DailyDose

జాన‌ప‌ద క‌థ‌ల‌కు ప్రాణం పోస్తున్న న‌కాశీ ప‌టాలు.. వీటి ప్ర‌త్యేకత ఏంటి?

జాన‌ప‌ద క‌థ‌ల‌కు ప్రాణం పోస్తున్న న‌కాశీ ప‌టాలు.. వీటి ప్ర‌త్యేకత ఏంటి?

తెలంగాణలో వందకు పైగా కళారూపాలు పురుడుపోసుకున్నాయి. శతాబ్దాలుగా పండితపామరులను అలరిస్తూ ఉన్నాయి. వీటిలో 15 జానపద కళారూపాలు.. ‘పటం కథలు’గా ఖ్యాతిపొందాయి. వివిధ ప్రదర్శనల్లో ‘నకాశీ పటాలు’ ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. కళాకారులకు – కళాభిమానులకు మధ్య వారధిగా నిలుస్తున్నాయి.
da
‘కథ’కు సరికొత్త ప్రాణం పోస్తున్నాయి. తెలంగాణ ప్రజలకు కొన్ని శతాబ్దాల క్రితమే వస్త్రంపై రాయడం, బొమ్మలు వేయడం తెలుసు. రాజులు, పుర ప్రముఖుల వంశవృక్షాలను వస్త్రాలపై చిత్రాలుగా గీసేవారు. కొందరు కళాకారులు వస్త్రాలపై వేసిన చిత్రాలను ‘జానపదం’లోకి తీసుకొచ్చారు. ముఖ్యంగా కుల పురాణాలు చెప్పే ఆశ్రిత కళాకారులు ఈ పటాల ద్వారా, ప్రేక్షకులను కథలో మరింత లీనం చేసేవారు. పటంపై ఉండే బొమ్మలను ‘నకాశీ చిత్రాలు’గా వ్యవహరిస్తారు. ఈ పటాలను రూపొం దించడంలో సిద్దిపేట కళాకారులు ప్రసిద్ధులు.
da5
mongodb import geojson
నకాశీ కళాకారులు..
పోషిత కులాల చరిత్రను చెప్పే ఆశ్రిత కళాకారులకు పటాలను చిత్రించి ఇచ్చేవారే.. నకాశీ చిత్రకారులు. తమ చిత్రాల ద్వారా కులాల చరిత్రను రికార్డు చేస్తున్న చరిత్రకారులు వీరు. వీరిని మొదట్లో ‘నక్షిలు’గా పిలిచేవారు. కాలక్రమంలో నకాశీలుగా స్థిరపడ్డారు. కుల పురాణాలను గానం చేసే కథకులు ముందుగా పురాణ కథలను నకాశీ చిత్రకారులకు వివరిస్తారు. ఆ సన్నివేశాలకు అనుగుణంగా చిత్రకారులు జాజు లేదా ఎరుపు రంగుతో చిత్రాలకు రూపం ఇస్తారు. మొత్తం కథకు సంబంధించిన ప్రాథమిక స్కెచ్‌ను సిద్ధం చేస్తారు. ఆ తర్వాత బొమ్మలకు నేపథ్య వర్ణాలు వేస్తారు. అనంతరం ఆయా పాత్రలకు తగిన ఆహార్యంతో, హావభావాలతో రంగురంగుల బొమ్మలను చిత్రిస్తారు. నాభికా పురాణం, గౌడ పురాణం, మహాభారత కథలు, పాండవుల కథలు, మార్కండేయ పురాణం, పద్మనాయకుల వృత్తాంతం, మాల చెన్నయ్య కథ, జాంబ పురాణం, మడేలు పురాణం.. తదితర పురాణాలను నకాశీ చిత్రకారులు అలవోకగా చిత్రిస్తారు. ఒక్కో పటం పూర్తి చేయడానికి ఆరు నెలల నుంచి ఏడాది కాలం పడుతుంది.
da1
పల్లెల్లో ఆదరణ..
కుల పురాణాలను వివరించే ఈ పటాలు, ప్రాచీన కాలం నుంచీ తెలంగాణలోని పల్లెల్లో బహుళ ప్రజాదరణ పొందాయి. ‘ఇండియన్‌ పిగ్మెంట్‌ పెయింటింగ్‌ ఆన్‌ క్లాత్‌’ అనే పుస్తకంలో రచయితలు కె.తల్వార్‌, కల్యాణ్‌ శుక్లా వివిధ రకాల పెయింటింగ్‌ పద్ధతులను వివరించారు. అయితే, క్రమంగా జానపద కళలతోపాటే.. ఈ పటాలు కూడా కనుమరుగయ్యే స్థితికి చేరుకున్నాయి. కళనే జీవనాధారంగా చేసుకుని బతికే కళాకారులు వేరే వృత్తులను ఆశ్రయించాల్సిన అనివార్య పరిస్థితులు తలెత్తాయి. నకాశీ పటాలను కాపాడుకుంటే మన ఉనికినీ కాపాడుకున్నట్టే.
da2
పటం తయారీ ..
నకాశీ చిత్రాలకు చేనేత లేదా ఖాదీ గుడ్డలను ఉపయోగిస్తారు. ఎందుకంటే, వస్త్రంపై బొమ్మలు వేసినప్పుడు ఆయా రంగులను పీల్చుకునే గుణం చేనేత/ ఖాదీ గుడ్డలకు ఉంటుంది. సాధారణంగా తెలుపు రంగు వస్త్రాలను వాడతారు. కథను బట్టి నలుపు, నీలం, ఎరుపు గుడ్డలతోపాటు వెండి, బంగారు రంగు వస్త్రాలనూ అరుదుగా ఉపయోగిస్తారు. బొమ్మల నిడివి, సైజులను బట్టి ఆయా కథలకు తగినట్లుగా వస్త్రం పొడవు, వెడల్పునిర్ణయిస్తారు. సాధారణంగా 12 నుంచి 20 గజాల పొడవు వస్త్రాలను వాడుతారు. పాండవుల కథ, మహాభారతం లాంటి నిడివి ఎక్కువ ఉండే కథలకు 40 గజాల వస్త్రాలు తప్పనిసరి. ఎన్నుకున్న గుడ్డను నేలపై పరిచి, ముందుగానే తయారు చేసుకున్న గంజి, చింతపిక్కలతో కాచిన అంబలి, సిద్ద పౌడర్‌తో పలుచటి పొరలా గుడ్డపై పూస్తారు. దాంతో పోగులమధ్య ఉన్న సందులు మాయం అవుతాయి. రెండు గంటలపాటు ఆరనిచ్చి, మరొక కోటింగ్‌ వేస్తారు. దృఢత్వం కోసం గుడ్డ వెనుక మరోముక్క అతికిస్తారు. దీనివల్ల గుడ్డ దళసరిగా తయారవుతుంది. ముడతలు పడకుండా, బొమ్మలు వేయడానికి అనుకూలంగా తయారవుతుంది.
da3