Movies

మలేసియాకు చిరంజీవి

మలేసియాకు చిరంజీవి

మలేసియా వెళ్లడానికి రెడీ అవుతున్నాడు ‘వాల్తేరు వీరయ్య’. ఓ సీక్రెట్‌ ఆపరేషన్‌ కోసమే ఈ ప్రయాణం. టార్గెట్‌ ఎవరు? ప్లాన్‌ ఎలా డిజైన్‌ చేశారు ? అనే అంశాలు తెలియడానికి కాస్త సమయం ఉంది. మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా కేఎస్‌ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో ‘వాల్తేరు వీరయ్య’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శ్రుతీహాసన్‌ హీరోయిన్‌. నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్న సినిమా ఇది. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్‌ దాదాపు 30 శాతం పూర్తయింది. ఈ సినిమా నెక్ట్స్‌ షెడ్యూల్‌ మలేసియాలో ప్రారంభం కానుందని సమాచారం. జూన్‌ మొదటివారంలో లేదా రెండోవారం ప్రారంభంలో చిరంజీవి, బాబీ అండ్‌ కో మలేసియాకు పయనం అవుతారు. సుమారు 20 రోజులు అక్కడ షూట్‌ ప్లాన్‌ చేశారని తెలిసింది. ఈ సినిమాకు ఈ షూటింగ్‌ కీలకమని సమాచారం. జీకే మోహన్, ఎమ్‌ ప్రవీణ్‌ సహనిర్మాతలుగా ఉన్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీత దర్శకుడు.