Politics

వైకాపా పతనం ఖాయం – TNI రాజకీయ వార్తలు

వైకాపా పతనం ఖాయం  – TNI రాజకీయ వార్తలు

*సభాపతి తమ్మినేని సీతారాంపై తెదేపా నేత కూన రవికుమార్ మండిపడ్డారు. తమ్మినేనిని ఆముదాలవలసలో సజీవంగా దహనం చేస్తారని ధ్వజమెత్తారు. తమ్మినేని పాడె మోయటనికి కూడా ఎవరు ఉండరన్నారు.స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యలపై తెదేపా మాజీ ఎమ్మెల్యే కూన రవి కుమార్ మండిపడ్డారు. తల్లి పాలు తాగి రొమ్ముగుద్దే రకం తమ్మినేని అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపాకి రోజులు దగ్గర పడ్డాయన్న వారికే.. రోజులు దగ్గరపడ్డాయని కూన రవి కుమార్ హెచ్చరించారు. ఒకరిద్దరికి మంత్రి పదవులిచ్చినంత మాత్రాన బీసీలకు ఒరిగేదేంలేదన్న ఆయన.. వైకాపాను పడగొట్టడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన వెల్లడించారు. వైకాపా తన చితికి తానే నిప్పు పెట్టుకుంటోందన్నారు.

* కేసీఆర్ మోదీమధ్య రాజకీయ అవగాహన:జగ్గారెడ్డి
ప్రధాని నరేంద్రమోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటనలపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పలు అనుమానాలు వ్యక్తం చేశారు.గాంధీభవన్‌లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని రాష్ట్రానికి వచ్చినప్పుడు రాష్ట్ర సమస్యలు అడిగే బాధ్యత సీఎంకు లేదా అని ప్రశ్నించారు. ప్రధానిని ప్రశ్నించే అవకాశం ఉన్నప్పటికీ కేసీఆర్ ఆ పని ఎందుకు చేయడం లేదని నిలదీశారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రజల ముందే ప్రధానిని నిలదీశారన్నారు. మరి సీఎం కేసీఆర్ ఆ పని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.ప్రధాని మోదీ రాష్ట్రానికి రావడం.. సీఎం కేసీఆర్ వెళ్ళడం.. ఇది పూర్తి అవగాహనతోనే జరిగిందని ఆరోపించారు.”కేసీఆర్‌, మోదీ మధ్య రాజకీయంగా అవగాహన ఉంది. భాజపా, తెరాస పరస్పర విమర్శలు ఒక నాటకం. ప్రజా సమస్యల మీద ప్రధాని మోదీ ఎందుకు స్పందించలేదు? ఒక్కో పేదవాడి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామన్న హామీపై ప్రధాని ఎందుకు మాట్లాడలేదు?భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉద్యోగాల భర్తీ పై మోదీని ఎందుకు అడగలేదు? మత విద్వేషాలు రెచ్చగొట్టేలా బండి సంజయ్ మాట్లాడటం సరికాదు. అందరూ బాగుండాలని కోరుకునే పార్టీ కాంగ్రెస్. భాజపాకు వ్యతిరేకంగా కేసీఆర్‌ తిరగడం లేదు. రాజకీయ విమర్శలు మాని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయాలి” అని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.

*బీజేపీ అంటేనే జూటా పార్టీ:మంత్రి Malla reddy
బీజేపీ అంటేనే జూటా పార్టీ అని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి విమర్శించారు. దేశాన్ని బీజేపీ ప్రభుత్వం నాశనం చేస్తోందని ఆయన ఆరోపించారు. శుక్రవారం భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాన మంత్రి మోదీ సీఎం కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. బీజేపీ కౌరవుల నుంచి దేశానికి విముక్తి కల్పించాలని దేవుడిని కోరుకున్నట్టు తెలిపారు.కేసీఆర్‌ను ప్రధానిని చేయాలని భద్రకాళిని ప్రార్థించానని మంత్రి మల్లారెడ్డి అన్నారు.

*నీతిని, ధర్మాన్ని గెలిపించాలి: తుమ్మల
పార్టీలో ఉండి పార్టీకి ద్రోహం చేసే వారికి చెంపపెట్టులా నీతిని, ధర్మాన్ని గెలిపించాలని కార్యకర్తలకు మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. శుక్రవారం ముత్తగూడెంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ గావించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాలేరు ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే పెద్ద పాలేరులా పనిచేస్తానని చెప్పానని అన్నారు. 70 ఏళ్లుగా లేని అభివృద్ధిని మూడేళ్లలో సాధించి పాలేరు తలరాత మార్చానని తెలిపారు. పదిమందికి సాయం చేసేలా పాలేరుని అభివృద్ధి చేశామన్నారు.భక్త రామదాసు ప్రాజెక్టుతో భూముల రేట్లు పెరిగాయని చెప్పారు.గతంలో 5 లక్షలు లేని ఎకరం భూమి ఈరోజు 40 లక్షలకు పైగా ఉందన్నారు.సాగునీరు రహదారులతో పాలేరు నియోజకవర్గం ఆదర్శంగా నిలిచిందని చెప్పారు.పాలేరు అభివృద్ధిని ఓర్వలేని కొన్ని శక్తులు ఎన్నికల్లో వెన్నుపొటు పొడిచాయని మండిపడ్డారు. పాలేరు ప్రజల ప్రేమాభిమానాలతో మళ్లీ ఇక్కడే ప్రజాసేవకు అంకితం అవుతానని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.

*త్వరలో మెదక్ రైల్వే లైన్ అందుబాటులోకి వస్తుంది:Harish rao
త్వరలో మెదక్ రైల్వే లైన్ అందుబాటులోకి వస్తుందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. శుక్రవారం మెదక్లో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్లో మాతా శిశు ఆరోగ్య కేంద్రం అద్భుతంగా ఉందని ప్రశంసించారు. త్వరలో వైద్య కళాశాలకు సంబంధించి ఉత్తర్వులు అందజేస్తామని మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. వైద్య రంగానికి తెలంగాణ సర్కార్ పెద్దపీట వేస్తుందని అన్నారు.తెలంగాణలోని ప్రభుత్వ దవాఖానాలను కార్పొరేట్ స్థాయిలో సేవలు అందించే విధంగా తీర్చిదిద్దతున్నట్టు తెలిపారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో వుండే సౌకర్యాలన్నీ ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ కల్పిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని అన్నారు. అందుకే ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్నిసౌకర్యాలను కల్పిస్తున్నట్టు తెలిపారు. ఇక మెదక్ రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే ప్రస్తుతం ఇక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులన్నీ తొలగి పోతాయన్నారు.

*modi, kcr పర్యటనలపై అనుమానాలున్నాయి: జగ్గారెడ్డి
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సీఎం కేసీఆర్ పర్యటనలపై అనుమానాలున్నాయని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని వచ్చినప్పుడు రాష్ట్ర సమస్యలు అడిగే బాధ్యత సీఎంకు లేదా? అని ప్రశ్నించారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రజల ముందే ప్రధానిని నిలదీశారని చెప్పారు. కేసీఆర్ ఆ పని ఎందుకు చేయలేదు?అని ప్రశ్నించారు. కేసీఆర్, మోదీ మధ్య పొలిటికల్ అండర్ స్టాండింగ్ ఉందన్నారు.మత విద్వేశాలు రెచ్చగొట్టడం సరికాదన్నారు. ప్రధాని మోదీ రావడం, కేసీఆర్ వెళ్లడమంటే ఇద్దరి అవగాహనలో భాగమేనని చెప్పారు..

*KCRపై అవినీతిని వెలికి తీసి ప్రధాని చిత్తశుద్ధి చాటుకోవాలి: Ponnala
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ పొరుగు రాష్ట్రానికి తప్పించుకు వెళ్లడం దుర్మార్గమని మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… నిన్నటి రోజు ప్రజాస్వామ్యంలో చీకటి రోజన్నారు. స్వయంగా ప్రధాని నోటి వెంట కేసీఆర్‌పై అవినీతి వ్యాఖ్యలు చేశారని తెలిపారు. మాటలకు పరిమితం కాకుండా సీఎం కేసీఆర్‌పై అవినీతిని వెలికి తీసి ప్రధాని చిత్తశుద్ధి చాటుకోవాలని సవాల్ విసిరారు. ప్రధాని దగ్గర కేసీఆర్ అవినీతిపై ఆధారాలు ఉంటే రాష్ట్రపతి పాలన పెట్టి కేసీఆర్‌పై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. అవినీతి సొమ్ముతో దేశ పర్యటన చేస్తున్న చిల్లర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అని వ్యాఖ్యానించారు. తెలంగాణ సమస్యలపై మాట్లాడకుండా కేవలం ప్రధాని మోదీ కేవలం రాజకీయం మాట్లాడడం దుర్మార్గమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రజలు చెంపదెబ్బ కొట్టే రోజులు దగ్గర్లో ఉన్నాయని పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు.

*వ్యవస్థలపై Jaganకు నమ్మకం లేదు: సోమిరెడ్డి
టీడీపీ మహానాడులో ఆ పార్టీ నేతలు తీర్మానాలు ప్రవేశపెడుతున్నారు. ఇప్పటివరకు 4 తీర్మానాలను ప్రవేశపెట్టారు. ప్రభుత్వ వేధింపులు, బాదుడే బాదుడు, సంక్షేమ పథకాల్లో మోసం, కష్టాల కడలిలో సేద్యం అంశాలపై తీర్మానాలకు మహానాడు ఆమోదం తెలిపింది. ప్రజాస్వామిక వ్యవస్థల విధ్వంసంపై మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ వ్యవస్థలపై సీఎం జగన్‌రెడ్డికి నమ్మకం లేదని ఆరోపించారు. పరిపాలనా వ్యవస్థను జగన్ భ్రష్టుపట్టించారని దుయ్యబట్టారు. వైఎస్ హయాంలో జగన్‌ చేసిన అవినీతికి ఐఏఎస్‌లు జైలు పాలయ్యారని గుర్తుచేశారు. అధికారులను వాడుకుని వదిలేయడం జగన్‌కు అలవాటని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు.

*ycp పాలనలో తీవ్ర సంక్షోభంలో రైతాంగం: ధూళిపాళ్ల
రాష్ట్ర ప్రభుత్వ పాలనపై టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర నిప్పులు చెరిగారు. వైసీపీ పాలనలో రాష్ట్ర రైతాంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోయిందని చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 45 లక్షల ఎకరాల పంటల సాగు ఉంటే.. వైసీపీ ప్రభుత్వం కేవలం 15 లక్షల ఎకరాలకే ఇన్స్యూరెన్స్ ఇచ్చిందన్నారు. పెట్రో ధరల భారం కారణంగా రైతుల పైనా తీవ్ర భారం పడుతుందన్నారు. మోటార్లకు మీటర్లు పెడితే రైతులకు లాభమని మంత్రులు వింత వాదన చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ రైతులకు మీటర్ల పెట్టబోమని స్పష్టంగా చెపితే.. జగన్ మీటర్లు పెట్టి ఉరితాళ్లు వేస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ హయాంలో రైతులకు ఉన్న పథకాలు అన్నీ ఆగిపోయాయని చెప్పారు.

*Thammineniపై కూన రవి ఆగ్రహం
స్పీకర్ తమ్మినేని సీతారాం పై టీడీపీ నేత కూన రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ మహానాడులో ఆయన మాట్లాడుతూ మహానాడును వల్లకాడని తమ్మినేని మాట్లాడడం సరికాదన్నారు. తల్లిపాలు తాగి రొమ్ముగుద్దే రకం తమ్మినేనిదని విమర్శించారు. తమ్మినేనిని ఆముదాలవలసలో సజీవ దహనం చేస్తారని హెచ్చరించారు. తమ్మినేని పాడె మోయటానికి కూడా ఎవరూ ఉండరన్నారు. టీడీపీకి రోజులు దగ్గర పడ్డాయన్న వారికే రోజులు దగ్గరపడ్డాయన్నారు. వైసీపీకి గద్దె దించడానికి ప్రజలు రెడీగా ఉన్నారని తెలిపారు. వైసీపీ తన చితికి తానే నిప్పు పెట్టుకుంటోందని కూన రవి చెప్పారు.

*తెలంగాణ రాష్ట్రానికి ప్రధాని ఏం చేశారో చెప్పగలరా?:Talasani
తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏం చేశారో చెప్పగలరా? అంటూ పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. కేవలం తెలంగాణ పైనా, ముఖ్యమంత్రి కేసీఆర్ పైనా ప్రధాన మంత్రి మోదీ తన అక్కసు వెళ్లబోసుకున్నారని అన్నారు. శుక్రకవారం TRSLP లో మంత్రి తలసాని మరో మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో లేదా?కాళేశ్వరం ప్రాజెక్టు కు జాతీయ హోదా ఎందుకు ఇవ్వరని అన్నారు.రాష్ట్రానికో వేషం, తీరొక్క డ్రెస్సు లతో షోవింగ్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

*ఏపీ కంటే కర్ణాటకలో పెట్రోల్ ధరలు తక్కువ: Ramakrishna
పెట్రోల్, డీజిల్ ధరలపై పన్నుల భారం తగ్గించాలని వినతి చేస్తూ సీఎం జగన్కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. ఏపీ కంటే కర్ణాటకలో పెట్రోల్ ధరలు తక్కువ అని అన్నారు. పెట్రో ఉత్పత్తులపై రాష్ట్రాలు పన్నులు తగ్గించాయని తెలిపారు. రాష్ట్రంలో నిత్యవసరాల ధరలు పెరిగాయని మండిపడ్డారు. విద్యుత్, బస్సు ఛార్జీలు, ఆస్తి, చెత్త పన్నులు పెంచారన్నారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే ధరలు, పన్నుల భారాలు తగ్గించాలంటూ రామకృష్ణ లేఖలో డిమాండ్ చేశారు.

*వైసీపీ లాగా టీడీపీ గాలికి పుట్టిన పార్టీ కాదు: అచ్చెన్నాయుడు
చంద్రబాబు సీఎం కాగానే కార్యకర్తలదే అధికారమని ఏపీ టీడీపీ(TDP) అధ్యక్షుడు మహానాడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఇబ్బంది పెట్టిన వారిని కార్యకర్తలతోనే శిక్షలు విధించేలా న్యాయబద్దమైన.. చట్టబద్దమైన అధికారాలు కల్పిస్తామన్నారు. చంద్రబాబు సీఎం కాగానే కార్యకర్తలపై తప్పుడు కేసులను ఒక్క సంతకంతో ఎత్తేస్తామన్నారు. వైసీపీ(YCP) చేపడుతోన్న బస్ యాత్రలో వస్తున్నది మంత్రులు కాదని.. అలీబాబా దొంగలు వస్తున్నారన్నారు. ఇంకా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబును సీఎం చేయడానికి కార్యకర్తలు శపథం చేశారు. అధికారం ఉన్నా.. లేకున్నా.. ప్రజల కోసమే టీడీపీ రాజకీయం చేస్తున్నారు. గత మూడేళ్లుగా చంద్రబాబు మొదలుకుని.. సాధారణ కార్యకర్త వరకూ చాలా ఇబ్బందులు పడ్డారు. వైసీపీ లాగా టీడీపీ గాలికి పుట్టిన పార్టీ కాదు. టీడీపీ ప్రజల మనస్సుల్లో నుంచి పుట్టిన పార్టీ. టీడీపీని లేకుండా చేయడం జగన్.. తాత, తండ్రి వల్ల కూడా కాలేదు. రోడ్డెక్కడానికి భయపడే పరిస్థితి నుంచి రోడ్డెక్కి పోరాటం చేసే స్థితికి కార్యకర్తలు చేరారు. చంద్రబాబు ప్రజల్లోకి రాగానే రాష్ట్రం షేక్ అయింది. ఉత్తరాంధ్రలోనే కాదు.. చంద్రబాబు కడప వెళ్తే ఆ జిల్లా దద్దరిల్లింది’’ అని పేర్కొన్నారు.

*కార్మికులను కేంద్రం ఇబ్బంది పెడుతోంది: మంత్రి Errabelli
కార్మికుల సమస్యలు అన్ని పరిష్కారం అవుతాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శుక్రవారం కార్మిక మాసోత్సవంలో మంత్రి మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం కార్మికులంటేనే ఇబ్బంది పెడుతోందని మండిపడ్డారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ వస్తే చాలా ఉద్యోగాలు వచ్చేవని… కాంగ్రెస్ , బీజేపీ తొక్కిపడేశాయని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కార్మికులను నాశనం చేశాయని విమర్శించారు. బీజేపీ ప్రైవేటు వ్యవస్థను తీసుకువస్తోందని.. అన్నీ ప్రైవేటు పరం చేస్తున్నారని ఆరోపించారు. వ్యవసాయరంగాన్ని కేంద్రప్రభుత్వం నాశనం చేసిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

*గొడ్డలిపోటును గుండెపోటని చెప్పి రాజకీయాలు చేశారు: చంద్రబాబు
గొడ్డలిపోటును గుండెపోటని చెప్పి రాజకీయాలు చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. నేడు ఒంగోలు లో జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కోడి కత్తి డ్రామా ఆడారన్నారు. ఒక్క ఛాన్స్‌ అంటే ప్రజలు నమ్మారన్నారు. డ్రైవర్‌ సుబ్రహ్మణ్యంను ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేశాడన్నారు. సమస్యను పక్కదారి పట్టించేందుకు కోనసీమ అల్లర్లు తీసుకొచ్చారన్నారు. కోనసీమలో కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని వాపోయారు. ఇంకా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘మంత్రిని కాపాడిన పోలీసులు ఇల్లు తగలబడుకుండా ఎందుకు ఆపలేదు? మీరే దాడిచేసుకొని మీరే రాజకీయం చేస్తున్నారు. రాజ్యసభ సీట్లలో ముగ్గురు మరో రాష్ట్రం వాళ్లకు ఇచ్చారు. సహ నిందితులకు రాజ్యసభ సీట్లు ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా తెస్తామన్నారు ఏమైంది? 25 మంది ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదా తెస్తామన్నారు. పోలవరం ఏమైంది..? విభజన హామీల అమలు ఏమయ్యాయి? గెలిచిన తర్వాత కేంద్రం దగ్గర మెడలు వంచి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు. జగన్‌ దిగిపోతే తప్ప మంచి రోజులు రావు. జగన్‌ అండ్‌ కంపెనీ ఆదాయం పెరిగింది. క్విట్‌ జగన్‌.. సేవ్‌ ఏపీ నినాదం ప్రతి ఇంట్లో వినిపించాలి.

*వచ్చే ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకే..: చంద్రబాబు
వచ్చే ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకే కేటాయిస్తామని టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. నేడు ఒంగోలు లో జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. నేడు పార్టీకి కొత్త రక్తాన్ని ఎక్కించాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ కోసం పనిచేసే వాళ్లకే అవకాశాలు వస్తాయన్నారు. రాష్ట్ర అప్పుల భారం రూ.8 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. వైసీపీ అవినీతి వల్లే రాష్ట్రం దివాళా తీసిందన్నారు. ఇంకా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘సంక్షేమం లేదు.. అంతా మోసకారి సంక్షేమమే. వైసీసీ ప్రభుత్వానికి పాలించే అర్హత లేదు. నిన్న ప్రధాని నా పేరును ప్రస్తావించకపోవచ్చు. కానీ నా కృషి వల్లే ISB.. హైదరాబాద్‌కు వచ్చింది. రూ.2 లక్షల కోట్ల సంపదను నాశనం చేశారు. పోలవరం డయాఫ్రం వాల్‌ కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. మద్యం, గంజాయి, డ్రగ్స్‌తో రాష్ట్రాన్ని నేరాంధ్రప్రదేశ్‌గా మార్చారు. కేంద్రం దగ్గర రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు. ప్రాజెక్టులు కట్టడం చేతకాకపోతే ఏపీ ప్రభుత్వం గద్దె దిగిపోవాలి’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

*కేసీఆర్ పట్ల మోదీ వ్యాఖ్యలు ఆయన స్ధాయికి తగ్గట్టుగా లేవు:Errabelli
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలు ఆయన స్ధాయికి తగ్గట్టుగా లేవని పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ఫైర్ అయ్యారు. అవ‌గాహ‌న లేకుండా, చ‌రిత్ర తెలియ‌కుండా, మోడీ చేసిన కామెంట్స్ ఆయ‌న ప‌ద‌వికి త‌గ్గ‌ట్టుగా లేవ‌న్నారు.మోదీకి కుటుంబం లేద‌ని, అందువ‌ల్ల ఆయ‌న‌కు సెంటిమెంట్లు తెలియ‌వ‌న్నారు. సీఎం కేసిఆర్ ది కుటుంబ పాల‌న కాద‌ని, ఆయ‌న కుటుంబ‌మంతా తెలంగాణ కోసం ఉద్య‌మించి జైళ్ళ‌కు పో్యి త్యాగాలు చేసిందని అన్నారు. ప్ర‌జాస్వామ్య బ‌ద్ధంగా ప్ర‌జ‌ల చేత ఎన్నుకోబ‌డిన వారిని అవ‌మానించ‌డ‌మంటే రాజ్యాంగాన్ని, ప్ర‌జాస్వామ్యాన్ని అవ‌హేళ‌న చేయ‌డ‌మేన‌ని మంత్రి ఎర్ర‌బెల్లి అన్నారు. ఈ మేర‌కు ఆయ‌న హైద‌రాబాద్ లోని త‌న మంత్రుల నివాసంలో మీడియాతో మాట్లాడారు. ప్ర‌ధాన మంత్రి స్థాయిలో లేవునీచంగా, దిగ జారి మాట్లాడిన‌ట్లుగా ఉన్నాయన్నారు. తెలంగాణ ఏర్పాటును పార్ల‌మెంటులో కించపరిచిన మోదీ తెలంగాణ ప్ర‌జ‌ల‌ను నూక‌లు తిన‌మ‌ని అవ‌మాన పరిచారని గుర్తు చేశారు. తెలంగాణ‌కు న‌యా పైసా ఇవ్వ‌కుండా వివ‌క్ష చూపిస్తూనే ఉన్న‌వు మోదీ ఇవ్వాళ వ‌చ్చి తెలంగాణ‌పై క‌ప‌ట ప్రేమ చూపిస్తే ఎవ‌రూ న‌మ్మ‌రని అన్నారు. తెలంగాణ ప్ర‌జ‌లంటే అభిమాన‌మ‌ని మ‌రోసారి అవ‌మాన ప‌రుస్తున్నారు.ఇంత కంటే దిగ‌జారుడు ఇంకోటి లేదన్నారు.తెలంగాణ ఉద్య‌మంలో ప్ర‌జ‌ల‌తో క‌లిసి ఆయ‌న కుటుంబం అంతా పాల్గొన్న‌ది.ఎన్నో త్యాగాలు చేసి, ప్ర‌జాస్వామ్య బద్ధంగా ప్ర‌జ‌ల చేత‌ గెలిచిన నేత‌లని అన్నారు.వారిది కుటుంబ పాల‌న ఎలా అవుతుందని మంత్రి ప్రశ్నించారు.తెలంగాణ పై విక్ష‌వ‌, విషం చిమ్మ‌డం, విద్వేషంతో మాట్లాడ‌ట‌మే మీ ప‌నా?అయితే మ‌తం లేక‌పోతే ప్రాంతాల పేరుతో ప్ర‌జ‌ల్లో చిచ్చు పెడుతున్నారని విమర్శించారు.

*కుటుంబ రాజకీయాల గురించి మోదీ మాట్లాడటం సిగ్గుచేటు: హరీష్‌రావు
కుటుంబ రాజకీయాల గురించి ప్రధాని మోదీ మాట్లాడటం సిగ్గుచేటని మంత్రి హరీష్‌రావు దుయ్యబట్టారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘మోదీ ప్రసంగం బీజేపీ కార్యకర్తలకు నచ్చుతుంది కావొచ్చు. గురివింద గింజ తన నలుపు చూసుకోవాలి. కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ కుమారుడు బీజేపీలో లేడా?. యూపీలో పొత్తు పెట్టుకున్న అప్నాదళ్‌ కుటుంబ పార్టీ కాదా?.. మీ తప్పులు ఎత్తి చూపితే కుటుంబ పార్టీ అంటారు. గతంలో పంజాబ్‌లో అకాళీదళ్‌తో అధికారం పంచుకోలేదా?.. మోదీ ఒక వేలు ఎత్తి చూపితే.. నాలుగు వేళ్లు మీవైపే చూపిస్తాయి. కేసీఆర్‌ది కుటుంబ పార్టీ కాదు.. తెలంగాణే ఓ కుటుంబం. రాష్ట్రాన్ని కుటుంబంగా భావిస్తే పరిపాలించే నాయకుడు కేసీఆర్‌. అధికారం లాక్కుంటే రాలేదు. ప్రజలే అధికారం ఇచ్చారు’’ అని హరీష్‌రావు తెలిపారు.

*తెలంగాణ పై విషం చిమ్ముతున్నమోది: Gangula kamalakar
ప్రధాని మోదీ మరోసారి తెలంగాణ రాష్ట్రంపై విషం చిమ్మారని, తెలంగాణ రాష్ట్రమన్నా, ఉద్యమ నేత కేసీఆర్కు టుంబమన్నా బీజేపీకి భయం అని మంత్రి గంగుల కమలాకర్అ న్నారు. గురువారం నగరానికి వచ్చిన మోదీ ప్రసంగంపై ప్రకటనలో తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు.తెలంగాణ ఉద్యమంలో అగ్రపథాన.సింహబాగం ఉన్నది కేసీఆర్ కుటుంబం అని, కేసీఆర్ కుటుంబం ప్రజలతో ఎన్నుకోబడ్డారని, ప్రజల ఆశీర్వాదంతో వారు రాజకీయాల్లో ఉన్నారని, నామినేటెడ్ గా రాలేదన్నారు, బీజేపీ మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తున్నదని విమర్శించారు.గత ప్రభుత్వాల హాయంలో మత విద్వేశాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకున్నారని, హైదరాబాద్ నగరంలో కర్య్పూలు, విద్వంసం ఉండేదని, నేడు కేసీఆర్ నేత్రుత్వంలో శాంతి భద్రతలు బాగున్నాయన్నరు.

*బండి సంజయ్‌పై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ పై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారుు. మతాల మధ్య చిచ్చుపెట్టాలని బండి సంజయ్‌ చూస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో ఉండడం ఇష్టం లేకపోతే యూపీ కి వెళ్లి ఉండాలని హితవు పలికారు. జూన్‌లో తెలంగాణ అమరవీరుల సంతాప సభలు ఏర్పాటు చేస్తానని తెలిపారు. అటు ఏపీలో కూడా త్వరలో పర్యటిస్తానని కేఏ పాల్ పేర్కొన్నారు.

*బెంగళూర్‌లో కేసీఆర్‌ను కలిసిన బిసి కమిషన్‌ చైర్మన్‌ Krishna mohan
గత రెండు రోజులుగా తమ అధ్యయనంలో భాగంగా కర్ణాటక రాష్ట్ర పర్యాటనలోఉన్నతెలంగాణ రాష్ట్ర బిసి కమిషన్‌ బృందం ముఖ్యమంత్రి కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసింది.గురువారం బెంగళూర్‌కు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను స్థానిక లీలా ప్యాలెస్‌లో కమిషన్‌ చైర్మన్‌ డా॥ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు సారధ్యంలో సభ్యులు సిహెచ్‌ ఉపేంద్ర, శుభప్రద్‌ పటేల్‌ నూలి, కె.కిషోర్‌ గౌడ్‌లు ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ అధ్యయన వివరాలను సీఎమ్‌ కేసీఆర్‌కు వివరించారు. మరో రెండు రోజుల పాటు ఇక్కడే ఉండి ముఖ్య ప్రభుత్వ అధికారులు, న్యాయ నిపుణులు, సామాజిక వేత్తలు, తదితరులను కలుసుకోనున్నట్లు చైర్మన్‌ వివరించారు. బిసి కమిషన్‌ కొనసాగిస్తున్న అధ్యయన వివరాలను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు, ఇదే విధంగా ప్రత్యేక స్పూర్తితో కొనసాగించాలని ముఖ్యమంత్రి సూచించారు.

*విద్యార్ధులను శాస్త్ర,సాంకేతిక రంగాల వైపు నడిపిస్తాం:Indra karan reddy
వ‌ర్త‌మాన స‌మాజానికి అనుగుణంగా విద్యార్థులను శాస్త్ర – సాంకేతిక రంగాల వైపు న‌డిపించేందుకు, సంబంధిత రంగాల్లో విష‌య వివేచ‌న పెంపొందించుకునేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం కృషి చేస్తుంద‌ని ప‌ర్యావ‌ర‌ణ‌, శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. స్వ‌రాష్ట్రంలో తెలంగాణ శాస్త్ర‌, సాంకేతిక మండ‌లి సాధించిన విజ‌యాలు, ప్ర‌గ‌తిపై మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఓ ప్ర‌క‌ట‌న విడుదల చేశారు. సైన్స్ అండ్ టెక్నాల‌జీని ఉపయోగించి రాష్ట్ర ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతుల‌ను మార్చేందుకు టీఎస్‌కాస్ట్ మంచి ప‌నితీరును క‌న‌బ‌రుస్తుంద‌ని చెప్పారు. రూ.14.51 కోట్ల‌తో వినూత్నంగా 7 ప్రాజెక్ట్ ల‌ను అమ‌లు చేస్తుంద‌ని, వాటిలో వరంగల్ లోని రీజిన‌ల్ సైన్స్ సెంట‌ర్ (ఆర్‌ఎస్‌సీ) లో ఇన్నోవేషన్‌ హబ్, విశ్వవిద్యాలయాలు/పరిశోధనా సంస్థల్లో ప్రాజెక్టులు, బయోటెక్నాలజీ కింద స్కిల్ డెవలప్‌మెంట్‌, వరంగల్‌ సైన్స్‌ సెంటర్‌లో ఎస్‌-ఎస్‌టీ సెల్‌ ఏర్పాటు, నేషనల్‌ సైన్స్ డే & నేషనల్‌ మ్యాథమ్యాటిక్స్ డే వేడుకలు, త‌దిత‌ర కార్య‌క్ర‌మాల‌ను నిర్వహిస్తుంద‌ని పేర్కొన్నారు. రూ. 42.41 కోట్ల‌తో నిర్మ‌ల్ లో సైన్స్ సెంటర్‌, ప్లానిటోరియం ఏర్పాటుకు కేంద్ర ప్ర‌భుత్వానికి ప్ర‌తిపాద‌న‌లు పంపామ‌న్నారు. సైన్స్ సెంట‌ర్ కు 5 ఎక‌రాల స్థ‌లాన్ని ఇప్ప‌టికే కేటాయించిన‌ట్లు వెల్ల‌డించారు. కేంద్ర ప్ర‌భుత్వం ఆమోదం త‌ర్వాత ప‌నులు ప్రారంభిస్తామ‌ని చెప్పారు. సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్‌ అండ్ సోషల్ స్టడీస్‌ , టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ , జవహర్‌ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ సహకారంతో టీఎస్‌కాస్ట్ ఆద్వ‌ర్యంలో ఎస్సీ, ఎస్టీ సెల్‌ ఏర్పాటు చేసి, ఈ ప్రాజెక్టును అమలు చేస్తామ‌న్నారు. మొత్తం 8 క్ల‌స్ట‌ర్ల‌ను ఎంపిక చేసి ఎస్సీ క్యాట‌గిరీలోవరంగల్‌ రూరల్‌ జిల్లా పర్వతగిరి మండలం, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం, ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం, నిర్మల్‌ జిల్లా సారంగపూర్‌ మండలం, కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలాల్లో 5 క్ల‌స్ట‌ర్లు, ఎస్టీ క్యాట‌గిరీలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి, ములుగు జిల్లా ఏటూరు నాగారం 3 క్ల‌స్ట‌ర్లను ఎంపిక చేశామ‌న్నారు. వరంగల్‌ రీజినల్‌ సైన్స్‌ సెంటర్ దీన్ని ఏర్పాటు చేస్తున్న‌ట్లు చెప్పారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా విద్యావంతులైన యువతకు ఉపాధి, స్వయం ఉపాధి లేదా వ్యవస్థాపక కార్యకలాపాలు చేపట్టేలా నైపుణ్య శిక్షణ ఇస్తార‌న్నారు.

*ఉద్యమకారుడు పాలకుడైతే అభివృద్ధిని పరుగులెత్తిస్తాడు:Gangula kamalakar
ఉద్యకారుడు పాలకుడైతే అభివృద్ధిని పరుగులెత్తిస్తాడనడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్పగా ఉదాహరణగా నిలుస్తారని బిసి, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ లో ఎటు చూసినా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. నగరంలో 9.90 లక్షలతో చేపట్టనున్న కుర్మ కమ్యూనిటీ హాలు నిర్మాణానికి మంత్రి గంగుల శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాకముందు కూడా ఇక్కడి ప్రజలు పన్నులు కట్టారు.అయినా అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు.కరీంనగర్ అభివృద్ధి కోసం ప్రభుత్వం వేల కోట్లు విడుదల చేస్తున్నదని చెప్పారు.

*హోదా ఇస్తేనే రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు అనగలరా?
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తేనే రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిస్తామని చెప్పగలరా అంటూ వైసీపీని ఆ పార్టీ ఎంపీ రఘురామ రాజు నిలదీశారు. పోయినసారి రాష్ట్రపతి అభ్యర్థిగా దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఎంపిక చేయడం వల్ల తాము స్వచ్ఛందంగా బీజేపీకి మద్దతిచ్చామని తమ పార్టీ నేత విజయసాయి రెడ్డి చెప్పిన విషయాన్ని రఘురామ రాజు ప్రస్తావించారు. ఈసారి బీజేపీ అడిగితే మద్దతిచ్చే అంశాన్ని పరిశీలిస్తామని విజయసాయి చెప్పడం పట్ల ఆయన విస్మయం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై సంతకం పెడితేనే ఈసారి మద్దతిస్తామని చెప్పగలరా అని ఆయన విజయసాయిని సూటిగా ప్రశ్నించారు. లేకపోతే వివేకా హత్య కేసులో తమ వారి ప్రమేయం లేదని, అలాగే తనపై ఉన్న కేసుల్లో నిర్దోషిగా ప్రకటించాలని విజయసాయి కోరే అవకాశం ఉందని రఘురామ వ్యాఖ్యానించారు. గురువారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల ముందు తమ పార్టీ అధ్యక్షుడి హోదాలో సీఎం జగన్‌ అనేక హామీలు ఇచ్చారని, మూడేళ్లయినా అమలు చేయలేదని రఘురామరాజు విమర్శించారు. ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను అమలు చేయని రాజకీయ నాయకులను బంగాళాఖాతంలో కలిపే పరిస్థితి రావాలన్న జగన్‌… ప్రజల ఆశీర్వాదంతో తమ ప్రభుత్వం ఏర్పడితే వారం రోజుల్లో సీపీఎస్‌ రద్దు చేస్తానని హామీ ఇచ్చిన విషయాన్ని రఘురామ గుర్తు చేశారు. డీఎస్సీ నోటిఫికేషన్‌, జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించకుండా నిరుద్యోగ యువతను దగా చేశారని అన్నారు. మరోవైపు, కోనసీమ ఘటనకు సంబంధించి మంత్రి విశ్వరూప్‌ అద్దెకు ఉంటున్న ఇల్లు తగులబడడం, నూతనంగా నిర్మించుకున్న ఇల్లు మాత్రం పాక్షికంగా దెబ్బతినడం… కోనసీమ జిల్లా ఉద్యమానికి తమ పార్టీ బీసీ విభాగం నాయకుడు మురళీ కృష్ణ నేతృత్వం వహించడం, సాయి ఉదంతం ఇలా అన్నీ పరిశీలిస్తే.. ఈ మొత్తం ఘటనల వెనుక ఎవరున్నారో స్పష్టమవుతోందని వ్యాఖ్యానించారు. కోనసీమ ఘటన వెనుక కౌన్సిలర్‌, వాలంటీర్‌, బీసీ నాయకులు ఉన్నారని, ఓ వలంటీరు 50 మందిని ఇతర ప్రాంతం నుంచి తరలించినట్లుగా పక్కా సమాచారం ఉందని, డీఎస్పీపై జరిగిన రాళ్ల దాడిలో వాళ్లు పాల్గొన్నట్లు ఆధారాలు ఉన్నాయని వెల్లడించారు. మాల మహానాడు అధ్యక్షుడిగా పనిచేసిన జూపూడి ప్రభాకర్‌రావు సంయమనం కోల్పోయి మాట్లాడుతున్నారని, మరొక సామాజికవర్గాన్ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేయడం ఆయనకు తగదని సూచించారు. కాగా, దావోస్‌ వెళ్లిన బృందంలోని ఎంపీ మిథున్‌ రెడ్డితో సీబీఐ కేసు ఎదుర్కొంటున్న పంచ్‌ ప్రభాకర్‌ భేటీ కావడం ఆశ్చర్యంగా ఉందన్నారు. సీఎం జగన్‌తో కూడా ప్రభాకర్‌ భేటీ అయినట్లు తెలుస్తోందని, సీబీఐ కేసులలో ఏ1 నిందితుడిగా ఉండి, కోర్టు అనుమతితో విదేశాలకు వెళ్ళిన వ్యక్తి… సీబీఐ గాలిస్తున్న మరొక వ్యక్తితో భేటీ కావడాన్ని కోర్టులు ప్రశ్నిస్తాయని భావిస్తున్నానని చెప్పారు.

*కేసీఆర్‌ అవినీతిపై చర్యలేవి
కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట కేసీఆర్‌ వేల కోట్లు దోచుకున్నారని స్వయంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డానే చెప్పారు. కేంద్రం వద్ద ఆధారాలు ఉంటే కేసీఆర్‌ అవినీతిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి నిలదీశారు. హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటిస్తున్న నేపథ్యంలో ఆయనకు తొమ్మిది ప్రశ్నలు సంధిస్తూ రేవంత్‌ బహిరంగ లేఖ రాశారు. ఎనిమిదేళ్లుగా బీజేపీ-టీఆర్‌ఎస్‌ మధ్య ఫెవికాల్‌ బంధం ఉన్నప్పటికీ ఇక్కడి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో రెండు ప్రభుత్వాలూ విఫలమయ్యాయని విమర్శించారు. రాజకీయ ప్రయోజనాలు తప్ప.. రాష్ట్ర ప్రయోజనాలు రైతులు యువత ఎదుర్కొంటున్న సమస్యలు రెండు ప్రభుత్వాలకు పట్టడం లేదని మండిపడ్డారు. బీజేపీ-టీఆర్‌ఎస్‌ మధ్య చీకటి సంబంధం బలంగా ఉన్నదనే ఇప్పటికీ తెలంగాణ సమాజం నమ్ముతోందని విద్యుత్తు సంస్కరణలు ద్యా సంస్కరణల విషయంలో జాతీయ విధానాన్ని వ్యతిరేకిస్తున్నామని చెబుతున్న టీఆర్‌ఎస్‌… అంతర్లీనంగా ఆమోద ముద్ర వేయడమే దీనికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.