DailyDose

వచ్చే నెల 8, 9న గుంటూరులో వైసీపీ ప్లీనరీ – TNI తాజా వార్తలు

వచ్చే నెల 8, 9న గుంటూరులో వైసీపీ ప్లీనరీ  –  TNI  తాజా వార్తలు

*వచ్చే నెల 8వ తేదీన వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా వైసీపీ ప్లీనరీ నిర్వహించాలని ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి నిర్ణయించారు. 8, 9వ తేదీల్లో రెండు రోజుల పాటు ప్లీనరీ నిర్వహించనున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలతో జగన్‌ సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. 2017లో ప్లీనరీ నిర్వహించిన గుంటూరు జిల్లా కాజ టోల్‌గేట్‌ సమీపంలోని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న స్థలంలోనే ఈసారి నిర్వహించాలని పార్టీ నేతలకు ముఖ్యమంత్రి సూచించారు.

*ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ ముగిసింది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. సుమారు 45 నిమిషాల పాటు సమావేశం కొనసాగింది. సీఎం వైఎస్ జగన్ వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఉన్నారు.

*కృష్ణా జిల్లాలోని ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోటీపై టీడీపీ అధినేత చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. చనిపోయిన కుటుంబ సభ్యులకే ఉప ఎన్నికల్లో సీటు ఇస్తే పోటీ పెట్టకూడదనేది టీడీపీ విధానమని స్పష్టం చేశారు. పార్టీ నేతలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. గౌతమ్‌ రెడ్డి మృతితో వచ్చిన ఉప ఎన్నికల్లో ఈ విధానంతోనే పోటీకి దూరంగా ఉంటున్నామని వెల్లడించారు. ఉప ఎన్నికలపై వైసీపీ సవాళ్లు నీచంగా ఉన్నాయని విమర్శించారు

*దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ కరోనా బారినపడ్డారు. గురువారం వైద్యులు నిర్వహించిన టెస్టుల్లో ఆమెకు పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆమె ఐసోలేషన్‌లోకి వెళ్లారు. ఇదిలా ఉండగా ఎన్స్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు హాజరయ్యే ముందు సోనియా కరోనా బారినపడ్డారు. కాగా, నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో భాగంగా సోనియా ఈనెల 8వ తేదీన ఈడీ ఎదుట హాజరుకానున్నారు. ఇక, ఇటీవల సోనియాతో సమావేశమైన నేతలకు కూడా కరోనా సోకినట్టు తెలుస్తోంది.

*తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమరవీరుల స్థూపం వద్ద ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ కుటుంబంలో ఎవరూ బలి కాలేదని అన్నారు. ప్రజాశాంతి పార్టీ తరఫున శ్రీకాంత్ చారి తండ్రిని ఎమ్మెల్యేగా నిలబెడతామన్నారు. డిసెంబర్ 3వ తేదీన శ్రీకాంత్ చారి తెలంగాణ కోసం బలిదానం చేసుకున్న రోజని, ఆ రోజున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించాలని డిమాండ్ చేశారు. అమర వీరుల కుటుంబాలకు ఉచిత విద్య, వైద్యం అందిస్తామన్నారు. 1200 మంది అమరవీరులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రజాశాంతి పార్టీ ప్రజల కోసం ఉందని, వారి కోసం పోరాటం చేస్తామని కేఏ పాల్ స్పష్టం చేశారు.

*త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ అమరుల ఆశయాలకనుగుణంగాే పురోమిస్తోందని పర్యావరణ, అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. దేశానికే ఆదర్శంగా తెలంగాణ పురోగమిస్తోందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి గురువారం ఉదయం శాస్త్రిన‌గ‌ర్ లోని క్యాంప్ కార్యాల‌యంలో జాతీయ జెండాను ఎగురవేశారు.తెలంగాణ రాష్ట్రం ఎనిమిది వసంతాలు పూర్తి చేసుకుని తొమ్మిదో వసంతంలోకి అడుగుపెట్టిన నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరుల ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రం పురోగమిస్తున్నదని తెలిపారు. దేశానికి ఆదర్శంగా తెలంగాణ నిలుస్తుందని వెల్లడించారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని, ప్రస్తుతం అవన్నీ సాకారం అవుతుండటం హర్షణీయమన్నారు.

*తెలంగాణ కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన అమరులను ఈ గడ్డ ఎన్నడూ మర్చిపోదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మంత్రి వరంగల్ కోట లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసు ల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ రాష్ట్ర అవ‌త‌ర‌ణ కోసం ప్రాణాలు అర్పించిన అమ‌రుల‌కు పుష్పాంజ‌లితోనే సరిపోదని, వారిని ఎన్నటికీ మరువరాదని అన్నారు. నీళ్ళు, నిధులు, నియామ‌కాలు నిజ‌మ‌వుతున్న ఈ సంద‌ర్భం వారికి నిజ‌మైన నివాళిగా భావిస్తున్నానని చెప్పారు.తెలంగాణ ప్రజల 60 ఏండ్ల క‌ల‌ను క‌ల్వకుంట్ల చంద్రశేఖ‌ర్ రావు నాయ‌క‌త్వంలో సాధించుకున్నామన్నారు.

*తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన నివాసంలో జెండా ఆవిష్కరించారు. అలాగే తెలంగాణ భవన్‌లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని తెలిపారు. దేశానికి స్వాతంత్ర్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. అందులో భాగంగా అనేక రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవాలను కేంద్రం నిర్వహిస్తోందని చెప్పారు. కేంద్ర మంత్రులు స్వయంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారన్నారు. ఈ మధ్యనే సిక్కిం రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించామని తెలంగాణ ఏర్పడి ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిపే ఈ వేడుకలు తెలంగాణ అమరవీరులకు అంకితమన్నారు.

*మే నెలలో శ్రీవారికి రికార్డు స్థాయి హుండీ ఆదాయం. వరుసగా మూడో నెల రూ.100 కోట్ల హుండీ ఆదాయం. ”’ టీటీడీ చరిత్రలో అత్యధిక హుండీ ఆదాయం మే నెలలో రూ.129కోట్ల 93లక్షలు. ”’ శ్రీవారిని దర్శించుకున్న 22,61,580మంది భక్తులు. తలనీలాలు సమర్పించిన 10,74,238 మంది భక్తులు.

*కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో మరోసారి పశువులపై పులి దాడి చేసింది. పాండవులపాలెం-పొదురుపాక సమీపంలో ఆవును చంపింది. ఈ ఘటనతో శరభవరం, పాండవులపాలెం, పోతులూరు, ఒమ్మంగి గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. పులిని అడవిలోకి పంపేందుకు అటవీ శాఖ అధికారుల యత్నం కొనసాగుతూనే ఉంది. పది రోజులకు పైగా పులి సంచారంతో స్థానికులు బిక్కుబిక్కుమంటున్నారు.

*కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. జిల్లాలోని పెనమలూరు, కంకిపాడు మండలాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి కరెంట్ లేదు. దీంతో స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అకాల విద్యుత్ కోత, కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. సాంకేతిక సమస్య కారణంగా విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు.

*అమరావతిలో టీటీడీ నిర్మించిన శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణకు హాజరు కావాలని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, జెఈవో వీరబ్రహ్మం గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్‌ను ఆహ్వానించారు. ఈమేరకు రాజ్ భవన్ లో గవర్నర్ ను కలసి ఆహ్వాన పత్రికను అందజేశారు.జూన్ 5వ తేదీ నుంచి ఆలయ మహా సంప్రోక్షణ కార్యక్రమాలు ప్రారంభం అవుతాయని వివరించారు. జూన్ 9న ఉదయం 7.30 నుంచి 8.30 గంటల మధ్య మహాసంప్రోక్షణ నిర్వహిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ ను శాలువతో సన్మానించి స్వామివారి ప్రసాదాలు అందజేశారు.

*బీజేపీ అమరావతిలోనే రాజధాని కడుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించారు. బీజేపీ అధికారంలోకి వస్తే.. రాజధాని అంశంపైనే మొదటి సంతకం చేస్తామని వెల్లడించారు. బీజేపీవి వంద రత్నాలు.. వైసీపీని కేవలం నవరత్నాలు మాత్రమేనని సోము వీర్రాజు పేర్కొన్నారు.

*వైసీపీ అరాచకాలను ప్రశ్నించాలని ప్రజలకు టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ట్విటర్ వేదికగా సూచించారు. ఇలాగే ఊరుకుంటే వైసీపీ నేతలు ఇంకా పేట్రేగిపోతారని ఆయన పేర్కొన్నారు. ఇంటింటికీ వ‌స్తారు.. ఊరూరా తిరుగుతారన్నారు. ప్రతి ఆఫీస్కు వచ్చి మిమ్మల్ని కొడతారని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.

* మే 30న జరిగిన శివ్వంపేట హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సొంత అన్నను భూ తగదాలతో ముగ్గురు తమ్ముళ్లు కర్రలతో, ఇనుప రాడ్లతో కొట్టిచంపారు. అన్న కృష్టయ్యను తమ్మళ్లు పొలంలోనే కొట్టి చంపారు. అడ్డుకోబోయిన మరో ఇద్దరిపై దాడి చేసి నిందితులు పారిపోయారు. 3 రోజుల్లోనే నిందితులను పోలీసులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

*తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శాసనసభలో ఘనంగా జరిగాయి. శాసన మండలి ప్రాంగణంలో మండలి చైర్మన్‌ గ్తు సుఖేందర్‌ రెడ్డి, అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం శాసనసభ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు వి.గంగాధర్ గౌడ్, నవీన్ కుమార్, ఎల్. రమణ, దండే విఠల్, శేరి శుభాష్ రెడ్డి, రఘోత్తమ రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి చార్యులు, టీఆర్‌ఎస్ఎల్పీ కార్యదర్శి రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

* అభివృద్ధి చెందుతున్న సాంకేతికత, కొవిడ్‌ కాలంలో జీవరసాయన శాస్త్రాలలో సాధించిన పురోగతి నేపథ్యంలో ఈ ప్రపంచానికి జీవరసాయన ఆయుధాల దుర్వినియోగం ముప్పు పెరిగిందని భారత్‌ హెచ్చరించింది. ఈ ప్రమాదాన్ని అరికట్టేందుకు సత్వర చర్యలు చేపట్టాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చింది. కొవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో బయోలాజికల్‌ ఏజెంట్లు జీవరసాయనాలను ఆయుధాలుగా దుర్వినియోగం చేసే ప్రమాదం అధికంగా ఉందని పేర్కొంది. ఉగ్రవాదులు, ఇతర సంస్థల చేతికి సామూహిక విధ్వంసక ఆయుధాలు (డబ్ల్యూఎండీ) లభించడం అంతర్జాతీయ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుందని భారత యూఎన్‌ మిషన్‌ కౌన్సిలర్‌ ఏ అమర్‌నాథ్‌ వ్యాఖ్యానించారు.

*‘ఇసుక నుంచి తైలం.. అనే మాట మనందరం విన్నాం. కానీ ఇసుక నుంచి ధనం పోగేసుకోవచ్చని సీఎం జగన్‌కు మాత్రమే తెలుసు’’ అని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్‌ వ్యాఖ్యానించారు. ప్రధాన మంత్రిగా ఎనిమిదేళ్ల పాలనను నరేంద్ర మోదీ పూర్తి చేసుకున్న సందర్భంగా విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డితో కలసి విలేకర్లతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చేనాటికి రూ.1.15 లక్షల కోట్లున్న దేశ జీడీపీని ఎనిమిదేళ్లలో రూ.2.30 లక్షల కోట్లకు తీసుకొచ్చారని కొనియాడారు. మోదీ హయాంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వివిధ పథకాలను వివరించారు.

*జిల్లా సాగునీటి అభివృద్ధి సలహా బోర్డు స్థానంలో జిల్లా సాగునీటి సలహా బోర్డును ఏర్పాటు చేశారు. ఇందులో వ్యవసాయాభివృద్ధి బోర్డును విలీనం చేశారు. బుధవారం జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ ఈ మేరకు గెజిట్‌ జారీ చేశారు. బోర్డు చైర్మన్‌గా జిల్లా కలెక్టర్‌, మెంబర్‌ కన్వీనర్‌గా జలవనరుల శాఖ సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ వ్యవహరిస్తారు. ఆయా జిల్లాల్లోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, వ్యవసాయాభివృద్ధి బోర్డు చైర్మన్‌, ప్రాజెక్టు కమిటీల చైర్మన్లు, డిస్ట్రిబ్యూటరీ కమిటీల చైర్మన్లు సభ్యులుగా ఉంటారు. అలాగే రెవెన్యూ డివిజన్‌కు ఒక్కరు చొప్పున రెండు రెవెన్యూ డివిజన్‌ల పరిధిలోని సాగునీటి వినియోగదారుల సంఘం అధ్యక్షులు, వ్యవసాయ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌, ఉద్యాన శాఖ సహాయ సంచాలకుడు, ఆర్డీవో, ముఖ్య ప్రణాళికాధికారి సభ్యులుగా ఉంటారు.

*ప్రధాన నగరాల్లో కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షించేందుకు దక్షిణ మధ్య రైల్వే(ఎ్‌ససీఆర్‌) చర్యలు చేపట్టింది. కర్బన ఉద్గారాలతో ఎదురయ్యే ఇబ్బందులను ప్రయాణికులకు తెలియజేయడంతోపాటు విద్యుత్‌ వాహనాలను(ఈవీ) వినియోగించే వారికి చార్జింగ్‌ స్టేషన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. సికింద్రాబాద్‌ డివిజన్‌లోని 32 ప్రధాన స్టేషన్లలో కాంట్రాక్ట్‌ పద్ధతిన వీటిని నిర్వహిస్తున్నట్లు ఒక ప్రకటనలో ఎస్‌సీఆర్‌ వెల్లడించింది. హైదరాబాద్‌లోని నాంపల్లి రైల్వేస్టేషన్‌లో చార్జింగ్‌ స్టేషన్‌ను బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. 2023 నాటికి ప్రధాన నగరాల్లో కాలుష్యాన్ని కనిష్ఠ స్థాయికి తగ్గించాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా, ఈ-మొబిలిటీ బలోపేతానికి కృషి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా ఈ కార్యక్రమంలో కీలకంగా వ్యవహరించిన సికింద్రాబాద్‌ డివిజన్‌ అధికారులు, సిబ్బందిని ఎస్‌సీఆర్‌ ఇన్‌చార్జి జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌ కుమార్‌ జైన్‌ అభినందించారు. ఈ-చార్జింగ్‌ స్టేషన్ల జాబితా చూస్తే.. హైదరాబాద్‌ (నాంపల్లి), బేగంపేట్‌, హైటెక్‌ సిటీ, వరంగల్‌, పర్లివైజ్‌నాథ్‌, ఖమ్మం, డోర్నకల్‌, తాండూరు, జమ్మికుంట, బీదర్‌, మంచిర్యాల, వికారాబాద్‌, చిత్తాపూర్‌, కాజీపేట, భద్రాచలం రోడ్‌, బెల్లంపల్లి, జనగాం, పెద్దపల్లి, కరీంనగర్‌, సిర్పూర్‌కాగజ్‌నగర్‌, మధిర, భువనగిరి, లాతూర్‌ రోడ్‌, బాల్కి, ఫతేనగర్‌, ఘట్‌కేసర్‌, లక్డీకపూల్‌, మహబూబాబాద్‌, నెక్లె్‌సరోడ్‌, సంజీవయ్యపార్కు, సేరం, జహీరాబాద్‌ స్టేషన్లు ఉన్నాయి.

*కర్నూలు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ డిజైన్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ (ఐఐఐటీడీఎం)కు చెందిన విద్యార్థి దీపక్‌ రాథోడ్‌ జాక్‌పాట్‌ కొట్టేశాడు. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో అమెజాన్‌ కంపెనీలో రూ.1.3 కోట్ల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగానికి ఎంపికయ్యారు. మధ్యప్రదేశ్‌కు చెందిన దీపక్‌ రాథోడ్‌ 2018లో కర్నూలు ఐఐఐటీడీఎంలో సీఎ్‌సఈ కోర్సులో చేరాడు. ప్రస్తుతం నాలుగో సంవత్సరం చదువుతున్నా డు. పాఠ్యాంశాలతో పాటు ప్లేస్‌మెంట్‌ ట్రైనింగ్‌లో ఇచ్చే సలహాలు, సూచనలను అవగ తం చేసుకుని అంతర్జాతీయ స్థాయిలో ఆన్‌లైన్‌ బేస్డ్‌ ఎగ్జామ్‌లో మంచి ప్రతిభ కనబరిచి సాఫ్ట్‌వేర్‌ డెవల్‌పమెంట్‌ ఇంజనీర్‌ రోల్‌ బేస్డ్‌లో అమెజాన్‌ కంపెనీలో ఉద్యోగం సాధించా డు. కర్నూలు ట్రిపుల్‌ఐటీ డీఎంకు చెందిన బీటెక్‌ విద్యార్థులు పలువురు రూ.20 లక్షలకు పైగా ప్యాకేజీతో వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారు.

* ఆర్టీసీని పది కాలాలపాటు పరిరక్షించుకోవాలనే ప్రధాన లక్ష్యంతో ఈ నెల 10న బస్‌భవన్‌ వద్ద సామరస్యతా సమావేశం నిర్వహిస్తామని ఆర్టీసీ రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం స్ర్కీనింగ్‌ కమిటీ కన్వీనర్‌ పి.చంద్రారెడ్డి తెలిపారు. 1932 జూన్‌ 5న ప్రారంభమైన ఆర్టీసీ గత 9 దశాబ్దాలుగా విజయవంతంగా నడిచిందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సంస్థలో ఉన్నతాధికారి నుంచి క్రింది స్థాయి ఉద్యోగి వరకు సేవలందించిన రిటైర్డ్‌ఉద్యోగులందరినీ ఈ సమావేశానికి ఆహ్వానించామన్నారు. వివిధ యూనియన్ల నేతలు, ప్రతినిధులంతా పాల్గొంటారన్నారు. బస్‌ భవన్‌లో జరిగే కార్యక్రమానికి రిటైర్డ్‌ ఉద్యోగులంతా తరలిరావాలని ఆయన పిలుపు నిచ్చారు.

*గ్రూప్‌ -1 పరీక్షా పత్రాలు దిద్దడంలో అన్యాయం జరిగిందని భావిస్తున్న అభ్యర్థులు కొందరు బుధవారం ఇక్కడ టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. తమకు అన్యాయం చేశారని ఆయనకు వారు ఫిర్యాదు చేశారు. 2018 గ్రూప్‌-1 పరీక్షా పత్రాలు దిద్దడంలో డిజిటల్‌, సాధారణ పద్ధతికి ఫలితాల్లో చాలా తేడా వచ్చిందని, ఈ అవకతవకల వల్ల 202 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూ జాబితా నుంచి తొలగింపునకు గురయ్యారని వారు ఆయనకు వివరించారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని వారు చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు.

*‘ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని నాలుగు ముక్కలు చేసి నలుగురు రెడ్లకు అప్పగించారు. సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి… వారు ఏం చెబితే అదే జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాల మంత్రులు వారి కింద బానిసల మాదిరిగా పడి ఉన్నారు. వైసీపీ చేస్తోంది సామాజిక న్యాయం కాదు… సామాజిక ద్రోహం’’ అని తెలుగుదేశం పార్టీ ధ్వజమెత్తింది. బుధవారం ఇక్కడ తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, పీతల సుజాత, పార్టీ రాష్ట్ర కార్యదర్శి మహ్మద్‌ నజీర్‌ విలేకరులతో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారికి తీరని ద్రోహం జరుగుతోందని తెలిసినా ఆ వర్గాలకు చెందిన మంత్రులు తమ పదవులు కాపాడుకోవడం కోసం జగన్‌ భజన చేస్తున్నారు’’ అని రవీంద్ర విమర్శించారు. ‘‘కులాల వారిగా వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్పొరేషన్లలో కూర్చోవడానికి కుర్చీ కూడా లేద’ని మాజీ మంత్రి పీతల సుజాత విమర్శించారు. ‘‘మైనారిటీ కార్పొరేషన్‌ ద్వారా ఈ మూడేళ్లలో ఒక్క పైసా కూడా మైనారిటీ యువతకు సాయం చేయలేదు’’ అని మహ్మద్‌ నజీర్‌ విమర్శించారు.

*నెల్లూరు జిల్లా ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గం ఉపఎన్నికలో వైసీపీ తరఫున పోటీ చేయనున్న మేకపాటి విక్రమ్‌ రెడ్డికి ఆ పార్టీ అధినేత జగన్మోహన్‌ రెడ్డి బీ-ఫారం అందజేశారు. బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగన్‌ను ఆయన కలిశారు. ఈ సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్ధన రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన సోదరుడు విక్రమ్‌ రెడ్డి వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు.

* రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో అవినీతి నిరోఽధించడానికి ఏసీబీ ప్రత్యేక మొబైల్‌ యాప్‌ రూపొందించింది. ‘ఏసీబీ 14400’ పేరుతో రూపొందించిన ఈ యాప్‌ను బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో ఎవరైనా లంచం అడిగితే ఫిర్యాదు చేయాలని సూచించారు. యాప్‌లో బటన్‌ నొక్కి వీడియో, ఆడియో రికార్డు చేసి ఏసీబీకి పంపాలని సూచించారు. అవినీతి నిరోఽధించడంలో ప్రతి జిల్లా కలెక్టర్‌, ఎస్పీకి బాధ్యత ఉంటుందని గుర్తు చేశారు. ఎలాంటి ఫిర్యాదు వచ్చినా వెంటనే స్పందించాలని, ఫలితంగా యాభై శాతం వరకూ అవినీతి అంతం అవుతుందని అభిప్రాయపడ్డారు. గూగుల్‌ ప్లే స్టోర్‌ ద్వారా యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఏసీబీ ఉన్నతాధికారులు ప్రజలకు సూచించారు.

*‘స్వామీ మమ్మల్ని రక్షించడం కాదు.. నీ తిరుపతిని కూడా కాపాడుకో తండ్రీ’ అని శ్రీ వేంకటేశ్వరస్వామిని కోరుకున్నట్టు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తెలిపారు. బుధవారం ఉదయం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా భక్తులను టీటీడీ నిలువుదోపిడీ చేస్తోందన్నారు. అసలు శ్రీవాణి ట్రస్టుకు అకౌంట్స్‌, అడిటింగ్‌ ఉందా అంటూ ప్రశ్నించారు.

*మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో ఏ-5గా ఉండి, కడప సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న దేవిరెడ్డి శంకర్‌రెడ్డికి ప్రత్యేక వసతులు కల్పించాలని కోరుతూ ఆయన తరఫు న్యాయవాది పి.రఘునాధరెడ్డి జిల్లా ప్రధాన(సెషన్స్‌) కోర్టులో వేసిన పిటిషన్‌పై మంగళ, బుధవారాల్లో వాదనలు జరిగాయి. జైల్లో ప్రత్యేక వసతులు కల్పించాలని రఘునాథరెడ్డి కోర్టును కోరగా.. సీబీఐ న్యాయవాది తోసిపుచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న జడ్జి విచారణ 7వ తేదీకి వాయిదా వేశారు.

*ఈ నెల 4న జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ నిర్ణయించారు. రాష్ట్రంలోని శాంతిభద్రతల పరిస్థితి, జనసేన కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయింపు అంశాలపై చర్చిస్తారు. జనసేన చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్ర అంశంపై మరింత లోతుగా చర్చిస్తారు.

*ఇరిగేషన్‌ అసిస్టెంట్‌ ఇంజనీర్‌(ఏఈ)పై సాక్షాత్తూ ఎమ్మెల్యేనే చేయిచేసుకున్న ఉదంతమిది.. తమ సమక్షంలోనే మూడు సార్లు ఏఈని చెంపదెబ్బ కొట్టడంతో ఉన్నతాధికారులు సైతం బిత్తరపోయారు. జలవనరుల మంత్రి అంబటి రాంబాబు రాజమహేంద్రవరం వచ్చి, ఆర్‌అండ్‌బీ గెస్ట్‌లో ఉన్నారు. అక్కడకు ఇరిగేషన్‌ ఇంజనీర్లను రమ్మన్నారు. ఒక రూమ్‌లో ఆయన ఉండగా.. వేరే గదిలో ఇంజనీరింగ్‌ అధికారులతో రాజానగరం వైసీపీ ఎమ్మెల్యే, వైసీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఇంద్రవందిత్‌ సమావేశమయ్యారు. ఆయన ఇరిగేషన్‌ ఏఈ సూర్యకిరణ్‌పై రెచ్చిపోయి మూడు సార్లు చెంప దెబ్బకొట్టారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ పరిధిలోకి వచ్చే పుష్కర కాలువకు సంబంఽధించి రెండేళ్ల కిందట తన అనుచరులు కాలువ నిర్వహణ పనులు చేశారని.. దీనిపై ప్రస్తుత ధరలతో అంచనాలు తయారు చేయాలని సుమారు ఆరు నెలలుగా ఎమ్మెల్యే.. ఏఈపై ఒత్తిడి తెస్తున్నారు. కానీ అప్పటి పనులకు ఇప్పుడు అంచనాలు వేయలేమని.. పైగా ఆ కాలువలు కూడా చిన్నవని, అంచనాల తయారీ కష్టమంటూ సూర్యకిరణ్‌ చెబుతూ వస్తున్నారు.

* కర్నూలు ఐఐఐటీడీఎంకు చెందిన విద్యార్థి దీపక్‌ రాథోడ్‌ జాక్‌పాట్‌ కొట్టేశాడు. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో అమెజాన్‌ కంపెనీలో రూ.1.3 కోట్ల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగానికి ఎంపికయ్యారు. మధ్యప్రదేశ్‌కు చెందిన దీపక్‌ రాథోడ్‌ 2018లో కర్నూలు ఐఐఐటీడీఎంలో సీఎ్‌సఈ కోర్సులో చేరాడు. ప్రస్తుతం నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. కర్నూలు ట్రిపుల్‌ఐటీ డీఎంకు చెందిన బీటెక్‌ విద్యార్థులు పలువురు 20 లక్షలకుపైగా ప్యాకేజీతో ఉద్యోగాలకు ఎంపికయ్యారు.

*కోనసీమకు అంబేడ్కర్‌ పేరును జోడించిన తర్వాత అమలాపురంలో జరిగిన అల్లర్లు, విధ్వంసాలకు సంబంధించి వాస్తవాలను తెలుసుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన చలో అమలాపురం ర్యాలీని పోలీసులు భగ్నం చేశారు. విజయవాడ రామవరప్పాడు రింగ్‌ వద్ద ఉన్న బాబు జగ్జీవన్‌రాం విగ్రహం నుంచి ర్యాలీగా అమలాపురం వెళ్లడానికి కాంగ్రెస్‌ నాయకులు సిద్ధపడ్డారు. పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌తోపాటు కాంగ్రెస్‌ పార్టీ ఎన్జీఆర్‌ జిల్లా అధ్యక్షుడు బొర్రా కిరణ్‌, కె.వినయ్‌ కుమార్‌, పీవై కిరణ్‌ తదితరులు బుధవారం జగ్జీవన్‌రాం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేక వాహనాల్లో అమలాపురం వెళ్లడానికి ప్రయత్నించిన వారిని మాచవరం పోలీసులు అడ్డుకున్నారు. నేతలందరినీ అరెస్టు చేసి మాచవరం పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు.

*అమరావతిలో టీటీడీ ఆధ్యర్యంలో చేపట్టిన శ్రీవారి ఆలయ నిర్మాణం పూర్తయ్యింది. బుధవారం ధ్వజ స్తంభాన్ని ప్రతిష్ఠించారు. ఆలయ ప్రారంభోత్సవంలో భాగంగా ఈ నెల ఐదో తేదీ నుంచి హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆలయంలో 8న విగ్రహాల ప్రతిష్ఠ, 9న మహా సంప్రోక్షణ ఉంటాయి. తాము ఇచ్చిన భూముల్లో శ్రీవారి ఆలయ నిర్మాణం చేపట్టడం తమ పూర్వ జన్మ సుకృతమని వెంకటపాలెం వాసులు సంతోషం వ్యక్తం చేశారు. రూ.126 కోట్లతో నిర్మించాల్సిన ఆలయానికి వైసీపీ ప్రభుత్వం రూ.35 కోట్లు కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో శ్రీవారి ఆలయానికి వెంకటపాలెం దగ్గర 25 ఎకరాలను కేటాయించి, రూ.126 కోట్లు మంజూరు చేశారు. ప్రభుత్వం మారిన తర్వాత రాజధాని పనులతో పాటు శ్రీవారి ఆలయ నిర్మాణాన్ని కూడా ఆపేశారు. దేవుడి విషయంలో కూడా రాజకీయాలు చేస్తున్నారని ఆరోపణలు రావడంతో ఆలయ నిర్మాణ పనులను టీటీడీ ప్రారంభించి పూర్తి చేసింది. కాగా, అమరావతిలో నిర్మించిన శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రారంభోత్సవానికి రావాలని ముఖ్యమంత్రి జగన్‌ను టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఆహ్వానించారు. బుధవారం సీఎంను కలిసి ఆహ్వానపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి టీటీడీ వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చారు.

*పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం కారుచోల గ్రామంలో వైసీపీ వర్గీయులు బరి తెగించారు. టీడీపీ సానుభూతిపరుడి నివాసాన్ని కూల్చివేసేందుకు యత్నించారు. గ్రామంలోని బీసీ కాలనీకి చెందిన ఉన్నవ శ్రీనివాసరావు నడుపుతున్న చిల్లర దుకాణం పోరంబోకు స్థలంలో ఉన్నదని, అక్కడ కమ్యూనిటీ హాలు నిర్మించుకునేందుకు ఖాళీ చేయాలని వైసీపీ వర్గీయులు హుకుం జారీ చేశారు. 25 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నానని, ఖాళీ చేయలేనని ఆయన చెప్పారు. దీంతో అతడ్ని బలవంతంగా ఖాళీ చేయించేందుకు మంగళవారం రాత్రి ప్రయత్నించారు. బాధితుడు పోలీసులను ఆశ్రయించగా.. నిబంధనల ప్రకారం పంచాయతీ అధికారుల ద్వారా వెళ్లాలని, దౌర్జన్యం చేయొద్దని చెప్పారు. మళ్లీ బుధవారం ఉదయం సుమారు 16 మంది గునపాలతో ఇంటిని ధ్వంసం చేసేందుకు ఉపక్రమించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు వచ్చి కూల్చివేతను అడ్డుకున్నారు. పార్టీ మారలేదన్న కక్షతో వైసీపీ వర్గీయులు ఇబ్బంది పెడుతున్నారని శ్రీనివాసరావు వాపోయారు. దుకాణంలోని రూ.లక్ష విలువైన సరుకులు, రూ.40 వేలు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

*కర్నూలు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ డిజైన్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ (ఐఐఐటీడీఎం)కు చెందిన విద్యార్థి దీపక్‌ రాథోడ్‌ జాక్‌పాట్‌ కొట్టేశాడు. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో అమెజాన్‌ కంపెనీలో రూ.1.3 కోట్ల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగానికి ఎంపికయ్యారు. మధ్యప్రదేశ్‌కు చెందిన దీపక్‌ రాథోడ్‌ 2018లో కర్నూలు ఐఐఐటీడీఎంలో సీఎ్‌సఈ కోర్సులో చేరాడు. ప్రస్తుతం నాలుగో సంవత్సరం చదువుతున్నా డు. పాఠ్యాంశాలతో పాటు ప్లేస్‌మెంట్‌ ట్రైనింగ్‌లో ఇచ్చే సలహాలు, సూచనలను అవగ తం చేసుకుని అంతర్జాతీయ స్థాయిలో ఆన్‌లైన్‌ బేస్డ్‌ ఎగ్జామ్‌లో మంచి ప్రతిభ కనబరిచి సాఫ్ట్‌వేర్‌ డెవల్‌పమెంట్‌ ఇంజనీర్‌ రోల్‌ బేస్డ్‌లో అమెజాన్‌ కంపెనీలో ఉద్యోగం సాధించా డు. కర్నూలు ట్రిపుల్‌ఐటీ డీఎంకు చెందిన బీటెక్‌ విద్యార్థులు పలువురు రూ.20 లక్షలకు పైగా ప్యాకేజీతో వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారు.

* ఈ నెల నుంచి వరుసగా రెండు మాసాలపాటు వివిధ ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్‌, పదవ తరగతి వార్షిక పరీక్షలు ముగియడంతో ప్రవేశ పరీక్షల నిర్వహణపై అధికారులు దృష్టిసారించారు. రాష్ట్ర స్థాయి ఎంట్రన్స్‌లతోపాటు జాతీయ స్థాయిలో నిర్వహించే జేఈఈ వంటి పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం అవుతున్నారు. ఆయా ప్రవేశ పరీక్షలకు మొత్తం 4 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యే అవకాశం ఉంది. ఎంసెట్‌కు సుమారు 2.6లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రంలో ముందుగా పాలిసెట్‌ను నిర్వహించనున్నారు. ఈ నెల 30న ఈ పరీక్ష జరగనుంది. ఆ తర్వాత వచ్చే నెల 13న ఈసెట్‌ను నిర్వహిస్తారు. తర్వాత జూలై 14 నుంచి 20వ తేదీ వరకు ఎంసెట్‌ జరగనుంది. ఇంటర్మీడియట్‌లో 70శాతం సిలబ్‌సను ఖరారు చేసినందున, ఎంసెట్‌ ప్రవేశ పరీక్షను కూడా ఆ 70శాతం సిలబ్‌సతోనే నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే ఇంటర్‌ మార్కుల వెయిటేజీని కూడా రద్దు చేశారు.

*గతేడాది (2020- 21) యాసంగి సీజన్‌కు సంబంధించిన కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌(సీఎంఆర్‌) డెలివరీ గడువును కేంద్ర ప్రభుత్వం ఈ నెల 30 వరకు పొడిగించింది. గతంలో పలుమార్లు డెడ్‌లైన్‌లు విధించినప్పటికీ రైస్‌మిల్లర్లు లక్షాన్ని పూర్తిచేయ లేదు. వాస్తవానికి తుది గడువు మే 31తో ముగిసిపోయింది. ఇంకా 5.39 లక్షల మెట్రిక్‌ టన్నుల బకాయిలు ఉన్నాయని, అందువల్ల మరో నెల రోజులు గడువు పొడిగించాలని మే 24న రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్‌ అనీల్‌కుమార్‌ కేంద్రానికి లేఖ రాశారు. అందుకు కేంద్రం ఆమోదించింది.

*జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో ఏడో నిందితురాలుగా ఉన్న మంత్రి సబిత బుధవారం నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు వచ్చారు. ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ కేసుకు సంబంధించిన విచారణకు ఆమె హాజరయ్యారు. జస్టిస్‌ బీఆర్‌ మధుసూదన్‌రావు సీబీఐ కోర్టు నుంచి బదిలీకావడంతో నూతన న్యాయమూర్తిగా జస్టిస్‌ సీహెచ్‌ రమే్‌షబాబు ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఆమె కోర్టుకు హాజరుకాగా ఆమె తరఫు న్యాయవాది ఉమామహేశ్వర్‌రావు వాదనలు వినిపించారు. ఈ కేసు నుంచి తన పేరు తొలగించాలని సబితారెడ్డి డిశ్చార్జి పిటిషన్‌ ఇదివరకే దాఖలు చేసినట్టు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం కేసు తదుపరి విచారణను 12వ తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు.

*ప్రజారోగ్య డైరెక్టర్‌ పరిఽధిలో ఉన్న 74 కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లను (సీహెచ్‌సీ) తెలంగాణ వైద్య విధాన పరిషత్‌కు ప్రభుత్వం బదలాయించింది. ఈ మేరకు బుధవారం జీవో జారీ చేసింది. ఇక నుంచి ఈ 74 సీహెచ్‌సీలు టీవీవీపీ ఆస్పత్రులుగా మార్పు చెందనున్నాయి. ఇందులో 30 పడకలు చొప్పున 61 సీహెచ్‌సీలు ఉన్నాయి. ఇక 30, 50 చొప్పున పడకలున్న మరో 10 సీహెచ్‌సీలను 100 పడకలకు అప్‌గ్రేడ్‌ చేయనున్నారు. మిగిలిన చోట 30 నుంచి 50 పడకలకు అప్‌గ్రేడ్‌ చేయనున్నారు. టీవీవీపీ పరిధిలోకి వచ్చిన ఈ ఆస్పత్రులన్నింటికి పారిశుధ్యం, ఇతర మౌలిక సదుపాయాల కల్పన కోసం టెండర్లు పిలవాలని టీఎస్‌ ఎంఎ్‌సఐడీసీని ప్రభుత్వం ఆదేశించింది.

*అతి వేగంగా నిర్మితమవుతున్న కొత్త పార్లమెంటు భవనం రాజ్యాంగ దినోత్సవమైన నవంబరు 26న ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 1949 నవంబరు 26న రాజ్యాంగ పరిషత్‌ భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. ఈ ఏడాది శీతాకాల సమావేశాలు కొత్త భవనంలోనే నిర్వహించాలనే లక్ష్యంతో మోదీ స ర్కారు నిర్మాణ పనులను వేగవంతం చేస్తోంది. కొత్త భవనంలో పార్లమెంటు సభ్యులకు, సందర్శకులకు అత్యాధునిక సౌకర్యాలు కల్పించనుంది. నూతన భవనంలో పార్లమెంటు సమావేశాలు నిర్వహించడం మోదీ సర్కారుకు మరో మైలురాయి కానుందని పార్టీ వర్గాలు తెలిపాయి. అక్టోబరు నెలాఖరులో భవనాన్ని పూర్తి చేస్తానని కాంట్రాక్టరు వాగ్దానం చేశాడని, డెడ్‌లైన్‌లో రాజీ ఉండబోదన్నారు.

*బిహార్‌లో త్వరలో జనగణన బదులు కులగణన నిర్వహిస్తామని, ఇందుకు మిత్రపక్షం బీజేపీ సహా అన్ని పార్టీలూ అంగీకరించాయని సీఎం నితీశ్‌ కుమార్‌ తెలిపారు. కులగణనపై బుధవారం అఖిలపక్ష సమావేశం జరిగింది. చట్టపరమైన సమస్యలు రాకుండా ఉండేందుకు జనగణన బదులు కులగణన తీర్మానాన్ని రాష్ట్ర క్యాబినెట్‌లో ఆమోదిస్తామని తెలిపారు.

*తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి బుధవారం కలిశారు. అమరావతిలో కొత్తగా నిర్మించిన వేంకటేశ్వరస్వామి దేవస్థానం ప్రారంభోత్సవానికి సీఎంను ఆహ్వానించారు. ఆహ్వాన పత్రాన్ని ముఖ్యమంత్రికి టీటీడీ ఛైర్మన్‌ అందజేశారు.ఈ సందర్భంగా సీఎంకు స్వామివారి ప్రసాదాలు అందజేసిన టీటీడీ వేద పండితులు.. వేద ఆశీర్వచనాలు ఇచ్చారు. టీటీడీ ఛైర్మన్‌ వెంట జేఈవో వి.వీరబ్రహ్మం, సీఎస్‌వో నరసింహ కిశోర్, చీఫ్‌ ఇంజనీర్‌ డి.నాగేశ్వరరావు ఉన్నారు. ఈ నెల 4 నుంచి విగ్రహ ప్రతిష్టకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 9న విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ, మహా సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

*ఆస్తులు కొనే ప్లాన్‌లో ఉన్నవారు పునరాలోచనలో పడే నిర్ణయం తీసకుంది ఢిల్లీ సర్కారు. అకస్మాత్తుగా ప్రాపర్టీ ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మున్సిపల్‌ కార్పోరేషన్‌ ఢిల్లీ 2022 మే 31న ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం ఢిల్లీ కార్పోరేషన్‌ పరిధిలో జూన్‌ 1 నుంచి ప్రాపర్టీల ట్రాన్స్‌ఫర్‌కి సంబంధించి పన్నులు పెరగనున్నాయి