NRI-NRT

TTA పొలిటికల్ ఫోరంకు డుమ్మా కొట్టిన తెలంగాణ నేతలు

TTA పొలిటికల్ ఫోరంకు డుమ్మా కొట్టిన తెలంగాణ నేతలు - Telangana Leaders Skip TTA Political Forum

న్యూజెర్సీలో జరుగుతున్న తెలంగాణ తెలుగు అసోసియేషన్ సంబరాలలో భాగంగా శనివారం నాడు పొలిటికల్ ఫోరం ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్యక్రమానికి న్యూజెర్సీలోనే ఉన్న రాజకీయ పార్టీల సీనియర్ నేతలు గైర్హాజరు కావడంతో పొలిటికల్ ఫోరమ్ కు హాజరైన సభికులు నిరాశకు గురయ్యారు. టిపిసిసి అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి, భాజపా ఎంపీ డీ.అరవింద్, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెలంగాణ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, భాజపా నేత డీకే అరుణలు ఈ ఫోరంలో పాల్గొనడానికి ఆసక్తి చూపలేదు. తెలంగాణలో తీవ్ర స్థాయిలో కొట్లాడుకుంటున్న ఈ పార్టీల నేతల అభిప్రాయాలను అమెరికాలో వినాలనుకున్న ప్రవాస తెలుగు వారికి నిరాశే మిగిలింది. వీరు హాజరు కానప్పటికీ నిర్వాహకులు పొలిటికల్ ఫోరం నిర్వహించారు. తెరాస ఆలేరు ఎమ్మెల్యే సునీత, కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ మధుయాష్కి, భాజపా నేత ప్రదీప్ రెడ్డి, తెరాసకు చెందిన నల్గొండ జిల్లా నేత మహేందర్ రెడ్డి, ఏఐసీసీ సభ్యులు ప్రభాకర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.TTA తదుపరి అధ్యక్షుడు వంశీరెడ్డి అధ్యక్షత వహించారు. ఫోరం కన్వీనర్ భాస్కర్ స్వాగతం పలికారు.