Politics

రూట్ మార్చిన పవన్ కళ్యాణ్ ఈసారి అక్కడ కాదు ఇక్కడ నుండి పోటీ

రూట్ మార్చిన పవన్ కళ్యాణ్ ఈసారి అక్కడ కాదు ఇక్కడ నుండి పోటీ

ఆంధ్రప్రదేశ్ లో అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. అన్ని పార్టీలు ఎన్నికల వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి.ఇప్పటికే అన్ని పార్టీలు జనంలోనే ఉంటున్నాయి. అధికార వైసీపీ గడప గడపకు ప్రభుత్వం పేరుతో నేతలంతా జనంలోనే ఉండేలా ప్లాన్ చేసింది. ఇటు ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం సైతం జనం బాట పట్టింది. చంద్రబాబు నాయుడు బాదుడే బాదుడు పేరుతో జిల్లాల యాత్రలు చేస్తున్నారు. నారా లోకేష్ పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఇక జనసేనకూడా జనంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. జూన్ 1 నుంచి నాగాబాబు ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాన్ వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే గత ఎన్నికల్లో ఆయన పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు. దీంతో మెగా అభిమానులు అవమానంగా ఫీలయ్యారు. దీంతో ఈ సారి ఎలాగైనా భారీ మెజార్టీతో గెలిపించాలని పట్టుదలతో ఉన్నారు. అందుకే ఇప్పుడు ఆయన ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.

తమ అధినేత పవన్ ను తిరుపతి నుంచి పోటీ చేయాలని జనసైనికులు డిమ కోరుతున్నారు. తాజాగా ఏర్పడిన తిరుపతి పట్టణ నూతన కమిటి పవన్ కళ్యాణ్ ఇక్కడే పోటీ చేయాలని తీర్మానించింది. ఆయన్ను అక్కడ నుంచి పోటీ చేయాలని డిమాండ్ చేయడం వెనుక పెద్ద కారణమే ఉంది. పవన్ కల్యాణ్ సోదరుడు మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని తిరుపతిలోనే ప్రారంభించారు. ఆ తరువాత వచ్చిన ఎన్నికల్లో తిరుపతితో పాటు పాలకొల్లు లో పోటీ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా లోని మొగల్తూరు ఆయన సొంత ఊరు అందుకే పోటీ చేయాల్సి వచ్చింది. కానీ అనూహ్యంగా అక్కడ ఓటమి ఎదురైంది. కానీ తిరుపతిలో గెలిచారు. చిరంజీవి అక్కడ గెలవడానికి ఆయన సామాజిక వర్గమే కారణమే అన్నది బహిరంగ రహస్యమే.. ఏదీ ఏమైనా ఇక్కడ గెలిచి అసెంబ్లీలో అధ్యక్ష అనేశారు.

పవన్ కళ్యాణ్ 2019లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. రాజకీయాల్లో ఇవన్నీ కామనే అని భావించారు. రైతు సమస్యల నుంచి రోడ్ల సమస్యల వరకూ ప్రజలందరి తరుఫున ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ కొనసాగుతోంది. కొన్ని రోజులుగా తమ్ముళ్ల హడావుడి కనిపించడం లేదు. ఇదే సమయంలో జనసేనతో పొత్తు కోసం టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తుండడం వారికి ప్లస్ పాయింట్ అయ్యింది.దీంతో ఇప్పటి నుంచే 2024 ఎన్నికల కోసం కసరత్తులు ప్రారంభించారు. తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను గెలిపించాలని జనసైనికులు ఉత్సాహ పడుతున్నారు. ఈసారి పవన్ ను తిరుపతి నుంచి పోటీ చేయాలని తీర్మానం చేశారు కూడా.. తిరుపతి నియోజకవర్గంలో ఆయన సామాజిక వర్గం బలంగా ఉండడం వల్ల పవన్ ను లక్ష మెజారిటీతో గెలిపిస్తాని ఇప్పటి నుంచే హామీ ఇస్తున్నారట. ఇప్పుడున్న వైసీపీకి ఇక్కడ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, దీంతో పవన్ ఇక్కడి నుంచి పోటీ చేస్తే కలిసొస్తుందని అంటున్నారు.