంగేల్ నివాసి అభయ్ త్యాగి హంతకులను పట్టుకోవడంలో పోలీసులకు ఓ మద్యపాన ప్రియుడు ఇచ్చిన సమాచారం చాలా ఉపయోగపడింది. దాడి జరిగినపుడు హంతకులు వచ్చిన బైక్ రంగును, రిజిస్ట్రేషన్ నంబరులో కొంత భాగాన్ని మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి పాక్షికంగా గుర్తుంచుకుని, పోలీసులకు చెప్పడంతో హంతకులను పట్టుకోగలిగారు.

*ఎచ్చెర్లలో జాతీయరహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయరహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. నలుగురు గాయపడ్డారు. మృతులను పశ్చిమబెంగాల్ వాసులుగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

*బయ్యారం పోలీస్ స్టేషన్‌లో దారుణం జరిగింది. దొంగతనం విచారణ కేసులో నిందితుడు మూల కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం చేశాడు. వారం రోజుల్లో రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేశాడు. మొదటిసారి పోలీస్ స్టేషన్‌లోని శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. దాంతో ఆయన్ను మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందించారు. కొద్దిసేపటి క్రితం రెండో సారి గాజుముక్కలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. అయితే పోలీసులు మూల కృష్ణారెడ్డిని రహస్యంగా ఆసుపత్రికి తరలించారు. మరోవైపు పోలీసుల వేధింపులే కారణమని బంధువులు ఆరోపించారు.

*యాదాద్రి భువనగిరి: జిల్లాలోని నారాయణపురం మండలం పుట్టపాక గ్రామ శివారులో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ క్వాలిస్ డీకొనడంతో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

*ఎన్నో ఆశలతో సాగు చేసిన పంటలు చేతికి రాకపోవడంతో అప్పులు తీర్చే మార్గం కనిపించక ముగ్గురు అన్నదాతలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలం ఇంచెంచెరువుపల్లి గ్రామానికి చెందిన బానోతు హరి (50) ఆదివారం అర్ధరాత్రి పురుగుల మందు తాగాడు. వరంగల్‌ ఎంజీఎంలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. వరంగల్‌ జిల్లా నల్లబెల్లి మండలం మూడు చెక్కలపల్లికి చెందిన భూక్య రాజు (47)లో సోమవారం రాత్రి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం ఘన్ముక్ల గ్రామానికి చెందిన రైతు జునుమాల కొంరయ్య (45) మంగళవారం పురుగుల మందు తాగి చనిపోయాడు.

*రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట టన్నెల్‌లో సొరంగం పైకప్పు కూలి జార్ఖండ్‌కు చెందిన కార్మికుడు యోగేందర్‌(24) మృతి చెందాడు. మరో ఇద్దరు ఉమే్‌షరాథోడ్‌, అనెల్‌ చోప్నాకు తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం కార్మికులు పనిచేస్తుండగా సొరంగం పైకప్పు నుంచి బండ పడటంతో యోగేందర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అధికారులను ఆదేశించారు.

*ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడిపై.. యువతి బంధువులు దాడిచేసిన ఘటన ఏలూరు జిల్లాలో జరిగింది. పోలీసుల కథనం మేరకు దెందులూరు మండలం చల్ల చింతలపూడికి చెందిన పజ్జూరి సాంబశివరావు అదే గ్రామానికి చెందిన పావనిని ఐదునెలల క్రితం ప్రేమవివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి నూతన దంపతులు భీమడోలు జంక్షన్‌లో ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు. ఇదే సమయంలో పావని తండ్రి వేమన సుధాకర్‌, అతని కుమారుడు ఫణికుమార్‌.. సాంబశివరావుపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు.

*ఎన్నో ఆశలతో సాగు చేసిన పంటలు చేతికి రాకపోవడంతో అప్పులు తీర్చే మార్గం కనిపించక ముగ్గురు అన్నదాతలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలం ఇంచెంచెరువుపల్లి గ్రామానికి చెందిన బానోతు హరి (50) ఆదివారం అర్ధరాత్రి పురుగుల మందు తాగాడు. వరంగల్‌ ఎంజీఎంలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. వరంగల్‌ జిల్లా నల్లబెల్లి మండలం మూడు చెక్కలపల్లికి చెందిన భూక్య రాజు (47)లో సోమవారం రాత్రి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం ఘన్ముక్ల గ్రామానికి చెందిన రైతు జునుమాల కొంరయ్య (45) మంగళవారం పురుగుల మందు తాగి చనిపోయాడు.

*రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట టన్నెల్‌లో సొరంగం పైకప్పు కూలి జార్ఖండ్‌కు చెందిన కార్మికుడు యోగేందర్‌(24) మృతి చెందాడు. మరో ఇద్దరు ఉమే్‌షరాథోడ్‌, అనెల్‌ చోప్నాకు తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం కార్మికులు పనిచేస్తుండగా సొరంగం పైకప్పు నుంచి బండ పడటంతో యోగేందర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అధికారులను ఆదేశించారు.

*నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం మద్దూరు వలంటీర్ కిరణ్ ప్రేమ పెళ్లి చేసుకుని అనంతరం ఆమెను కాదని మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. తనను మోసం చేసి వలంటీర్ కిరణ్ మరో పెళ్లి చేసుకునేందుకు సిద్దమయ్యాడని బాధితురాలు వేద మాణిక్యాలు ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

*రేగిడి మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. అగ్రికల్చర్ అసిస్టెంట్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సచివాలయంలో ఉరేసుకొని అగ్రికల్చర్ అసిస్టెంట్ హరి ప్రసాద్ మృతి చెందారు. హరి ప్రసాద్ మృతిపై తోటి సిబ్బంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సచివాలయం వద్దకు స్థానికులు పెద్ద ఎత్తున చేరుకున్నారు.

*చిత్తూరు జిల్లాలోని పలమనేరు మండలం పెంగరగుంట పంచాయతీ ఇంద్రానగర్ ఏనుగులు బీభత్సం సృష్టించాయి. గ్రామసమీపాన పంట పొలాల వద్ద నివాసముంటున్న ఇంటిపై బుధవారం తెల్లవారుజామున ఏనుగుల గుంపు దాడికి పాల్పడింది. పొలము వద్ద నిద్రిస్తున్న యానాది సుబ్రమణి అనే రైతుపై ఏనుగుల దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన సుబ్రమణి అక్కడికక్కడే మృతి చెందాడు. ఏనుగుల బీభత్సంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

*విశాఖలోని నాతయ్యపాలెంకు చెందిన ఆదినారాయణ అలియాస్ అశోక్(30) అనే వ్యక్తి పదో తరగతి వరకు చదివాడు. ఆటోనగర్లో వెల్డింగ్ పనులు చేస్తుంటాడు. అయితే అతని తల్లి చీటీల వ్యాపారం చేసి ఆర్థికంగా నష్టపోయింది. ఆ నష్టాన్ని పూడ్చుకోవాలనే ఉద్దేశంతో సులభంగా డబ్బులు సంపాదించాలనుకున్నాడు. యూట్యూబ్లో చూసి గొలుసు దొంగతనాలు ఎలా చేయాలో నేర్చుకున్నాడు. ఆన్లైన్లో కత్తి, తుపాకీ నమూనాలో ఉన్న సిగరెట్ లైటర్ను కొనుగోలు చేశాడు. అలా రెండుసార్లు దొంగతనాలు చేశాడు. గొలుసు దొంగతనానికి వెళ్లే సమయంలో తన వాహనాన్ని దూరంగా ఉంచి, అందరితో పాటు నడుస్తున్నట్లుగా నటిస్తూ, ఎవరూ లేని ప్రాంతానికి వచ్చిన తర్వాత ముందు వెళ్తున్న మహిళను బెదిరించి మెడలోని గొలుసు లాక్కెళ్తాడు.