NRI-NRT

కాన్సాస్ లో ఘనంగా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు, మహానాడు సంబరాలు

కాన్సాస్ లో  ఘనంగా ఎన్టీఆర్  శత జయంతి ఉత్సవాలు, మహానాడు సంబరాలు

తెలుగు జాతి ముద్దుబిడ్డ, విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారకరామరావు శతజయంతి వేడుకలతో పాటు మహానాడు సంబరాలు అమెరికాలోని కాన్సాస్ నగరంలో NRI TDP Kansas City వారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. మొదట స్థానిక తెలుగు మహళా సీనియర్ నేత వెలకటూరి లక్ష్మి నాయుడు, మరి కొంత మంది తెలుగు మహిళలు కలసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఆ తరువాత రిచా వల్లూరుపల్లి, శ్రీనివాస్ కోటిపల్లి పాడిన పాటలు అందరిని అలరించాయి. శ్రీనివాస్ దామ NTR గారికి భారతరత్న ఇవ్వాలని, కేశవ్ మాగంటి అమరావతిని రాజధానిగా ఉంచాలని తీర్మానించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుండి దాదాపు 15 మంది TDP సీనియర్ నాయకులు ఈ కార్యక్రమాన్ని అభినందించారు. వెంకట్ నల్లూరి, శిల్ప బండ్ల తదితర స్థానిక నాయకులు, అభిమానులు ప్రసంగించారు. దాదాపు 300 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం జరిగినంత సేపు ‘జోహార్ అన్న ఎన్టీఆర్!’, ‘జై బాబు.. జై జై బాబు!’ నినాదాలతో హోరెత్తింది.
kcr1
ముఖ్య సభ్యులు రావు ద్రోణవల్లి, అరుణ్ కొమ్మినేని, వెంకట్ నల్లూరి, ప్రకాష్ కన్యాదార, రథన్ కొమర్నేని, మురళి నార్ల, నాయుడు వట్టిగుంట, గౌతమ్ నల్లూరి, శ్రీనివాస్ కోడె, సురేష్ తుమ్మల, హరి బండ్ల, గోపి మాదాల, శ్రీధర్ కొడాలి, వెంకట్ గొర్రెపాటి, సోమశేఖర్ పెమ్మసాని తదితరులు ఈ కార్య క్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువ నేత సాయి నంబూరి, Kansas City యువ నాయకులు పాల్గొనడం విశేషం. ఈ సందర్భంగా వేణు కొల్ల, సాయి మనీంద్ర, మధు ఉప్పగండ్ల సభ్యత్వ కార్యక్రమం నిర్వహించి దాదాపు 150 మంది NRI TDP కొత్త సభ్యులని చేర్పించారు. కళ్యాణ్ పెమ్మసాని, శ్రీనివాస్ కుదారవల్లి, కమలాకర్ అనంతనేని భోజన ఏర్పాట్లు చూశారు. చంద్ర గన్నె సభా ప్రాంగణమంతా ఫొటోలు, వీడియోలు తీసి ఈ కార్యక్రమం విజయవంతమవ్వడానికి దోహదపడ్డారు. మనోహర్ నాయుడు వెలకటూరి, ప్రకాష్ కన్యాదార, బాపు రెడ్డి మోతె, శివ జాస్తి ఈ కార్యక్రమం విజయవంతం కావడం కోసం పని చేసిన అందరికి, దాతలకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.
kcr2
kcr3
kcr4