NRI-NRT

తానా డాలస్ క్రికెట్ పోటీల విజేతలు వీరే

తానా డాలస్ క్రికెట్ పోటీల విజేతలు వీరే

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) డాలస్ స్పోర్ట్స్ కమిటీ ఆధ్వర్యంలో మే 28-30 మధ్య క్రికెట్ పోటీలు నిర్వహించారు. 20జట్లు పాల్గొన్న ఈ పోటీల్లో టెక్నీ హైర్ టైగర్స్ (కెప్టెన్ గంగాధర్ వంకా & టీమ్) విజేతగా నిలిచింది. ద్వితీయ స్థానాన్ని విల్లో వారియర్స్(కెప్టెన్ రాజా అడైకల సామీ & టీమ్) సాధించింది. విజేత జట్టుకు $1500, రెండో స్థానం సాధించిన జట్టుకు $750 బహుమతిగా అందజేశారు. కార్యక్రమంలో తానా ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన, తానా జాతీయ స్పోర్ట్స్ కో-ఆర్డినేటర్ శశాంక్ యార్లగడ్డ, తానా ఫౌండేషన్ కోశాధికారి శ్రీకాంత్ పోలవరపు, తానా కౌన్సిలర్ ఎట్ లార్జ్ లోకేష్ నాయుడు, తానా డ్Fవ్ స్పోర్ట్స్ సమన్వయకర్త వెంకట్ బొమ్మ, రాజేష్ చెరుకుపల్లిలు పాల్గొన్నారు. దేవాన్ష్ ల్యాబ్స్ గోల్డ్ స్పాన్సర్ గా వ్యవహరించారు. పోటీ నిర్వాహకులను తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి అభినందించారు.