DailyDose

పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేం – TNI తాజా వార్తలు

పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేం –  TNI  తాజా వార్తలు

* పోలవరం ప్రాజెక్టు పూర్తికి గడువు లేదని.. ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. గోదావరి డెల్టాకు.. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సాగునీటిని మంత్రి అంబటి విడుదల చేశారు. పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని.. జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తికి గడువు లేదని తేల్చి చెప్పారు. గోదావరి డెల్టాకు.. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సాగునీటిని మంత్రి అంబటి విడుదల చేశారు. అనుకున్న విధంగానే జూన్ 1 న నీటిని విడుదల చేశామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు విషయంపైనా మాట్లాడిన ఆయన.. డయా ఫ్రం వాల్‌కు మరమ్మతులపై మేధావులు తలలు పట్టుకుంటున్నారని చెప్పారు.డయా ఫ్రం వాల్ ఎవరి చర్య వల్ల దెబ్బతిందో చర్చ జరగాలి. చంద్రబాబు, దేవినేని ఉమను చర్చకు రావాలని సవాల్ చేస్తున్నా. ఇంజినీర్లు, మేధావులు, మీడియాతో చర్చ జరగాలి. కాఫర్ డ్యామ్‌ పూర్తికాకుండా డయా ఫ్రం వాల్ కడతారా? డయా ఫ్రం వాల్ కొనసాగించాలా?.. కొత్తది నిర్మించాలా?. డయా ఫ్రం వాల్‌కు మరమ్మతులపై మేధావులు తలలు పట్టుకుంటున్నారు. దశలవారీగానే ఏ ప్రాజెక్టు అయినా పూర్తవుతుంది. మొదటి దశ పూర్తికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేం. పోలవరం ప్రాజెక్టు పూర్తికి గడువు లేదు.

*కిన్నెర వాయిద్యకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగిలయ్యకు(కిన్నెర మొగిలయ్య) రూ. కోటి నగదు ఇవ్వాలని తాజాగా కేసీఆర్‌ సర్కారు ఉత్తర్వులు ఇచ్చింది. అంతేకాదు బీఎన్‌ రెడ్డి నగర్‌లో మొగిలయ్యకు ఇంటి స్థలం ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్‌లో 300 గజాల స్థలం, కోటి రూపాయల నగదు గతంలో కేసీఆర్‌ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయనకు నగదు, ఇంటి స్థలం అందించాల్సిందిగా కేసీఆర్‌ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.

*డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్యక్రమం జూన్ 3 న తిరుమ‌ల అన్నమ‌య్య భవనంలో జరుగనుంది. ఉద‌యం 9 నుంచి 10 గంట‌ల వ‌ర‌కు ఈ కార్యక్రమం ఉంటుందని టీటీడీ అధికారులు తెలిపారు. భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ కార్యనిర్వహణాధికారి ఎవి.ధ‌ర్మారెడ్డికి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చని వివరించారు. ఇందుకు భక్తులు 0877-2263261 నంబర్‌కు ఫోన్‌ చేసి సమస్యలను వివరించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంక‌టేశ్వర భ‌క్తి చాన‌ల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుందని వెల్లడించారు.తిరుమ‌ల మొద‌టి ఘాట్ రోడ్డు నడకమార్గంలో ఉన్న ల‌క్ష్మీన‌ర‌సింహాస్వామివారి ఆల‌యంలో ఇవాళ మండ‌లాభిషేకం, స‌హ‌స్ర క‌లశాభిషేకాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇటీవ‌ల శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామివారి ఆలయంలో అష్టబంధ‌న మహాసంప్రోక్షణ చేసిన విష‌యం విదిత‌మే. సంప్రోక్షణ చేసి మండ‌లం రోజులు పూర్తయిన సంద‌ర్భంగా ఉద‌యం 7 నుంచి 9 గంట‌ల వ‌ర‌కు ప్రత్యేక స‌హ‌స్ర క‌లశాభిషేకం జ‌రిగింది.

*ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం వైదిక ఆచారాల మధ్య అయోధ్యలో రామ మందిర ప్రధాన నిర్మాణానికి తొలి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా సీఎం యోగి మాట్లాడుతూ… దేవాలయం నిర్మాణం కోసం 500 ఏళ్ల పోరాటం ముగిసిందని, ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయమన్నారు. దేవాలయ నిర్మాణ సాధన ఉద్యమంలో విశ్వహిందూ పరిషత్ నాయకుడు అశోక్ సింఘాల్ పాత్రను యోగి గుర్తు చేసుకున్నారు.ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో 11 మంది అర్చకులు పూజలు జరిపారు.రామమందిర నిర్మాణ పనులకు సంబంధించిన పుస్తకాన్ని కూడా ఆదిత్యనాథ్ విడుదల చేశారు.

*ఇంటర్‌ తరగతులు జులై 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్‌ కేలండరును ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి ఎంవి శేషగిరి బాబు సోమవారం విడుదల చేశారు. ఏప్రిల్‌ 21వ తేది చివరి పనిదినమని తెలిపారు.పబ్లిక్‌ పరీక్షలు 2023 మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 4వ తేదీ వరకు నిర్వచాలని ప్రాధమికంగా నిర్ణయించారు. ప్రీ ఫైనల్‌ పరీక్షలు 2023 జనవరి 19 నుంచి 25వ తేదీ వరకు, ప్రాక్టికల్‌ పరీక్షలు ఫిబ్రవరి 8 నుంచి 28వ తేదీ వరకు జరుగుతాయి.దసరా సెలవులు అక్టోబరు 2 నుంచి 9వ తేదీ వరకు, సంక్రాంతి సెలవులు జనవరి 11 నుంచి 17వ తేదీ వరకు ఉంటాయి.

* ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రేపు(గురువారం) ఢిల్లీలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని…. అక్కడి నుంచి 11:30 గంటలకు సీఎం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి వన్‌ జనపద్‌కు చేరుకోనున్నారు. పెండింగ్‌ ప్రాజెక్టులు, పోలవరానికి నిధులు, తదితర అంశాలపై కేంద్రమంత్రులతో కలిసి ముఖ్యమంత్రి జగన్ చర్చించే అవకాశం ఉంది.

*మనీ లాండరింగ్ కేసులో అరెస్టయి జూన్ 9వ తేదీ వరకూ ఈడీ కస్టడీలోకి తీసుకున్న రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ కు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్మ రోసారి దన్నుగా నిలిచారు. ఆయనపై తప్పుడు కేసు పెట్టారని, రాజకీయ ఉద్దేశాలున్నాయని ఇప్పటికే కేజ్రీవాల్ ప్రకటించారు. తాజాగా ఆయన సత్యేంద్ర జైన్‌కు ‘పద్మ విభూషణ్’ ఇవ్వాలంటూ కితాబిచ్చారు.

*తెలంగాణ ప్రజలకు గవర్నర్ తమిళిసై రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలిపారు. కష్టపడి సాధించుకున్న రాష్ట్రంలో ప్రజలు అభివృద్ధి పథంలో నడవాలని సూచించారు. అలాగే రాష్ట్ర సాధన కోసం అమరులైన వారిని స్మరించుకోవాలన్నారు. త్యాగాల సాక్షిగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని దేశం, ప్రపంచం గమనిస్తుందన్నారు.

* సంగం పాల ధరలను స్వల్పంగా పెంచుతున్నట్లు సంస్థ ఎండీ గోపాలకృష్ణన్‌ తెలిపారు. పెరిగిన ధరలు బుధవారం నుంచే అమలులోకి వస్తాయని మంగళవారం ఒక ప్రకటనలో వివరించారు. పాల సేకరణ, ప్యాకింగ్‌ మెటీరియల్‌ ధరలు, ఇతర వ్యయాలు పెరిగిన ందునే పాల ప్యాకెట్ల ధరలు పెంచినట్లు తెలిపారు.

*హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఏవీ శేషసాయి తండ్రి ఏఎన్‌ అప్పారావు (84) మంగళవారం కన్నుమూశారు. బుధవారం ఆయనకు భీమవరంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

*వంశపారంపర్య అర్చక వ్యవస్థను టీటీడీ నాశనం చేసిందంటూ టీటీడీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు ట్విటర్‌ వేదికగా మరోసారి ఆరోపించారు. సీఎం జగన్మోహన్‌రెడ్డిని ట్యాగ్‌ చేస్తూ రమణదీక్షితులు మంగళవారం సాయంత్రం ట్వీట్‌ చేశారు. అందులో ‘‘వైఎస్‌ జగన్‌ అభినందనలు. శ్రీవేంకటేశ్వరస్వామి మిమ్మల్ని భవిష్యత్తులో మరిన్ని విజయాలతో ఆశీర్వదిస్తారు. మమ్మల్ని (వంశపారపర్య అర్చకులను) గతేడాది ఏప్రిల్‌ 2న తిరిగి తీసుకున్నారు. కానీ టీటీడీ బలహీనమైన కారణాలతో మా బాధ్యతలను నిలిపివేస్తోంది. ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం. ప్రభుత్వం అర్చకులతో స్నేహపూర్వకంగానే ఉన్నప్పటికీ టీటీడీ వంశపారంపర్య అర్చక వ్యవస్థను నాశనం చేసింది’’ అని పేర్కొన్నారు.

*కోనసీమ అల్లర్ల కేసులో నిందితుల కోసం పోలీసుల అన్వేషణ ముమ్మరమైంది. ఏలూరు రేంజ్‌ డీఐజీ పాలరాజు వారం రోజులుగా అమలాపురంలోనే మకాంవేసి శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు. ఈ కేసులో మంగళవారం మరో తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య 71కి చేరింది. మరోవైపు ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేయడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మలికిపురం, సఖినేటిపల్లి, ఆత్రేయపురం, ఐ.పోలవరం మండలాల్లో ఇంటర్నెట్‌ సేవలను పునరుద్ధరించారు. మంగళవారం అర్ధరాత్రి నుంచే ఈ 4 మండలాల్లో నెట్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన పన్నెండు మండలాల్లో నెట్‌ సేవలపై మరో 24 గంటల పాటు నిషేధం కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.

*రిసెర్చ్‌సెట్‌ ప్రవేశాల్లో అవకతవకలు జరిగాయని కొందరు అభ్యర్థులు ఆరోపిస్తున్నా రు. ప్రవేశాల ప్రక్రియ పారదర్శకంగా చేపట్టలేదంటున్నారు. స్థానిక, స్థానికేతర అభ్యర్థులను నిర్ణయించడానికి సరైన పద్ధతి పాటించలేదనే ఆరోపణలు వస్తున్నాయి. పోస్టుగ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసినవారికి ఆ తర్వాత పీహెచ్‌డీల్లో ప్రవేశాల కోసం రిసెర్చ్‌ సెట్‌ నిర్వహించారు. ఇందులో మంచి ర్యాంకు లు సాధించినా సీట్లు రాలేదని కొందరు అభ్యర్థులు వాపోతున్నారు. స్థానిక, స్థానికేతర అభ్యర్థులను నిర్ణయించడంలో సరైన నిబంధనలు పాటించకపోవడంతో తమకు అన్యాయం జరిగిందంటున్నారు. 4 నుంచి 10వ తరగతి వరకు(ఆ ఏడేళ్లలో) ఎక్కువ సంవత్సరాలు ఏ రాష్ట్రంలో చదివితే అక్కడి స్థానికత వస్తుందని, కానీ ఆ నిబంధనను అనుసరించలేదని అంటున్నారు.

*రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 179 ఎస్సీ గురుకులాల్లో ఈ ఏడాది సీబీఎ్‌సఈ విద్యా విధానాన్ని అమలు చేయనున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. దీనిలో భాగంగా గురుకులాల టీజీటీ టీచర్లకు సీబీఎ్‌సఈకి చెందిన ఆంగ్లం, గణితం, సైన్స్‌ సబ్జెక్టుల్లో శిక్షణ ఇవ్వనున్నామని చెప్పారు. ఎస్సీ గురుకులాలకు చెందిన బోర్డు ఆఫ్‌ గవర్నర్స్‌(బీవోజీ) 70వ సమావేశాన్ని తాడేపల్లిలోని గురుకులం ప్రధాన కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పెద్దగా డిమాండ్‌లేని కోర్సుల స్థానంలో డిమాండ్‌ ఉన్న కోర్సులను ప్రవేశపెట్టడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గురుకులాల్లో రూ.65.06 కోట్లతో సోలార్‌ ప్యానెళ్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని, వీటి ద్వారా 1,233 కేవీల విద్యుత్‌ ఉత్పత్తి అవుతుందని తెలిపారు. గురుకులాల్లో విద్యార్థుల రక్షణ, పటిష్టమైన పర్యవేక్షణ కోసం రూ.7 కోట్లతో సీసీ కెమెరాల ఏర్పాటుకు తీర్మానించామన్నారు.

* ఐఎస్‌ఎ్‌సఎఫ్‌ వరల్డ్‌క్‌పలో భారత మహిళల 10 మీ. ఎయిర్‌ రైఫిల్‌ జట్టు స్వర్ణంతో అదరగొట్టింది. మంగళవారం జరిగిన ఫైనల్లో ఎలవెనిల్‌ వలరివన్‌, రమిత, శ్రేయ అగర్వాల్‌తో కూడిన భారత త్రయం 17-5తో డెన్మార్క్‌ జట్టుపై గెలిచింది. పోలెండ్‌ టీమ్‌కు కాంస్యం దక్కింది. క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో 944.4 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన భారత జట్టు.. స్టేజ్‌-2లో రెండో స్థానంతో స్వర్ణ పోరుకు అర్హత సాధించింది. రుద్రాన్ష్‌ పాటిల్‌, పార్థ్‌ మఖీజా, ధనుష్‌ శ్రీకాంత్‌తో కూడిన భారత పురుషుల టీమ్‌.. కాంస్య పతక పోరులో 10-16తో క్రొయేషియా చేతిలో ఓడింది.

*సీఎం కేసీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా వచ్చే జూలై నాటికి నెక్లెస్‌ రోడ్డులో నీరా కేఫ్‌ను ఏర్పాటు చేస్తామని ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ప్రకటించారు. నీరా ఉత్పత్తులైన బెల్లం, తేనె, చక్కెర తదితర ఉత్పత్తులను ఆగస్టులో ప్రారంభిస్తామని తెలిపారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నీరా ప్రాజెక్టుపై మంత్రులు మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఇతర రాష్ట్రాల్లో గీత కార్మికులకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, నీరా, దాని అనుబంధ ఉత్పత్తులు తదితర అంశాలపై అధ్యయనం చేయటానికి డిప్యూటీ కమిషనర్‌ డేవిడ్‌ రవికాంత్‌ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ఎక్సైజ్‌ డైరెక్టర్‌ను ఆదేశించారు.

*రాష్ట్రంలో రెవెన్యూ జిల్లాలకు అనుగుణంగా ఏర్పాటైన 33 నూతన జిల్లా కోర్టులను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. ఈ నెల 2న సాయంత్రం హైకోర్టులో జరుగనున్న ప్రత్యేక కార్యక్రమంలో ఎన్వీ రమణ, కేసీఆర్‌ 33 జ్యుడీషియల్‌ జిల్లాలను అధికారికంగా ప్రారంభిస్తారు. హైకోర్టుతో సంప్రదింపుల అనంతరం 33 జిలాల్ల కోర్టులను ఏర్పాటు చేస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తెలంగాణ ఆవిర్భావం రోజైన జూన్‌ 2 నుంచి రాష్ట్రంలో నూతన జ్యుడీషియల్‌ జిల్లాలు ప్రారంభమవుతాయని పేర్కొంది.

*రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య విద్య కళాశాలల్లో పీజీ సీట్లు పెరగనున్నాయి. అన్ని కళాశాలల్లో కలిపి కొత్తగా 240 సీట్ల కోసం ప్రతిపాదించారు. ఇందుకు సంబంఽధించిన సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)తో మంగళవారం వైద్యవిద్య సంచాలకులు డాక్టర్‌ రమేశ్‌రెడ్డి ఢిల్లీ వెళ్లారు. ఆయన వెంట కళాశాలల ప్రిన్సిపాళ్లు ఉన్నారు. కొత్తగా సిద్దిపేట, సూర్యాపేట, నల్లగొండ కళాశాలలకు పీజీ సీట్లు రానున్నాయి. సిద్దిపేటకే 80 సీట్లను ప్రతిపాదించినట్లు సమాచారం. ఉస్మానియా, గాంఽధీ, కాకతీయ, మహబూబ్‌నగర్‌, నిజా మాబాద్‌, ఆదిలాబాద్‌ రిమ్స్‌లో పీజీ సీట్లను మరింత పెంచుకునేందుకు ప్రతిపాదించారు. కాగా, రాష్ట్ర వైద్య శాఖ సమర్పించే ప్రతిపాదనలతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంతృప్తి చెందాల్సి ఉంటుంది. నిబంధనల మేర కు అధ్యాపకులు, మౌలిక సదుపాయాలుంటే కోరిన సీట్లన్నింటినీ ఇచ్చే అవకాశం ఉంది. ఇక కేంద్రం అంగీ కా రం తెలిపాక.. ఒక్కో సీటుకు రూ.1.20 కోట్లు ఇస్తుంది. వీటితో పీజీ విద్యకు అవసరమయ్యే మౌలిక సదుపా యాలను అభివృద్ధి చేయాలి. రాష్ట్రం కోరినట్లు 240 పీజీ సీట్లకు కేంద్రం అనుమతిస్తే రూ.288 కోట్లు వస్తాయి.

*భారత వైమానిక, నౌకా దళాలకు అస్త్ర ఎంకే-1 క్షిపణిని సరఫరా చేయాలని భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌(బీడీఎల్‌) సంస్థతో.. రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కాంట్రాక్టు విలువ రూ.2,971 కోట్లు. అస్త్ర ఎంకే-1.. భారత్‌లో తయారైన మొట్టమొదటి గాలిలో నుంచి గాలిలోకి ప్రయోగించే క్షిపణి. దీని తయారీ సాంకేతికతను డీఆర్‌డీవో నుంచి బీడీఎల్‌కు అందించామని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. ప్రస్తుతం బీడీఎల్‌లో ఈ క్షిపణుల తయారీ జరుగుతోందని చెప్పారు. ఈ ప్రాజెక్టు ఆత్మనిర్భర్‌ భారత్‌ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని అన్నారు. రక్షణ మంత్రిత్వశాఖ ఇప్పటికే 248 అస్త్ర ఎంకే-1 క్షిపణులను ఆర్డర్‌ చేసింది. వీటిలో వైమానిక దళానికి 200, నౌకా దళానికి 48 కేటాయించారు. డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన ఈ క్షిపణి పరిధి 100 కి.మీ. మే 2003లో దీనిని మొదటిసారిగా పరీక్షించారు. అనేకసార్లు సుఖోయ్‌-30 ఎంకేఐ యుద్ధ విమానాలకు అనుసంధానించి ప్రయోగించారు. భవిష్యత్తులో ఈ క్షిపణిని తేజస్‌ మార్క్‌-1ఏ, అభివృద్ధి చేసిన మిగ్‌-29 విమానాలతో కూడా అనుసంధానం చేస్తారు.

*డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్స్‌ మౌల్డ్‌ టెక్నాలజీ(డీపీఎంటీ), డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్‌ టెక్నాలజీ(డీపీటీ) కోర్సుల్లో చేరేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని చర్లపల్లి సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ(సీపెట్‌) ప్రిన్సిపల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బి. శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. మూడేళ్ల పాటు నిర్వహించనున్న డిప్లొమా కోర్సుల్లో చేరేందుకు పదో తరగతి పూర్తి చేసిన వారు అర్హులని చెప్పారు. ఈ కోర్సుల్లో చేరేందుకు జూన్‌ 19న ఆన్‌లైన్‌లో కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌(క్యాట్‌) నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు జూన్‌ 5 లోగా ఠీఠీఠీ.ఛిజీఞ్ఛ్ట. జౌఠి.జీుఽ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

*రాష్ట్రంలోని రైతుబజార్లు, రిటైల్‌ మార్కెట్లలో నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రత్యేక యాప్‌ను వారంరోజుల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ తెలిపారు. మంగళవారం అమరావతి సచివాలయంలో ఆయా ధరలపై సీఎస్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుబజార్లలో కూరగాయలు, వంట నూనెలు సహా నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్‌, ఆయిల్‌ఫెడ్‌, రైతుబజార్ల అధికారులను ఆదేశించారు.

*విలీన పాఠశాలల ఉపాధ్యాయుల పనిభారం ప్రకారం పోస్టుల మంజూరు శాస్ర్తీయంగా జరగాలని, అదనపు పోస్టులు మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు జీవీ నారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. ఈ విషయాలపై అందరు భాగస్వాములతోనూ ఒక సమావేశం నిర్వహించాలని కోరుతూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు మంగళవారం ఒక లేఖ రాశారు.

* ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల పదోన్నతుల్లో విద్యాశాఖ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ జూన్‌ 10న రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్లను ముట్టడించనున్నట్టు ఏపీ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బట్టు సురేశ్‌కుమార్‌ తెలిపారు. ప్రభుత్వం దిగిరాని పక్షంలో జూన్‌ 17 నుంచి విజయవాడలో రిలే నిరాహార దీక్షలు చేయాలని నిర్ణయించినట్టు మంగళవారం ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులుగాను, ఉప విద్యాశాఖ అధికారులుగాను పనిచేస్తున్న బోధనేతర సిబ్బందిని తొలగించి, వారి స్థానంలో అర్హత కలిగిన సీనియర్‌ ప్రధానోపాధ్యాయులకు, మండల విద్యాశాఖ అధికారులకు పదోన్నతులు కల్పించాలని కోరారు. జూనియర్‌ కళాశాలల్లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న లెక్చరర్లను పర్మినెంట్‌ చేయాలన్నారు. సీఎం హామీ మేరకు సీపీఎ్‌సను రద్దుచేసి వోపీఎ్‌సను అమలు చేయాలని కోరారు.

* విద్యుత్ మీటర్లు ఇవ్వడానికి లంచం అడిగిన ఏఈ, లైన్ ఇన్‌స్పెక్టర్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కూకట్‌పల్లికి చెందిన భాస్కర్ అనే గుత్తేదారు 20 విద్యుత్ మీటర్ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నాడు.సనత్ నగర్ విద్యుత్ శాఖలో ఏఈగా విధులు నిర్వర్తిస్తున్న అవినాష్ రూ. 25 వేలు, లైన్ ఇన్‌స్పెక్టర్ కృపానంద్ రూ. 7,500 లంచం డిమాండ్ చేశారు. ఇందులో కొంత నగదును భాస్కర్ ఇప్పటికే ముట్టజెప్పారు. ఆ తర్వాత 5 మీటర్లు మంజూరు చేశారు. మిగతా డబ్బులిస్తేనే మరో 15 మీటర్లు మంజూరు చేస్తామని అధికారులు డిమాండ్ చేశారు. దీంతో భాస్కర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏఈ, లైన్ ఇన్‌స్పెక్టర్‌కు లంచం ఇస్తుండగా, ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

*ఏపీలో డీజిల్పెట్రోల్ కొనుగోళ్లను నిలిపివేశారు. పెట్రో కొనుగోళ్లను బంకుల యాజమాన్యాలు నిలిపివేశారు. బంకుల డీలర్లకు 2017 నుంచి కమీషన్ పెంచకపోవడంతో ఆందోళనకు వ్యక్తం చేశారు. ఏపీలోని 4వేల పెట్రోల్ బంకులకు గానూ 2వేల బంకుల్లో రోజూ కొనుగోళ్లు జరుగుతుంది. ఆయిల్ కంపెనీలకు ముందే పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ నోటీసులిచ్చింది. అలాగే ఆయిల్ కంపెనీలు దిగిరాకపోతే బంకులు మూస్తామని హెచ్చరించింది.

*రాష్ట్రాలకు కేంద్రం చెల్లించాల్సిన జీఎస్టీ బకాయిలను పూర్తి స్థాయిలో చెల్లించినట్లు మంగళవారం కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ఈ ఏడాది జనవరి వరకు ఉన్న బకాయిలు రూ. 47,617 కోట్లు, ఫిబ్రవరి, మార్చి నెలల చెల్లింపులు రూ. 21,322 కోట్లు కలిపి మొత్తం రూ. 86,912 కోట్లను విడుదల చేశామని తెలిపింది. అందులో ఆంధ్రప్రదేశ్‌కు రూ. 3199 కోట్లు విడుదల కాగా… తెలంగాణకు రూ. 396 కోట్లు విడుదలయ్యాయి.

*రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి, వైసీపీకి చెందిన ముగ్గురు అభ్యర్థులు మంగళవారం రెండో సెట్‌ నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. అమరావతి అసెంబ్లీ కార్యాలయంలో రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి పీవీ సుబ్బారెడ్డికి వైసీపీ అభ్యర్థి ఆర్‌. కృష్ణయ్య స్వయంగా రెండో సెట్‌ నామినేషన్‌ పత్రాలను అందజేశారు. ఎస్‌ నిరంజన్‌రెడ్డి, బీద మస్తానరావు తరఫున రాష్ట్ర మంత్రులు జోగి రమేశ్‌, అంబటి రాంబాబు రెండో సెట్‌ నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు.

* ఏపీ టీచర్స్‌ ఫెడరేషన్‌(ఏపీటీఎఫ్‌) నూతన అధ్యక్షులుగా జి. హృదయరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎస్‌. చిరంజీవి ఎన్నికయ్యారు. తిరుపతిలో జరిగిన ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశంలో వీరిని ఎన్నుకున్నారు. ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడాన్ని ఆపేయాలని, ప్రాథమిక విద్యను బలోపేతం చేయాలని ఈ సందర్భంగా హృదయరాజు డిమాండ్‌ చేశారు. తెలుగు మీడియం కూడా కొనసాగించాలని, సీబీఎ్‌సఈ సిలబస్‌ వద్దని, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులపై యాప్స్‌ భారం తొలగించాలని తీర్మానం చేశామన్నారు. సీపీఎ్‌సను రద్దు చేయాలన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగ వ్యతిరేక విధానాలను కౌన్సిల్‌ తీవ్రంగా పరిగణించిందని తెలిపారు. మున్సిపల్‌ విద్య విలీనంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు.

*పార్టీ నేతలతో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. JAGAN పాలనతో వైసీపీ పని అయిపోయిందన్నారు. జరగబోయేది వన్‌ సైడ్ ఎలక్షన్ అన్నారు. ఇంతటి ప్రజావ్యతిరేకత ఏ ప్రభుత్వంపైనా చూడలేదని చంద్రబాబు అన్నారు. పార్టీలో గ్రూపులకు చెక్ పడాల్సిందే.. ఎవరికీ మినహాయింపులు లేవన్నారు. కార్యకర్తల్లో కసి పాలనపై ప్రజల అసంతృప్తే మహానాడు సక్సెస్‌కు కారణమన్నారు. ఓట్ల తొలగింపుపై స్థానిక నేతలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల అవినీతి, అక్రమాలపై స్థానికంగా పోరాటం చేయాలన్నారు.

*ఆత్మకూరు ఉప ఎన్నికకు టీడీపీ దూరం కానున్నట్లు సమాచారం. మేకపాటి కుటుంబ సభ్యులకే టికెట్ ఇవ్వడంతో సంప్రదాయాన్ని పాటించాలని టీడీపీ భావిస్తోన్నట్లు తెలుస్తోంది. గతంలో బద్వేలు ఉప ఎన్నికలోనూ ఇదే తరహా నిర్ణయం తీసుకుంది. త్వరలో అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.

*ఏపీలో డీజిల్, పెట్రోల్ కొనుగోళ్లను నిలిపివేశారు. పెట్రో కొనుగోళ్లను బంకుల యాజమాన్యాలు నిలిపివేశారు. బంకుల డీలర్లకు 2017 నుంచి కమీషన్ పెంచకపోవడంతో ఆందోళనకు వ్యక్తం చేశారు. ఏపీలోని 4వేల పెట్రోల్ బంకులకు గానూ 2వేల బంకుల్లో రోజూ కొనుగోళ్లు జరుగుతుంది. ఆయిల్ కంపెనీలకు ముందే పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ నోటీసులిచ్చింది. అలాగే ఆయిల్ కంపెనీలు దిగిరాకపోతే బంకులు మూస్తామని హెచ్చరించింది.

* కేసీఆర్‌ దూరదృష్టితోనే జిల్లా సస్యశ్యామలమైందని మంత్రి jagadeesh reddy అన్నారు. ఇప్పుడు జిల్లాలో ఒక్క ఫోరైడ్‌ కేసు కూడా లేదన్నారు. అలాగే జిల్లాలో పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తిచేస్తామని మంత్రి చెప్పారు. రైతులను లక్షాధికారులుగా చేయలన్నదే కేసీఆర్‌ లక్ష్యమన్నారు.

*సుప్రీంకోర్టు లో జగన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. రిషికొండ తవ్వకాలపై హైకోర్టును ఆశ్రయించాలని ధర్మాసనం సూచించింది. హైకోర్టులో తేలేంతవరకు ఇకపై కొత్త తవ్వకాలు చేపట్టకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పాత రిసార్ట్ ఉన్న ప్రాంతంలో మాత్రమే.. కొత్త నిర్మాణాలు చేపట్టడానికి సుప్రీంకోర్టు అనుమతించింది. అంతకు ముందు రుషికొండ తవ్వకాలపై సుప్రీంకోర్టులో వాదనలు వాడీవేడిగా కొనసాగాయి. మొత్తం కొండను తొలిచేశారని.. పునరుద్ధరించడం సాధ్యం కాదని ఎంపీ రఘురామ కృష్ణరాజు తరపు న్యాయవాది బాలాజీ శ్రీనివాసన్‌ కోర్టుకు తెలిపారు. రిషికొండ ఫొటోలను లాయర్‌ బాలాజీ శ్రీనివాసన్‌ ధర్మాసనం ముందు ఉంచారు. జస్టిస్‌ గవాయ్‌, జస్టిస్‌ హిమాకోహ్లి ధర్మాసనం ఫొటోలు పరిశీలించింది. హైకోర్టులో ధిక్కరణ పిటిషన్‌ పెండింగ్‌లో ఉందని బాలాజీ శ్రీనివాసన్‌ సర్వోన్నత న్యాయస్థానానికి వెల్లడించారు.

*కడప: జిల్లా జైల్లో ప్రత్యేక వసతులు కల్పించాలంటూ మాజీ మంత్రి వివేకా హత్య కేసు నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి బుధవారం జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం శివశంకర్‌రెడ్డి.. కడప సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. కడప జైల్లో ప్రత్యేక వసతులు కల్పించాలని కోరుతూ జిల్లా కోర్టులో శివశంకర్‌రెడ్డి పిటిషన్ వేశారు. శివశంకర్‌రెడ్డి వేసిన పిటిషన్‌పై సీబీఐ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. కడప జిల్లా కోర్టులో సీబీఐ న్యాయవాది వాదనలు వినిపించారు. శివశంకర్‌రెడ్డికి జైల్లో ప్రత్యేక వసతులు అవసరం లేదని సీబీఐ తరపు న్యాయవాది వాదించారు. తదుపరి విచారణను న్యాయస్థానం ఈనెల 7కు వాయిదా వేసింది.

*వాట్సప్ గ్రూప్ ద్వారా మూడు రోజుల పసిపాపను అమ్మకానికి పెట్టిన వైనం ఆశ్చర్యానికి గురిచేసింది. విషయం వెలుగులోకి రావడంతో చైల్డ్ లైన్ అధికారులకు పలువురు ఫిర్యాదు చేశారు. చిన్నారి అమ్మకంపై ఆర్ఎంపీ డాక్టర్ అమృతరావు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్టు అధికారులు గుర్తించారు. ఆర్ఎంపీ అమృతరావు జి.కొండూరులో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు.

*ముఖ్యమంత్రి జగన్క లెక్టర్లు, ఎస్పీలతో ‘స్పందన’ కార్యక్రమంలో పాల్గొన్నారు. బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీఎస్ సమీర్ శర్మ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై సీఎం చర్చిస్తున్నట్లు సమాచారం. అలాగే ఖరీఫ్ సన్నద్దత, విత్తనాలు, ఎరువుల పంపిణి, గృహ నిర్మాణం, అమ్మఒడి ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చలు జరుపుతున్నట్లు తెలియవచ్చింది. రాష్ట్రంలో శాంతి భద్రతల అంశాలపై జగన్మోహన్ రెడ్డి ఎస్పీలకు దిశా నిర్దేశం చేయనున్నారు

*గడప గడప ప్రభుత్వ కార్యక్రమంపై వాలెంటీర్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమతో గొడ్డు చాకిరీ చేయిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. వాలెంటీర్ బాషా ప్రభుత్వం ఇచ్చిన సర్వే పేపర్‌లను తగలబెట్టి నిరసన తెలిపాడు. పేపర్‌లను తగలబెట్టిన వీడియో‌ను వాలెంటీర్ల అధికారిక గ్రూపులో బాషా పోస్ట్ చేశాడు. తమతో గొడ్డు చాకిరీ చేయిస్తే ఫస్ట్రేషన్ ఇలానే ఉంటుందని ఆవేదన చెందాడు. కాగా వాలెంటీర్ బాషా పోస్టింగ్ చర్చనీయాంశంగా మారింది. బాషా భట్టిప్రోలులో వాలెంటీర్‌గా పని చేస్తున్నాడు.

*గాయకుడు కేకే అకాల మరణం బాధాకరమని తెలియజేస్తూ.. జనసేన అధినేత, స్టార్ హీరో పవన్ కల్యాణ్ ఒక ప్రకటనను విడుదల చేశారు. కేకేగా సుపరిచితులైన ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కున్నత్ అకాల మరణం బాధ కలిగించిందన్నారు. సినీ సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక బాణీని కలిగిన గాయకుడు కేకే అని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు. ఇంకా పవన్ తన ప్రకటనలో.. ‘‘నా చిత్రాల్లో ఆయన ఆలపించిన గీతాలు అభిమానులను, సంగీత ప్రియులను అమితంగా మెప్పించాయి. ఖుషీ చిత్రం కోసం ‘ఏ మేరా జహా’ గీతం అన్ని వయసులవారికీ చేరువైంది. అందుకు కె.కె. గారి గాత్రం ఓ ప్రధాన కారణం. ‘జల్సా’లో మై హార్ట్ ఈజ్ బీటింగ్… అదోలా’, ‘బాలు’ ‘ఇంతే ఇంతింతే’, ‘జానీ’లో ‘నాలో నువ్వొక సగమై’, ‘గుడుంబా శంకర్’లో ‘లే లే లే లే’.. గీతాలను నా చిత్రాల్లో ఆయన పాడారు. అవన్నీ శ్రోతలను ఆకట్టుకోవడమే కాదు… సంగీతాభిమానులు హమ్ చేసుకొనేలా సుస్థిరంగా నిలిచాయి. సంగీత కచేరీ ముగించుకొన్న కొద్దిసేపటికే హఠాన్మరణం చెందటం దిగ్భ్రాంతికరం. ఆయన చివరి శ్వాస వరకూ పాడుతూనే ఉన్నారు. కేకే గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఆ కుటుంబానికి భగవంతుడు మనో ధైర్యాన్ని ప్రసాదించాలి’’ అని పేర్కొన్నారు.

*విజయవాడ: నగరంలోని కృష్ణలంకలో ఇంటింటికీ సీపీఎం(CPM) యాత్ర బుధవారం ఉదయం ప్రారంభమైంది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు , బాబూరావు , దోనేపూడి కాశీనాథ్ ఈ యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ… ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకునేందుకు ఇంటింటికీ సీపీఎం కార్యక్రమంలో చేపట్టామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలను దగా చేస్తోందని మండిపడ్డారు. పైకి ప్రకటించేదొకటి.. ఆచరించేది మరొకటని మండిపడ్డారు. ఎక్కడకి వెళ్లినా ప్రజలు కన్నీరు పెడుతున్నారని తెలిపారు. సంక్షేమ పధకాల పేరుతో ఇస్తూ.. రెట్టింపు వసూళ్లు చేస్తున్నారన్నారు. జగన్ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. సమయం వచ్చినప్పుడు తగిన విధంగా బుద్ది చెబుతారని శ్రీనివాసరావు హెచ్చరించారు.