Movies

బోనీ క‌పూర్ క్రెడిట్ కార్డు నుంచి 3.82 ల‌క్ష‌ల చోరీ

బోనీ క‌పూర్ క్రెడిట్ కార్డు నుంచి 3.82 ల‌క్ష‌ల చోరీ

ఫిల్మ్ ప్రొడ్యూస‌ర్ బోనీ క‌పూర్ క్రెడిట్ కార్డు నుంచి సుమారు 4 ల‌క్ష‌ల చోరీ జ‌రిగింది. ఫిబ్ర‌వ‌రి 9వ తేదీన త‌న అకౌంట్ నుంచి 3.82 ల‌క్ష‌లు ట్రాన్స్‌ఫ‌ర్ అయిన‌ట్లు బోనీ క‌పూర్ త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు. అయిదు సార్లు ఆ లావాదేవీలు జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. ముంబైలోని అంబోలీ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు న‌మోదు చేశారు. ఐటీ చ‌ట్టంలోని సెక్ష‌న్ల కింద ఈ కేసును ఫైల్ చేశారు. త‌న బ్యాంక్ అకౌంట్ నుంచి డ‌బ్బలు విత్‌డ్రా అయిన‌ట్లు తెలుసుకున్న బోనీ కపూర్ దీని గురించి బ్యాంక్ వ‌ద్ద స‌మాచారం కోరారు. ఆ త‌ర్వాత ఆయ‌న పోలీసుల‌కు లిఖిత‌పూర్వ‌క ఫిర్యాదు ఇచ్చారు. త‌న‌ను ఎవ‌రూ క్రెడిట్ కార్డు వివ‌రాలు అడ‌గ‌లేద‌ని, క‌నీసం ఫోన్ కాల్ కూడా రాలేద‌న్నారు. బోనీ క‌పూర్ క్రెడిట్ కార్డు వాడుతున్న స‌మ‌యంలో సైబ‌ర్ నేర‌గాళ్లు డేటాను చోరీ చేసి ఉంటార‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. బోనీ అకౌంట్ల ఉన్న డ‌బ్బు గురుగ్రామ్‌లోని ఓ కంపెనీ అకౌంట్‌లోకి వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. ఈ కేసులో పోలీసులు ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు.