NRI-NRT

లాస్ ఏంజెల్స్‌లో ఘనంగా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు

లాస్ ఏంజెల్స్‌లో  ఘనంగా ఎన్టీఆర్   శత జయంతి వేడుకలు

కాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్ ఏంజెల్స్‌లో మే 28న విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు (NTR) శత జయంతి వేడుకలు శరత్ కామినేని నివాసంలో ఘనంగా జరిగాయి. సినీ నటులు మాగంటి మురళీమోహన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ ఉత్సవాలు “అన్న” నందమూరి సజీవ శిల్పం దగ్గర మే 28న(శనివారం) ఉదయం అంగరంగ వైభవంగా నిర్వహించారు. రాజకీయ పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా జరిగిన ఈ వేడుకలకు ఎన్టీఆర్ అభిమానులు కుటుంబ సమేతంగా అధిక సంఖ్యలో పాల్గొని తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి నటుడు మురళీ మోహన్ జ్యోతి ప్రజ్వలన, పూలమాలతో నివాళులు అర్పించారు. ఆడపడుచులు హారతులిచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
IMG-20220529-WA0035-1
Los Angeles లో ఘనంగా NTR శత జయంతి వేడుకలుఈ కార్యక్రమములో భాగముగా ఇండియా నుండి జూమ్ ద్వారా పురంధరేశ్వరి.. ఎన్టీఆర్ అభిమానులందరు తమ ఆత్మ బంధువులంటూ వారి తండ్రితో తనకు వున్న అనుబంధాన్ని ఆత్మీయతను పాలుపంచుకోగా, అశ్వినీ దత్త్, వై.వీ.ఎస్.చౌదరి.. NTR తో తమకు వున్న తీపి అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ కార్యక్రమములో మురళి మోహన్ మాట్లాడుతూ ఎన్టీఆర్‌తో తనకు ఉన్న బంధం.. అన్నదమ్ముల అనుబంధం అంటూ తన సినీ రాజకీయ ప్రస్థానాన్ని, అనుభవాలను చెబుతుంటే అభిమానులు మంత్రముగ్ధులైపోయారు. ఆయన ప్రసంగం ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.Los Angeles లో ఘనంగా NTR శత జయంతి వేడుకలుఅదే విధముగా ఈ కార్యక్రమములో రాజలక్ష్మి చిలుకూరి మాట్లాడుతూ ఆడపడుచులకు NTR చేసిన సేవలను కొనియాడారు. మధు బోడపాటి, నందన్, ప్రసాద్ పప్పుదేశి, కరుణాకర్ రాంభట్ల, సంపత్ కుమార్ తదితరులు మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగుజాతికి, తెలుగు భాషకు ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిని తెచ్చిన విధానాన్ని మననం చేశారు. అనంతరం శరత్ కామినేని ఆధ్వర్యములో సినీ నటులు మాగంటి మురళీమోహన్ ముఖ్య అతిథిగా, పిల్లలు పెద్దలు అందరూ కలిసి లాస్ ఏంజెల్స్ డౌన్ టౌన్, కోస్తామిస, సాన్ ఫెర్నాండో వ్యాలీ పట్టణాలలో సుమారు 1000 మంది నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. చివరగా శరత్ కామినేని ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కావడానికి కృషి చేసిన వాలంటీర్స్ అందరికి పేరు పేరునా ధన్యవాదములు తెలిపారు.
IMG-20220529-WA0035-1-3
IMG-20220529-WA0035-1-4
IMG-20220529-WA0035-1-5
IMG-20220529-WA0035-1-6
IMG-20220529-WA0035-1-7
IMG-20220529-WA0035-1-8