NRI-NRT

మాతృదేశంలో 6 నెలలు మించి ఉంటే కువైత్‌ వీసా రద్దు!

మాతృదేశంలో 6 నెలలు మించి ఉంటే కువైత్‌ వీసా రద్దు!

*ఆర్టికల్‌ 20 వీసా ఉన్న వేలాది ప్రవాసాంధ్రులపై ప్రభావం
గత కొన్ని నెలలుగా స్వదేశంలో ఉంటున్న కువైత్‌ వీసాదారులు జూన్‌లోపు తిరిగి రాని పక్షంలో, వారి వీసా రద్దవుతుందని కువైత్‌ ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఈ నిబంధన ఆర్టికల్‌ 20 వీసా వారికి మాత్రమే వర్తిస్తుంది. కువైత్‌ సహా గల్ఫ్‌ దేశాలలో నివాసముంటున్న విదేశీయులందరూ తాము పనిచేస్తున్న దేశం బయట ఆరు నెలలు మించి ఉండరాదు. కానీ కరోనా ఆంక్షల నేపథ్యంలో కువైత్‌ ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చింది. ఆర్టికల్‌ 20 వీసా వారు తిరిగి రావడానికి సముచిత గడువు ఇచ్చి కువైతీ యజమానులకు తమ ఉద్యోగుల పక్షాన పొడిగింపు చేసుకోడానికి అవకాశం కూడా ఇచ్చింది. ఈ కేటగిరి వీసా కల్గిన ప్రవాసాంధ్రులు కువైత్‌లో అత్యధిక సంఖ్యలో ఉన్నారు. వీరిలో అనేక మంది ప్రస్తుతం స్వదేశంలో ఉన్నారు. కువైతీ ఇళ్లలో పని చేసే వృత్తుల వారికి ఆర్టికల్‌ 20 వీసా ఉంటుంది. ఈ కేటగిరి కింద కువైత్‌లో మొత్తం 6 లక్షలకుపైగా విదేశీయులు పని చేస్తున్నారు. అందులో 3.25 లక్షల మంది భారతీయులే. వీరిలోనూ అత్యధికులు అన్నమయ్య జిల్లాకు చెందినవారున్నారు.