NRI-NRT

విదేశాల్లో మన మామిడికి ఫుల్‌ డిమాండ్‌

విదేశాల్లో మన మామిడికి ఫుల్‌ డిమాండ్‌

సింగపూర్, దుబాయ్, స్విట్జర్లాండ్, అమెరికా వంటి దేశాల్లో సిక్కోలు మామిడికి మంచి గిరాకీ ఉందన్న సంగతి తెలుసా..? ఆశ్చర్యంగా అని పించినా ఇదే నిజం. జిల్లాలోని గంగువారి సిగడాం మండలం వెలగాడ పంచాయతీ చంద్రయ్యపేట గ్రామం నుంచి ఏటా మామిడిని విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ఈ గ్రామంలో సుమారు 100 ఎకరాల్లో మామిడి తోట ఉంది. ఇక్కడ వివిధ రకాల మామిడి కాయలు పండించడంతో ఈ కాయలను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.

*హిమాపసల్‌ అంటే మహా ఇష్టం
ఈ గ్రామంలోని తోట నుంచి హిమాపసల్‌ మామిడి కాయలను సింగపూర్, దుబాయి, స్విట్జర్లాండ్, అ మెరికా దేశాలకు తరచూ ఎగుమతి చేస్తారు. అలాగే మనదేశంలోని తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకూ ఈ మామిడిని తరలిస్తారు. అక్కడ కాయ రూ.50 నుంచి రూ.75 వరకు పలుకుతుంది. వందకాయలు దాదాపు రూ.7వేల వరకు విక్రయిస్తారు. ఈ రకం మామిడి సువాసన కిలోమీటర్‌ వరకు వ్యాపిస్తుందని చెబుతుంటారు. రుచి కూడా అమోఘం. కాయ సుమారుగా ఐదువందల గ్రాముల బరువు ఉంటుంది.