NRI-NRT

కెన్యాలో ఘనంగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు

కెన్యాలో ఘనంగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు

తెదేపా వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను కెన్యాలో ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ అభిమానులు, తెదేపా విభాగం ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. తెలుగువారి ఆత్మగౌరవ సారథి ఎన్టీఆర్ అని కొనియాడారు. ఎన్టీఆర్ జయంతి వేడుకలను నిన్న తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు, తెదేపా శ్రేణులు ఉత్సాహంగా నిర్వహించిన విషయం తెలిసిందే.