NRI-NRT

నాట్కోపై అమెరికాలో కేసు

Auto Draft

నాట్కో ఫార్మా, దాని మార్కెటింగ్‌ భాగస్వామి మైలాన్‌ ఫార్మాస్యూటికల్స్‌, ఇతరులపై జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌, మొమెంటా ఫార్మాస్యూటికల్స్‌ అమెరికా కోర్టులో కేసు వేశాయి. 20 ఎంజీ/ఎంఎల్‌, 40 ఎంజీ/ఎంఎల్‌ గ్లాటిరామెర్‌ ఎసిటేట్‌ ఇంజెక్షన్‌కు సంబంధించి రెండు పేటెంట్‌ హక్కులను నాట్కో, దాని భాగస్వామి ఉల్లంఘించినట్లు పేర్కొన్నాయి. పెన్సిల్వేనియా ఫెడరల్‌ కోర్టులో కేసు దాఖలైనట్లు నాట్కో వెల్లడించింది. అయితే..ఈ కేసులో బలం లేదని నాట్కో, మైలాన్‌లు పేర్కొన్నాయి. గత ఐదేళ్లకు పైగా మార్కెట్లో ఈ ఉత్పత్తి ఉందని.. కేసుపై బలంగా తమ వాదనలు వినిపిస్తామని నాట్కో తెలిపింది.