DailyDose

తెలంగాణలో మరో పరువు హత్య- TNI నేర వార్తలు

తెలంగాణలో మరో పరువు హత్య- TNI  నేర వార్తలు

* వరంగల్‌ జిల్లా కేంద్రంలో ఘోర అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. చౌరస్తాలోని మను ఫ్యామిలీ రెస్టారెంట్‌లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటల్లో రెస్టారెంట్‌ పూర్తి స్థాయిలో కాలిపోయినట్టు సమాచారం.

* తెలంగాణలో పరువుహత్యలు కలకలం రేపుతున్నాయి. ఒకదాన్ని మర్చిపోయేలోపే ఇంకోటి జరుగుతూ.. భయాందోళనలకు గురి చేస్తున్నాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్లోనే ఇటీవల ఒకదాని వెనక ఇంకోటి రెండు పరువు హత్యలు సంచలనం సృష్టించాయి. అవి మరవకముందే.. ఇప్పుడు ఆదిలాబాద్‌ జిల్లా నార్నూర్‌ మండలం నాగల్‌కొండలో మరో ఘాతుకం వెలుగుచూసింది.ఇంతవరకు.. తమ ఇంటి ఆడపడుచులను ప్రేమించి వివాహం చేసుకున్నందుకు యువకులను హతమార్చిన ఘటనలు చోటు చేసుకున్నాయి. కానీ.. ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా జరిగింది. కన్న కూతుర్నే తల్లిదండ్రులు దారుణంగా చంపుకున్నారు. వేరే మతానికి చెందిన యువకుడిని ప్రేమిస్తోందని తెలిసి.. కుమార్తె రాజేశ్వరి(20)ని కత్తితో గొంతు కోసి హతమార్చారు.

*డవలూరు మండలం రాచర్ల పాడు గమేసా ఫ్యాక్టరీ వద్ద రోడ్డు ప్రమాదం. ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా కొట్టడంతో ట్రాక్టర్ లో ఉన్న వ్యక్తి మృతి …రొకరికి స్వల్ప గాయాలు మృతి చెందిన వ్యక్తి ప్రకాశం జిల్లా మర్రిపాడు మండలం అయ్యపురాజుపాలెం వ్యక్తి గా గుర్తింపు చిలకడ దుంపలు అమ్ముకొ స్వగ్రామానికి వెళ్తుండగా ఘటన ప్రమాద స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసిన కొడవలూరు పోలీసులు…

*లద్దాఖ్లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. 26 మంది సైనికులతో వెళ్తున్న వాహనం అదుపుతప్పి శ్యోక్ నది సమీపంలో లోయలో పడినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. పర్తాపుర్ ట్రాన్సిట్ క్యాంప్ నుంచి లేహ్ జిల్లా తుర్తుక్ ఫార్వర్డ్ లొకేషన్కు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను హుటాహుటిన పర్తాపుర్లోని ఫీల్డ్ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన సైనికులకు మెరుగైన వైద్యం కోసం ఎయిర్ అంబులెన్స్లో తరలింపునకు చర్యలు చేపడుతున్నట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.

* లద్దాఖ్లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. 26 మంది సైనికులతో వెళ్తున్న వాహనం అదుపుతప్పి శ్యోక్ నది సమీపంలో లోయలో పడినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. పర్తాపుర్ ట్రాన్సిట్ క్యాంప్ నుంచి లేహ్ జిల్లా తుర్తుక్ ఫార్వర్డ్ లొకేషన్కు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను హుటాహుటిన పర్తాపుర్లోని ఫీల్డ్ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన సైనికులకు మెరుగైన వైద్యం కోసం ఎయిర్ అంబులెన్స్లో తరలింపునకు చర్యలు చేపడుతున్నట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.

* హర్యానా లోని పంచకుల జిల్లా, దాని పరిసరాల్లో దోపిడీలకు పాల్పడుతున్న ఓ ముఠాను పోలీసులు గుర్తించారు. ఈ ముఠాలో పోలీసులు, వ్యాపారులు ఉన్నారు. వీరిలో ముగ్గురిని అరెస్టు చేయగా, అరెస్టయినవారిలో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ కస్టడీ నుంచి తప్పించుకుపోయారు. పోలీసు కస్టడీ నుంచి తప్పించుకుపోయినందుకు మరొక కేసును నమోదు చేశారు.

* లడఖ్‌లో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భారత జ‌వాన్లు ప్ర‌యాణిస్తున్న ఆర్మీ వాహ‌నం అదుపు త‌ప్పి టుర్టుక్ సెక్టార్ వద్ద ష్యోక్ న‌దిలో ప‌డిపోయిన ఘటనలో ఏడుగురు జవాన్లు ప్రాణాలో కోల్పోయారు. మరో 19 సైనికులకు తీవ్ర గాయలయ్యాయి. క్షతగాత్రులను ఎయిర్‌ అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయ‌ప‌డిన వారికి మెరుగైన చికిత్స అందిస్తున్న‌ట్లు ఆర్మీ పేర్కొంది. 26 మంది సైనికుల బృందం పార్తాపూర్‌లోని ట్రాన్సిట్ క్యాంప్ నుండి సబ్ సెక్టార్ హనీఫ్‌లోని ఒక ఫార్వర్డ్ లొకేషన్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

*ఆదాయానికి మించి ఆస్తుల కేసులో హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఇండియన్ నేషనల్ లోకదళ్ అధినేత ఓం ప్రకాశ్ చౌతాలాకు ఢిల్లీ సీబీఐ ప్రత్యేక కోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష విధించింది. లక్షల రూపాయల జరిమానా కూడా విధించింది. చౌతాలాకు చెందిన నాలుగు ఆస్తులను జప్తు చేయాలని కూడా న్యాయమూర్తి వికాస్ ధుల్ ఆదేశించారు. తీర్పు సమయంలో చౌతాలాలో కోర్టురూంలోనే ఉన్నారు.

*పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో నటి మోడల్ మంజూజా నియోగీ అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించారు. పటూలి ప్రాంతంలోని ఆమె నివాసం నుంచి మంజూష మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది. ఆమె బలవన్మరణానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు.

*విశాఖపట్నం: జిల్లాలోని మర్రిపాలెం రైల్వే క్వాటర్స్‌ లో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. రెబాక సాయి తేజ(25) అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణారహితంగా కత్తులు, రాడ్లతో దాడి చేశారు. యువకుడిపై దాడి చేసిన దృశ్యాలు సీసీ ఫుటేజ్‌లో రికార్డు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరిస్తున్నారు. మద్యం మత్తులో ఘర్షణ పడి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.

*వేర్పాటువాద నేత యాసిన్‌ మాలిక్‌ జైలు శిక్షను వ్యతిరేకిస్తూ చెలరేగిన ఆందోళనకారులపై కశ్మీర్‌ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. శ్రీనగర్‌లో దేశ వ్యతిరేక నినాదాలు చేస్తూ రాళ్లు రువ్విన ఘటనకు సంబంధించి 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక (ఉపా) చట్టం కింద వారిని అరెస్టు చేశారు. మరిందరు నిందితులను గుర్తించామని.. వారినీ అరెస్టు చేస్తామని సీనియర్‌ ఎస్పీ రాకేశ్‌ బల్వాల్‌ చెప్పారు. బుధవారం రాత్రి పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి అల్లరి మూకలను అదుపులోకి తీసుకున్నామన్నారు. కాగా, జమ్ముకశ్మీర్‌ కుప్వారా జిల్లాలో లష్కరే తాయిబా ఉగ్రవాదుల చొరబాటును భద్రతా దళాలు గురువారం భగ్నం చేశాయి. జుమాగండ్‌ గ్రామంలో సరిహద్దులు దాటి భారత్‌లోకి ప్రవేశిస్తున్న లష్కరే సభ్యులు ముగ్గురిని కాల్చి చంపాయి.

*అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సుబ్బారాయుడుపాలెం దగ్గర కారు ప్రమాదం జరగ్గా.. ముగ్గురు మృతి చెందారు. ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు గమనించి క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందని అడిగి తెలుసుకుని కేసు నమోదు చేసుకున్నారు. కాగా.. మృతులు మాకవరపాలెం, తామరం గ్రామాల వాసులని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

*పూరీకి కూర (Curry) ఇవ్వలేదని హోటల్‌ (Hotel) సిబ్బందిపై దాడి చేశాడో యువకుడు. రహ్మత్‌నగర్‌లో హర్షద్‌ అనే వ్యక్తి హోటల్‌ నిర్వహిస్తున్నాడు. గురువారం ఉదయం రహ్మత్‌నగర్‌కు చెందిన మిరాజ్‌ హోటల్‌కు వచ్చి పూరీ ఆర్డర్‌ ఇచ్చాడు. పనిచేసే నాగేష్‌ పూరీ తెచ్చి ఇచ్చాడు. ఎక్స్‌ట్రా కూర కావాలని మిరాజ్‌ కోరాడు. నాగేష్‌ కాస్త ఆలస్యం చేయడంతో ఆగ్రహానికి గురైన మిరాజ్‌ అతడిపై దాడి చేసి గాయపర్చాడు. జూబ్లీహిల్స్‌ (Jubilee Hills) పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

*ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు మండలంలోని మల్లేల సచివాలయ ఉద్యోగిపై వైసీపీ నేత అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో గురువారం కేసు నమోదైంది. బాధితుని ఫిర్యాదు ప్రకారం.. మల్లేల గ్రామ సచివాలయంలో సంక్షేమ, విద్యా సహాయకుడుగా పనిచేస్తున్న జినుగు సురేంద్ర విధుల్లో ఉండగా.. గ్రామానికి చెందిన ఒక నాయకుడి అనుచరులు దార్ల ఏసుపాదం, మెగపర్తి ఏసుదాసు వచ్చి అకారణంగా గొడవ పెట్టుకున్నారు. ‘నువ్యు ఎందుకు ఆఫీసులో ఉన్నావు’ అని కుర్చీలో కూర్చున్న సురేంద్రను లాగి కొట్టారు. కార్యాలయంలో ఉన్న వీఆర్‌వో, ఇతర సిబ్బంది అడ్డుకోగా.. వెళుతూ ‘నీ అంతం చూస్తాం’ అని బెదిరించారు. సంవత్సర కాలంగా గ్రామానికి చెందిన ఒక నాయకుడు అతని అనుచరులు సురేంద్రను వేధిస్తూ విధులు నిర్వహించకుండా అడ్డుకుంటున్నారు. గతంలో ఆయనపై తప్పుడు ఫిర్యాదులు చేస్తూ ఎంపీడీవో వద్దకు, ఎమ్మెల్యే వద్దకు పిలిపించారు. వారు విచారించి అతని తప్పు ఏమీలేదని చెప్పి నాయకులనే మందలించారు. ఈ నేపథ్యంలో వారు సురేంద్రపై కక్ష పెంచుకున్నారు. తనకు రక్షణ కల్పించాలని బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. ఎస్సై దుర్గాప్రసాదు కేసు నమోదు చేశారు.

*అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలం బూసులు ఘాట్‌లో గురువారం సాయంత్రం ఓ మినీ వ్యాన్‌ ప్రమాదానికి గురైంది. అందులో ప్రయాణిస్తున్న 18 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గాలికొండకు చెందిన పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులు, బంధువులు గురువారం ఉదయం వివాహం అనంతరం సాగులు నుంచి మినీ వ్యాన్‌లో తిరుగు ప్రయాణమయ్యారు. పరిమితికి మించి ఎక్కడంతో బూసులు ఘాట్‌లో వాహనం ఒక్కసారిగా వెనక్కి జారి వేగంగా కొండను ఢీకొంది. దీంతో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న 18 మందిలో 15 మంది గాయపడ్డారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉంది.

*శుభకార్యానికి బయలుదేరిన ఆ కుటుంబాల్లో విధి రోడ్డు ప్రమాదం రూపంలో తీవ్ర విషాదం నింపింది. కృష్ణా, అన్నమయ్య జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో తొమ్మిదిమంది ప్రాణాలు కోల్పోయారు. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం చింతలమడ దళితవాడకు చెందిన పెండ్లి కుమార్తె తరపు బంధువులు మోపిదేవి మండలం పెదప్రోలు గ్రామానికి వ్యాన్‌లో వస్తున్నారు. కాసానగర్‌ సమీపంలోకి రాగా, వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో వాహనంలో 25 మందికిపైగా ప్రయాణిస్తుండగా గుర్రం విజయ (45), బూరేపల్లి వెంకటేశ్వరమ్మ (50), కోన వెంకటేషు(55), బూరేపల్లి రమణ(46) అక్కడికక్కడే మృతి చెందారు. 15 మంది గాయపడగా 108లో చల్లపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన నలుగురిని మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి, అక్కడి నుంచి విజయవాడ తరలిస్తుండగా, ఎం.మాధవరావు(70) మార్గమధ్యంలో మృతి చెందాడు. అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లె మండలం రెడ్డివారిపల్లెకు చెందిన నీలపరెడ్డిగారి వీరగంగిరెడ్డి (45) కాంట్రాక్ట్‌ పనులు చేస్తుంటాడు. ఇతనికి భార్య మధుప్రియ (35), పిల్లలు కుషితారెడ్డి (7), దేవాన్ష్‌రెడ్డి (5) ఉన్నారు.

*నల్గొండ: జిల్లాలోని చండూరు మండలం గట్టుప్పల్ గ్రామంలో అర్ధరాత్రి పెళ్లి వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి బరాత్ తీస్తున్న వారిపైకి వధువు, వరుడు ఉన్న కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో దుబ్బాక సాయి చరణ్(13) అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే పెళ్ళికొడుకు సహా పలువురికి గాయాలయ్యాయి. అయితే డ్రైవింగ్ రాకున్నప్పటికీ వరుడు కారు నడపడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

*రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం ఓ విదేశీ ప్రయాణికుడు అక్రమంగా తెస్తున్న బంగారు ఆభరణాలను కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్‌ నుంచి వచ్చిన ఎఫ్‌35 జెడ్‌ 5435 ఫ్లైట్‌ ప్రయాణికులను తనిఖీ చేశారు. ఓ ప్రయాణికుడి వద్ద అక్రమంగా తెచ్చిన బంగారు నగలను గుర్తించారు. వాటిని తూకం వేయగా 723.4 గ్రాములున్నాయి. పట్టుబడిని ఈ బంగారు నగల విలువ రూ.37.91లక్షలు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

*పాస్ట్ పాసింజర్ రైలులో నుంచి జారిపడి ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఉమ్మ రెడ్డి రవికుమార్ మృతి చెందిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది.ఏలూరు జుట్ మిల్ వంతెన వద్ద కానిస్టేబుల్ రైలులో నుంచి జారి కిండపడిపోయాడు. వెంటనే స్పందించిన రైల్వే పోలీసులు తీవ్ర గాయాలపాలైన కానిస్టేబుల్‌ను చికిత్స నిమిత్తం జిల్లాప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ కానిస్టేబుల్ మృతి చెందాడు.