Devotional

గంటను కొట్టే గుడి కాదండీ.. కట్టే ఆలయం!

గంటను కొట్టే గుడి కాదండీ.. కట్టే ఆలయం!

దేవభూమి ఉత్తరాఖండ్​లో ఓ వింతైన దేవాలయం ఉంది. ఇక్కడ భక్తులు తమ కోరికలను స్టాంప్​ పేపర్​పై రాసి కడతారు. ​ఆ కోరికలు తీరితే గంటను కట్టడం ఇక్కడి సంప్రదాయం. ఆ గుడి విశేషాలు ఏంటో మీరు చూడండి! దేవాలయం అనగానే పూజ అయ్యాక గంటను కొట్టడం సర్వసాధారణం. కానీ ఈ గుడి అందుకు పూర్తిగా భిన్నం. అన్ని ఆలయాల్లో గంటను కొడితే ఈ గుడిలో గంటను కడతారు. ఇదేంటి అనుకుంటున్నారా అయితే ఈ గుడి గురించి తెలుసుకోండి.దేవభూమిగా పేరొందిన ఉత్తరాఖండ్​.. అనేక చారిత్రక దేవాలయాలతో భక్తుల కోరికలను తీరుస్తూ ప్రత్యేకతను పొందింది. రాష్ట్రంలోని అల్మోరా చిత్తయిలో ఓ వింతైన ఆలయం ఉంది. ఇక్కడ స్టాంప్​ పేపర్​లో తమ కోరికలను రాసి దేవుడి ముందు కడతారు. భక్తులు కట్టిన పత్రాల్లోని కోరికలను పూజారి గోలు దేవుడికి వినిపిస్తారు. కోరికలు తీరిన భక్తులు దేవుడికి గంటలను సమర్పిస్తారు. ఇదీ ఇక్కడి సంప్రదాయం.