NRI-NRT

మక్కాలో ప్రవాసుల ఎంట్రీ బ్యాన్!

Auto Draft

Hajj 2022 నేపథ్యంలో సౌదీ అరేబియా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మక్కాలో ప్రవాసుల ఎంట్రీపై ఆంక్షలు విధించింది. అనుమతి లేని ప్రవాసులకు పవిత్ర నగరం మక్కాలో ప్రవేశించడాన్ని నిషేధించింది. ఈ నెల 26 (గురువారం) నుండి బ్యాన్ అమల్లోకి వచ్చింది. ఈ ఏడాది హజ్ యాత్రను క్రమబద్ధీకరించే క్రమంలో జారీ చేసిన సూచనల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు పబ్లిక్ సెక్యూరిటీ ప్రతినిధి జనరల్ షమీ అల్ షువైరెఖ్ వెల్లడించారు. మక్కా ప్రవేశానికి అనుమతి పొందిన ప్రవాసులు మాత్రమే మే 26కి సంబంధించిన షవ్వాల్ 25 గురువారం నుంచి మక్కాలోకి అనుమతించబడతారని తెలిపారు.