DailyDose

అటు ఎర్ర చందనం.. ఇటు బంగారం పట్టివేత – TNI నేర వార్తలు

అటు ఎర్ర చందనం.. ఇటు బంగారం పట్టివేత   – TNI  నేర వార్తలు

* కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కాసానగరం సమీపంలో ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో.. ప్రమాద స్థలంలోనే నలుగురు మరణించారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. చల్లపల్లి మండలం చింతలమడ గ్రామం నుంచి మోపిదేవి మండలం పెదప్రోలు గ్రామంలో వివాహానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన పెట్టిన ఫ్లెక్సీ.. వాహనానికి అడ్డురావడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. అవనిగడ్డ డీఎస్పీ మెహబూబ్ బాషా ఘటన స్థలాన్ని పరిశీలించించారు. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. మృతులు గుర్రం విజయ(50), బూరేపల్లి రమణ(52), బూరేపల్లి వెంకటేశ్వరమ్మ(50), కోన వెంకటేష్(70)గా పోలీసులు గుర్తించారు.

* శంషాబాద్‌లో రాజీవ్‌ అంతర్జాతీయ గాంధీ విమానాశ్రయంలో అధికారులు అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. దుబాయి నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి అధికారులు 723.39 గ్రాముల బంగారాన్ని తరలిస్తుండగా పట్టుకున్నారు. బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న బంగారం విలువ దాదాపు రూ.38లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

* ఢిల్లీలోని మ‌హిపాల్‌పూర్‌లో తెలంగాణ‌కు చెందిన ఓ వ్య‌క్తి అనుమానాస్ప‌ద‌స్థితిలో మృతి చెందాడు. శివంప‌ల్లికి చెందిన సుబ్ర‌మ‌ణియ‌న్ రాజేశ్(45) ఇటీవ‌ల ఢిల్లీకి వెళ్లారు. మ‌హిపాల్‌పూర్‌లోని ఓ హోట‌ల్‌లో మే 19న దిగాడు. అయితే 26న ఉద‌యం రాజేశ్ అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెంద‌డాన్ని హోట‌ల్ సిబ్బంది గ‌మ‌నించి, పోలీసుల‌కు సమాచారం అందించారు.

* మాదకద్రవ్యాల కేసులో చిత్తూరు జిల్లాకు చెందిన దివంగత పారిశ్రామికవేత్త డీకే ఆదికేశవుల నాయుడు కుమారుడు, పారిశ్రామికవేత్త డీకే శ్రీనివాస్‌నాయుడును ఎన్‌సీబీ అధికారులు మంగళవారం రాత్రి అరెస్ట్‌ చేశారు. బుధవారం నగర కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి కస్టడీకి ఆదేశించారు. బెంగళూరు సదాశివనగరలోని ఒక అపార్టుమెంటులో పార్టీ చేసుకుంటుండగా ఎస్‌సీబీ అధికారులు దాడి చేశారు. అక్కడ నిషేధిత మత్తు పదార్థాలు పట్టుబడటంతో శ్రీనివాస్‌నాయుడును అదుపులోకి తీసుకున్నారు.

*Chittoorలో భారీగా ఎర్రచందనం పట్టివేత
చిత్తూరు జిల్లాలోని భారీగా ఎర్రచందనాన్ని పోలీసులు పట్టుకున్నారు. కోటి రూపాయలు విలువచేసే 71 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న మూడు వాహనాలను సీజ్ చేసిన పోలీసులు 15 మందిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చిత్తూరు జిల్లా నుంచి తమిళనాడుకు ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

*పెళ్లి వేడుకలతో ఆనందం వెళ్లివిరియాల్సిన ఆ ఇంట్లో ఆక్రందనలు చోటు చేసుకున్నాయి. కృష్ణా జిల్లా మోపిదేవి సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదం నలుగురు దుర్మరణం చెందారు. పెళ్లి వేడుకలకు వెళ్తున్న తరుణంలో ప్రమాదం జరిగింది. చింతలమడ గ్రామం నుంచి పెడప్రోలు గ్రామంలో జరుగుతున్న పెళ్లి వేడుకలకు వెళ్లేందుకు పెళ్లి బృందం సిద్ధమైంది. బోలోరో వాహనంలో బంధువులు బయలుదేరారు. కాగా మోపిదేవి మండలం కాశానగర్ వద్ద వాహనం అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా… మరో 15 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను చల్లపల్లి, మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడిన 15 మందిలో పది మందికి తీవ్రగాయాలయ్యాయని… వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాద సమయంలో పరిమితికి మించి 20 మంది వాహనంలో ఉన్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

*అనకాపల్లి: జిల్లాలోని చీడికాడ మండలం వరహాపురంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా బొలెరోలో తరలిస్తున్న 1500 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పరారీలో వున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

*అన్నమయ్య: జిల్లాలోని మదనపల్లి – పుంగనూరు మార్గమధ్యలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో దంపతులతో పాటు ఇద్దరు చిన్నారులు ఉన్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులు నిమ్మనపల్లి మండలం రెడ్డివారిపల్లి వాసులుగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు

*ప్రేమ వైఫల్యంతో భవనం పదవ అంతస్థుపై నుంచి దూకి యువతి ఆత్మహత్య చేసుకుంది. మాదాపూర్ డీఎస్ఆర్ రేగంటి అపార్ట్ మెంట్‎లో శివమని( గత ఐదు సంవత్సరాలుగా కేర్ టెకర్‎గా పని చేస్తూ అక్కడే నివాసం ఉంటుంది. ఇవాళ మధ్యాహ్నం అపార్ట్ మెంట్ అంతస్థుపై నుంచి ఆమె కిందకు దూకారు. శివమని ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. యువతి తండ్రి కేశవులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

*ఎచ్చెర్లలో జాతీయరహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయరహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. నలుగురు గాయపడ్డారు. మృతులను పశ్చిమబెంగాల్ వాసులుగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

*ఉమ్మడి ఖమ్మం, సంగారెడ్డి జిల్లాల్లో మండే ఎండలతో వడదెబ్బకు గురై సోమవారం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. భద్రాద్రి జిల్లా పాల్వంచ మండలం ఒడ్డుగూడేనికి చెందిన వంకా సారమ్మ(60) మంగళవారం మేకలను కాయడానికి వెళ్లి వడదెబ్బతో తీవ్ర అవస్థతకు గురైంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందింది. పాల్వంచ మండలంలోని జగన్నాధపురం గ్రామానికి చెందిన వంట మాస్టర్‌ కంభంపాటి సైదులు(50) వడదెబ్బకు గురై బుధవారం తెల్లవారు జామున నిద్రలోనే ప్రాణాలొదిలాడు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని తిప్పారెడ్డిగూడెంకు చెందిన పోట్ల లక్ష్మమ్మ(72) వడదెబ్బతో తీవ్ర అస్వస్థతకు గురై బుధవారం మృతి చెందింది. అలాగే, సంగారెడ్డి జిల్లా ఇస్మాయిల్‌ఖాన్‌ గ్రామానికి చెందిన విద్యార్థి మాల శ్రీనివాస్‌ (17) బుధవారం జిల్లా కేంద్రంలో పదో తరగతి పరీక్ష రాసి ఇంటికి తిరిగి వెళ్లిన వెంటనే కుప్పకూలి చనిపోయాడు.

* పరీక్షల భయంతో ఇంటర్‌ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన కృష్ణాజిల్లా పెనమలూరు మండలం తాడిగడపలో బుధవారం జరిగింది. తాడిగడప శ్రీనివాసనగర్‌ కట్ట సమీపంలో నివాసముంటున్న మోకా సూర్యప్రకాష్‌ కుమార్తె మోకా అక్షయ (17) ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. మాథ్స్‌ అంటే భయం ఉన్న అక్షయ తల్లిదండ్రులు తమ ఉద్యోగాలకు వెళ్లిన తర్వాత ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

*శవ్యాప్తంగా ప్ర‌ఖ్యాతి గాంచిన పుల్లారెడ్డి స్వీట్స్‌ అధినేత జి. పుల్లారెడ్డి కుటుంబ వివాదం చివరకు కోర్టుకు చేరింది. పుల్లారెడ్డి మనవడు ఏక్‌నాథ్‌ రెడ్డిపై ఆయన భార్య ప్ర‌జ్ఞారెడ్డి పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో గృహ హింస చట్టం కేసు పెట్టిన విషయం తెలిసిందే. కాగా, ప్ర‌జ్ఞారెడ్డి బుధవారం హైద‌రాబాద్ మొబైల్ కోర్టును ఆశ్ర‌యించారు. త‌న‌ను ఇంట్లోనే నిర్బంధించి వేధింపులకు గురిచేశారని ప్ర‌జ్ఞారెడ్డి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా ఇంటిలో త‌న‌ను ఎలాంటి హింస‌కు గురి చేస్తున్నార‌న్న వైనాన్ని తెలిపే ఫొటో కాపీలను ఆమె కోర్టులో సమర్పించారు. దీంతో, ఆమె పిటిష‌న్‌పై విచార‌ణ చేప‌ట్టిన కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. బాధితురాలు ప్ర‌జ్ఞారెడ్డికి భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని పంజాగుట్ట పోలీసుల‌ను ఆదేశించింది. అనంతరం త‌దుప‌రి విచార‌ణ‌ను వ‌చ్చే నెల 9కి వాయిదా వేసింది.

*ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. జమ్మూకాశ్మీర్‌లో బుధవారం రాత్రి వరుస ఉగ్రదాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో టీవీ నటిని కాల్చి చంపడం కలకలం రేపింది. ఉగ్రదాడుల్లో ఆమె మేనల్లుడు తీవ్రంగా గాయపడ్డాడు.

*హైదరాబాద్‌ నగరంలోని చార్మినార్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. చార్మినార్‌లోని లాడ్ బజార్‌లో రెండంతస్తుల భవనంలో ఉన్న ఓ బట్టల దుకాణంలో మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి షాప్‌ మొత్తం విస్తరించాయి. దీంతో దుకాణం పూర్తిగా దగ్ధమయింది. పెద్దఎత్తున మంటలు ఎగసిపడటంతో ఆ ప్రాంతమంతా పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. షాట్‌సర్క్యూట్‌ కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

*అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లె గ్రామీణం పరిధిలోని పుంగనూరు రోడ్డులో కారు కల్వర్టును ఢీకొట్టి ఆపై కిందపడింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. పుంగనూరు రోడ్డులోని 150 మైలు వద్ద ఈ ఘటన జరిగింది. ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతులను ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. వారిలో దంపతులతో సహా ఇద్దరు పిల్లలున్నట్లు సమాచారం.

*అన్నమయ్య: జిల్లాలోని మదనపల్లి – పుంగనూరు మార్గమధ్యలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో దంపతులతో పాటు ఇద్దరు చిన్నారులు ఉన్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులు నిమ్మనపల్లి మండలం రెడ్డివారిపల్లి వాసులుగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.