NRI-NRT

పెట్టుబడి పెట్టండి.. యూఎస్‌ వీసా పట్టండి

పెట్టుబడి పెట్టండి.. యూఎస్‌ వీసా పట్టండి

ఇమిగ్రేషన్‌ నిబంధనలు కఠినం చేయడంతో అమెరికాలో పని చేయడానికి వీసాలు పొందడం కష్టంగా మారింది. అయితే.. అమెరికాలోని ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా వీసా పొంది అక్కడ ఉండొచ్చు. ఇందుకు ఈబీ-5 ప్రోగ్రామ్‌ వీలు కల్పిస్తోందని ఇన్వెస్ట్‌ ఇన్‌ ద యూఎ్‌సఏ (ఐఐయూఎ్‌సఏ) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఆరన్‌ గ్రావౌ తెలిపారు. అమెరికాలో ఈబీ-5 వీసాల ప్రాసె్‌సను చేపట్టే రీజినల్‌ కేంద్రాల అసోసియేషన్‌ ఇది.

కనీసం 8 లక్షల డాలర్ల పెట్టుబడి..
ఈబీ-5 ప్రోగ్రామ్‌ కింద అమెరికా పౌరసత్వం పొందాలనుకునే అక్కడ ఉద్యోగావకాశాలు కల్పించే ఏ ప్రాజెక్టులోనైనా కనిష్ఠంగా 8 లక్షల డాలర్ల (దాదాపు రూ.6 కోట్ల్లు), గరిష్ఠంగా 10.5 లక్షల డాలర్ల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రాజెక్టులు, ప్రాజెక్టు వల్ల లభించే ఉద్యోగాలు, ప్రాజెక్టు స్వభావం, ప్రాజెక్టు ఉన్న ప్రాంతంలో నిరుద్యోగం తదితర అంశాల ఆధారంగా పెట్టుబడి ఉంటుంది. ఏ రంగంలోని ప్రాజెక్టులోనైనా పెట్టుబడి పెట్టొచ్చు. పెట్టుబడి పెట్టిన వారితో పాటు భాగస్వామికి, 21 సంవత్సరాల లోపు పిల్లల్లో ఒకరికి.. మొత్తం 3 వీసాలు ఇస్తారు. గత ఏడాది వరకూ కనీస పెట్టుబడి 5 లక్షల డాలర్లుండేది. దీన్ని తాజాగా 8 లక్షల డాలర్లకు పెంచారు. ఈబీ-5 ప్రోగ్రామ్‌ కింద ప్రతి ఏడాది అమెరికా ప్రపంచ వ్యాప్తంగా 10 వేల వీసాలను జారీ చేస్తోందని ఆయన తెలిపారు. భారత్‌లో గరిష్ఠంగా 700 వీసాలను జారీ చేయడానికి వెసులుబాటు ఉందన్నారు..