DailyDose

నేపాల్‌లో గల్లంతైన విమానం కథ విషాదాంతం..

నేపాల్‌లో గల్లంతైన విమానం కథ విషాదాంతం..

22 మందితో ప్రయాణిస్తూ గల్లంతైన నేపాల్‌ విమానం.. ముస్టాంగ్‌ సమీపంలోని కోవాంగ్‌ గ్రామంలో కూలిపోయినట్లు తెలుస్తోంది. 22 మందితో ప్రయాణిస్తూ గల్లంతైన నేపాల్‌ విమానం.. ముస్టాంగ్‌ సమీపంలోని కోవాంగ్‌ గ్రామంలో కూలిపోయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు నేపాల్ విమానాశ్రయ అధికారులు స్పష్టం చేశారు. విమానం కూలిందని భావిస్తున్న ప్రదేశంలో భారీగా మంచు కురుస్తున్న కారణంగా రెస్క్యూ ఆపరేషన్‌కు ఆటంకం కలుగుతోందని చెప్పారు. విమానం కూలిపోయిందని స్థానికులు.. నేపాల్ సైన్యానికి సమాచారం అందించారు. మనపథి హిమాల్ పర్వత శ్రేణుల్లోని లమ్‌చే నది దగ్గర కూలిపోయినట్లు స్థానికులు చెప్పినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. భారీ శబ్ధం వినిపించిందని టిటి ప్రాంత ప్రజలు సమాచారం అందించారని ముస్టాంగ్‌ పోలీసులు తెలిపారు. గల్లంతైన విమానాన్ని వెతికేందుకు హోంశాఖ వెంటనే రెండు హెలికాప్టర్లను రంగంలోకి దించింది. ముస్టాంగ్‌, పొఖరా నుంచి ఇవి గాలింపు చర్యల్లో పాల్గొంటున్నాయి. మరోవైపు నేపాల్ ఆర్మీ చాపర్ MI-17ను సైతం మోహరించింది. నేపాల్‌ తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన 9 NEAT ట్విన్ ఇంజిన్ విమానం.. ఆదివారం ఉదయం గల్లంతైంది. ఇందులు ముగ్గురు సిబ్బంది సహా మొత్తం 22 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికుల్లో నలుగురు భారతీయులు..ఇద్దరు జపనీయులు ఉన్నారు. పొఖరా నుంచి జోమ్సమ్ నుంచి వెళ్తుండగా విమానం గల్లంతైంది. విమానం టేకాఫ్‌ తీసుకున్న 15 నిమిషాలకే ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయాయని అధికార వర్గాలు తెలిపాయి.