NRI-NRT

ఎన్నారై టీఆర్ఎస్ కువైట్ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సంబరాలు

ఎన్నారై టీఆర్ఎస్ కువైట్ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సంబరాలు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఎన్నారై టీఆర్ఎస్ కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అభిలాష తొలుత తెలంగాణ అమరవీరులకు జోహార్లు అర్పించి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం కెసిఆర్‌ చెప్పినట్టు తెలంగాణ తెచ్చుకున్నది నీళ్లు నిధులు నియామకాల కోసమని.. నీళ్లు, అనేక ప్రాజెక్టులతో తెలంగాణ కళకళలాడుతోందని చెప్పారు. నిధుల విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా ఉందన్నారు. అలాగే.. నియామకాల విషయంలో ఇప్పటికే చాలా ఉద్యోగాలు కల్పించి ఇటీవలే దాదాపు లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్ కూడా ఇచ్చారని అభిలాష పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో KCR గారిని ప్రధాన మంత్రిగా చూడాలని టీఆర్ఎస్ ఎన్నారై కువైట్ శాఖ తరపున కోరుకుంటున్నామన్నారు.
A9
ఎన్నారై టీఆర్ఎస్ కువైట్ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సంబరాలుతెలంగాణ జాగృతి కువైట్ అధ్యక్షులు వినయ్ మాట్లాడుతూ మంత్రి KTR దావోస్ పర్యటన సందర్భంగా యూరప్ దేశాల్లో ప్రతి ఒక్కరూ తెలంగాణ రాష్ట్రం గురించి చర్చించుకుంటున్నారని చెప్పారు. అందుకు గాను NRIలుగా తామందరం గర్వపడుతున్నామన్నారు. యునైటెడ్ తెలుగు ఫోరం అధ్యక్షులు వెంకట్ కోడూరి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం శాంతిభద్రతల విషయంలో ముఖ్యమంత్రి KCR తీసుకుంటున్న నిర్ణయాలు అభినందనీయమన్నారు. కొండల్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపు చూస్తుంది అన్నారు.ఈ కార్యక్రమంలో ఎన్నారై టీఆర్ఎస్ కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల, తెలంగాణ జాగృతి అధ్యక్షులు ముత్యాల వినయ్ కుమార్, యునైటెడ్ తెలుగు ఫోరం అధ్యక్షులు వెంకట్ కోడూరి, కొండల్ రెడ్డి, సురేష్, అయ్యప్ప, సరోజ రెడ్డి, రవి సుధాగాని, మహమ్మద్ దస్తగిరి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.