Politics

వైకాపా పనైపోయింది.. వచ్చే ఎన్నికలు ఏకపక్షమే – TNI రాజకీయ వార్తలు

వైకాపా పనైపోయింది.. వచ్చే ఎన్నికలు ఏకపక్షమే  – TNI రాజకీయ వార్తలు

* వైకాపా పాలనపై ప్రజల అసంతృప్తే.. మహానాడు గ్రాండ్ సక్సెస్కు కారణమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఇంతటి ప్రజా వ్యతిరేకత ఏ ప్రభుత్వంపైనా చూడలేదని చెప్పారు. వైకాపా పనైపోయిందని వచ్చే ఎన్నికలు ఏకపక్షమేనని వ్యాఖ్యనించారు.వైకాపా పనైపోయిందని వచ్చే ఎన్నికలు ఏకపక్షమేనని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. పార్టీ ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. ఇంతటి ప్రజా వ్యతిరేకత ఏ ప్రభుత్వంపైనా చూడలేదని అన్నారు. పార్టీలో గ్రూపులకు చెక్ పడాల్సిందేనని.. ఎవరికీ మినహాయింపులు లేవని వెల్లడించారు. వైకాపా పాలనపై ప్రజల అసంతృప్తే.. మహానాడు గ్రాండ్ సక్సెస్కు కారణమని అన్నారు.ఒంగోలు నేతలు సమష్టి కృషితో మహానాడును సక్సెస్ చేశారన్న చంద్రబాబు.. ఈ నమూనాను అన్ని జిల్లాలు పాటించాలని సూచించారు. ఓట్ల తొలగింపు విషయంలో గ్రామ స్థాయిలో నేతలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. కార్యకర్తల ఆరోగ్యం కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ తెచ్చిన న్యూట్రిఫుల్ యాప్ సేవల గురించి ఆయన వివరించారు. నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల అవినీతి, అక్రమాలపై స్థానికంగా పోరాటం చేయాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సూచించారు.

*పశువుల మేతలో వైకాపా నేతల కుంభకోణం: నరేంద్ర
రాష్ట్రంలో పశువుల దాణా తరహా కుంభకోణానికి వైకాపా నాయకులు తెర లేపారని తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. మూగజీవాల పేరుతో ప్రభుత్వం భారీ దోపిడికి పాల్పడుతోందన్నారు. ప్రభుత్వం.. కమిషన్ల కోసం కక్కుర్తి పడుతోందని నరేంద్ర మండిపడ్డారు. రాష్ట్రంలో పశువుల దాణా తరహా కుంభకోణానికి వైకాపా నాయకులు తెర లేపారని తెదేపా సీనియర్ నేత ధూళిపాళ నరేంద్ర ఆరోపించారు. వైకాపా నేతలు సుమారు రూ. 40 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని నరేంద్ర పేర్కొన్నారు. ‘ఆర్బీకేల ద్వారా వల్లభ ఫీడ్ను అమ్ముతున్నారు. వల్లభ ఫీడ్స్ దాణా వైకాపా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మానాయుడుది. పశువుల దాణా కుంభకోణం అంటారో ఏమో కానీ.. మూగజీవాల పేరుతో ప్రభుత్వం భారీ దోపిడీకి పాల్పడుతోంది. ప్రభుత్వం కమిషన్ల కోసం కక్కుర్తి పడుతోంది. ఫెర్టయిల్ గ్రీన్ అనే కంపెనీ ద్వారా పశువుల మేత కోసం వినియోగించే టీఎంఆర్ను మెట్రిక్ టన్ను రూ.16 వేలకు కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ మేతనే కొనుగోలు చేయాలని రైతులపై ఒత్తిడి తెస్తున్నారు. వెటర్నరీ డాక్టర్లకు టార్గెట్ పెట్టి మరీ ఫెర్టయిల్ గ్రీన్ కంపెనీ సరఫరా చేసే మేతను కొనుగోలు చేయిస్తున్నారు. మార్కెట్‌లో తక్కువ ధరకు అందుబాటులో ఉన్నప్పటికీ.. రూ. 16 వేలకు కొనుగోలు చేస్తున్నారని’ నరేంద్ర మండిపడ్డారు.

*జగన్ ది జనరంజక పాలన కాదు జనపీడిత పాలన: Dhulipalla
సీఎం జగన్ ఈ మూడేళ్ల కాలంలో ప్రజలకు నరకాన్ని చూపించారని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ… జగన్ ది జనరంజక పాలన కాదు జనపీడిత పాలన అని వ్యాఖ్యానించారు. ఏపీలో సంక్షేమ పాలన కాదు సంక్షోభ పాలన నడుస్తోందన్నారు. జగన్ నెలకొకసారైనా సచివాలయం ముఖం చూడరని విమర్శించారు. ప్రత్యేక హోదాతో రాయితీలు వస్తాయని చెప్పి, ప్లేటు ఫిరాయించారన్నారు. 22 మంది ఎంపీలను ఇచ్చినా రాష్ట్రానికి ఒక్క పరిశ్రమను తేలేదని ఆయన మండిపడ్డారు.టీడీపీ హయాంలో 16 వందలకు అమ్ముకున్న ధాన్యం నేడు వెయ్యికి దిగజారిందన్నారు. వ్యవసాయరంగం సంక్షోభంలోకి నెట్టబడిందని ప్రభుత్వ గణాంకాలే తేల్చాయని తెలిపారు. 26 లక్షల ఎకరాల్లో పంట నష్టపోతే ప్రభుత్వం కేవలం రూ.1402 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత యేడాది సెప్టెంబర్‌లో జరిగిన పంట నష్ట పరిహారాన్ని ఇవ్వలేదని ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు.

*2024 ఎన్నికలే చంద్రబాబుకు చివరివి: మంత్రి పెద్దిరెడ్డి
అనంతపురంలో సామాజిక న్యాయభేరి సభ విజయవంతమైందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సామాజిక న్యాయభేరి సభకు మహానాడుకి మించి ప్రజలు వచ్చారన్నారు. 2024 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి గత ఎన్నికలకు మించి సీట్లు వస్తాయన్నారు. కుప్పంలో మైనింగ్‌ మాఫియా జరుగుతోందని చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. కేవలం ఎన్నికల అస్త్రంగా చంద్రబాబు మాట్లాడుతున్నారన్నారు. 2024 ఎన్నికలే చంద్రబాబుకు చివరివని మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు.

*కశ్మీర్ లో వినిపించే వార్తలు.. కోనసీమలో వినాల్సి రావడం బాధాకరం: చంద్రబాబు
కోనసీమలో వారం రోజులైనా ఇంటర్ నెట్ సేవలు పునరుద్ధరించక పోవడం రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనమని టీడీపీ అధినేత చంద్రబాబుట్విటర్ వేదికగా పేర్కొన్నారు.ఎక్కడో కశ్మీర్‌లో వినిపించే ‘ఇంటర్నెట్ సేవలు నిలిపివేత’ అనే వార్తను మన సీమలో వినాల్సి రావడం బాధాకరమన్నారు. IT వంటి ఉద్యోగాలు ఇవ్వలేని ఈ ప్రభుత్వం… కనీసం వాళ్ళు పని చేసుకునే వెసులుబాటు కూడా లేకుండా చెయ్యడం దారుణమని చంద్రబాబు పేర్కొన్నారు. ఇంటర్ నెట్ అనేది ఇప్పుడు అతి సామాన్యుడి జీవితంలో కూడా భాగం అయ్యిందన్న విషయాన్ని ప్రభుత్వం తెలుసుకోవాలన్నారు.చిరు వ్యాపారుల లావాదేవీలు కూడా నెట్ ఆధారంగా నడిచే రోజుల్లో వారం రోజుల సేవలు నిలిపివేయడం సరికాదన్నారు. వెంటనే కోనసీమలో ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఇది లక్షల మంది ప్రజలకు సంబంధించిన విషయమన్నారు. మీ ఉదాసీనత వారికి ఇబ్బందిగా మారకూడదని చంద్రబాబు పేర్కొన్నారు..

*డెల్టా ప్రాంతంలో మట్టి మాఫియా చెలరేగిపోతోంది: Nakka anadbabu
డెల్టా ప్రాంతంలో మట్టి మాఫియా చెలరేగిపోతోందని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ… గ్రామాల్లో చెరువుల్లో మట్టి అక్రమంగా తరలిస్తున్నారని మండిపడ్డారు. ఎలాంటి అనుమతులు లేకుండానే మట్టి అడ్డగోలుగా తవ్వుతున్నారని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా అధికారులు, పోలీసులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. ఎవరైనా అడ్డుకుంటే బెదిరిస్తున్నారని తెలిపారు. మంత్రి నుంచి గ్రామ స్థాయి కార్యకర్తల వరకూ వాటాలు పంచుకుంటున్నారని అన్నారు. అధికారులు మౌనంగా ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని నక్కా ఆనంద బాబు హెచ్చరించారు

*ఆంధ్ర కాంట్రాక్టర్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు Kodandaram
నీళ్లు, నిధులు, నియామకాల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీజేఎస్(TJS) పార్టీ అధ్యక్షులు కోదందరాం విమర్శలు గుప్పించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ… ఆంధ్ర కాంట్రాక్టర్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు అని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కేవలం ఆంధ్ర కాంట్రాక్టర్లకే ప్రయోజనం చేకూరిందన్నారు. ప్రగతి భవన్‌లో ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఎర్ర తివాచీ పరుస్తున్నారని మండిపడ్డారు. మిగతా వారు ప్రగతి భవన్‌కు వెళితే 144 సెక్షన్ ద్వారా కేసులు పెడుతున్నారని ఆయన అన్నారు.ధర్నా చౌక్‌లు ప్రభుత్వం మూయిస్తే కోర్టు ద్వారా తెరిపించామని తెలిపారు. కాళేశ్వరం ఖర్చు ఎక్కువ… నీళ్లు తక్కువని వ్యాఖ్యానించారు. కేసీఆర్ నియంత నిరంకుశ పాలనకు ప్రజలు త్వరలోనే స్వస్తి పలుకుతారని హెచ్చరించారు. జూన్ 6న ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో తెలంగాణ ఆత్మగౌరవ దీక్షకు ఉద్యమకారులు రాజకీయ పార్టీలకతీతంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఉద్యమకారులు మరో పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోదండరాం పేర్కొన్నారు

*జగన్ పాలనలో అప్పులు ఫుల్… అభివృద్ధి నిల్: Tulasi reddy
జగన్ మూడేళ్ల పాలనలో అప్పులు ఫుల్ – అభివృద్ధి నిల్ – సంక్షోభంలో సంక్షేమం నిలిచిందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విమర్శలు గుప్పించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ… ప్రస్తుతం రాష్ట్ర అప్పు రూ.8 లక్షల కోట్లు అని… ఇందులో జగన్ ప్రభుత్వం చేసిన అప్పు రూ.5 లక్షల కోట్లు అని తెలిపారు. శ్రీలంక ఆర్థిక పరిస్థితి కంటే, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థతి దారుణంగా ఉందన్నారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని వ్యాఖ్యానించారు. అమ్మ ఒడి నాన్న బుడ్డికి చాలడం లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు

*తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేయాలని ఉంది : జయప్రద
స్వతహాగా తెలుగు మహిళను అయిన తనకు తెలుగు రాష్ట్రాల్లోని ఎన్నికల్లో పోటీ చేయాలని ఉందని, పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే తాను ఆ దిశగా ముందుకు సాగుతానని బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ జయప్రద అన్నారు. సోమవారం ఆమె హైదరాబాద్‌ హిమాయత్‌నగర్‌లోని ఓ క్లినిక్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో పార్టీ గెలుపునకు పాటుపడతానని చెప్పారు. తెలంగాణ, ఏపీలో అధికారంలో ఉన్న పార్టీలు పాలనను గాలికి వదిలేశాయని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్ర ప్రజల సమస్యలను పరిష్కరించిన తర్వాతే దేశ రాజకీయాల్లోకి వెళ్లాలని ఆమె సూచించారు

*ఆ ఇద్దరి నుంచి నాకు ప్రాణహాని ఉంది: టీడీపీ నేత Ravindra Reddy
వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు రక్షణ లేకుండా పోతోంది. ముఖ్యంగా ప్రతిపక్ష నేతలపై కక్ష్య పూరితంగా వ్యవహరిస్తున్నారు. పోలీసుల సహకారంతో లేనిపోని కేసులు పెడుతున్నారు. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి , డీఎస్పీ విఎస్‌కె చైతన్య నుంచి తనకు ప్రాణ హాని ఉందని టీడీపీ నేత రవీంద్రా రెడ్డి మానవ హక్కుల కమిషన్‌ ను ఆశ్రయించారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి, డీఎస్పీ తనను తాడిపత్రిలో అడుగుపెట్టనివ్వకుండా బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. తనపై కక్ష్య కట్టి అక్రమంగా కేసులు బనాయించారని, వేధిస్తున్నారని, తన హక్కులు కాలరాస్తున్నారని రవీంద్రా రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

*జగన్ ది జనరంజక పాలన కాదు జనపీడిత పాలన: Dhulipalla
సీఎం జగన్ ఈ మూడేళ్ల కాలంలో ప్రజలకు నరకాన్ని చూపించారని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ… జగన్ ది జనరంజక పాలన కాదు జనపీడిత పాలన అని వ్యాఖ్యానించారు. ఏపీలో సంక్షేమ పాలన కాదు సంక్షోభ పాలన నడుస్తోందన్నారు. జగన్ నెలకొకసారైనా సచివాలయం ముఖం చూడరని విమర్శించారు. ప్రత్యేక హోదాతో రాయితీలు వస్తాయని చెప్పి, ప్లేటు ఫిరాయించారన్నారు. 22 మంది ఎంపీలను ఇచ్చినా రాష్ట్రానికి ఒక్క పరిశ్రమను తేలేదని ఆయన మండిపడ్డారు.టీడీపీ హయాంలో 16 వందలకు అమ్ముకున్న ధాన్యం నేడు వెయ్యికి దిగజారిందన్నారు. వ్యవసాయరంగం సంక్షోభంలోకి నెట్టబడిందని ప్రభుత్వ గణాంకాలే తేల్చాయని తెలిపారు. 26 లక్షల ఎకరాల్లో పంట నష్టపోతే ప్రభుత్వం కేవలం రూ.1402 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత యేడాది సెప్టెంబర్‌లో జరిగిన పంట నష్ట పరిహారాన్ని ఇవ్వలేదని ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. *మహిళలపై హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయి: సంధ్యారాణి
ఏపీలో ప్రతిరోజూ ఏదో ఒక చోట మహిళలపై హత్యలు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయని, వాటిని జగన్ ప్రభుత్వం అరికట్టలేకపోతోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మిడి సంధ్యారాణి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అత్యాచారాలు యాదృచ్ఛికంగా జరుగుతాయని బాధ్యతారాహిత్యంగా మాట్లాడిన హోంమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అత్యాచారానికి గురై మానసిక వేదనతో బతుకుతున్న బాధితులను మంత్రులు, ముఖ్యమంత్రి మాటలు మరింత గాయపరుస్తున్నాయన్నారు. బాధిత మహిళలకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు.

*కోనసీమ కల్లోలానికి వైసీపీనే కారణం: హర్షకుమార్‌
‘‘అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో అల్లర్లకు ప్రధాన కారణం వైసీపీ ప్రభుత్వమే. అంబేడ్కర్‌ పేరు ప్రకటిస్తూ అభ్యంతరాలుంటే నెల రోజుల్లో తెలియజేయాలని స్పష్టం చేసింది. ఇతర జిల్లాలకు ఎన్టీఆర్‌, అన్నమయ్య, సత్యసాయి వంటి పేర్లు పెట్టినప్పుడు అవసరం లేని అభ్యంతరాలు ఇప్పుడే ఎందుకు అవసరమయ్యాయి. ఈ పరిస్థితి వల్లే అల్లర్లు చెలరేగాయి’’ అని కాంగ్రెస్‌ నేత, మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ వ్యాఖ్యానించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సోమవారం ఆయన మాట్లాడారు. జిల్లాల విభజన సమయంలో అంబేడ్కర్‌ పేరు పెట్టాలని, దళిత సంఘాలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు విజ్ఞప్తి చేశారని, అయినా మొదట ఆ పేరు పెట్టలేదన్నారు. తాము అడిగినా అంబేడ్కర్‌ పేరు పెట్టలేదనే భావన దళితులు, ప్రజాప్రతినిధులు, అంబేడ్కర్‌ వాదుల్లో ఏర్పడిందని, దీంతో వైసీపీ నేత వెనుక ఉండి, యువతతో ఉద్యమాలు చేయించారని తెలిపారు. వాళ్లు తనకు చెప్పకపోయినా తానూ ఉద్యమంలోకి వెళ్లానని అన్నారు.

*ముందస్తు ఎన్నికలు రావ్వొచ్చు: అచ్చెన్నాయుడు
రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ఏపీ టీడీపీ (TDP) రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి 160 సీట్లు వస్తాయన్నారు. పొత్తులపై ఎన్నికలు ముందే నిర్ణయం తీసుకుంటామని విశాఖపట్నంలో చెప్పారు. మహానాడుకి 5 లక్షల మంది వచ్చారని, కార్యక్రమం విజయవంతమైందన్నారు. వైసీపీ ఫ్లెక్సీల్లో ఎన్టీఆర్ ఫొటో పెట్టుకునే అర్హత ఆ పార్టీ నేతలకు లేదన్నారు. దేవుడికి…దొంగల ముఠా నాయకుడికి పోలిక ఏమిటి? అని ప్రశ్నించారు. వైసీపీ బీసీ మంత్రులను నోరు లేని మూగ జీవులుగా పోల్చారు. జగన్ పాలనను మొత్తం నలుగురు రెడ్లకు అప్పగించారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బీసీలే లేనట్టుగా తెలంగాణకు చెందిన కృష్ణయ్యకు రాజ్యసభ సీటు ఇచ్చారని ఎద్దేవా చేశారు. జగన్ హయాంలో కరెంట్ ఎప్పుడు పోతుందో, ఎప్పుడు వస్తుందో తెలియదన్నారు. పవర్ హాలిడే ఇచ్చి రాష్ట్ర పరువును తీశారని విమర్శించారు.

*టికాయత్‌పై దాడిచేసిన వారిని శిక్షించాలి: నిరంజన్‌రెడ్డి
భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌ టికాయత్‌పై బెంగళూరులో సిరాతో దాడి చేయడాన్ని మంత్రి నిరంజన్‌రెడ్డి ఖండించారు. ఈ దాడికి బాధ్యులను చట్టప్రకారం శిక్షించాలని ఆయన డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా టికాయత్‌ పోరాడారని గుర్తుచేశారు. ప్రధాని మోదీతో రైతులకు క్షమాపణలు చెప్పించిన ఆయనపై దాడి చేయడం బాధాకరమన్నారు. డిప్లమో ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డీఎడ్‌) పరీక్షల షెడ్యూల్‌ని ప్రకటించారు. జూలై 4 నుంచి 9 వరకు మొత్తం 6 పేపర్లకు సంబంధించిన పరీక్షలను నిర్వహించనున్నారు. డిప్లమో ఇన్‌ ప్రీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షలు కూడా జూలై 4 నుంచి 8 వరకూ కొనసాగనున్నాయి. కాగా, ఎంసెట్‌కు సోమవారం నాటికి 2,55,431 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

*అచ్చెన్నాయుడూ.. టెక్కలి రోడ్లపై ఈడ్చిఈడ్చి కొడతా
‘‘అరే దున్నపోతు నిన్ను తన్నాలంటే మాకు ఒక నిమిషం పట్టదు. ఈ రోజు చెబుతున్నా.. ఆహుతి సినిమాలో విలన్‌కు ఎలాగైతే ఈడ్చిఈడ్చి కొట్టారో అలాగే నిన్ను కూడా ఈ టెక్కలి రోడ్లపై ఈడ్చిఈడ్చి, దొర్లించి దొర్లించి కొట్టకపోతే ఐ యామ్‌ నాట్‌ దువ్వాడ శ్రీనివాస్‌ (మీసాలు మెలేస్తూ)..’’ అంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడుపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ పరుష పదజాలంతో రెచ్చిపోయారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి గురించి గానీ, వైసీపీ నాయకుల గురించిగానీ మాట్లాడితే తాట తీస్తానని హెచ్చరించారు. ‘అచ్చెన్నాయుడూ.. నిన్ను రాజకీయంగా పతనం చేయడమే నా లక్ష్యం’ అంటూ తిట్టిపోశారు. వైసీపీ ప్రభుత్వం మూడేళ్ల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఇందిరాగాంధీ కూడలిలో సోమవారం వైఎ్‌సఆర్‌ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఎమ్మెల్సీ దువ్వాడ మీడియాతో మాట్లాడుతూ.. అచ్చెన్నపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ‘‘చట్నీ నా కొడకా.. దిక్కుమాలిన దున్నుపోతు నా కొడకా.. నువ్వురా మాట్లాడుతావు.. నువ్వురా 160 స్థానాలు తెలుగుదేశం పార్టీకి వస్తాయంటావు.. నువ్వురా జగన్మోహన్‌రెడ్డి గురించి మాట్లాడుతావు.. పార్టీ లేదు.. బొక్కాలేదు.. అని లాడ్జీ గదుల్లో చెబుతా వు, లాడ్జీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మోసం చేస్తావు. ఆ దిక్కుమాలిన తెలుగుదేశం పార్టీకి, దొంగల పార్టీకి గతిలేక నిన్ను అధ్యక్షుడ్ని చేశారు. ఇంకోసారి జగన్మోహన్‌రెడ్డిపై మాట్లాడితే.. నీ తాట తీస్తా జాగ్రత్త. ఒరేయ్‌ దున్నపోతా మాకు అధికారాలతో పనిలేదురా.. పదేళ్ల క్రితమే నిన్ను గుడ్డలూడదీసి కొడతానని హెచ్చరించా. ఈ రోజుకి కూడా వడ్డితాండ్ర, ఆకాశలక్కవరం గ్రామాల్లో నువ్వు అడుగుపెట్టలేవు’’ అంటూ దువ్వాడ హెచ్చరించారు.

*కోనసీమ కల్లోలానికి వైసీపీనే కారణం: హర్షకుమార్‌
అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో అల్లర్లకు ప్రధాన కారణం వైసీపీ ప్రభుత్వమే. అంబేడ్కర్‌ పేరు ప్రకటిస్తూ అభ్యంతరాలుంటే నెల రోజుల్లో తెలియజేయాలని స్పష్టం చేసింది. ఇతర జిల్లాలకు ఎన్టీఆర్‌ అన్నమయ్య సత్యసాయి వంటి పేర్లు పెట్టినప్పుడు అవసరం లేని అభ్యంతరాలు ఇప్పుడే ఎందుకు అవసరమయ్యాయి. ఈ పరిస్థితి వల్లే అల్లర్లు చెలరేగాయి అని కాంగ్రెస్‌ నేత మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ వ్యాఖ్యానించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సోమవారం ఆయన మాట్లాడారు. జిల్లాల విభజన సమయంలో అంబేడ్కర్‌ పేరు పెట్టాలని దళిత సంఘాలు ప్రజాప్రతినిధులు ప్రజలు విజ్ఞప్తి చేశారని అయినా మొదట ఆ పేరు పెట్టలేదన్నారు. తాము అడిగినా అంబేడ్కర్‌ పేరు పెట్టలేదనే భావన దళితులు ప్రజాప్రతినిధులు అంబేడ్కర్‌ వాదుల్లో ఏర్పడిందని దీంతో వైసీపీ నేత వెనుక ఉండి యువతతో ఉద్యమాలు చేయించారని తెలిపారు. వాళ్లు తనకు చెప్పకపోయినా తానూ ఉద్యమంలోకి వెళ్లానని అన్నారు.

*పంటపై రైతులకు ఎలాంటి షరతులు లేవు: niranjan reddy
రైతులను కేంద్రం పట్టించుకోవడం లేదని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. నల్ల చట్టాలను కాంగ్రెస్ తెస్తే..బీజేపీ అమలు చేస్తోందన్నారు. రైతాంగంపై బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే మద్దతుధర చట్టం చేయాలన్నారు. 2 లక్షల రుణమాఫీ..కాంగ్రెస్ జూటా మాట అన్నారు. వర్షాకాలం పంటపై రైతులకు ఎలాంటి షరతులు లేవన్నారు.

*ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకోం: ayyanna patrudu
మహానాడుతో వైసీపీ నేతల్లో వణుకుపుడుతోందని tdp నేత అయ్యన్నపాత్రుడు అన్నారు. విజయసాయి ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు. 14 నెలలు జైల్లో ఉన్న వ్యక్తికి ఎన్టీఆర్‌తో పోలికా? అని ప్రశ్నించారు. ఏమీ చేయకుండానే సామాజిక న్యాయమంటూ బస్సు యాత్రా? అని ఆయన ప్రశ్నించారు. ఏ ప్రభుత్వంలో సామాజిక న్యాయముందో చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.