NRI-NRT

పాక్‌లో ప్రవాసుల ఓటు హక్కు రద్దు చేసే సవరణ బిల్లు

పాక్‌లో ప్రవాసుల ఓటు హక్కు రద్దు చేసే సవరణ బిల్లు

ఎలక్ట్రానిక్‌ యంత్రాల(ఈవీఎం)ల వినియోగాన్ని నిలిపేయడం తోపాటు, ప్రవాసులు ఓటు హక్కు రద్దు చేస్తు పాక్‌ నేషనల్‌ అసెంబ్లీ ఒక కొత్త చట్ట సవరణ బిల్లును ఆమోదించింది. అంతేకాదు సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలను ఉపయోగించడాని కంటే ముందు స్థానిక ఉప ఎన్నికల్లో మరిన్ని పైలెట్‌ ప్రాజెక్టులు నిర్వహించడమే ఈ బిల్లు మొదటి లక్ష్యంగా పేర్కొంది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ముర్తాజా జావేద్ అబ్బాసీ సమర్పించిన ఎన్నికల చట్ట సవరణ బిల్లు 2022ను దిగువ సభలో మెజారిటీ ఓట్లతో ఆమోదిం పొందింది.

ఐతే ఈ బిల్లును కేవలం గ్రాండ్ డెమోక్రటిక్ అలయన్స్ సభ్యులు మాత్రమే వ్యతిరేకించారు. ఈ మేరకు ముస్లిం లీగ్ నవాజ్(పీఎంఎల్‌ఎన్‌) మంత్రి అజం నజీర్‌ తరార్‌ ఈ బిల్లు ప్రాముఖ్యతను వివరిస్తూ….ఎన్నికల చట్టం 2017 సవరణలకు ముందు ఉన్న విధంగా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా ఈ బిల్లు చేస్తుందని చెప్పారు. ఈ బిల్లు చట్టంలోని సెక్షన్‌ 94, 107కి సంబంధించిన సవరణలని తెలిపారు. అంతేకాదు గత పాకిస్తాన్‌ తెహ్రీక్‌ ఈ ఇన్సాఫ్(పీటీఐ) ప్రభుత్వం ఎన్నికల చట్టం 2017కి పలు సవరణలు చేసిందని గుర్తు చేశారు.

అలాగే పాకిస్తాన్ ఎన్నికల సంఘం(ఈసీపీ) కూడా తక్కువ సమయంలో ఈవీఎంల ద్వారా ఎలాంటి గ్రౌండ్‌ వర్క్‌ లేకుండా ఎన్నికలు నిర్వహించలేమంటూ అభ్యంతరం వ్యక్తం చేసిందన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించేందుకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని కూడా స్పష్టం చేశారు. ఐతే పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) ఈ చర్యను తీవ్రంగా ఖండించింది. అంతేకాదు పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ (పీఎంఎల్‌ఎన్‌) ప్రధాన మంత్రి షెహబాజ్ షెరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వ తిరోగమన చర్యగా పేర్కొంది. పీటీఐతొమ్మిది మిలియన్లకు పైగా పాకిస్తానీ విదేశీయులకు ఓటు హక్కును కల్పిస్తే ఈ దుండగుల ప్రభుత్వం వాటిని హరించే లక్ష్యంతో సవరణలు చేసిందంటూ ఆరోపణలు గుప్పించింది.