NRI-NRT

టాప్‌-50 వర్సిటీల్లో చదివితే బ్రిటన్‌ వీసా ఈజీ

Auto Draft

క్యూఎస్‌, టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌, అకాడమిక్‌ ర్యాంకింగ్‌ ఆఫ్‌ వరల్డ్‌ యూనివర్సిటీస్‌ సంస్థలు గుర్తించే ప్రపంచ టాప్‌-50 యూనివర్సిటీల్లో చదివిన విద్యార్థులకు బ్రిటన్‌ వీసా సులభంగా లభించ నుంది. బ్రిటన్‌ సర్కారు సోమవారం ప్రకటించిన ‘హై పొటెన్షియల్‌ స్కీమ్‌’ లో వర్క్‌ వీసా వెంటనే వస్తుంది. ప్రతిభావంతులకు ప్రోత్సాహమివ్వడంలో భాగంగా పట్టభద్రులకు రెండేళ్లు, పీహెచ్‌డీ పట్టా పొందిన వారికి మూడేళ్ల వర్క్‌ వీసా జారీ చేస్తామని భారత సంతతికి చెందిన కేబినెట్‌ మంత్రులు రిషి సనక్‌, ప్రీతి పటేల్‌ తెలిపారు. ఈ వీసా చార్జి రూ.70వేలు (715 పౌండ్లు)గా ఉంటుంది. బ్రిటన్‌ వెళ్లేవారి బ్యాంకు ఖాతాలో కనీసం రూ.1.24 లక్షల(1,270 పౌండ్లు) నిల్వలు ఉండాలి. ఈ వీసాలపై బ్రిటన్‌కు వచ్చేవారు తమ కుటుంబ సభ్యులు, ఆప్తులకు డిపెండెంట్‌ వీసాలు తీసుకోవచ్చు.