DailyDose

హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగానే అమరావతిలో పనులు – TNI తాజా వార్తలు

హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగానే అమరావతిలో పనులు –  TNI  తాజా వార్తలు

* హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగానే అమరావతిలో పనులు జరుగుతున్నాయని సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ వెల్లడించారు. నవంబర్ నాటికి రాజధానిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అఖిల భారత సర్వీసు అధికారుల నివాసాలకు సంబంధించి పనులు పూర్తి అవుతాయన్నారు. హైకోర్టు ఉత్తర్వులకు ఏపీసీఆర్డీఏ కట్టుబడి ఉంటుందని సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ స్పష్టం చేశారు. హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగానే పనులు చేపడుతున్నామని ఆయన వెల్లడించారు. ఈ ఏడాది నవంబర్ నాటికి రాజధానిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అఖిల భారత సర్వీసు అధికారుల నివాస భవనాలకు సంబంధించిన పనులు పూర్తి అవుతాయని కమిషనర్ తెలిపారు. రాజధాని పరిధిలో పనులు చేపట్టేందుకు సీఆర్డీఏకు నిధులు అవసరం అవుతాయని.. అందుకే అమరావతి టౌన్ షిప్ లాంటివి అభివృద్ధి చేసి ప్లాట్లు విక్రయిస్తున్నట్లు చెప్పారు. నవులూరులో అభివృద్ధి చేసిన లేఅవుట్లో రూ. 310 కోట్ల వరకూ ఆదాయం వచ్చే అవకాశముందని సీఆర్డీఏ కమిషనర్ వెల్లడించారు.రాజధాని పనుల కోసం రుణం ఇవ్వాలని బ్యాంకులనూ సంప్రదించామని.. రూ. 3 వేల కోట్ల రుణాలను రెండు దశల్లో ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. రాజధాని ప్రాంతంలో ఎల్పీఎస్ లే ఆవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోందని.. ఆ అవుట్ల అభివృద్ధికి సంబంధించి రైతులకు ఇచ్చిన హామీలకు సీఆర్డీఏ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం కరకట్ట రహదారిని అభివృద్ధి చేస్తున్నాం.. త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. అలాగే.. హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టుకు సంబంధించి సీఆర్డీఏ మధ్యవర్తి మాత్రమేనని ఆయన పేర్కొన్నారు.

*కృష్ణా జిల్లా గన్నవరంలో హనుమాన్ శోభాయాత్ర కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది. ఈ కార్యక్రమం భువనేశ్వరిపీఠం పీఠాధిపతులు కమలానంద భారతీ స్వామి వారి చేతుల మీదుగా ప్రారంభమైంది. బీజేపీ జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యులు ఎస్.శేషు కుమార్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరగనుంది. గాంధీ బొమ్మ సెంటర్ నుంచి బైక్ ర్యాలీగా బయలుదేరి వివిధ ప్రాంతాలలో పర్యటించి అనంతరం దావాజీగూడెం రామాలయానికి చేరుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

*ఏలూరు: జిల్లాలోని జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో రెండో రోజు హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారికి లక్ష తమలపాకులతో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో ఆలయ ఈ ఓ కొండలరావు, ధర్మకర్తల మండలి చైర్మన్ కిసరి సరితా రెడ్డి, వేద పండితులు, భక్తులు పాల్గొన్నారు.

* శ్రీశైలం జలాశయానికి వరద నీరు క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం జలాశయం ఇన్ ఫ్లో 2,181 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో : నిల్‌గా ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను… ప్రస్తుత నీటిమట్టం 815.80 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 215.807 టీఎంసీలు కాగా… ప్రస్తుత నీటినిల్వ 37.8590 టీఎంసీలుగా నమోదు అయ్యింది. అటు శ్రీశైలం కుడి, ఎడమగట్టు విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.

*కోనసీమ జిల్లాలో విధ్వంసకాండకు సంబంధించి నిందితులెవరైనా వదిలేది లేదని మంత్రి దాడిశెట్టి రాజా స్పష్టం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ…పక్కాప్లాన్‌ ప్రకారమే విధ్వంసం సృష్టించారని ఆరోపించారు. విపక్షాలకు వ్యవస్థలపై గౌరవం లేదన్నారు. అన్నిపార్టీల అంగీకారంతోనే జిల్లా పేరు మార్చారని తెలిపారు. చంద్రబాబు కుట్ర రాజకీయాలు చేస్తున్నారని మంత్రి దాడిశెట్టి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు.

*ఒంగోలులో ఈనెల 27, 28న జరగనున్న టీడీపీ మహానాడుకు వైపీపీ ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోంది. మహానాడు నిర్వహణకు ఒంగోలు మినీ స్టేడియం గ్రౌండ్ ఇచ్చేందుకు అధికారులు నిరాకరించారు. అలాగే మహానాడుకు కార్యకర్తలు వచ్చేందుకు ఆర్టీసీ బస్సులు ఇవ్వలేమని ఆర్టీసీ అధికారులు చేతులెత్తేశారు. స్కూల్ బస్సులు, ప్రైవేటు బస్సులు కూడా పంపొద్దని ట్రావెల్స్ యజమానులకు ఆర్టీఏ అధికారుల హెచ్చరికలు జారీ చేశారు. ఒంగోలు చర్చి సెంటర్‌లో కట్టిన టీడీపీ తోరణాలు కార్పోరేషన్ అధికారులు తొలగించారు. దీంతో ప్రభుత్వ తీరుపై టీడీపీ నాయకులు మండిపడుతున్నారు.

*ఏలూరు డీఐజీ, ఎస్పీలతో డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అమలాపురంలో పరిస్థితులపై సమీక్షించారు. అనంతరం డీఐజీ పాలరాజు మాట్లాడుతూ.. కోనసీమలో పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. అమలాపురం అల్లర్లపై ఏడు కేసులు నమోదు చేశామన్నారు. పోలీసులకు ప్రజలు సహకరించాలన్నారు. అమలాపురంలో 144 సెక్షన్ అమలులో ఉందని డీఐజీ పాలరాజు వెల్లడించారు.

*‘‘గడప గడప ప్రభుత్వం’’ కార్యక్రమంలో పెనుకొండ ఎమ్మెల్యే శంకర నారాయణ( కష్టాలను చవిచూడాల్సి వస్తోంది. గడప గడప కార్యక్రమంలో భాగంగా పరిగి మండలంలో ఎమ్మెల్యే పర్యటించారు. ఈ క్రమంలో సమస్యపై ప్రజలు నిలదీస్తుండటంతో… ‘‘చెప్పేది వినండి స్వామీ’’ అంటూ శంకర నారాయణ చేతులెత్తి మొక్కుతున్న పరిస్థితి నెలకొంది. మూడేళ్లు మంత్రిగా ఉన్నా ఏం చేశావంటూ మోద గ్రామపంచాయతీలోని చెర్లోపల్లి పుట్టగూర్లపల్లి గ్రామస్తులు నిలదీశారు. గ్రామంలో రోడ్లు లేవని, తాగేందుకు నీళ్లు లేవని, పింఛన్లు ఇవ్వడం లేదంటూ శంకర నారాయణ దృష్టికి మహిళలు తీసుకెళ్లారు. శంకర నారాయణను చుట్టుముట్టి గ్రామస్తులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు.

*ఎర్రబెల్లి ట్రస్ట్ఆ ధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణతో పాటు మెటీరియల్ ను పొంది ఉద్యోగాలు సంపాదించుకోవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నిరుద్యోగులకు ఉద్బోధించారు. శిక్షణ పొందుతున్న వారికి ఉచితంగా మెటీరియల్ ను ఆయన పంపిణీ చేశారు. ఈసందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ మెటీరియల్ తీసుకోవడమే కాదు, మీరు ఉద్యోగాలు పొంది మా సంకల్పాన్ని నెరవేర్చాలన్నారు. నిరుద్యోగులకు ఈ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండటం మా అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. శిక్షణ ద్వారా వేలాది మంది ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు పొందుతున్నారని చెప్పారు.

*మహిళా చట్టాలు కేవలం మహిళలే కాదు పురుషులు కూడా తెలుసుకోవాలని, తద్వారా మహిళలకు కల్పించిన హక్కుల పట్ల అవగాహన కలుగుతుందని తెలంగాణమహిళా కమిషన్ చైర్ పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి అన్నారు.ఆడపిల్లలపై సమాజ ఆలోచన విధానంలో కూడా మార్పు రావాలని అన్నారు.యాదాద్రీ జిల్లా పర్యటనలో భాగంగా ప్రభుత్వ బాలికల వసతి గృహమును ఆకస్మిక తనిఖీ చేసి బాలికల వసతి సౌకర్యాలను గురించి తెలుసుకున్నారు.అనంతరం జిల్లాలోని సఖి కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సఖి నిర్వాహకురాలు లావణ్య ద్వారా సఖి కార్యకలాపాలను అడిగి తెలుసుకొని సఖి కేంద్రం ద్వారా మరిన్ని సేవలందించేందుకు కృషి చేయాలని సూచించారు.

*శ్రీనగర్‌ శివారులోని సౌర అనే ప్రాంతంలో ఉగ్రవాదులు మంగళవారం దారుణానికి ఒడిగొట్టారు. ఓ ఏడేళ్ల చిన్నారి కళ్ల ఎదుటే అమె తండ్రిపై కాల్పులకు తెగబడ్డారు. తన కూతురితో కలిసి ఇంటి బయటికి వచ్చిన సైఫుల్లా ఖాద్రీ అనే పోలీసు కానిస్టేబుల్‌పై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన సైఫుల్లా ఆస్పత్రిలో మరణించారు. బుల్లెట్‌ గాయానికి గురైన అతని కూతురు ప్రస్తుతం చికిత్స పొందుతుంది. ఇకరెండు వారాలుగా ఆందోళన బాట పట్టిన కశ్మీరీ పండిట్‌ ఉద్యోగులు.. తమను సురక్షిత ప్రాంతానికి తరలించే వరకు ఉద్యోగాల్లో చేరమని స్పష్టం చేశారు.

*అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల ఈపీఎఫ్‌ వాటా చెల్లించకుండా జాప్యం చేసిన జీహెచ్‌ఎంసీకి హైకోర్టులో చుక్కెదురైంది. ఈపీఎఫ్‌ బకాయిలు చెల్లించని జీహెచ్‌ఎంసీకి జరిమానా, వడ్డీ విధించడం సబబేనని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. 2012 నుంచి 2019 వరకు ఈపీఎఫ్‌ సొమ్మును జమ చేయకపోవడంతో నష్టపరిహారం కింద జరిమానా, వడ్డీని విధిస్తూ ఈపీఎఫ్‌ కమిషనర్‌ ఆదేశాలు జారీచేశారు. ఈ ఆదేశాలపై జీహెచ్‌ఎంసీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ రాధారాణి ధర్మాసనం విచారణ చేపట్టింది. జరిమానా, వడ్డీ విధించడంతోపాటు, డిపాజిట్ల నుంచి రికవరీ చేసుకోవడానికి ఈపీఎఫ్‌ కమిషనర్‌ ఇచ్చిన ఆదేశాలు సబబేనని ధర్మాసనం పేర్కొంది.

* నిమ్స్‌ ఆస్పత్రిలో ప్రస్తుతం ఉన్న జెరియాట్రిక్‌ వార్డును ప్రత్యేక విభాగంగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ డిపార్టుమెంటులో వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఐసీయూ వార్డు, వ్యాధి నిర్ధారణ పరికరాలను అందుబాటులో ఉంచుతారు. ఎండీ జెరియాట్రిక్‌ కోర్సు, పీజీ సీట్లు అందుబాటులోకి వస్తాయి. తద్వారా దక్షిణ భారతదేశంలోనే జెరియాట్రిక్‌ విభాగం ఉన్న మూడో కేంద్రంగా నిమ్స్‌ రికార్డు నెలకొల్పనుంది. ప్రస్తుతం ఇక్కడి జెరియాట్రిక్‌ వార్డులో 38 పడకలు ఉన్నాయి. వీటిని 44కు పెంచుతారు. అదనపు సిబ్బందిని నియమిస్తారు.

*శబ్దకాలుష్యానికి కారణమ్యే మల్టీ టోన్డ్‌ హారన్‌లను వినియోగిస్తే వాహనదారులపై కేసులను నమోదు చేస్తామని డీజీపీ మహేందర్‌రెడ్డి హెచ్చరించారు. మోటార్‌ హెహికిల్‌ యాక్ట్‌ ప్రకారం జరిమాన కూడా విధిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ హారన్‌లను వినియోగం వల్ల కలిగే అనర్థాలపై వాహనదారులకు అవగాహన కల్పించాలని ఆయన ఆదేశించారు.

*తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సోసైటీ (టాస్‌) టెన్త్‌, ఇంటర్‌ వార్షిక పరీక్షలను ఈ నెల 31నుంచి నిర్వహించనున్నారు. విద్యార్థులు www.telanganaopenschool.org వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని టాస్‌ డైరెక్టర్‌ తెలిపారు.

*ఉమ్మడి రాష్ట్ర ఉన్నత విద్యా మండలి మాజీ వైస్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ నీరదారెడ్డి మృతి పట్ల మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ లింబాద్రి, వైస్‌ చైర్మన్‌ వెంకటరమణ తదితరులు సంతాపం తెలిపారు.

* రాష్ట్ర వ్యాప్తంగా జూన్‌ 10 నాటికి వరి ధాన్యం సేకరణ ముగిసే అవకాశాలున్నాయని, మెజారిటీ జిల్లాల్లో మరో వారం రోజుల్లో ధాన్యం సేకరణ పూర్తవుతుందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. హైదరాబాద్‌లో మంగళవారం ధాన్యం సేకరణపై సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. నిజామాబాద్‌, కామారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కొనుగోళ్లు చివరి దశకు వచ్చినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో 6,544 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ ఇప్పటికే పూర్తయ్యిందని, రోజుకు లక్షన్నర నుంచి రెండున్నర లక్షల టన్నుల సేకరణ జరుగుతోందని తెలిపారు.

*తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో స్వామివారి అభిషేక దర్శనం టికెట్ల కోసం దళారీని నమ్మిన మిర్యాలగూడకు చెందిన కొందరు భక్తులు రూ. 4.50 లక్షల మేర దోపీడీకి గురయ్యారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన వ్యాపారులు హరికృష్ణ, మురళీకృష్ణ, వెంకటేశ్వర్లు, వారి సమీప బంధువులు కుటుంబాలతో కలిసి శ్రీవారి దర్శనానికి వెళ్లాలని అనుకున్నారు. ఈ క్రమంలో.. గతంలో తిరుమలకు వెళ్లిన సందర్భంలో పరిచయమైన శరవణన్‌ అనే వ్యక్తిని ఈ నెల 19న హరికృష్ణ ఫోన్‌లో సంప్రదించారు. తమకు అభిషేక సేవా దర్శనం టికెట్ల కావాలని కోరారు. తనకు ఆలయ పాలక మండలి సభ్యులు, అధికారులు బాగా తెలుసని, డబ్బు పంపిస్తే ఏర్పాట్లు చేస్తానని శరవణన్‌ బదులిచ్చాడు. అతన్ని నమ్మిన వారు తొమ్మిది టికెట్ల కోసం రూ.4.50 లక్షలను గూగుల్‌ పే చేశారు. ఈ నెల 21నతిరుమల చేరుకున్న బాధితులు శరవణన్‌కు ఫోన్‌ చేయగా స్విచాఫ్‌ వచ్చింది. దీంతో మోసం పోయామని గ్రహించి టీటీడీ విజిలెన్స్‌ అధికారులను ఆశ్రయించారు

*ఎన్నికల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ.15 వేల కోట్లు తీసి పక్కన పెట్టారని, అన్ని నియోజకవర్గాల్లో డబ్బు, మద్యం పంచి ఓట్లు అడుగుతారని మాజీ మంత్రి, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లిలో మంగళవారం వివిధ పార్టీల నుంచి పలువురు బీజేపీలో చేరారు. వారికి ఈటల కాషాయ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పంచే డబ్బు తీసుకుని మన ఓట్లు మనమే వేసుకోవాలన్నారు. తెలంగాణ వచ్చిన తరువాత కేసీఆర్‌ కుటుంబంలో తప్ప ప్రజల్లో ఎలాంటి మార్పురాలేదని చెప్పారు. తుర్కపల్లి మండలంలో వెనుకబడిన గ్రామాలే ఇందుకు నిదర్శనమన్నారు. దేశంలోనే అత్యధికంగా మద్యం తాగుతున్న రాష్ట్రం తెలంగాణే అని చెప్పారు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి వారి కళ్లలో మట్టి కొట్టారని మండిపడ్డారు. 57 ఏళ్లకే పింఛన్లు ఇస్తానని చెప్పి, 60 ఏళ్లు నిండినవారికి కూడా మంజూరు చేయడంలేదన్నారు. బీజేపీకి అధికారం కనుచూపుమేరలోనే ఉందని, తెలంగాణలో ఎగిరేది కాషాయ జెండానేనని ధీమా వ్యక్తంచేశారు.

*వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర ఈ నెల 28న పునఃప్రారంభం కానుంది. సత్తుపల్లి నియోజకవర్గంలో తాత్కాలిక విరామం ఇచ్చిన పాదయాత్రను పునఃప్రారంభించనున్నారు. లోటస్‌ పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో మంగళ వారం జరిగిన పార్టీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు.

*ఎర్రబెల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణతో పాటు మెటీరియల్ ను పొంది ఉద్యోగాలు సంపాదించుకోవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నిరుద్యోగులకు ఉద్బోధించారు. శిక్షణ పొందుతున్న వారికి ఉచితంగా మెటీరియల్ ను ఆయన పంపిణీ చేశారు. ఈసందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ మెటీరియల్ తీసుకోవడమే కాదు, మీరు ఉద్యోగాలు పొంది మా సంకల్పాన్ని నెరవేర్చాలన్నారు. నిరుద్యోగులకు ఈ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండటం మా అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. శిక్షణ ద్వారా వేలాది మంది ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు పొందుతున్నారని చెప్పారు.

*మహిళా చట్టాలు కేవలం మహిళలే కాదు పురుషులు కూడా తెలుసుకోవాలని, తద్వారా మహిళలకు కల్పించిన హక్కుల పట్ల అవగాహన కలుగుతుందని తెలంగాణమహిళా కమిషన్ చైర్ పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి అన్నారు.ఆడపిల్లలపై సమాజ ఆలోచన విధానంలో కూడా మార్పు రావాలని అన్నారు.యాదాద్రీ జిల్లా పర్యటనలో భాగంగా ప్రభుత్వ బాలికల వసతి గృహమును ఆకస్మిక తనిఖీ చేసి బాలికల వసతి సౌకర్యాలను గురించి తెలుసుకున్నారు.అనంతరం జిల్లాలోని సఖి కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సఖి నిర్వాహకురాలు లావణ్య ద్వారా సఖి కార్యకలాపాలను అడిగి తెలుసుకొని సఖి కేంద్రం ద్వారా మరిన్ని సేవలందించేందుకు కృషి చేయాలని సూచించారు.

*పిల్లలకు ఆసక్తి ఉన్న రంగాలలో ప్రోత్సహించాలని, అప్పుడే వారు మరింత ఉన్నతంగా రానిస్తారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్అ న్నారు. బుధవారం సైదాబాద్ కు చెందిన న్యాయవాది ఫసియోద్దిన్ ఇటీవల గోవాలో ఈ నెల 6 నుండి 8 వ తేదీ వరకు జరిగిన నేషనల్ టైక్వాండో చాంపియన్ షిఫ్ లో సిల్వర్ మెడల్స్ సాధించిన తన ఇద్దరు కుమార్తె లు ఉమైమా పాతిమా, సుమమ పాతిమా లతో కలిసి వచ్చి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

*రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారన్నారు. తెలంగాణలో ఆస్పత్రుల నిర్మాణం చేపట్టలేదన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే ప్రత్యేక కార్యాచరణ చేపడతామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల సిబ్బంది కొరత ఉందని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని సీఎం కేసీఆర్ తుంగలో తొక్కారన్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో సేవలు అందక పేదలు రోడ్డున పడ్డారన్నారు. పేదల ఆరోగ్యంతో ప్రభుత్వం ఆడుకుంటోందని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

*తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ ప్రాజెక్ట్ రానుంది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కానుంది. దావోస్‌లో మంత్రి కేటీఆర్ (KTR) సమక్షంలో ప్రభుత్వంతో స్టాడ్లర్ రైల్ కంపెనీ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. రూ.1000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు కంపెనీ మందుకొచ్చింది. ఈ ప్రాజెక్ట్‌తో దాదాపు 2500 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. మేదో సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ , స్టాడ్లర్ రైల్ కలిసి ఈ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని స్థాపించనున్నాయి.

*ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నగర పర్యటన సందర్భంగా గచ్చిబౌలిలో పోలీసులు ఆంక్షలు విధించారు. ఐఎస్‌బీ 5 కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లు, పారా గ్లైడర్స్‌, మినీ ఎయిర్‌క్రాఫ్ట్‌లపై నిషేధం విధించారు. ఏరియల్‌ వ్యూ కోసం లైవ్‌ టెలికాస్ట్‌పై పోలీసులు నిషేధంచారు. అటు ఐఎస్‌బీ, హెచ్‌సీయూ పరిసరాల్లో పోలీసుల ఆంక్షలు కొనసాగనున్నాయి. రేపు(గురువారం) మధ్యాహ్నం ఒంటి నుంచి సాయంత్రం 5 గంటల వరకు బేగంపేట, ఐఎస్‌బీ, సెంట్రల్‌ యూనివర్సిటీలో ట్రాఫిక్‌ ఆంక్షలు కొనసాగుతాయి. కాగా…రేపు(గురువారం) గచ్చిబౌలిలో ఐఎస్‎బీ (ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌) ద్విదశాబ్ది ఉత్సవాలు, స్నాతకోత్సవ కార్యక్రమాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

*ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవ సమితి కన్వీనర్‌ డి.పురందేశ్వరి తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొక ప్రాంతంలో ఉత్సవాల నిర్వహణ ఉంటుందని మంగళవారం ఆమె హైదరాబాద్‌లో తెలిపారు. ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల సావనీర్‌ను కూడా ముద్రించనున్నట్లు పురందేశ్వరి చెప్పారు.

*పంజాగుట్ట ఎస్‌హెచ్‌ఓ నిరంజన్‌ రెడ్డి సెలవులో వెళ్లగా, అతడి స్థానంలో సీసీఎస్‌లో పని చేస్తున్న ఇన్‌స్పెక్టర్‌కు చార్జి ఇచ్చారు. అయితే ఎస్‌హెచ్‌ఓ బదిలీపై వెళ్లారని ప్రచారం జరిగింది. మంగళవారం మధ్యాహ్నం ఆయన తిరిగి బాధ్యతలు చేపడుతున్నారన్న సమాచారంతో ఇన్‌చార్జి ఇన్‌స్పెక్టర్‌ పీఎస్‌కు రాలేదు. వాస్తవానికి లీవ్‌పై వెళ్లిన ఇన్‌స్పెక్టర్‌ స్థానంలో అదే పీఎస్‌కు చెందిన అధికారికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించాల్సి ఉండగా, సీసీఎస్‌లో పని చేసిన వ్యక్తికి చార్జి ఇవ్వడంతో బదిలీ ప్రచారం జరిగింది. ఇదే డివిజన్‌కు చెందిన ఏసీపీ పరిస్థితి కూడా అలాగే కనిపిస్తోంది. ఆయనను బదిలీ చేస్తూ డీజీపీ ఆదేశాలిచ్చినా ఆయన సీటు వదలకపోవడం, ఆ ఉత్తర్వులు వెనక్కు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఎల్‌బీనగర్‌ ఏసీపీ బదిలీ వ్యవహారం బాస్‌లకు తలనొప్పిగా మారిందని ప్రచారం జరుగుతోంది.

*కారుణ్య నియామకాల విషయంలో దరఖాస్తు వచ్చిన 6 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నియామకాలు తప్పనిసరిగా కాలవ్యవధికి లోబడి ఉండాలని, ఆ వ్యవధి 6 నెలలకు మించకూడదని తేల్చి చెప్పింది. లేనిపక్షంలో కారుణ్య నియామకాల ప్రయోజనమే నెరవేరదని అభిప్రాయపడింది. ‘‘ఒక ఉద్యోగి అకాల మరణం అతడి కుటుంబాన్ని ఆర్థిక కష్టాల్లోకి నెట్టేస్తుంది. అలాంటి స్థితిలో ఉన్న కుటుంబానికి తక్షణ ఆర్థిక సాయం అందించడమే ఈ విధానానికి మూలం. కాబట్టి కారుణ్య నియామకం కోరుతూ వచ్చే దరఖాస్తులను అధికారులు వెంటనే పరిగణనలోకి తీసుకుని, 6 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలి’’ అని కోర్టు పేర్కొంది.

* జ్ఞానవాపి మసీదు కేసు విచారణార్హతపై వారాణసీ జిల్లా కోర్టు గురువారం విచారణ జరపనుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జిల్లా జడ్జి ఏకే విశ్వేష్‌ ఈ కేసు విచారణ చేపట్టనున్నట్టు మంగళవారం ప్రభుత్వ న్యాయవాది రాణా సంజీవ్‌ సింగ్‌ చెప్పారు. జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌లో నిర్వహించిన వీడియోగ్రఫీ సర్వే నివేదికపై అభ్యంతరాలు సమర్పించడానికి ఇరుపక్షాలకూ కోర్టు వారం గడువిచ్చింది. వీడియోగ్రఫీ సర్వేకు వ్యతిరేకంగా మసీదు కమిటీ వేసిన అప్పీలుపై తొలుత విచారణ జరుపుతామని జడ్జి విశ్వేష్‌ తెలిపారు. వీడియోగ్రఫీ సర్వే నివేదికను గతవారం సీల్డ్‌ కవర్‌లో వారాణసీ కోర్టుకు సమర్పించిన విషయం తెలిసిందే. కాగా, జ్ఞానవాపి వివాదంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌ దాఖలైంది.

*గోధుమల ఎగుమతి నిషేధం నిర్ణయాన్ని పునరాలోచించాలని భారత్‌ను అర్థిస్తున్నామని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్‌) చీఫ్‌ క్రిస్టలీనా జార్జీవా పేర్కొన్నారు. అంతర్జాతీయ ఆహార భద్రత, ప్రపంచ స్థిరత్వంలో భారత్‌ చాలా కీలక పాత్ర పోషిస్తుందని ఆమె గుర్తుచేశారు. ‘‘భారత్‌లో వేసవి వేడిమి కారణంగా వ్యవసాయ ఉత్పాదకత దెబ్బతిందని మేం గుర్తించాం. అదే విధంగా భారత్‌ తమ 135 కోట్లమంది జనాభాకు ఆహారాన్ని సమకూర్చాలన్న విషయమూ మాకు తెలుసు. కానీ.. వారు గోధుమల ఎగుమతి నిషేధంపై పునరాలోచించాలని అర్థిస్తున్నాం’’ అన్నారు. అయితే.. ఆహార కొరత కారణంగా తమను విజ్ఞప్తి చేసిన దేశాలకు నిషేధాన్ని సడలించి ఎగుమతి చేస్తామని భారత్‌ పేర్కొంది.

*ఇంధనం కొరత నేపథ్యంలో మంగళవారం పెట్రోల్‌, డీజిల్‌ ధరలను శ్రీలంక ప్రభుత్వం భారీగా పెంచింది. లీటరు పెట్రోల్‌పై 24.3%, డీజిల్‌పై 38.4ు మేర ధరలను పెంచింది. తాజా పెంపుతో లీటర్‌ పెట్రోల్‌ రేటు రూ.420కి, డీజిల్‌ ధర రూ.400కి చేరింది. రవాణా, ఇతర సర్వీస్‌ చార్జీలను కూడా పెంచుతున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. దీంతో ఆటో చార్జీలను కూడా పెంచుతున్నట్టు శ్రీలంక ఆటో రిక్షా ఆపరేటర్ల సంఘం వెల్లడించింది. ఖర్చులు పెరగడంతో ఉద్యోగులకు ప్రభుత్వం వర్క్‌ ఫ్రం హోమ్‌ అనుమతిచ్చింది. పెట్రోల్‌ కొనడానికి రూ.38 వేల కోట్ల రుణం ఇవ్వాలని భారత్‌ను లంక కోరింది. ఇప్పటికే 40 వేల మెట్రిక్‌ టన్నుల పెట్రోల్‌, 40 వేల మెట్రిక్‌ టన్నుల డీజిల్‌ను సరఫరా చేసినట్టు భారత్‌ వెల్లడించింది.

*రాష్ట్రపతి అభ్యర్థిపై బీజేపీ జూన్‌ మొదటి వారంలోనే నిర్ణయం తీసుకోనుంది. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇప్పటికే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభ్యర్థులతో పాటు రాజ్యసభకు ఎంపిక చేయాల్సిన సభ్యులపై చర్చలు జరిపారు. జూన్‌ 8న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విదేశీ పర్యటన నుంచి వచ్చేలోపే రాష్ట్రపతి అభ్యర్థి పేరును ఖరారు చేసే అవకాశాలున్నాయని తెలిసింది. రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలెక్టోరల్‌ కాలేజీలో బీజేపీకి 48.9ు ఓట్లు, విపక్షాలు, ఇతర పార్టీలకు 51.1ు ఓట్లున్నాయి. దీంతో ఒడిషా సీఎం, బిజూజనతాదళ్‌ అధినేత నవీన్‌ పట్నాయక్‌, బిహార్‌ సీఎం, జేడీ(యూ) నేత నితీ్‌షకుమార్‌లతో బీజేపీ నేతలు ఇప్పటికే చర్చలు జరిపారు. వైసీపీ తమకు మద్దతు ఇచ్చి తీరుతుందని బీజేపీ నేత ఒకరు చెప్పారు. విపక్షాల శిబిరంలోనూ రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై చర్చలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ సీఎం కేసీఆర్‌, శరద్‌ పవార్‌, మమతా బెనర్జీ, దేవెగౌడ, ఉద్ధవ్‌ ఠాక్రే, కేజ్రీవాల్‌ తదితరులు ప్రాథమిక చర్చలు జరిపారు. వారు కూడా జూన్‌ మొదటి వారం లోపు అభ్యర్థిపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలున్నాయి. జూన్‌ 10న రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. ఏపీకి చెందిన బీజేపీ సభ్యులు సుజనాచౌదరి, టీజీ వెంకటేశ్‌, సురేశ్‌ ప్రభు పదవీ విరమణ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి బలం లేనందున ఇతర రాష్ట్రాల నుంచి ఒక తెలుగు నేతకు అవకాశం లభించవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న నేతల్లో సుజనాచౌదరి, వెంకటేశ్‌తోపాటు పురంధేశ్వరి, లక్ష్మణ్‌ తదితరులు ఉన్నారు.

*తమ పార్టీ అధినాయకత్వం రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించిన హెటిరో పార్థసారథి నరహంతకుడు అంటూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలను టీఆర్‌ఎస్‌ ముఖ్యులు ఆక్షేపించారు. పార్థసారథి కుంభకోణానికి పాల్పడ్డారని ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. వ్యక్తిగతంగా టార్గెట్‌ చేసుకుని ఆరోపణలు చేయడం వల్ల జగ్గారెడ్డి తన హుందాతనాన్ని కోల్పోతారని విమర్శించారు. ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడితే గొప్పవారైపోరని, ఇప్పటికైనా జగ్గారెడ్డి తన పద్ధతిని మార్చుకోవాలని సూచించారు. విధానాలపై రాజకీయ విమర్శలు ఎవరైనా చేయొచ్చని, కానీ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా తీవ్ర పదజాలాన్ని ఉపయోగించడం సమర్థనీయం కాదని టీఆర్‌ఎస్‌ నేతలు అన్నారు.

*రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్దిష్ట ప్రయోజనం కోసం భూమిని సేకరించిందో, దానికోసం వినియోగించలేదనే కారణంగా ఆ భూమిని వెనక్కి ఇవ్వమని అడగడానికి వీలు లేదని రాష్ట్ర హైకోర్టు పేర్కొంది. ప్రస్తుత కేసులో పిటిషనర్‌కు భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం అందిందని కోర్టు గుర్తు చేసింది. ప్రభుత్వ స్వాధీనంలోకి భూమి వెళ్లిన తరువాత తిరిగి దానిని ఇవ్వాలని కోరలేరని పేర్కొంది. ఈ మేరకు ఆ వ్యాజ్యాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి కొట్టివేస్తూ ఇటీవల తీర్పు వెలువరించారు. నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇచ్చేందుకు 2004లో అప్పటి ప్రభుత్వం కర్నూలు జిల్లా, మిడ్తూరు మండలం, దేవనూర్‌ గ్రామం పరిధిలో సేకరించిన ఈ భూమిని ఇన్నాళ్లూ ప్రభుత్వం ఖాళీగా ఉంచిందని, దాన్ని తనకు తిరిగివ్వాలని పిటిషనర్‌ కోరగా, కోర్టు పై విధంగా తీర్పు ఇచ్చింది.

*ప్రశాంతమైన కోనసీమలో హింసాత్మక ఘటనలు దురదృష్టకరమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కోనసీమ ప్రజలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. సున్నితమైన అంశంలో హోం మంత్రి టీడీపీపై నిరాధార ఆరోపణలు చేయడాన్ని చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఇది ముమ్మాటికీ పోలీసుల, ప్రభుత్వ వైఫల్యమని ఆరోపించారు. కోనసీమలో ప్రశాంతత నెలకొనేలా ప్రజలంతా సహకరించాలని చంద్రబాబు మంగళవారం ఓ ప్రకటనలో కోరారు.

*‘నేను రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ను ఉల్లంఘించలేదు. అలాంటప్పుడు నా లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేసే ప్రశ్నే తలెత్తదు. రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిస్తామని మా పార్టీ నాయకత్వం చెప్పినా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఇంకా మరేవిధంగా ప్రభావితం చేయాలని చూసిన నన్ను చేయగలిగిందేమీ లేదు. విలువల గురించి మాట్లాడే నైతిక అర్హత మా పార్టీ నేతలకు, ఎంపీ మార్గాని భరత్‌కు ఉందా?’’ అని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. మంగళవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ‘‘ఇతర పార్టీల గుర్తులపై గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేలు మా పార్టీ కండువా కప్పుకొని నిస్సిగ్గుగా తిరుగుతున్నా వారిపై అనర్హత వేటు ఎందుకు వేయడం లేదు? నేనేమీపార్టీ మారలేదు. పార్టీలోనే ఉంటూ ప్రశ్నిస్తుంటే నాపై వేటు వేయాలని కోరడం విడ్డూరంగా ఉంది. పార్లమెంటులో నేను విప్‌ ఉల్లంఘించినట్లు తప్పుడు మాటలు చెబుతున్నారు. అసలు ఇప్పటి వరకూ మా పార్టీ పార్లమెంటులో విప్‌నే జారీ చేయలేదు. విప్‌ జారీ చేయనప్పుడు దాన్ని ధిక్కరించానన్న ప్రశ్నే ఉత్పన్నం కాదు. రాజ్యాంగంలోని 350 ఏ అధికరణ ఏమి చెబుతుందో మా పార్టీ వారికి తెలియదు.

*కందిపప్పు ధరపై పౌరసరఫరాల కార్పొరేషన్‌ ఎండీ వీరపాండియన్‌ రోజుకో మాట చెబుతున్నారు. ఇటీవల సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కందిపప్పు ధర రూ.112 అని చెప్పిన ఆయన ఇప్పుడు తాను రూ.106.57 అన్నానని ప్రకటన విడుదల చేయడం చేయడం గమనార్హం. సచివాలయంలో విలేకరుల సమావేశంలో కందిపప్పు గురించి విలేకరులు ప్రస్తావించగా… ‘టెండర్‌ పిలిచాం. టెండర్‌లో రూ.112 వచ్చింది. బయట మార్కెట్‌లో రూ.120 ఉంటే రూ.112కే మనం ఇది చేశాం’ అని రూ.112కి కొనుగోలు చేశామన్నట్లుగా స్పష్టంగా వివరించారు.

* ఎండ తీవ్రతకు కోస్తాలోని అనేక ప్రాంతాలు నిప్పులకొలిమిలా మారాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాలు భగభగమన్నాయి. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వడగాడ్పులతో జనం బెంబేలెత్తిపోయారు. గోదావరి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉండ్రాజవరం, పెంటపాడు, తణుకుల్లో 45.8 డిగ్రీలు, ఉంగుటూరు, భీమడోలులో 44.8, రాజమండ్రిలో 44.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కోస్తా, రాయలసీమల్లోని మిగిలిన జిల్లాల్లో కూడా ఎండ తీవ్రత కొనసాగింది. కాగా ఉత్తర తమిళనాడు పరిసరాల్లో ఉన్న ఆవర్తనం ప్రభావంతో పలుచోట్ల వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తాలో ఎండలు, ఉక్కబోత కొనసాగుతాయని, అక్కడక్కడా ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

*గుంటూరు నడిబొడ్డున మహ్మద్‌ అలీ జిన్నా పేరు వినపడటం ఈ దేశానికి అవమానం. ఆగస్టు తేదీలోపు ఆ టవర్‌ పేరు మారిస్తే సరి. లేదంటే ఆతర్వాత దాన్ని కూల్చేస్తే బీజేపీకి ఎటువంటి సంబంధం లేదు అని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ హెచ్చరించారు. గుంటూరులో మంగళవారం భారతీయ యువ మోర్చా (బీజేవైఎం) రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సత్యకుమార్‌ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిన ఏళ్ల తర్వాత కూడా జిన్నా వంటి దుర్మార్గుడి స్మారక చిహ్నం ఇక్కడ ఉండటం అవమానకరంగా భావిస్తున్నామన్నారు. రంగులు మారిస్తే ఆత్మలు శాంతించవని దాని పేరు కలాం లేదా జాషువా లేదా అమీద్‌లలో ఏదైనా పెట్టుకోమని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామన్నారు

*ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవ సమితి కన్వీనర్‌ డి.పురందేశ్వరి తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొక ప్రాంతంలో ఉత్సవాల నిర్వహణ ఉంటుందని మంగళవారం ఆమె హైదరాబాద్‌లో తెలిపారు. ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల సావనీర్‌ను కూడా ముద్రించనున్నట్లు పురందేశ్వరి చెప్పారు.

*తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు శత జయంతి ఉత్సవాలు ఒంగోలులో ప్రారంభం కానున్నాయి. ఈనెల 28న ఒంగోలులోని అద్దంకి బస్టాండు సెంటర్‌లో ఉన్న ఎన్‌టీఆర్‌ కాంస్య విగ్రహం వద్ద పార్టీ అధినేత చంద్రబాబు నివాళులర్పించి ఉత్సవాలను ప్రారంభించనున్నారు. ఈ ఏడాది మహానాడు ఒంగోలు వేదికగా ఈనెల 27, 28 తేదీల్లో జరగనుంది. ఈనెల 28న ఎన్‌టీఆర్‌ శతజయంతి నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ తరఫున కార్యక్రమాలు నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది. మహానాడులో తొలి రోజైన 27న ప్రతినిధుల సభ జరగనుంది. 28న సాయంత్రం లక్షమందితో నిర్వహించనున్న బహిరంగసభకు సన్నాహలు చేస్తున్నారు.

*వైసీపీ ప్రభుత్వంలోని పెద్దలు కుట్రలు, కుతంత్రాలతో మహానాడును అడ్డుకోవాలని చూస్తే అంతు తేలుస్తాం. వైసీపీ ప్రభుత్వం గడప గడప కార్యక్రమంలో ప్రజల నిలదీతలు… టీడీపీ నాయకులకు లభిస్తున్న స్వాగతాలతో అధికార పార్టీ నేతలకు కడుపు మంట, ఓర్వలేని తనం పెరిగిపోయాయి. కక్షతో మహానాడును అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారు’’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. మంగళవారం ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘‘మహానాడుకు ఎవరూ ఎలాంటి వాహనాలు సమకూర్చవద్దని, ఆర్టీసీ బస్సులు అద్దెకు ఇవ్వవద్దని ప్రభుత్వ పెద్దలు ఆదేశించారు. కొంత మంది అధికారులు డూడూ బసవన్నల మాదిరిగా తలూపుతూ విద్యా సంస్థల యాజమాన్యాలు, ఇతరులకు మహానాడుకు బస్సులు, ఇతర వాహనాలు ఇవ్వవద్దని ఫోన్లు చేస్తున్నారు. బస్సులిస్తే చర్యలు తీసుకొంటామని బెదిరించడానికి రవాణాశాఖ అధికారులు ఎవరు? ఆర్టీసీ బస్సులు అద్దెకు తీసుకొంటామంటే ఇవ్వనంటున్నారు. ప్రైవేటు బస్సులు ఇవ్వడానికి వీల్లేదని విద్యా సంస్థలు, ట్రావెల్స్‌ సంస్ధలను బెదిరిస్తున్నారు. అధికారులు వైసీపీ పాలెగాళ్లా? సీఎం జగన్‌రెడ్డి చెప్పగానే వాహనాలు ఇవ్వడానికి వీలు లేదని హెచ్చరికలు జారీ చేయడం ఏమిటి? దీనిని మేం చూస్తూ ఊరుకోం. ఒంటెత్తు పోకడతో అధికార పార్టీ నేతల సేవలో మునిగి తేలుతున్న అధికారుల చిట్టా తయారు చేస్తున్నాం. వారి భరతం పడతాం. మహానాడుకు రాకుండా అడ్డుకోవాలని చూస్తే టీడీపీ శ్రేణులు, ప్రజలు ప్రతిఘటించడం ఖాయం. వాహనాలు ఇవ్వకుండా అడ్డుకొంటే నడుచుకొంటూ అయినా చీమల దండు మాదిరిగా వస్తారు. మహానాడును విజయవంతం చేస్తారు’’ అని పేర్కొన్నారు.

*‘అధికార పార్టీ ఎమ్మెల్సీ జగనన్న శవాల పంపిణీ పథకం అమలు చేస్తున్నాడు. దళితులను చంపి వారి శవాలను ఇళ్ల వద్ద పడేసి పోతుంటే రాష్ట్రంలో ఒక్క దళిత మంత్రి కూడా నోరు తెరిచి ఇదేమి ఘోరమని ప్రశ్నించలేకపోయారు. ఇక ఏ ముఖం పెట్టుకొని బస్సు యాత్ర చేస్తారు’ అని టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ ప్రశ్నించింది. దళితులపై జరుగుతున్న అమానుష ఘటనలపై గళం విప్పి ప్రశ్నించాల్సింది పోయి దళిత మంత్రులు, ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి భజనలో తరిస్తున్న తీరుతో దళితుల హృదయం రగిలిపోతోందని, వైసీపీ నేతల బస్సుయాత్రకు వారు చెప్పులతో స్వాగతం పలకడం ఖాయమని కమిటీ సభ్యులు వ్యాఖ్యానించారు. కాకినాడలో కారు డ్రైవర్‌ వీధి సుబ్రహ్మణ్యం హత్యపై పార్టీపరంగా ఏర్పాటైన నిజ నిర్ధారణ కమిటీ సభ్యులుగా ఉన్న మాజీ మంత్రి పీతల సుజాత, పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్‌ రాజు, పార్టీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు మంగళవారం ఇక్కడ తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

*రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూ్‌పకు చెందిన రెండు ఇళ్లకు నిరసనకారులు నిప్పు పెట్టారు. జిల్లా పేరు మార్చొద్దంటూ మంగళవారం చేపట్టిన ఆందోళన అదుపుతప్పింది. రెచ్చిపోయిన ఆందోళనకారులు ఎర్రవంతెన సమీపంలోని బ్యాంకు కాలనీలో నివాసముంటున్న మంత్రి ఇంటిని చుట్టుముట్టారు. ఆ సమయంలో మంత్రి సతీమణి బేబీ మీనాక్షి కార్యాలయ సిబ్బంది ఉన్నారు. పోలీసులు హుటాహుటిన వారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. అయితే ఆందోళనకారులు గేట్లు వేసి ఉన్న ఇంట్లోకి చొరబడ్డారు. రాళ్లతో దాడిచేసి ఇంటికి నిప్పంటించారు. విలువైన ఫర్నిచర్‌ వ్యక్తిగత ఆస్తి పత్రాలు కాలి బూడిదయ్యాయి. నివాసంలోని గ్యాస్‌ సిలిండర్లు భారీ శబ్ధంతో పేలిపోయాయి. దీంతో పలు గోడలు బీటలు వారాయి. ఆందోళనకారుల రాళ్ల దాడులకు పోలీసులు సైతం పలాయనం చిత్తగించారు. దీంతో ఆందోళనకారుల విధ్వంసం అదుపు లేకుండా సాగింది. ఏలూరు రేంజ్‌ డీఐజీ పాలరాజు మంత్రి ఇంటిని పరిశీలించారు. కాగా అమలాపురం పట్టణంలోని కిమ్స్‌కు సమీపంలో మంత్రి విశ్వరూప్‌ సొంత ఇల్లు నిర్మాణాన్ని చేపట్టారు. ఆ ఇల్లు నిర్మాణ దశలోనే ఉంది. ఇటీవలే ఇంటికి కావలసిన కలపను కొనుగోలు చేసి అక్కడ పెట్టారు. ఆందోళనకారులు ఆ ఇంటికి కూడా రాత్రివేళలో నిప్పు పెట్టడంతో రూ.లక్షల విలువైన కలపతో సహా అక్కడి ఆస్తులు కూడా కాలి బూడిదైంది. ఈ ఘటనలతో చలించిపోయిన మంత్రి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.

*సుబ్రహ్మణ్యం హత్యపై సీబీఐ విచారణకు అఖిలపక్షం డిమాండ్‌ చేసింది. కాకినాడ కలెక్టర్‌కు అఖిల పక్షం నేతలు వినతిపత్రం ఇచ్చారు. హత్యకేసుపై పోలీసులు పూర్తి విచారణ చేయడం లేదని ఆరోపిస్తున్నారు. అనంతబాబుకు పోలీసులు కొమ్ముకాశారని అఖిలపక్షం పేర్కొంది. సుబ్రహ్మణ్యం హత్య విషయంలో ఎస్పీ కట్టుకథ చెప్పారని వ్యాఖ్యానించింది. ఎమ్మెల్సీ అనంతబాబుపై ఉన్న కేసులపై విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని అఖిలపక్షం డిమాండ్ చేసింది. కలెక్టర్‌ను టీడీపీ నేత గొల్లపల్ఇ సూర్యారావు సీపీఐ రామకృష్ణ కలిసిన వారిలో ఉన్నారు.