Movies

అదే నా సక్సెస్‌ సీక్రెట్‌

అదే నా సక్సెస్‌ సీక్రెట్‌

కొంచెం జోరు తగ్గినా టాలీవుడ్‌లో తమన్నా క్రేజ్‌ తగ్గలేదు. తమిళంలోనూ హీరోయిన్‌గా తిరుగులేని స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న తమ్ము వెబ్‌సిరీస్‌లు, మ్యూజిక్‌ ఆల్బమ్స్‌తోనూ మెరుస్తున్నారు. కుర్ర హీరోయిన్లతో పోటీపడుతూ గ్లామర్‌ తారగా ఇండస్ట్రీలో వెలిగిపోతున్నారు. తను ఎంపిక చేసుకుంటున్న పాత్రలే తన సక్సెస్‌ సీక్రెట్‌ అంటున్నారు తమన్నా. ‘‘హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి చాలా కాలమైంది. సీనియర్‌గా నా హోదా కాపాడుకోవాలి, ‘తమన్నా ఇలాంటి పాత్రలు చేస్తోంది ఏంటి’ అని ప్రేక్షకులు అనుకోకూడదు. కథ డిమాండ్‌ చేస్తే గ్లామర్‌ షోకు సిద్దమే కానీ ఎంత డబ్బు ఇచ్చినా బోల్డ్‌ రోల్స్‌ మాత్రం చేసేది లేదు’ అన్నారు తమన్నా. ప్రస్తుతం ఆమె వెంకటేష్‌ సరసన నటించిన ‘ఎఫ్‌ 3’ ఈ వారంలో విడుదల అవుతుంది. సత్యదేవ్‌ సరసన ‘గుర్తుందా శీతాకాలం’ చిత్రంలో తమన్నా నటి స్తున్నారు.