Politics

హైద‌రాబాద్ లో బిజెపి కార్య‌వ‌ర్గ స‌మావేశం – మూడు రోజులు న‌గ‌రంలో ప్ర‌ధాని మోడీ..అమిత్ షా

హైద‌రాబాద్ లో బిజెపి కార్య‌వ‌ర్గ స‌మావేశం – మూడు రోజులు న‌గ‌రంలో ప్ర‌ధాని మోడీ..అమిత్ షా

హైద‌రాబాద్ లో బిజెపి కార్య‌వ‌ర్గ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఈ మేర‌కు తెలంగాణ‌పై ఫోక‌స్ పెట్ట‌నుంది బిజెపి అగ్ర‌నాయ‌క‌త్వం.నిన్న ల‌క్ష్మ‌ణ్ కు రాజ్య‌స‌భ సీటు ఖ‌రారు చేశారు. కాగా ఇప్పుడు జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాన్ని జ‌ర‌ప‌నున్నారు. దేశం న‌లుమూల‌ల నుంచి కాషాయ నేత‌లు ఈ స‌మావేశానికి త‌ర‌లిరానున్నారు. తెలంగాణ మా నెక్ట్స్ టార్గెట్ అంటూ బిజెపి సంకేతాలు జారీ చేస్తోంది. ఈ స‌మావేశానికి హెచ్ ఐసీసీ నోవాటెల్ ను ఎంపిక చేసింది రాష్ట్ర బిజెపి. మూడు రోజుల‌పాటు హైద‌రాబాద్ లోనే ఉండ‌నున్నారు ప్ర‌ధాని మోడీ, అమిత్ షాలు. కాగా 300మంది ప్ర‌ముఖులు ఉండేందుకు విడిదికి ప్లాన్ చేస్తున్నారు బిజెపి నేత‌లు. ఈ స‌మావేశానికి బిజెపి రాష్ట్ర సీఎంలు..కేంద్ర మంత్రులు హాజ‌రుకానున్నారు. వ్యూహాత్మ‌కంగా తెలంగాణ‌ను ఎంపిక చేసింది కేంద్ర పార్టీ.