Politics

మంత్రి రోజాకి కేరళ మానసిక వైద్యం తప్పనిసరి – TNI రాజకీయ వార్తలు

మంత్రి  రోజాకి కేరళ మానసిక వైద్యం తప్పనిసరి – TNI రాజకీయ వార్తలు

*చిలకలూరిపేట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి జరీనా సుల్తానా, చిలకలూరిపేట నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు అమరా రమాదేవి, చిలకలూరిపేట నియోజకవర్గ మహిళా ప్రధాన కార్యదర్శి పోపూరి లక్ష్మి, పట్టణ మహిళా అధ్యక్షురాలు అద్దంకి అనిత భాయ్, పార్టీ నాయకురాలు మిద్దెల వనిత భాయ్ లు ప్రసంగించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రోజా… సిగ్గులేని మాటలు మాట్లాడవద్దు. మంత్రివై…. మహిళవై ఉండి అత్యాచారాలు గురించి అవహేళన చేయడం అవమానంగా లేదా….? అంటూ చిలకలూరిపేట నియోజకవర్గ తెలుగు మహిళలు తీవ్రంగా మండిపడ్డారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఆర్ కే రోజా తన స్థాయిని మరచి మహిళ అనే విషయం కూడా మరిచి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఒకటి, రెండు రేప్ లకే తెలుగుదేశం రాద్ధాంతం చేయడం ఏమిటంటూ రోజా మాట్లాడడం ఆమె దిగజారుడు తనానికి నిదర్శనం అన్నారు. ఒక మంత్రి అంటారు. “అనుకోకుండా అప్పుడప్పుడూ అలా జరుగుతుంటాయి” అని హోమ్ మంత్రి అంటారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏపీలో వందల సంఖ్యలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరిగిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లాలోనే అత్యాచారాలు జరిగిన విషయం రోజాకు తెలియదా అన్నారు. మహిళలపై అత్యాచారాలు, హత్యలు నివారించడానికి చర్యలు తీసుకోవాలే కానీ… ఇలా హేళనగా మాట్లాడటం మంచిది కాదన్నారు. వైసిపి పాలనలో జరిగిన అత్యాచారాలు, హత్యల ఫై బహిరంగ చర్చకు రోజా సిద్ధమా అని సవాల్ విసిరారు. దిశా చట్టం ద్వారా ఎంత మంది ఆడ బిడ్డలకు న్యాయం జరిగిందో ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. రోజా ఇలాగే మాట్లాడితే, త్వరలోనే రోజాకి కేరళ మానసిక వైద్యం టిడిపి డాక్టర్స్ సెల్ వారి ద్వారా చేయి౦చనున్నామని తెలిపారు. గతంలో తమిళనాడులో కూడా ఓ మంత్రి ఇలా మానసిక సమస్యతో మాట్లాడుతుంటే వారిని కేరళ మానసిక వైద్యాలయానికి పంపారని, మూడు నెలల్లోనే మరలా అతడు మామూలు మనలాగా మనిషి అయ్యారని తెలిపారు.

*ఇప్పుడు ఆపారు.. మరోసారి తప్పకుండా వెళ్లి తీరుతా : శైలజానాథ్
విజయవాడ నుంచి కాంగ్రెస్ నేతలు చేపట్టిన “చలో అమలాపురం” కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ సహా ఆ పార్టీ నాయకులు.. రామవరప్పాడు వద్ద జగజ్జీవన్ రాం విగ్రహానికి నివాళులర్పించి అమలాపురం బయల్దేరారు. అయితే ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ.. పోలీసులు కాంగ్రెస్ నేతలను అడ్డుకున్నారు. వారిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. విజయవాడ నుంచి కాంగ్రెస్ నేతలు చేపట్టిన చలో అమలాపురం కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ సహా ఆ పార్టీ నాయకులు.. రామవరప్పాడు వద్ద జగజ్జీవన్ రాం విగ్రహానికి నివాళులర్పించి అమలాపురం బయల్దేరారు. అయితే ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ…పోలీసులు కాంగ్రెస్ నేతలను అడ్డుకున్నారు. వారిని అరెస్టు చేసి పోలీస్స్టేషన్‌కు తరలించారు. అంబేడ్కర్ పేరును కోనసీమకు పెడితే నేరం అన్నట్లుగా కొంతమంది ప్రవర్తిస్తున్నారని శైలజానాథ్‌ మండిపడ్డారు. జిల్లా ఏర్పాటు చేసిన నెల తర్వాత.. కోనసీమ జిల్లా పేరు మారుస్తూ.. నోటిఫికేషన్ ఇవ్వడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని ఆరోపించారు.

*ఎనిమిదేళ్లలో ఐటీలో అద్భుతమైన పురోగతి : కేటీఆర్‌
గడిచిన ఎనిమిదేళ్లలో తెలంగాణలో ఐటీలో అద్భుతమైన పురోగతి సాధించామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు. 2021-22 ఏడాదికి ఐటీ వార్షిక నివేదిక బుధవారం విడుదల చేశారు. హైటెక్‌ సిటీలోని టెక్‌ మహీంద్రా కార్యాలయంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావం నుంచి సాధించిన పురోగతిని వివరించారు. కరోనా మహమ్మారి ప్రభావం ఉన్నా గతేడాది అంచనాలకు మంచి రాణించామన్నారు.ఐటీ, అనుబంధ ఎగుమతుల్లో గతేడాది 26.14శాతం వృద్ధి సాధించినట్లు తెలిపారు. జాతీయ సగటు 17.2 శాతం కంటే 9 శాతం ఎక్కువ వృద్ధి సాధించామన్నారు. 2021-22లో ఐటీ ఎగుమతుల విలువ రూ.1,83,569 కోట్లనీ, దేశంలో 4.5లక్షల ఉద్యోగాలు వస్తే హైదరాబాద్‌లో లక్షన్నర వచ్చాయని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 7,78,121గా ఉన్నాయని, తెలంగాణలో ఎనిమిదేళ్లలో 4.1లక్షల ఐటీ ఉద్యోగాలు వచ్చాయన్నారు. ఈ నెల 20న టీ హబ్‌ రెండో దశ ప్రారంభిస్తామని, టీ వర్క్స్‌ కొత్త ఫెసిలిటీ ఆగస్టు ప్రారంభించే యోచనలో ఉన్నట్లు కేటీఆర్‌ ప్రకటించారు.

*వాణిజ్య పంట‌ల‌ను పండించాలి : మంత్రి నిరంజ‌న్ రెడ్డి
మూస ధోర‌ణిలో ఒకే ర‌క‌మైన పంట‌లు పండించ‌కుండా, వాణిజ్య పంట‌ల‌ను పండించేలా రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి సూచించారు. అన్న‌దాతల‌ను ప్ర‌తి ఒక్క‌రూ గౌర‌వించుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. న‌ల్ల‌గొండ‌, యాదాద్రి జిల్లాల వ్య‌వ‌సాయ అధికారుల‌కు, రైతుబంధు స‌మితి స‌భ్యుల‌కు వానాకాలం సాగు స‌న్న‌ద్ధ‌త‌పై నిర్వ‌హించిన వ‌ర్క్‌షాప్‌లో మంత్రి నిరంజ‌న్ రెడ్డి పాల్గొని ప్‌‌సంగించారు.ఇవాళ రాష్ట్రంలో ఉన్న బీడు భూముల‌న్ని పలు ర‌కాల పంట‌ల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయ‌ని తెలిపారు. 2020-21 సంవ‌త్స‌రంలో 3 కోట్ల మెట్రిక్ ట‌న్నుల ధాన్యాన్ని తెలంగాణ పండించింద‌ని గుర్తు చేశారు. దేశానికే అన్నం పెట్టేస్థాయికి తెలంగాణ చేరుకోవ‌డం మ‌నంద‌రికీ గ‌ర్వ‌కార‌ణం అని మంత్రి పేర్కొన్నారు.ప్రజల జీవన విధానంలో మార్పులు వచ్చాయి. ప్రజల ఆహారపు అలవాట్లు కూడా మారాయి. వాటికి అనుగుణంగా తృణ ధాన్యాలు, ఉద్యానవన పంటలను కూడా పండించాల‌ని మంత్రి సూచించారు. ఇవాళ‌ నూనె గింజల కొరత తీవ్రంగా ఉన్న నేప‌థ్యంలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్స‌హిస్తున్నామ‌ని చెప్పారు. 2 ల‌క్ష‌ల ఎక‌రాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తామ‌న్నారు. భ‌విష్య‌త్‌లో 10 ల‌క్ష‌ల ఎక‌రాల్లో ఆయిల్ పామ్ సాగును విస్త‌రిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

*బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణంలో నూతన శకం: Gangula
బీసీ కులాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణాల కల సాకారమయిందని, ముఖ్యమంత్రి కేసిఆర్సం కల్పంతో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కృషితో బుధవారం ఉప్పల్ భగాయత్ లో దేవాంగ కులానికి సంబంధించిన ఆత్మగౌరవ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.ఏక సంఘంగా ఏర్పడిన ఆయా కుల సంఘాల ఆత్మగౌరవ భవన నిర్మాణాల ట్రస్ట్ లు ఈ భవన నిర్మాణాలను చేపడుతున్నాయి.ప్రభుత్వం ఉప్పల్ భగాయత్ లో దేవాంగ కులస్తుల ఆత్మగౌరవ భవన నిర్మాణం కోసం చెరో ఎకరా భూమి చెరో కోటి రూపాయలు మంజూరు చేసింది.ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ బీసీలు వెనుకబడిన వారు కాదని గత పాలకుల నిర్లక్ష్యంతో వెనుకకు నెట్టేయబడ్డామన్నారు.

*తెలంగాణ వచ్చాకే సమస్యలు దూరం అయ్యాయి:Talasani
ప్రజలు ఎదుర్కొంటున్న అనేక దీర్ఘకాలిక సమస్యలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిష్కరించబడ్డాయని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్చె ప్పారు. బుధవారం GHMC కార్యాలయంలో ఈ నెల 3 నుండి 15 వ తేదీ వరకు నిర్వహించనున్న పట్టణ ప్రగతి కార్యక్రమం పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హోంమంత్రి మహమూద్ అలీ తో కలిసి సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టణాలు, పల్లెల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వివరించారు. ఈ నెల 3 వ తేదీ నుండి ప్రారంభం కాకున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యంతో అనేక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇందుకోసం 391 ప్రత్యేక టీం లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

*గత 67 ఏళ్లల్లో జరగని అభివృద్ధి ఈ ఎనిమిదేళ్లల్లో జరిగింది: Satya Kumar
నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఎనిమిదేళ్లు అవుతోందని, గత 67 ఏళ్లల్లో జరగని అభివృద్ధి ఈ ఎనిమిదేళ్లల్లో జరిగిందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలతో మోదీ దేశాన్ని ప్రగతి పథంలో నడిపారని, పేదరిక నిర్మూలనపై ప్రత్యేక దృష్టి పెట్టి రూ. 41 వేల కోట్లు జనధన్ ఖాతాల్లో డబ్బులు వేశారని కొనియాడారు. పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు భారీగా గృహ నిర్మాణం చేపట్టారన్నారు. 25 లక్షల గృహాలను ఒక్క ఏపీకే కేటాయించారన్నారు. ప్రధాని సురక్ష, జీవన భీమా, అటల్ భీమా యోజన కింద పేదలకు అండగా నిలిచారని, కరోనా సమయంలో కుడా పేదల కడుపు నింపే కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. రైతుల ఖాతాల్లో 2 లక్షల 3 వేల కోట్ల రూపాయలు వేశారన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఇచ్చేలా రూ. 35 కోట్ల మందికి ముద్ర లోన్స్ ఇప్పించారన్నారు. మహిళా సాధికారిత కోసం లక్షల కోట్ల రూపాయలు వెచ్చించారని సత్య కుమార్ తెలిపారు.

*వైసీపీ అరాచకాలకు వెల్దుర్తి ఘటన పరాకాష్ట: Lokesh
వైసీపీ అరాచకాలకు వెల్దుర్తి ఘటన పరాకాష్ట అని లోకేష్అ న్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ… కర్నూలు జిల్లా వెల్దుర్తి అనకాల వీధికి అడ్డంగా వైసీపీ నాయకుడు సమీర్ రెడ్డి గోడ కడుతుండగా స్థానికులు అడ్డుకోవడాన్ని తట్టుకోలేక వారిపైనే దాడిచేయడం దారుణమని మండిపడ్డారు. మహిళలు, పిల్లలని చూడకుండా సీసాలు, రాళ్లతో కొట్టడం వైసీపీ నేతల రాక్షసప్రవృత్తికి నిదర్శనమన్నారు. నలుగురు నడిచే రోడ్డుకడ్డంగా గోడ కట్టడమేంట్రా గాడిదా అని ఒక్క వైసీపీ నేతయినా సమీర్ రెడ్డికి గడ్డి పెట్టగలరా? అని ప్రశ్నించారు. సినిమాల్లో విలన్ల మాదిరి వైసీపీ నేతలు రెచ్చిపోతుంటే.. పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించడం మన దౌర్భాగ్యమని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

*ఆత్మకూరులో మేం పోటీచేస్తున్నాం: సోము వీర్రాజు
ఆత్మకూరులో తాము పోటీ చేస్తున్నామని బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు పేర్కొన్నారు. రాజమండ్రిలో ఈ నెల 7న గోదావరి గర్జన పేరుతో బహిరంగసభ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ముఖ్య అతిథిగా బీజేపీ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా హాజరుకానున్నారని వెల్లడించారు. ఓట్ల రాజకీయాల్లో భాగంగానే కోనసీమలో గొడవలు జరుగుతున్నాయన్నారు. నవరత్నాలతో రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమం కంటే.. ప్రధాని మోదీ ఇచ్చే సంక్షేమమే ఎక్కువ అని సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు. ఏపీకి కేంద్రం కేటాయించిన ఇళ్లు 20 లక్షలైతే.. రాష్ట్ర ప్రభుత్వం కట్టినవి 40 వేలు మాత్రమేనని సోము వీర్రాజు పేర్కొన్నారు.

*బస్సు యాత్ర కాదు.. బుస్సు యాత్ర: pitala sujata
వైసీపీ మంత్రులు చేసింది బస్సు యాత్ర కాదు.. బుస్సు యాత్ర అని మాజీ మంత్రి పీతల సుజాత విమర్శించారు. మంత్రులను నోరు లేని గొర్రెలుగా మార్చారని ఆమె మండిపడ్డారు. బస్సు యాత్ర పేరుతో మంత్రులు దోపిడీ చేశారని ఆరోపించారు. వైసీపీ కి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు.

*రాక్షస పాలన నుంచి ఏపీని కాపాడాలి: Ayyanna Patrudu
టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కుటుంబ సభ్యులతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాక్షస పాలన నుంచి ఏపీని కాపాడాలని శ్రీనివాసుని కోరుకున్నట్లు చెప్పారు. ‘‘స్వామీ మమ్మల్ని రక్షించడం కాదు.. తిరుపతిని నీవే కాపాడుకో తండ్రీ.. ఇక్కడ చాలా దోపిడీ జరుగుతోంది’’.. అంటూ ప్రార్థించినట్లు చెప్పారు. శ్రీవాణి టిక్కెట్ పేరుతో నిలువు దోపిడీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. టిక్కెట్ ఖరీదు రూ. 10,500. అయితే తన కుటుంబానికి రూ. 75,000 పెట్టి టిక్కెట్లు తీసుకున్నానని చెప్పారు. అందులో రూ. 3,500 స్వామివారికి వెళుతుందని, మిగిలిగిన డబ్బులు ట్రస్టుకు వెళుతున్నాయన్నారు. దీనికి అకౌంట్స్ ఉన్నాయా? అని ప్రశ్నించారు. అలాగే స్వామీజీలు హిందూ ధర్మ ప్రచారాలు మరిచిపోయి రాజకీయ భజన చేస్తున్నారని అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు.

*బీజేపీ రాజ్యసభ ఎన్నికల ఇంఛార్జ్‌గా కిషన్ రెడ్డి
జూన్ పదిన జరగనున్న రాజ్యసభ ఎన్నికల కోసం బీజేపీ ఇంఛార్జ్‌లను నియమించింది. కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డిని కర్నాటక రాజ్యసభ ఎన్నికల ఇంంఛార్జ్ గా నియమించారు. రాజస్థాన్‌కు నరేంద్ర సింగ్ తోమర్, హర్యానాకు గజేంద్ర సింగ్ షెకావత్, మహారాష్ట్రకు అశ్విని వైష్ణవ్‌ను నియమించారు.

*తెలంగాణ వచ్చాకే సమస్యలు దూరం అయ్యాయి:Talasani
ప్రజలు ఎదుర్కొంటున్న అనేక దీర్ఘకాలిక సమస్యలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిష్కరించబడ్డాయని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్చె ప్పారు. బుధవారం GHMC కార్యాలయంలో ఈ నెల 3 నుండి 15 వ తేదీ వరకు నిర్వహించనున్న పట్టణ ప్రగతి కార్యక్రమం పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హోంమంత్రి మహమూద్ అలీ తో కలిసి సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టణాలు, పల్లెల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వివరించారు. ఈ నెల 3 వ తేదీ నుండి ప్రారంభం కాకున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యంతో అనేక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇందుకోసం 391 ప్రత్యేక టీం లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ప్రతి టీం కు రెండు వాహనాలను కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ టీం లు ప్రజలతో కలిసి ఆయా కాలనీలు, బస్తీలలో పర్యటించి పారిశుధ్య నివారణ, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలను చేపట్టడంతో పాటు ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు చెప్పారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇందుకోసం ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో, హాస్పిటల్స్, స్కూల్స్, బస్తీ దవాఖానా లు, అంగన్ వాడి కేంద్రాలు, బస్తీలు, కాలనీలలో మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. వర్షాకాలం సమీపిస్తున్నందున ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. కొన్ని చోట్ల ప్రజలు రహదారులపై చెత్తను వేస్తున్నారని ఆయా ప్రాంతాలలో డస్ట్ బిన్ లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

*గాంధీ కుటుంబానికి భయపడటం తెలియదు: రేణుకాచౌదరి
కాంగ్రెస్ నేతలు రాహుల్‌ గాంధీ, సోనియాగాంధీకి ఈడీ నోటీసులు పంపడంలో ఆశ్చర్యం లేదని మాజీ ఎంపీ రేణుకాచౌదరి వ్యాఖ్యానించారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఉద్దేశపూర్వకంగానే నోటీసులు ఇచ్చారని తప్పుబట్టారు. ఎదిరించేవారికి నోటీసులు ఇవ్వడం సరికాదన్నారు. రాహుల్‌, సోనియాను కేసులు పెట్టి వేధిద్దాం అనుకుంటున్నారని, గాంధీ కుటుంబానికి భయపడటం తెలియదని రేణుకాచౌదరి పేర్కొన్నారు. నేషనల్ హెరాల్డ్ అవినీతి కేసులో సోనియాకు రాహుల్ గాంధీకి ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. రాహుల్ ఈ నెల 2న, సోనియా ఈ నెల 8న తమ ఎదుట హాజరుకావాలంటూ ఈడీ సమన్లు పంపింది. అయితే రాహుల్ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారని ఈ నెల 5న హాజరయ్యేందుకు అనుమతినవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఈడీని కోరింది.

*ఈడీ నోటీసులు ఇవ్వడం వెనుక కుట్ర దాగి వుంది: ponnam prabhakar
జూన్ 2న అమిత్ షా, మీనాక్షి లేఖిన్ను తీసుకొచ్చి హడావిడి చేయాలనుకుంటున్నారని, బీజేపీ ముందు ప్రధాని క్షమాపణ చెప్పాలని congress నేత పొన్నం ప్రభాకర్ అన్నారు. పార్లమెంట్లో విభజనపై తప్పుగా మాట్లాడారని చెప్పారు. బీజేపీ పార్టీకి తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరిపే హక్కు లేదన్నారు. ఆజాద్‌కి అమృత్ ఎవరి కోసం..? అని ప్రశ్నించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన గాంధీ కుటుంబం కనుమరుగు చేయడానికే కుట్ర అన్నారు. ఉత్తర భారత్‌లో మతతత్వ రాజకీయాలు.. సౌత్‌లో అదే ఫాలో కావాలనుకుంటుందని పేర్కొన్నారు. బండి సంజయ్ అనర్హుడుగా ప్రకటించాలన్నారు. ఆయన కరీంనగర్ పరువు తీస్తుండన్నారు. మసీదులు కూల్చాలని కామెంట్ చేయడం సిగ్గుమాలిన ప్రకటన అన్నారు. కాంగ్రెస్‌కు టీఆరేసే పోటీ అన్నారు. రాహుల్ , సోనియాకు ఈడీ నోటీసులు ఇవ్వడం వెనుక కుట్ర దాగి వుందని ఆరోపించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్‌కు ఎందుకు ఇవ్వడం లేదన్నారు.

*బీజేపీవి చిల్లర రాజకీయాలు:Niranjan reddy
తెలంగాణలో బీజేపీవి చిల్లర రాజకీయాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి విమర్శించారు.అలాగే డిక్లరేషన్‌ పేరుతో కాంగ్రెస్‌ కొత్త డ్రామాలు చేస్తోందని అన్నారు.బీజేపీ, కాంగ్రెస్‌లు రైతులకు చేసింది ఏమీ లేదని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే రైతులకు నిజమైన న్యాయం జరిగిందని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాతనే తెలంగాణలో బీడు భూములన్నీ పచ్చగా మారాయన్నారు. గతేడాది 3 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయ్యిందని మంత్రి తెలిపారు.తెలంగాణ పత్తి అంటే హాట్‌కేక్‌లా అమ్ముడుపోతుందని చెప్పారు.

*ప్రభుత్వ పని తీరుపై చర్చకు సిద్ధం: మేరుగ
చంద్రబాబు, అచ్చెన్నాయుడు నిజమైన నాయకులైతే తమ ప్రభుత్వ పనితీరుపై చర్చకు రావాలని మంత్రి మేరుగ నాగార్జున సవాల్‌ విసిరారు. స్థలం, సమయం చెప్పాలంటూ ఛాలెంజ్‌ చేశారు. మంగళవారం సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ పథకాలపై చర్చించడానికి, ప్రజల్లోకి వచ్చి నిలబడటానికి చంద్రబాబుకు దమ్మూ.. ధైర్యం లేవన్నారు. చంద్రబాబు చేసిన అప్పులన్నీ జగన్మోహన్‌రెడ్డి తీర్చారని, ఆయన పాలనలో ఒక్క రూపాయి స్కీమ్‌ పెట్టలేదని, రాష్ట్రాన్ని దోచేసి, అప్పులు చేసి డొల్ల చేసిందని విమర్శించారు.

*మూడేళ్ల‌ YCP పాలనలో ప్రజలు సంతోషంగా లేరు: Ramakrishnat
మూడేళ్ల‌ వైసీపీ (YCP) పాలనలో ప్రజలు ఎవ్వరూ సంతోషంగా లేరని, పదవులు పొందిన కొంతమంది మాత్రమే సంబరాలు చేసుకున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ లక్షా 42 వేల కోట్ల రూపాయలను వివిధ పధకాల కింద సీఎం జగన్ పంచారని, రాష్ట్ర అభివృద్ధిని మాత్రం పూర్తిగా విస్మరించారని తీవ్రస్థాయిలో విమర్శించారు. పక్క రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ (AP)లో అన్నీ ధరలు ఎక్కువేనన్నారు. పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువులు పెంచేశారని, ఆటో వాలాకి పది వేలు వేసి రెట్టింపు వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు. ఈ మూడేళ్లల్లో ఒక్క రంగంలో అయినా అభివృద్ధి ఉందా? అని ఆయన ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో సీఎం మాట తప్పారని, కనీసం కేంద్రాన్ని అడిగే ధైర్యం కూడా ముఖ్యమంత్రికి లేదని ఎద్దేవా చేశారు.

*జగన్ ది జనరంజక పాలన కాదు జనపీడిత పాలన: Dhulipalla
సీఎం జగన్ ఈ మూడేళ్ల కాలంలో ప్రజలకు నరకాన్ని చూపించారని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ… జగన్ ది జనరంజక పాలన కాదు జనపీడిత పాలన అని వ్యాఖ్యానించారు. ఏపీలో సంక్షేమ పాలన కాదు సంక్షోభ పాలన నడుస్తోందన్నారు. జగన్ నెలకొకసారైనా సచివాలయం ముఖం చూడరని విమర్శించారు. ప్రత్యేక హోదాతో రాయితీలు వస్తాయని చెప్పి, ప్లేటు ఫిరాయించారన్నారు. 22 మంది ఎంపీలను ఇచ్చినా రాష్ట్రానికి ఒక్క పరిశ్రమను తేలేదని ఆయన మండిపడ్డారు.

*చంద్రబాబుకు ఇవి ఆఖరి ఎన్నికలు: మంత్రి Peddireddy
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు( కి ఇవి ఆఖరి ఎన్నికలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ… ఎన్నికల ప్రచార లబ్ధి కోసమే కుప్పంలో గ్రానైట్ తవ్వకాలపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కుప్పంలో అక్రమ గ్రానైట్ తవ్వకాలపై విచారణకు ఆదేశించామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.

*జగన్ పాలనలో అప్పులు ఫుల్… అభివృద్ధి నిల్: Tulasi reddy
జగన్ మూడేళ్ల పాలనలో అప్పులు ఫుల్ – అభివృద్ధి నిల్ – సంక్షోభంలో సంక్షేమం నిలిచిందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విమర్శలు గుప్పించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ… ప్రస్తుతం రాష్ట్ర అప్పు రూ.8 లక్షల కోట్లు అని… ఇందులో జగన్ ప్రభుత్వం చేసిన అప్పు రూ.5 లక్షల కోట్లు అని తెలిపారు. శ్రీలంక ఆర్థిక పరిస్థితి కంటే, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థతి దారుణంగా ఉందన్నారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని వ్యాఖ్యానించారు. అమ్మ ఒడి నాన్న బుడ్డికి చాలడం లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

*ఉచిత విద్యుత్‌ పేరిట కుంభకోణం: విజయశాంతి
24 గంటల ఉచిత విద్యుత్‌ పేరిట రాష్ట్రంలో భారీ కుంభకోణం జరుగుతోందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి ఆరోపించారు. ప్రైవేటు కంపెనీలతో కుమ్మక్కై మార్కెట్‌ రేటు కంటే రెట్టింపు ధరకు విద్యుత్‌ కొనుగోలు చేస్తూ కమీషన్లు దండుకుంటున్నారని పేర్కొన్నారు. భద్రాద్రి పవర్‌ ప్లాంట్‌ ఓ పెద్ద స్కాంగా మారిందని ట్విటర్‌లో ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ తన బినామీలకు ఆ కంపెనీని అప్పజెప్పారని తెలిపారు. మతాల గురించి మాట్లాడే పాలకులు భైంసా, నిర్మల్‌, కామారెడ్డి ఘటనలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

*నవసంకల్ప్ శిబిర్‌కు ఆరు కమిటీలు ఏర్పాటు చేశాం: batti vikramarka
నవసంకల్ప్ శిబిర్‌కు ఆరు కమిటీలు ఏర్పాటు చేశామని కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క తెలిపారు. సీనియర్ నాయకులను కమిటీ కన్వీనర్లుగా నియమించామన్నారు. ఒక్కో కమిటీలో 25 నుంచి 30 మంది సభ్యులుంటారని తెలిపారు. ఆర్గనైజేషన్ కమిటీ కన్వీనర్‌గా పొన్నాల లక్ష్మయ్య, పొలిటికల్ కమిటీ కన్వీనర్‌గా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అగ్రికల్చర్ కన్వీనర్‌గా జీవన్‌రెడ్డి, ఎకానమీ కన్వీనర్‌గా శ్రీధర్‌బాబు, సోషల్ జస్టిస్ కమిటీ కన్వీనర్‌గా వీహెచ్, యూత్ కమిటీ కన్వీనర్‌గా దామోదర్ రాజనర్సింహను నియమించినట్లు వెల్లడించారు. అలాగే తొలిరోజు కమిటీల్లో చర్చించిన అంశాలను పీఏసీలో తీర్మానం చేస్తామన్నారు.

*ప్రధాని మోదీకి ఏపీ అంటే ఎంతో మక్కువ : సర్భానంద సోనోవాల్
జీవన పరిస్థితులను మెరుగుపరిచే పథకాలను 8 ఏళ్లలో ఎన్నో అమలు చేశామని కేంద్ర షిప్పింగ్ మంత్రి సర్భానంద సోనోవాల్ పేర్కొన్నారు. దేశాన్ని శక్తిశాలిగా మలిచామన్నారు. ప్రపంచంలోనే సుందరమైన నగరం విశాఖ అని కొనియాడారు. ప్రధాని మోదీకి ఏపీ అంటే ఎంతో మక్కువ అని అన్నారు. ఏపీని ఉత్తమ రాష్ట్రంగా నిలిపేందుకు చిత్తశుద్దితో ఉన్నామన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఏపీకి 20 లక్షల74 వేల ఇళ్లు కేటాయించామన్నారు. ఆశీర్వాదం ఇవ్వండి దేశాన్ని ఆత్మనిర్భరత సాధించే దిశగా నడిపిస్తామని సర్భానంద సోనోవాల్ పేర్కొన్నారు.

*నన్ను రాజ్యసభకు పంపితే తప్పేంటి?: కృష్ణయ్య
ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు చెందిన తనను రాజ్యసభకు పంపితే తప్పేమిటో టీడీపీ నేతలు చెప్పాలని వైసీపీ రాజ్యసభ అభ్యర్ధి ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. గతంలో చంద్రబాబు ఇతర రాష్ట్రాలకు చెందిన నిర్మలా సీతారామన్‌, సురేశ్‌ ప్రభును ఏపీ నుంచి రాజ్యసభకు పంపలేదా? అని ప్రశ్నించారు. మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలో తనను కలిసిన మీడియాతో ఆయన మాట్లాడారు. ‘ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు తన స్థాయికి తగ్గట్టు మాట్లాడాలి. జగన్‌ను విమర్శించే ముందు మీరు బీసీలకు ఏం చేశారో చెప్పాలి. గతంలో పార్లమెంటులో బీసీల బిల్లు పెట్టాలని ఎన్నిసార్లు అడిగినా స్పందించలేదు. ఏనాడైనా బీసీలకు ఇన్ని పదవులు ఇచ్చారా?’ అని ప్రశ్నించారు.

*సీడీటీఎల్‌ సేవలు ఏపీకి విస్తరించాలి: రజిని
సెంట్రల్‌ డ్రగ్స్‌ లేబోలేటరీ సేవలను ఏపీకి కూడా అందించాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని కోరారు. మంగళవారం ఏపీఐఐసీలో డిప్యూటీ డ్రగ్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ ఇండియా డా.ఎ.రామకృష్ణన్‌తో ఆమె భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని సీడీటీఎల్‌ సేవలను ఏపీకి పూర్తిస్థాయిలో అందించాలన్నారు. రాష్ట్రంలోని డ్రగ్‌ విభాగ సిబ్బందికి కేంద్ర డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు పూర్తిస్థాయిలో సహాయం అందించాలని కోరారు. ప్రపంచస్థాయి నైపుణ్యం పొందేలా రాష్ట్రాల్లోని డ్రగ్‌ విభాగం అధికారులకు సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆఫ్‌ ఆర్గనైజేషన్‌తో శిక్షణ ఇప్పించాలని కోరారు. మంత్రి విజ్ఞప్తులపై డిప్యూటీ డ్రగ్‌ కంట్రోల్‌ ఆఫ్‌ ఇండియా సానుకూలంగా స్పందించారు.

*అక్రమ కేసులపై డీజీపీని కలుస్తాం: జనసేన
జనసేన నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడం, వేధింపులకు గురిచేయడంపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ స్పందించారు. ఆయన నేతృత్వంలోని బృందం రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డితో చర్చించాలని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయించింది. ఇందుకోసం డీజీపీ అపాయింట్‌మెంట్‌ కోరుతూ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ లేఖ రాశారు.

*ధర్మాన బీసీలకు క్షమాపణ చెప్పాలి:చక్రధారి
బ్యాంకుల్లో డబ్బులు వేస్తున్నాం.. ఇతర అవసరాలు తీర్చాలంటే కుదరదంటూ బీసీలను అవమానించిన మంత్రి ధర్మాన ప్రసాదరావు క్షమాపణ చెప్పాలని ఆలిండియా హ్యాండ్లూమ్‌ బోర్డు మాజీ డైరెక్టర్‌ చక్రధారి డిమాండ్‌ చేశారు. మంత్రుల బస్సు యాత్ర సందర్భంగా అనంతపురంలో బీసీలు, ఇతర పేదలను అవమానించేలా ధర్మాన మాట్లాడారని మండిపడ్డారు. చేనేతలందరికీ నేతన్న నేస్తం ఇస్తామని చెప్పి… 4 లక్షల మందికి గాను కేవలం 80 వేల మందికే ఇచ్చారని మండిపడ్డారు.

*‘పశువుల దాణా’లో కుంభకోణం: ధూళిపాళ్ల
రాష్ట్ర ప్రభుత్వం తరఫున పాడి రైతులకు సరఫరా చేసే పశువుల దాణాలో కుంభకోణం చోటు చేసుకొందని సంగం డెయిరీ చైర్మన్‌, టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ‘‘మొబైల్‌ పశు వైద్య చికిత్స వాహనాల ద్వారా పాడి రైతులకు అందించే దాణా సరఫరాను ముఖ్యమంత్రి జగన్‌ తన మనిషి శివ రామిరెడ్డికి చెందిన ఫెర్టయిల్‌ గ్రీన్‌ అనే కంపెనీకి అప్పగించారు. ఇది నాసి రకం దాణా. దీనిని ఒక మెట్రిక్‌ టన్ను రూ.16 వేలకు కొంటున్నారు. మరో నాలుగు వేలు పెడితే నాణ్యమైన మేలు రకపు దాణా సరఫరా చేసే కంపెనీలు చాలా ఉన్నాయి. కానీ ఈ దాణానే పాడి రైతులు కొనాలని ప్రభుత్వం వేధిస్తోంది. నాసి రకం దాణా కోసం రూ.40 కోట్ల ప్రజాధనాన్ని జగన్‌ రెడ్డి ప్రభుత్వం తమ వారికి దోచి పెడుతోంది’’ అని విమర్శించారు.

* లెక్కలు చెప్పడానికి అవేమీ చిట్టా పద్దులు కావు: మంత్రి నాగార్జున
అప్పు తీసుకురాకుండా ఏ రాష్ట్ర ప్రభుత్వమూ పని చేయదని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున అభిప్రాయపడ్డారు. తామూ తెస్తున్నామని, వాటిని రాష్ట్రాన్ని బాగు చేయడానికే వినియోగిస్తున్నామని వ్యాఖ్యానించారు. ఎంత తెచ్చారు? ఎంత తీర్చారో? చెప్పడానికి ఇవేమీ చిట్టాపద్దులు కాదని వివరించారు. ప్రతి దాంట్లోనూ జవాబుదారీతనంగా ఉంటామని స్పష్టం చేశారు. తాము ఎంత అప్పు చేశామో.. ప్రధాని ఎంత అప్పు చేశారో? ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎంత చేస్తున్నారో? ప్రజలకు తెలుసని పేర్కొన్నారు. సచివాలయంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని 179 ఎస్సీ గురుకులాల్లో ఈ ఏడాది నుంచి సీబీఎస్‌ఈ విద్యా విధానాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. పెద్దగా డిమాండు లేని కోర్సుల స్థానంలో ప్రాధాన్యమున్న కోర్సులను ప్రవేశపెట్టడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. తాడేపల్లిలో ఎస్సీ గురుకులాలకు సంబంధించి బోర్డు ఆఫ్‌ గవర్నెన్స్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఎస్సీ విద్యార్థులకు శ్రీకాకుళం, విజయవాడ, అనంతపురం, తిరుపతిలలో మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఏఎన్‌ఎమ్‌ కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఏలూరు జిల్లా పోలసానిపల్లి, పెదవేగిల్లో స్పోర్ట్స్‌ అకాడమీల ఏర్పాటుకు ఆలోచన చేస్తున్నాం. ప్రస్తుతం ఉన్న 3 ఐఐటీ, నీట్‌ శిక్షణ కేంద్రాలతోపాటు అదనంగా ఉమ్మడి జిల్లాల్లో జిల్లాకు ఒకటి చొప్పున కొత్తగా ఏర్పాటు చేయాలని నిర్ణయించాం’ అని తెలిపారు.