Devotional

హనుమాన్ జయంతి విశిష్టత.. అంజనాదేవికి శాపం ఏంటి..?

హనుమాన్ జయంతి విశిష్టత.. అంజనాదేవికి శాపం ఏంటి..?

‘బుద్ది మతాం వరిష్టమ్’ జ్ఞాన నిష్ఠ అర్ధగంభీర్య భాషా ప్రవాహము, అమిత రామ భక్తీ ,కార్యనిపుణత కలిగినవాడు హనుమంతుడు. హనుమంతుడు సీత జాడ తెలుసుకుని వచ్చినప్పుడు శ్రీ రాముడు అంటాడు హనుమా నీ అగణిత ఉపకారములు నాపై ఉన్నాయి, అందులకు నా యొక్క ప్రాణమును తీసి ఇచ్చినను తక్కువే అవుతుంది నీ ప్రేమ నాకై పంచ ప్రాణముల కన్నా కుడా ఎక్కువే , ఇందుకు నేను నీకు కేవలం ఆలింగనము ” ఏకైకస్యోపకారస్య ప్రాణాన్ దాస్వామి తే కాపే” నీ లాగ ఎవ్వరు చేయలేరు అని ఆలింగనం చేసునున్నాడు రాముడు. స్వామి భక్తి , గురుభక్తి ,స్నేహశీలి, నమ్మినబంటు, అంతర్భాహ్య శత్రువులను జయించినవాడు ఇలా ఎన్నింటిలోనో హనుమంతుడు ఘనుడు. అందుకే మనం హనుమంతుని జయంతిని జరుపుకుంటాం.

హనుమంతుడి పుట్టుక ఎలా జరిగింది..?
ఈ జగమందు సప్త చిరంజీవులలో హనుమంతుడు ఒకరు. శ్రీరామ భక్త హనుమంతుని యొక్క జన్మ రహస్యం భక్తులెందరో హనుమంతుణ్ణి ఆదర్శనీయ దైవంగా ఆరాధిస్తారు. అతన్ని మహాబలుడు, బుద్ధిశాలి, కపిశ్రేష్టుడు, సర్వశాస్త్ర పారంగతుడు, స్వామిభక్తి పరాయణుడు, రామదూత అంటూ ఎన్నోవిధాలుగా ప్రస్తుతిస్తారు. తల్లి అంజనాదేవి కనుక వీరిని ఆంజనేయుడంటారు. అతని తండ్రి ఎవరనే విషయంలో శివ మహాపురాణం, రామాయణం, పరాశర సంహిత మొదలైన గ్రంథాల్లోని వైవిధ్య గాథలతో అతడి దివ్య జననం ముడివడి ఉంది. శ్రీ హనుమంతుని యొక్క జన్మ రహస్యం అతని తల్లి అంజన కథతో సంబంధం కలిగి ఉన్నది. హనుమంతుడు అంజన అనే ఆడకోతి మరియు కేసరి అనే పురుషకోతి యొక్క కుమారునిగా జన్మించాడు.

అంజనకు కలిగిన శాపం ఏమిటి..?
గతంలో అంజన బ్రహ్మ న్యాయస్థానంలో ఒక అప్సరసలా ఉండేది. ఆమె బాల్యంలో ఒక ముని తపోభంగం కలిగించినందుకు శపించబడింది. ఆమె బాల్యంలో కాళ్ళు ముడుచుకుని ధ్యానం చేసుకుంటున్న కోతిని చూసి ఆశ్చర్యంతో ఉత్సాహభరితంగా చిన్నపిల్ల అయిన అంజన కోతిపైన పండ్లు విసిరింది. హఠాత్తుగా ధ్యానానికి భంగం కలిగిన కోతి రూపంలో ఉన్న ముని నిజరూపం పొంది కోపంతో అంజనను ఆమె ఎవరితోనైన ప్రేమలో పడిన్నప్పుడు కోతిగా మారమని శాపం ఇచ్చాడు. అంజన చేసిన తప్పు తెలుసుకుని ఆ మునిని క్షమాభిక్ష పెట్టమని వేడుకొంది.అప్పుడా ముని శాంతపడి ఆమె కోతి రూపంలో ఉన్నా ఆమెను ఎవరైతే ఇష్టపడతారో మరియు శివుని అవతారమైన శిశువుకు ఆమె జన్మ ఇచ్చినప్పుడు ఆమె శాపం నుండి విముక్తి పొందుతుందని వరమిచ్చాడు.

అంజనకు శాప విమోచన అందు వలన శాప విమోచనానికి అంజన భూమి పైన జన్మించింది. అడవిలో నివాసం ఏర్పరచుకున్న అంజన ఒక రోజు ఒక పురుషుడిని చూసింది మరియు ఆమె అతనితో ప్రేమలో పడింది. ఆమె ప్రేమలో పడిన క్షణం నుండి వెంటనే ఆమె కోతి రూపంలోకి మారింది. ఆ మనిషి అంజన వద్దకు వచ్చి తన నామధేయం ‘కేసరి’ అని కోతులకు రాజును అని తనను తాను పరిచయం చేసుకున్నాడు. అంజన కోతి ముఖం కలిగి ఉన్నా అతనిని చూసి ఆశ్చర్యపోయింది.తన ఇష్టానుసారంగా కోతి మరియు మానవ రూపాలను మార్చుకోగలిగిన శక్తి గల అతనిని చూసి ఆశ్చర్యపడింది. అతను తనను వివాహమాడమని అంజనను కోరాడు. అంజన మరియు కేసరి ఆ అడవిలోనే వివాహం చేసుకున్నారు. అంజన శివుడికి పూజలు జరిపి తపస్సు చేసింది. సంతోషించిన శివుడు ఆమెను కోరిక కోరుకోమన్నాడు. అంజన ముని శాప విమోచనం కోసం శివుడిని తన కుమారుడిగా జన్మించమని కోరుకున్నది. శివుడు ఆమె అభ్యర్థనను ఆమోదించాడు.

హనమంతుడి జన్మం దశరధ మహారాజు అయోధ్య రాజు సంతానం కోసం పుత్రకామేష్టి యజ్ఞం నిర్వర్తిస్తున్నాడు. తృప్తి చెందిన అగ్నిదేవుడు రాజుకు పవిత్రమైన పాయసం ఇచ్చాడు. దైవాంశ సంభూతులైన సంతానం కోసం ఆ పాయసాన్ని అతని భార్యలకు పంచిపెట్టమని చెప్పాడు. రాజు అతని పెద్ద భార్య అయిన కౌసల్యకు ఒక భాగం ఇచ్చాడు. ఆ పవిత్ర పాయస భాగాన్ని ఒక గాలిపటం దూరంగా తీసుకెళ్ళింది. ఆ గాలిపటం ఆ పాయసభాగాన్ని( తీపి ఆహారము ) అంజన తపస్య స్థలంలో పడవేసింది. మహాదేవుడు అంజనా చేతుల్లో ఆ పాయసాన్ని ఉంచమని వాయు, గాలి దేవుడిని ఆజ్ఞాపించాడు. పాయసాన్ని చూసిన అంజన అది శివుని దీవేనలుగా భావించి సంతోషంగా ఆమె దానిని త్రాగింది.ఆ మహిమాన్వితమైన పాయసం సేవించడం ద్వారా అంజన కోతి ముఖంగల శివుని అవతారమైన శిశువుకి జన్మ ఇచ్చింది. బాలుడు అంజనాదేవికి జన్మించటం వలన ఆంజనేయుడని, కేసరినందనుడని, వాయుపుత్ర లేదా పవన పుత్ర అంటే వాయువు యొక్క కుమారుడని వివిధ పేర్లతో ప్రసిద్ధి చెందాడు.

హనుమంతుడి బాల్యం
తన బాల్యదశలో కూడా హనుమంతుడు చాలా శక్తివంతమైనవాడు. అతను తన తండ్రి అయిన కేసరి, తల్లి అప్సర అంజన యొక్క శక్తి, వాయువేగం గలవాడు. హనుమాన్ జననం వలన అంజన శాపవిమోచనం పొంది తిరిగి స్వర్గం తిరిగివెళ్ళింది.శ్రీరామ భక్తుడు హనుమంతుడు అమితమైన రామ భక్తీ కలవాడు. శంకరుని శివాలయంలో నంది లేకుండా ఎట్లుఉండదో అట్లే శ్రీ రామ మందిరం హనుమంతుని విగ్రహం లేకుండా ఉండదు. భక్తుడు లేకుండా భగవంతుడు అపూర్ణుడన్న భావం ఈ విషయంలో మనకు వ్యక్తమౌతుంది. హనుమంతుడు బల, బుద్ధి సంపన్నుడు. మానసిక శాస్త్రం, రాజనీతి, సాహిత్యం, వ్యాకరణ వేత్త, తత్వజ్ఞానం మొదలైన శాస్త్రము పట్ల జ్ఞానం కలిగినవాడు, ప్రబల పాండిత్యం కలిగినవాడు హనుమంతుడు.

హనుమంతుడికి పూజలు ఆయా రోజుల్లో ఎలా చేయాలి..?
హనుమంతునకు ప్రదక్షిణములు మంగళవార సేవ :- మంగళవారం నాడు హనుమంతునకు శరీరంపై సింధూరం పూయటం చాల ఇష్టం. అంతా కుదరని వారు మూతికయినా తప్పక పూయాలి. సింధూరార్చన చేయటం, జిల్లెడుతో, తమలపాకులతో పూజ, అరటి పండ్లు నివేదించడం చేయాలి. హనుమంతునకు ప్రదక్షిణములు శనివార సేవ:- హనుమంతుడు శనివారం జన్మించాడు, కాబట్టి ఆయనకు శనివారం ఇష్టమైనది. యథాశక్తి విశేషార్చన, సహస్రనామాదికం చేయాలి. ఆ రోజున అప్పాలు, వడమాల వంటివి స్వామి వారికి నివేధించి స్వామి వారి ఆశీస్సులు పొందవచ్చును. హనుమంతునకు ప్రదక్షిణములు పంచ సంఖ్య :- హనుమంతుడుకి పంచ ( ఐదు ) సంఖ్య ఇష్టం కాబట్టి ప్రదక్షిణాలు, నమస్కారాలు ఐదు చేయాలి. అరటిపండ్లు లేదా ఇతరములు, స్వామికి 5 సంఖ్యంలో సమసర్పించడం స్వామివారికి మరింత ప్రీతికరం.