DailyDose

నేటి నుంచి మరో కొత్త బాదుడు

Auto Draft

స్థిరాస్తి రిజిస్ట్రేషన్‌ క్రయవిక్రయాలపై రాష్ట్ర ప్రభుత్వం బాదుడుకు సిద్ధమైందిపూరి గుడిసె నుంచి ఎత్తయిన భవనాల వరకు అన్ని రకాల నిర్మాణాల మార్కెట్‌ విలువలను సవరించింది. రెండు నెలల కిందటే వీటిని అమలు చేయాలని నిర్ణయించారు. కొత్త జిల్లాల ఏర్పాటు చేయడంతో జూన్‌ 1 నుంచి అమలు చేయనున్నారు. ఇందుకుగాను మే 25న జేసీ అధ్యక్షతన నిర్మాణాల మార్కెట్‌ విలువలపై సమావేశం జరిగింది. ఈ మేరకు మార్పు చేసిన వాటిని ఆమోదించడంతో నేటి నుంచి మారిన మార్కెట్‌ విలువలు అమలు కానున్నాయి. జూన్‌ 1 నుంచి అమలు చేయాలని స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ కమిషనర్‌ నుంచి ఇప్పటికే ఉత్తర్వులు వెలువడ్డాయి.

అదనపు భారమే..
నిర్మాణాల మార్కెట్‌ విలువల సవరణతో ప్రజలపై అదనపు భారం పడనుంది. పట్టణ ప్రాంతాల్లోనూ, మేజర్‌ గ్రామ పంచాయతీలు, పంచాయతీలు ఇలా ఆయా ప్రాంతాల్లోని విలువల ఆధారంగా సవరణలు చేశారు. వీటి ప్రకారమే బుధవారం నుంచి స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ రుసుములను వసూలు చేయనున్నారు. జిల్లా కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే విలువను పెంచగా, ఇప్పుడు నిర్మాణాల మార్కెట్‌ విలువలు పెరగటంతో పేద, మధ్య తరగతి వర్గాలపై మరో బాదుడుగా నిర్మాణాల మార్కెట్‌ విలువలున్నాయి.